చిత్రలేఖనాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిత్రలేఖనాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జులై 2015, బుధవారం

'Summer Course'.....

'సమ్మర్ క్రాష్ కోర్స్ '.......:)

ముప్పై రోజుల్లో నేర్చుకున్న కొన్ని ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్.....

ముందుగా ఓ ఎనిమిది క్లాస్ లు ఓన్లీ పెన్సిల్ స్కెచ్ చేయాలి. ఇందులో పెన్సిల్ స్కెచ్, చార్కోల్ స్కెచ్, స్టిల్ లైఫ్, యానిమల్స్, బర్డ్స్, లాండ్ స్కేప్ చేయాలి.


   ఇది నే వేసిన ఓ పెన్సిల్ స్కెచ్...






ఇదేమో సింపిల్ లాండ్ స్కేప్ ఆయిల్ పెయింటింగ్....






బోర్డ్ మీద వైట్ టెక్స్చర్ వాడి చేసిన పెయింటింగ్. ఇలా ఎంత పెద్దవయినా చేసుకోవచ్చు.





ఇది బోర్డ్ మీద ఇసుక (sand painting) అప్లై చేసి చేసిన పెయింటింగ్. అన్నిటికన్నా నాకు ఎంతో నచ్చిన టెక్నిక్ ఇది. దీనిమీద ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు.






ఇంక ఇది, నైఫ్ తో చేసిన పెయింటింగ్. ఇలాంటి పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఒంటికి ఎంత పూసుకుంటామో అంత మజా కూడా ఒస్తుంది:)





చివరగా, ఓ పోర్ట్రయిట్. ఇందులో ఎవరి బొమ్మ నైనా గీయటానికి, చిన్నా పెద్ద సైజుల కోసం చక్కటి గ్రాఫింగ్ మెజర్మెంట్ చెప్తారు. అచ్చుగుద్దినట్లు పోలికలతో వేయవచ్చు.


ఇదండీ, నేను నేర్చుకున్న 'వేసవి కాలపు ' విద్య:) 

చాలా బాగున్నాయా, బాగున్నాయా, ఫర్వాలేదా, ఏమాత్రం బాగాలేవా.....మీరందరూ నాకిచ్చే గ్రేడ్ చెప్తారా ఫ్రెండ్స్:)
వీలయినప్పుడల్లా ఈ టెక్నిక్స్ డెవెలప్ చేసుకోవాలన్న కోరిక మాత్రం చాలానే ఉంది.  మెటీరియల్ మాత్రం అన్నీ కొనేసుకున్నాను. కొంచెం బద్దకంగా కూడా ఉంది. మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏమో:)))
థాంక్యూ ఫ్రెండ్స్.


********************************************************************************

26, ఆగస్టు 2014, మంగళవారం

మీనియేచర్ ముద్దుగుమ్మలు...

                          




                                       
                           


                                   


నీ శతృవు మాట విను ఎందుకంటే నీ లోని లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే.....
కాని మితృలైతే ఇంకా బాగా చెప్తారని నా నమ్మకం.....:)

Old Concept,
Do or die

New concept,
Do before you die

Latest concept,
Don't die until you do

My concept,
What to do....?

నా చేతులు ఊరుకోనంటున్నాయి, అందుకే ఈ సారి కొంతమంది అమ్మాయిల్ని మీ మీద వదిలేస్తున్నా....అద్దీ సంగతి.....:)



************************************************************************************************************************************


21, ఏప్రిల్ 2014, సోమవారం

పూలోయమ్మా! పూలు....పూలు.












9, సెప్టెంబర్ 2013, సోమవారం

మహా గణపతిం భజే!


ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా శుక్లాం బరధరం చదవాల్సిందేకదా!
వినాయకుని కెంతో ఇష్టమైనది భాద్రపద  శుద్ధ చవితి. సకల గణాధిపతి. ఈ వినాయకుని శ్రద్ధతో ఈ రోజు ఆరాధిస్తే సకల ఇష్టసిధ్ధి కలుగుతుంది. నైవేద్య ప్రియుడు ఈ దేవుడు. ఉండ్రాళ్ళతో పాటు రకరకాల పిండివంటలు సమర్పిస్తాము. గుంజీళ్ళు తీసినా, రెండుచేతులు ముడిచి తలపై కొట్టుకున్నా మన తప్పులన్నీ క్షమించేస్తాడట. సంకష్ట హరుడు. స్వయంభువు. ఇట్టి వినాయకుని మనసార పూజించితే సంభవించే కష్టాలను హరించగలడు.

ఎర్రరంగు వినాయకుని మన ఇంటి గుమ్మం ఎదురుగ్గా పెట్టుకున్నట్లైతే ఎటువంటి ఆరోగ్య సమష్యలు తలెత్తవట. తెల్లటి వినాయకుని ఇంటిలో ఉంచుకున్నట్లైతే ఎంతో స్వచ్చమైన మనసుతో సంతోషంగా ఉంటారట. ఆకుపచ్చ, పసుపుపచ్చ కలిపి వినాయకుని తయారు చేసుకున్నట్లైతే సకల సంపదలతో, సౌభాగ్యంతో విలసిల్లుతారట. బంగారు వన్నెలో మెరిసిపోయె వినాయకున్ని తయారుచేసుకున్నట్లైతే సకల గుణాభిరాములవ్వటమే కాక, దయార్ద్ర హృదయంతో సంఘసేవా తత్పరులౌతారట.

ఓంకారం అంటే గణపతి స్వరూపమే! ముక్కోటి దేవుళ్ళలో గణపతికే పెద్ద పీట వేసాం. మొదట స్మరించేది కూడా ఆయన్నే! చిన్నపిల్లలు విద్యాప్రాప్తి కోసం పూజించే దేవుడు.ప్రతి ఒక్కరు అంతుపట్టని ఆ వింత దేవుణ్ణి మనసుల్లో కలకాలం నిలుపుకున్నట్లైతేసకల సుఖాలను కలిగించే దేవుడు ఈ గణపతి....

మరి నేను తయారు చేసుకున్న ఈ గణపతులు ఎలా ఉన్నారు?

స్నేహితులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.













*************************************************************************************************************************************************** 


27, జులై 2013, శనివారం

నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....

'ఎంకెవ్వరని లోకమెపుడైన కదిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు'.... 

నాయుడు బావ దే యెంకి .... యెంకి వంటి పిల్ల లేదోయి బావా! 

  నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....




గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
      కూకుండనీదురా కూసింతసేపు !




ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే !
       యీ చిత్తమునకు వెలుగు నీ యెంకితనమే !



ఎకసకె మెవరికి తెలుసు ?
 ఎంకిచిలుక మనుసు గడుసు !




అద్దమేలంటాది అందాలు తెలప
ముద్దుమాటలకెంకిదె ముందునడక




జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని
 సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
  మెల్లంగ వస్తాది నా యెంకీ !
   సల్లంగ వస్తాది నా యెంకీ !



సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ
బారెడైనా కొండ పైకి సాగిందేమొ
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ

తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు
కాలుసేతులు పక్కకంటుకొని పోనాయి 



  ఎంకి వన్నెల చీర నెగిరె వెన్నెల పూలు
      ఎండుటాకుల గొలుసు వెండి తీగెలుచేరె!

***************************************************************************************************************************************************************************************************


14, ఫిబ్రవరి 2013, గురువారం

విహంగ ప్రేమ




 ప్రేమ పేజీ లో విహంగం....  విహంగ ప్రేమ... అమృత ధార.  


 ప్రేమించాలి...ఆ ప్రేమను పంచటం లో మించాలి....
ప్రేమ దీపం ఆరకుండా కాపాడాలి....
గుండెల్లో హాయి ప్రేమ..... 


 చెలియా,  feel my love... ప్రేమ కోరి నే వేచి ఉంటానులే....
 ప్రేమ దివ్య భావము...ప్రేమ దైవ రూపము....


 లేత వాలు చూపులో మౌన గీతాలు....నీ తోడు! నను నేనే మరిచాను...
 పో పో అని నువ్వంటే....పోనే పోనమ్మా!!! నిజంగా నిను చూడందే ఉండలేనమ్మా...



ఓ ప్రేమా! నా గుండె నీకే ఇచ్చాను....నీ చిరునామా ఎపుడు చెపుతావు
ప్రియతమా....నా హృదయమా... పల్ పల్ దిల్ కే పాస్ రహెనేదో....




 మాటలే రాని వేళ పాట ఎలా పాడను...
కళ్ళలోన కడలి సాకి ఎంతసేపు ఆపను...

   


నచ్చావులే...మనిద్దరమూ గెలిచే ఒకే ఒక ఆట ప్రేమ....
నీతో నేనున్న క్షణాలు మధురం....
నీకై వేచిన క్షణాలు మధురం...
నిన్నే తలచిన క్షణాలు మధురం...




నింగిలోన తారనైపోనా నిను చూడటానికి...
నిండు చందమామనైపోనా నీ మనసు దోచుకోటానికి...
చల్లని గాలినై రానా నిను చేరటానికి....



                                                        


చిరునవ్వుల వరమిస్తావా....చితినుండి బ్రతికొస్తాను ...
మరుజన్మకు కరుణిస్తావా....ఈ క్షణమే మరణిస్తాను... ఆత్రేయ

పక్షులు ఎంతో ప్రేమిస్తాయిట....ఒకరికొకరు అంకిత భావంతో జీవిస్తాయిట....అందుకే నా ఈ పక్షి ప్రేమ...... జంటగానే ఉంటాయి. అస్సలు విడిపోవు. ప్రతి పని సమానంగా పంచుకొని పని చేస్తాయిట. ఆడ పక్షుల్ని అపురూపంగా చూసుకుంటాయిట. ఆడ పక్షి గుడ్డు పెట్టి పొదిగే సమయంలో కంటికి రెప్పలా కాపాడుతాయి. జాగ్రత్తగా ఆహారం అందిస్తూ ఉంటాయి. ఒక పక్షి చనిపోతే జీవితాంతం ఒంటరిగానే జీవిస్తాయిట. పావురాలు ప్రేమ సందేశాలు తీసుకు పోవటం లోనే కాదు, కలిసి బతకటంలో కూడా దేనికీ తీసిపోవు.


అందుకే, నేనేసుకున్న ప్రేమ పక్షుల బొమ్మలతో మీ అందరికీ 'ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు'.....


***************************************************************************

22, అక్టోబర్ 2012, సోమవారం

Let flowers do the talking ...


  
  
Each of us is a flower
Growing in life’s garden.....   

 వాడిపోతాను, అని తెలిసినా వికసించక మానదు పువ్వు. జీవితం క్షణ భంగురమే అయినా ఎలా పరిమళించాలో ఈ పూల గుసగుసలు, గాలిలో ఈలలు వేసుకుంటూ మరీ మనకి నేర్పిస్తాయి.
పువ్వు చెట్టుకుంటే అందాన్ని ఇస్తుంది.
భగవంతుని చెంత చేరితే పరిమళిస్తుంది.
ఆడపిల్ల జడ నలంకరిస్తే నింగిలో చందమామలా వెలుగొందుతుంది.
సిపాయి మృతదేహం తాకితే పువ్వు జన్మ పరిపూర్ణత చెందుతుంది.

ఓ అందమైన పూవా!
నీవు అందం...నీ మనస్సు అందం...
నీ మనస్తత్వాన్ని సువాసనలతో వెదజల్లుతావు
నీ వంటి మనస్సు మాకుందా!

నన్ను నీవు నాటినప్పుడు
నాకు జన్మ నిచ్చిన తల్లి వనుకున్నాను
నాకు నీరు పోసి పెంచినపుడు
నా మేలు కోరే తండ్రి వనుకున్నాను
నేనొక పూవు పూయగానే
నువ్వు సంతోషిస్తావనుకున్నాను
తీరా నువ్వు ఆ పువ్వును కోసి నప్పుడు
నేను కొంత కృంగిపోయాను
కానీ ఆ పువ్వును భగవంతుని
పాదాల చెంత ఉంచినపుడు
నేనెంతో సంతోషించాను
చివరకు నా జన్మ సార్ధకమైనందుకు
నేను మరీ మరీ ఆనందించాను . . . .
నేనెప్పుడో రాసుకున్న ఈ కవిత గుర్తొచ్చింది.....ఈ పూలతో దానిని జత కూర్చాలనిపించింది....

దేవుణ్ణి పూలతో కొలుస్తాం...ఆ పూలనే దేవుడిగా కొలుస్తే!!!!





రక రకాల రంగు రంగుల పూలు
భలె భలె పూలు... పసందైన పూలు
అందమైన పూలు... కొత్త కొత్త పూలు
ముట్టుకుంటె వదలి పోలేమండి.....
కోరుకున్న పూలు...పూలంటె పూలు కావండి:) 
పూలను   చేకొనరండి ఓ అమ్మల్లారా.....ఓ అయ్యల్లారా...



పూజలు చేయ పూలు తెచ్చాను 
నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా
ఈయరా దర్శనము 






నీ వుండే దా కొండ పై, నా స్వామీ!  నే ఉండే దీ నేలపై.  ఏ లీల సేవింతునో....ఏ పూల పూజింతునో....
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె.....ఈ పేద రాలి మనస్సెంతొ వేచే......


                                                    


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మని రెమ్మరెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు..ప్రొద్దు పొడవక ముందె పూలిమ్మని...
 కొలువైతివా దేవి నా కోసము.. తులసీ..తులసీ దయా పూర్ణ కలసి...
మల్లెలివి నాతల్లి వరలక్ష్మికి..మొల్లలివి నన్నేలు నా స్వామికి 
ఏ లీల సేవింతు ఏ మనుచు కీర్తింతు...
సీత మనసే నీకు సింహాసనం...



ఒక పువ్వు పాదాల..ఒక దివ్వె నీ మ్రోల ఒదిగి నీ ఎదుట...
ఇదె వందనం.. ఇదె వందనం...  


 


ముద్దు ముద్దు రోజావే ముద్దు లొలుకు రోజావే 
ప్రేమ మంత్రమే, వాడని రోజావే
నిన్ను చూస్తే నన్ను నేను మరచిపోనా!




జగన్మాత నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు.....మీరెల్లరూ ఉల్లాసంగా రంగు రంగుల, వన్నె చిన్నెల పూనవ్వులతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలి......జయ






**************************************************************************************************************************************

                                   

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చిత్రలేఖనాలు-2

మీకు మళ్ళీ కొన్ని చిత్రలేఖనాలు చూపించబోతున్నాను. శక్తి కొలది మీరు భయపడకుండా ఉండాలని నా విన్నపం. ఇవన్నీ నేను చాలా చిన్నప్పుడు వేసినవి కాబట్టి, అందులో ఘోరమైన తప్పులన్నీ కూడా 'చిన్న తప్పులు ' గా భావించగలరని నా కోరిక. ఎందుకోనండి మరి, ఇవంటే నాకు చాలా ఇష్టమే:) అవున్లెండి, కాకి పిల్ల కాకికి ముద్దు, మాకేంటంట అంటారా! అదీ నిజమే.

ఇందులో నేను ఈ మధ్యే వేసిన రెండు చిత్రాలు కూడా ఉన్నాయి. అవేవో చాలా సులభంగానే కనుక్కోవచ్చులెండి. పెద్ద ఇబ్బందేమి ఉండదు. ఇందులో గనుక తప్పులుంటే మాత్రం అవి 'పెద్ద తప్పులన్న ' మాట.

కొంచెం గుండె చిక్కబట్టుకొని కళ్ళుమూసుకొని చూసేయండేం!!!...














*************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner