'సమ్మర్ క్రాష్ కోర్స్ '.......:)
ముప్పై రోజుల్లో నేర్చుకున్న కొన్ని ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్.....
ముందుగా ఓ ఎనిమిది క్లాస్ లు ఓన్లీ పెన్సిల్ స్కెచ్ చేయాలి. ఇందులో పెన్సిల్ స్కెచ్, చార్కోల్ స్కెచ్, స్టిల్ లైఫ్, యానిమల్స్, బర్డ్స్, లాండ్ స్కేప్ చేయాలి.
ఇది నే వేసిన ఓ పెన్సిల్ స్కెచ్...
ఇదేమో సింపిల్ లాండ్ స్కేప్ ఆయిల్ పెయింటింగ్....
బోర్డ్ మీద వైట్ టెక్స్చర్ వాడి చేసిన పెయింటింగ్. ఇలా ఎంత పెద్దవయినా చేసుకోవచ్చు.
ఇది బోర్డ్ మీద ఇసుక (sand painting) అప్లై చేసి చేసిన పెయింటింగ్. అన్నిటికన్నా నాకు ఎంతో నచ్చిన టెక్నిక్ ఇది. దీనిమీద ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు.
ఇంక ఇది, నైఫ్ తో చేసిన పెయింటింగ్. ఇలాంటి పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఒంటికి ఎంత పూసుకుంటామో అంత మజా కూడా ఒస్తుంది:)
చివరగా, ఓ పోర్ట్రయిట్. ఇందులో ఎవరి బొమ్మ నైనా గీయటానికి, చిన్నా పెద్ద సైజుల కోసం చక్కటి గ్రాఫింగ్ మెజర్మెంట్ చెప్తారు. అచ్చుగుద్దినట్లు పోలికలతో వేయవచ్చు.
ఇదండీ, నేను నేర్చుకున్న 'వేసవి కాలపు ' విద్య:)
చాలా బాగున్నాయా, బాగున్నాయా, ఫర్వాలేదా, ఏమాత్రం బాగాలేవా.....మీరందరూ నాకిచ్చే గ్రేడ్ చెప్తారా ఫ్రెండ్స్:)
వీలయినప్పుడల్లా ఈ టెక్నిక్స్ డెవెలప్ చేసుకోవాలన్న కోరిక మాత్రం చాలానే ఉంది. మెటీరియల్ మాత్రం అన్నీ కొనేసుకున్నాను. కొంచెం బద్దకంగా కూడా ఉంది. మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏమో:)))
థాంక్యూ ఫ్రెండ్స్.
********************************************************************************