18, మార్చి 2011, శుక్రవారం

నిన్నుచేరాలని!!!!!నిన్నుచేరాలని...

మల్లెసౌరభాల నీ నిండు హృది లో
మధురగానం వినిపించే నీ తీయని మాటలు...
మదిలో రాగాలను వింటున్న నేను
పదపదము నీ అలికిడికై ఎదురుచూస్తూ
ఆనందమయంలో మునిగి నీ ప్రేమలో పరవశించి
ప్రకృతినే ఆహ్లాదపరిచే...సర్వకాలాల్లో చిగుళ్ళు తొడిగే
లహరిలో ఓలలాడించె...దివ్యమైన మధురస్మృతి అయిన
నీ ప్రేమకు ప్రతిబింబమునై నిలిచిపోవాలని నా తపన...
నీ ప్రేమలో మైమరచి నన్ను నేను మరచి
నేను నేనుగాక నీవే నేనుగా నిలిచిపోవాలని మన ప్రేమకు సాక్షి అయిన
ఆ నిండుచందురునే కోరుకుంటున్నాను
నింగిలోన తారనైపోనా నిన్నుచూడడానికి...
నిండు చందమామనైపోనా నీ మనసు దోచుకోడానికి...
చల్లని గాలినై రానా నిన్ను చేరడానికి...
వానజల్లునై రానా నీ మనసు తడపడానికి...
మెరుపులా రానా నీ గుండెలో ఉండిపోడానికి...

ఏదో మా అక్క అడిగిందని రాయడమే గాని....ఈ రవివర్మ అందానికి కవిత రాయటం నా తరమా, నేను రాయలేను. ఆ మధ్య నా మనస్వి తో చెప్పుకున్న 'నాకోసం’ కవిత గుర్తొచ్చింది.

రేపు నా కళ్ళనిండుగా చూడాలని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఆ బంగారు 'మహా చందురుని' కే ఇది అంకితం....

నాకెంతో ఇష్టమైన...రవివర్మకే అందని, ఒకే ఒక అందానివో.....ఈ పాటకూడా గుర్తొస్తోంది.....

Get this widget | Track details | eSnips Social DNA


********************************************************************************

8, మార్చి 2011, మంగళవారం

’ఫస్ట్ లేడీస్’

నూరు వసంతాలు నిండిన మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డలైన మన నారీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకసారి 'మొదటి మహిళ’ ల గురించి నేను సేకరించిన కొంత సమాచారం మీతో పంచుకోవాలని, నా ఈ చిన్ని ప్రయత్నం. మీకు తెలిసిన వారి గురించి కూడా చెప్తారు కదూ. మరి మొదలు పెట్టనా....

* దేశం లో తొలి మహిళా ఉపాధ్యాయిని - సావిత్రీ బాయి పూలే
* భారత పోలీస్ సర్వీస్ తొలి మహిళా అధికారి _ కిరణ్ బేడీ
* విదేశీ గడ్డపై భారత పతాకాన్ని గర్వంగా ఎగురవేసిన తొలి మహిళ _ మేడం బికాజీ రుస్తుం కామా
* తొలి కమర్షియల్ పైలట్ మహిళ _ ప్రేమ్ మాథుర్
* ఐక్యరాజ్య సమితి లో తన గళ మాధుర్యాన్ని వినిపించిన తొలి మహిళ _ యం.యస్. సుబ్బలక్ష్మి
* దూరదర్శన్ లో మొదటి సారిగా వార్తలు చదివిన మహిళ _ ప్రతిమా పురి
* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ తొలి గ్రహీత _ దేవికారాణి
* తొలి జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత _ ఆశాపూర్ణాదేవి
* నోబల్ బహుమతి పొందిన తొలి మహిళ _ మదర్ థెరిస్సా
* రాజ్యసభకు ఎన్నుకోబడిన మొదటి భారతీయ సినీనటి _ నర్గీస్ దత్త్
* ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ పారిస్ నుంచి అందుకున్న తొలి భారతీయ నటి _ షబానా ఆజ్మీ
* ఫ్రాన్స్ లో అత్యున్నత పురష్కారాన్ని పొందిన ఆసియా నటి _ స్మితా పాటిల్
* మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్ _ షన్నోదేవి
* హైకోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి _ జస్టిస్ లీలాసేఠ్
* క్రికెట్ లో ఆంపైరింగ్ చేసిన తొలి మహిళ _ బచేంద్రీ పాల్
* బాడ్మింటన్ అర్జున అవార్డ్ ను సాధించిన తొలి మహిళ _ మీనా షా (1961)
* కేంద్రంలో అతి చిన్న వయస్కురాలైన తొలి మహిళా మంత్రి _ కుమారి షెల్జా (రాజస్థాన్)
* కేరళ హైకోర్ట్ తొలి మహిళా న్యాయమూర్తి _ అన్నావైండి
* వాలీబాల్ అర్జున అవార్డ్ పొందిన తొలి మహిళ _ జి. మృణాళినీ రెడ్డి
* జిమ్నాస్టిక్ లో అర్జున అవార్డ్ పొందిన తొలి మహిళ _ సునితా శర్మ (1985)
* మొట్టమొదటి మహిళా కానిస్టేబుల్ _ బెయిల్ నూన్యిద్ సేన్
* స్పీడ్ టైపింగ్ లో జాతీయ రికార్డ్ సాధించిన తొలి ఆంధ్ర వనిత (నిమిషానికి 118 పదాలు ) _ డి.వి. పద్మావతి(విశాఖపట్నం)
* మొదటి చిత్రం తోటే ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మహిళ _ ఆండ్రీ పెప్ బర్న్
* జవహర్ లాల్ అవార్డ్ ను అందుకున్న తొలి మహిళ (81 సంవత్సరాలు, స్వీడన్, 1981) _ ఆల్వామిర్ధాల్
* పోస్ట్ కార్డ్ పై 81,544 అక్షరాలు వ్రాసి గిన్నీస్ బుక్ లో చోటుచేసుకున్న మహిళ _ కుమారి ఉమామహేశ్వరి (విశాఖపట్నం)
* అథ్లెటిక్స్ లోఅర్జున అవార్డ్ పొందిన తొలి మహిళ _ అనసూయాబాయ్ (1975 )
* ఆసియా మహిళా చెస్ చాంపియన్ షిప్ టైటిల్ ను వరుసగా అయిదు సార్లు గెలుచుకున్న మొదటి మహిళ _ రోహిణీ ఖదిల్కర్
* భారతదేశ మొదటి మహిళా జర్నలిస్ట్ _ హమాయివ్యారవల్లా
* దేశంలో మొదటి వేలిముద్రల నిపుణురాలు _ బ్రగతంబాల్ (తమిళనాడు)
* పారాచూట్ ఉపయోగించిన తొలి భారతీయ మహిళ _ గీతాచంద్
* భారత ‘సాహస’ పురస్కారాన్ని అందుకున్న తొలి బాలిక _ దూద్ బెన్ బోడాబాయ్ (14 సంవత్సరాలు)
* ప్రపంచంలో అత్యధిక భాషలలో, అత్యధిక పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన తొలి భారతీయ గాయని ( 20 భాషలలో 25 వేలకు పైగా పాటలు) _ లతామంగేష్కర్
* వింబో స్కేటింగ్ లో గిన్నీస్ బుక్ ఎక్కిన మొదటి బాలిక _ కుమారి శైలజ (విశాఖపట్నం)
* మూడు సంవత్సరాలకే కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్ లలో అద్భుత నైపుణ్యాన్ని చూపి ప్రపంచాన్నే అబ్బురపరచిన భారతీయ బాలిక _ జుహీ అగర్వాల్
* సుప్రీం కోర్ట్ లో తొలి మహిళా జడ్జ్ _ ఫాతిమా బీబీ
* అంత్యక్రియలు స్వయంగా నిర్వహించిన ప్రధమ మహిళ _ గులాబ్ మహరాజన్

...ఈ మహిళలు మహరాణులు....మనందరం ఎంతో మంచి ’సీ గాన పెసూనంబ’ లం. ఈ నాటి మహిళ అసమర్ధురాలు కాదు. ఆడపిల్లల జనన రేట్ సంరక్షించాల్సిన బాధ్యత స్త్రీలదే. స్త్రీ లేని ప్రపంచం ఎలా ఉంటుంది....అందుకే స్త్రీలను గౌరవంగా ఉన్నత స్థానం లో ఉంచాల్సిన భాద్యత పురుషులదే.......ఏదీ తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. విజయం సాధించాలంటే నిరంతర పరిశ్రమ, అచంచలమైన ధృఢసంకల్పం ఉండాలి అని ఏనాడో స్వామీ వివేకానంద చెప్పారు. అంతేకాకుండా "If you want to change the society, educate the woman’ అని కూడా స్త్రీల మీద ఉన్న తన నమ్మకాన్ని చూపించారు.

చూసారుగా ఎన్ని ముందడుగులో మనవి. ఇంకా, ఇంకా ముందుకు పోతూనే ఉండాలి.....ఎన్ని ముందడుగులో వేయాలి. ఆ ఆకాంక్ష తీరే రోజు దగ్గరిలోనే ఉంది......ఉందిలే మంచి రోజు ముందు ముందునా.....
అంతేనా....మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ....రాగం లో అనురాగంలో తరగని పెన్నిధి మహిళ.....
మన నైటింగేల్ ఆఫ్ ఇండియా....సరోజినీ నాయుడు, బ్రోకెన్ వింగ్, గోల్డెన్ త్రెష్ హోల్డ్ ...ఈ బుక్స్ ఎంత చదివినా తనివి తీరదు కదా.....
ద గ్రేట్ కల్పనా చావ్లా...మన మహిళా స్వాతంత్యం కోసం పోరాడిన దుర్గాబాయ్ దేశ్ ముఖ్.....
అంగవైకల్యాన్ని మరచి ముందుముందుకు సాగిపోతున్న, రోజ్, సుజ్జి మనకి ఆదర్శమేగా...
విజయనిర్మల కూడా రికార్డ్ బద్దలకొట్టిందిగా...
సుభద్ర, థాయ్ లాండ్... ఒంటినిండా జుట్టుతో రికార్డ్ సాధించింది. అబ్బో ఇలా ఇంకా చాలా...చాలా మంది తెలుసు నాకు:)))

"Climb high
Climb far,
Your goal the Sky
Your aim the Star".....
What is impossible if you have intelligence?
What is unachievable if your will is firm?


"Success is counted sweetest
by those who never succeed
to comprehend a nectar,
requires sorest need." ..... Emily Dickinson

Persistence is the key to success
Hope is the last thing that we loose. ...కదా. మరి అందరం ఫాలో అయిపోదామా.

"ఎందరో మహిళలు. అందరికీ వందనాలు."... "A Rome is not built in a day"...సో, సడలని ఆత్మ విశ్వాసంతో...చెదరని ధైర్యంతో అందరం కష్టాలు అనే అడ్డుగోడలు చీల్చుకుని... విజయాల వైపు పయనిద్దామా....


లేచింది నిద్ర లేచింది మహిళా లోకం...దద్దరిల్లింది పురుష ప్రపంచం:)

ఈ మాటలు వింటుంటే రైన్ డ్రాప్ లా డాన్స్ చేయాలనిపించటం లేదూ. ఐస్క్రీం లా కరిగి పోవాలనిపించటం లేదూ....
*********************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner