1, మే 2011, ఆదివారం

నిండుతెరల వింజామరలు...

(సమ్మర్ స్పెషల్స్ 4)

ఇదే నా చిట్టచివరాఖరి సమ్మర్ స్పెషల్. నమ్మాలి మరి.

ఇప్పుడు చీరలమీద చక్కని ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తాను. భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది...ఈ వన్నెచిన్నెల వింజామరలే...కాదంటారా!!! ఎన్నిరకాల చీరకట్టులో...పూర్తి తృప్తినిచ్చేది చీరేకదా...ఆ చీరలకి ఎన్ని రకాల అలంకరణలో....ఎప్పటికీ తనివితీరని ముచ్చట్లే....మమకారమనే మగ్గం మీద చీరలు నేస్తారట...అందుకేనేమో ఎన్ని యుగాలు గడిచినా చీరల మీద ప్రేమ తరగదు...ప్రత్యేకతా మాసిపోదు. పాత సినిమాలు చూస్తూంటే, అప్పటి హీరోయిన్స్ చీరల మీదా...బ్లౌజుల మీదా ఇప్పటికన్నా ఎంతో చక్కటి వర్క్ కనిపిస్తుంది. అబ్బా, వాళ్ళెంత అదృష్టవంతులో అనిపిస్తుంది. అప్పటి వర్క్స్ అన్నీ మా అత్తగారు ఎంతబాగా చేస్తారో. ముఖ్యంగా చీరల మీద కన్నా బ్లౌజుల మీద వర్క్ నాకు చాలా ఇష్టం. అప్పటి ఆవిడ చేసుకున్న ఆ డిజైన్స్ అన్నీ నాక్కూడా చేసిపెట్టారు. ఆ బ్లౌజ్ లన్నీ ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నానో!!!

ఈ విషయంలో మాత్రం, ఈ సారి మా అత్తగారిని పరిచయం చేస్తాను. చిన్నప్పటినుంచి కూడా రకరకాల ఎంబ్రాయిడరీ వర్క్ చేయటంలో సిద్ధహస్తులు. మా చుట్టపక్కాలందరికీ ఆవిడ `పనితనం’ బాగా పరిచయమే. అందరికీ ఏదో ఒకటి ఎప్పుడూ కుట్టిచ్చేవాళ్ళు. నేనొచ్చిన తరువాత మిగతావారికి కొంచెం అవకాశాలు సన్నగిల్లాయి. ఆవిడ ఎప్పుడూ ఏదో ఒకటి కుట్టుతూనే ఉంటారు. లేకపోతే తోచదు. ఎటువంటి బుక్స్ చదవరు. కనీసం టి.వి. చూడరు. ఎవరైనా ఆవిడని చూడడానికి రావాల్సిందే కాని, ఒకరింటికి వెళ్ళరు. కాకపోతే చెప్పిందే చెప్తూ ఉంటారు. ఎవరినీ ఏమీ అనరు...కాని బయటకు వెళ్ళేప్పుడు మాత్రం మళ్ళీ ఎప్పుడొచ్చేది తప్పకుండా చెప్పి వెళ్ళాల్సిందే. చెప్పిన టైమ్ కి రావాల్సిందే. లేకపోతే, ఇంక మనం అయిఫోయామన్నమాటే. ఈ విషయం ఒకసారి రాశానులెండి. నాకే కొన్ని సార్లు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. ఇల్లు కదలకుండా ఎప్పుడూ అలా కుట్టుకుంటూ ఎలా ఉండి పోగలరా అని. నాకైతే ఒక్కరోజు అలా బయటికి వెళ్ళకుండా ఉన్నానో అస్సలు తోచదు. మా కాలేజ్ లో కూడా మా అత్తగారు చాలా ఫేమస్. అందరూ దర్జాగా, వరసపెట్టి చీరలు కుట్టించుకున్న వాళ్ళే. ఈ మధ్యే పాపం.. ఓపిక లేక కొంచెం తగ్గించారు. మా అత్తగారు నాకోసం కుట్టిన చీరలన్నీ ఇప్పుడు మీరు చూడాలన్నమాట.

ఈ ఎంబ్రాయిడరీ విషయానికొస్తే, వేరే చోటెక్కడన్నా ఆర్డర్ ఇస్తే మాత్రం...కుట్టేది మొగవారే. మొగవారు కదా...మిషన్ వర్క్ అనుకునేరు. కాదు ...చేతి ఎంబ్రాయిడరీయే... మొగవారు చాలా బాగా చేస్తారు. వంటకు నలభీములు ప్రసిద్ధి లాగా కుట్టుపనికి కూడా ఎవరో ఒకరి పేరు ఉండే ఉంటుంది. నాకు తెలియదు. చార్ మినార్ దగ్గిర ఇలా వర్క్ చేసే వారు చాలా మంది ఉన్నారు. చీరలు, రకరకాల డ్రెస్సులు...ఎంత బాగా చేస్తారో. కొన్ని ఈ డిజైన్స్ చీరల మీద వేయించి, వాటికి మేచ్ అయ్యే మంచి ’ఆంకర్’ రంగుదారాలు కొని మా అత్తగారికిస్తే ఎంత సంబరపడిపోతారో. ఆ చీర పూర్తి చేసే వరకు మంచంమీద దిండ్లకి జారిగిలపడి కూర్చొని కుడ్తూనే ఉంటారు. భోజనం కూడా మనమే గుర్తు చేయాలి. ఇంట్లో ఉన్న కళ, నేను నేర్చుకోపోతే బాగుండదని ఎన్నోసార్లు ప్రయత్నం చేసాకాని....ఊహూ...నాకు రాలేదు. ఆ బ్లూ కలర్ చీర వైట్ వర్క్ లో మాత్రం నేను కొంచెం చేసానన్నమాట. దానికి కావాల్సినంత కుదురు నా దగ్గిర లేదని మా అత్తగారు అంటారు. ఏం చేస్తాం చెప్పండి మరి....నాకు కొంచెం నిలకడ తక్కువ. తోచిందే అయిపోవాలి. అంతఓపిక లేదన్నమాట. అయినా నేను కష్టపడాల్సిన అవసరమేంటంట, ఇలా చీర తర్వాత చీరలొస్తుంటే:)

సో...అందరికీ హ్యాపీ సమ్మర్ వెకేషన్.....హాయిగా, ఆనందంగా మీకు నచ్చిన పనులు చేసుకుంటూ...ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ, మీ పిల్లలకి నేర్పుకుంటూ, పిల్లలకి కొత్త ప్రదేశాలు చూపించుకుంటూ గడిపేయండేం....

స్కూల్ అనే ప్రత్యేక జైల్ నుంచి బెయిల్ మీద విడుదలైన పిల్లలందరికీ నా ప్రత్యేక అభినందనలు:)

పచ్చని తోటల్లో
పాపంటి మనసున్న
జాబిల్లి పిలిచాడనీ
చల్లని కబురొచ్చింది.....అందుకే

కనాకకు కకూకడా కశకలకవుకలే కగా, కఅంకదుకకే. కహైకదకరాకబాకదు కనుంకచి కపాకరికపోకతుకన్నాకనోకచ్.

కమకళ్ళీ కకకలుకద్దాం!!! కబై కబై:)























































********************************************************************************

13 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

కపాకరికపొకండి..కపాకరికపొకండి..కమాకకూ కటైకముకవకస్తుకంది. కఅకప్పుకడు కమేకమూ కపాకరికపోకతాకము.

చాలా బాగున్నాయి వర్క్స్. మరి వెళ్ళొచ్చాకా కబుర్లన్నీ చెప్పేయాలి.Happy holidays.

ఇది "క" భాష గురించి చాలా మొదట్లో నే రాసిన టపా:
http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_25.html

మాలా కుమార్ చెప్పారు...

మీ అత్తగారు కుట్టి ఇచ్చిన రెండు చీరలూ , ఒక బ్లౌజూ చాలా జాగ్రత్తగా డైమండ్ నెక్లెస్ లా దాచుకున్నాను . నిజం గా ఆవిడ ఓపికకు మెచ్చుకోవాలసిందే ! ఇంకా చీరలు తెచ్చి ఇమ్మన్నారు కాని నాకే మొహమాటంవేసి తెచ్చివ్వలేదు :)

శిశిర చెప్పారు...

అత్తగారిని ఇంతలా పొగిడేశారు. ఎంత మంచి కోడలండీ మీరు. :) టపా చాలా బాగా రాసారు. చీరల వర్క్ కూడా మీరు చేసినవాటికన్నా బాగుంది. :) (ఊరికే, పెద్దవారు కదా అని ఆవిడనెక్కువ పొగుడుతున్నా.)
ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు.

జయ చెప్పారు...

@తృష్ణా థాంక్యూ. చిన్నప్పటి తీపి గుర్తు 'క ' భాష. అప్పుడప్పుడూ తలచుకోవాలనిపిస్తుంది కదా ;) మీ పోస్ట్ కూడా బాగుంది. మీరు కూడా పారిపొండి. ఎంతెగిరిపోయినా ఇప్పుడే. ఎందుకంటే పిల్లలు 10థ్, ఇంటర్ కొచ్చారంటే ఇంతే సంగతులు.

@ అక్కా, ఇంక ఆ చీరలు దాచిపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు కుట్టటం లేదు కదా.

@ హాయ్ శిశిరా, సరదాకి అన్నా ఆవిడ కుట్టిన చీరలే బాగున్నాయి. ఇంకా ఉన్నాయి కాని 'బ్లాగర్ రామనధం ' కథ గుర్తొచ్చి చూపించలేదు:)

శిశిర చెప్పారు...

హహహ్హ.. ఆ కథ చాలా బాగుంటుంది. :)

మురళి చెప్పారు...

Happy vacation.. come back soon..

జయ చెప్పారు...

@ శిశిరా, ఆ కథ నాక్కూడా చాలా నచ్చింది. :):):)

@ మురళి గారు థాంక్యూ. హైద్రాబాద్ వాళ్ళు రాజమండ్రి, కాకినాడ వాళ్ళు హైద్రాబాద్....రాజమండ్రి వాళ్ళు...ఇలా ఒకళ్ళ ఊరినుంచి ఇంకోళ్ళ ఊరు అందరూ వెళ్ళిపోతున్న టైం ఇది. మరి మీరు ఎక్కడికి వెల్తున్నారు:)

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీ అత్త గారు సూపర్. చాలా బాగున్నాయి. మా అత్తగారు కూడా బాగా కుట్టేవారు. ఇప్పటికి కూడా డిజైను వేసిస్తే కుడతారు. నాకు కూడా ఈ కుట్ల పిచ్చి బాగానే ఉంది. మీ అత్తగారిలాగానే మొదలుపెడితే అది అయ్యేదాకా తిండీ నిద్రా గుర్తుకొచ్చేవి కావు.ఇప్పుడు చేయటం లేదు లేండి.

సెలవలు బాగా ఎంజాయ్ చేసిరండి.

జయ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు, బాగున్నారా...చాలా రోజులయ్యింది. థాంక్యూ.
ఇదివరకు అందరూ ఇళ్ళల్లో కుట్లు, అల్లికలూ బాగా చేసే వారు. ఇప్పుడు తగ్గిపోయింది మరి. కావాల్సినట్లు ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోటమే. మీరు ఇంకా ఈ కళ కొనసాగిస్తున్నందుకు అభిమందనలు. మరి మాకు చూపించరా...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Happy holidays....
come back soon..

జయ చెప్పారు...

Thanq Raji. I am back.

Ennela చెప్పారు...

అత్త ఉన్న కొడలుత్తమురాలు ఓయమ్మ..
కోడలున్న అత్త గుణవంతురాలమ్మా....
నా వరకూ నాకు పాట ఇలా ఉంటుంది..హహహ..
కుట్లు అన్నీ సింప్లీ సూపర్బ్ అండీ...అమ్మో ఎంత ఓపికో!!!!

జయ చెప్పారు...

Yes Ennela, you are absolutely correct.:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner