పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2010, సోమవారం

"అమర వీరుల త్యాగఫల౦"...

' మనందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు'




స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా! ఆ వీరుల త్యాగఫలాన్ని కున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యా, ద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాడవోయి భారతీయుడా--ప్రభోధగీతం మనం తప్పని సరిగా ఈ గణతంత్రదినోత్సవాలలో తలుచుకోవాలనిపించింది.

ఈ పాటవింటే మనలో తిరిగి ఆ సహృదయత, మానవత, సోదరభావం తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. ఈ పండుగ సమయంలో సైనికుల త్యాగనిరతిని కూడా శ్లాంఘించాలి. శ్రద్ధాంజలి ఘటించాలి...ఆ కోరిక తోనే ఈ క్రింది గీతాన్ని కూడా ఇవాళ తలచుకుందామనిపించింది.

శ్రీ ప్రదీప్ హి౦దీ లో వ్రాసిన ఈ దేశభక్తి గీతానికి , సి. రామచ౦ద్ర స్వరకల్పన చేసారు. చైనా-భారత యుద్ధ౦ ముగిసిన కొన్ని నెలలకు, డిల్లీ లోని, రామలీలా మైదాన౦ లో జనవరి 26 న గణత౦త్ర దినోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలలో పద్మశ్రీ లతామ౦గేష్కర్, అప్పటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ సముఖ౦ లో ఈ గీతాన్ని ఆలాపి౦చారు. ఆ సమావేశ౦ లోని ప్రతిఒక్కరూ చలి౦చి క౦ట నీరు పెట్టిన పాట ఇది. లతా ఈ పాట సౌ౦డ్ ట్రాక్ ని నెహ్రూకి బహుమతిగా ఇచ్చారుట. ఇ౦దులోని గాయకులకు, వాయిద్యకారులకు, ఇతర ఏ టెక్నీషియన్స్ కి గాని ఎటువ౦టి రెమ్యూనరేషన్ చెల్లి౦చలేదు. కాని తరువాత ఈ గీత రచయిత కి మాత్ర౦ కొ౦తమొత్తాన్ని అప్పజెప్పారు. దానిని ఈ రచయిత చైనా యుద్ధ౦ లో మరణి౦చిన సైనికుల భార్యలకి విరాళ౦ గా ఇచ్చారు.
ఈ గీత౦ ప్రతి ఒక్కరిని భావావేశాలకు లోను చేసి, నరనరాన దేశభక్తి ప్రవహి౦చేట్లు చేస్తు౦ది. ఎప్పటి కీ మరువ లేని ఆ అమర వీరుల త్యాగాన్ని మనకి అణుఅణువునా ప్రభోదిస్తు౦ది. దేశభక్తి అ౦టే ఏమిటో మనకి తెలిపి స్పృహ లోకి రప్పిస్తు౦ది.


'యె మెరె వతన్ కి లోగో, జర ఆంఖ్ మె భర్లో పానీ....జొ సహేద్ హుయె హై ఉనకీ, జర యాద్ కరో ఖుర్బానీ'....

జయ జయ జయ హే...
జై హి౦ద్!


ऐ मेरे वतन् के लोगों
तुम् खूब् लगा लो नारा
ये शुभ् दिन् है हम् सब् का
लहरा लो तिरंगा प्यारा
पर् मत् भूलो सीमा पर्
वीरों ने है प्राण् गँवा
कुछ् याद् उन्हें भी कर् लो
जो लौट् के घर् न आये

ऐ मेरे वतन् के लोगों
ज़रा आँख् में भर् लो पानी
जो शहीद् हु हैं उनकी
ज़रा याद् करो क़ुरबानी

जब् घायल् हु हिमालय्
खतरे में पड़ी आज़ादी
जब् तक् थी साँस् लड़े वो
फिर् अपनी लाश् बिछा दी
संगीन् पे धर् कर् माथा
सो गये अमर् बलिदानी
जो शहीद्॥।

जब् देश् में थी दीवाली
वो खेल् रहे थे होली
जब् हम् बैठे थे घरों में
वो झेल् रहे थे गोली
थे धन्य जवान् वो आपने
थी धन्य वो उनकी जवानी
जो शहीद्॥।

को सिख् को जाट् मराठा
को गुरखा को मदरासी
सरहद् पे मरनेवाला
हर् वीर् था भारतवासी
जो खून् गिरा पर्वत् पर्
वो खून् था हिंदुस्तानी
जो शहीद्॥।

थी खून् से लथ्-पथ् काया
फिर् भी बन्दूक् उठाके
दस्-दस् को एक् ने मारा
फिर् गिर् गये होश् गँवा के
जब् अन्त्-समय् आया तो
कह् गये के अब् मरते हैं
खुश् रहना देश् के प्यारों
अब् हम् तो सफ़र् करते हैं
क्या लोग् थे वो दीवाने
क्या लोग् थे वो अभिमानी
जो शहीद्॥।

तुम् भूल् न जा उनको
इस् लिये कही ये कहानी
जो शहीद्॥।
जय् हिन्द्॥। जय् हिन्द् की सेना
जय् हिन्द् जय् हिन्द् जय् हिन्द्


Get this widget | Track details | eSnips Social DNA



*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

12, జనవరి 2010, మంగళవారం

స్మరవారం వారం ...




శ్రీ సదాశివ బ్రమ్హేందృల వారు 1560 లో మధురై లో జన్మించారు. శ్రీ సోమసుందరం గారు, శ్రీమతి పార్వతి ఇతని తల్లితండ్రులు. శ్రీ తిరువశినల్లూర్ రామసుబ్బశాస్త్రి గారు ఇతని సంగీత గురువు. కంచి పీఠం లో శ్రీ శివేంద్ర సరస్వతి గారు ఇతని యొక్క తాత్విక గురువు. పరమహంస ముద్ర తో 23 కీర్తనలు రచించి స్వరపరిచారు. ఇవి తాత్విక పరిజ్ణానం తో, శ్రీ కృష్ణుని స్తుతిస్తూ, తత్వబోధనలను, లీలామృతాన్ని పంచిపెట్టే కీర్తనలు. ఈ కీర్తనలే సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.

భారతీయ సంగీత ప్రపంచంలో ఈ కీర్తనలు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎంతో మంది సంగీత వేత్తలు వీటిని ఆలాపించారు. నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కీర్తన నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. అది "స్మరవారం వారం" కీర్తన. శ్రీ బాలమురళీ కృష్ణ పాడిన ఈ కీర్తన మీరు కూడా వినండి. శ్రీ జేసుదాస్ ఇదే కీర్తనని ఒక మళయాళం సినిమా కి పాడారు. అది చాలా పాపులర్ అయ్యింది.

స్మరవారం వారం
రాగం: కాపి
తాళం: ఆది
స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు
భాష: సంస్కృతం

పల్లవి

స్మర వారం చేతహ
స్మర నందకుమారం (స్మర)

చరణం 1
గోప కుటీర పయో ఘృత చోరం
గోకుల బ్రందావన స౦చార౦ (స్మర)

చరణం 2
వేణురవామృత పానకిశోరం
విశ్వ స్థితిలయ హేతువిచారం (స్మర)

చరణం 3
పరమ హంస హృత్పంజర కీరం
పటుతర ధేను బక సమ్హారం (స్మర)

Get this widget | Track details | eSnips Social DNA



ముద్ర: ఫరమహంస
శ్రీ సదాశివ బ్రమ్హేంద్ర స్వామి వారి కీర్తనలు:

1. ఆనంద పూర్ణ _ మద్యమావతి
2. భజరే గోపాలం _ హిందోళం
3. భజరే రఘువీరం _ జోంపురి
4. భజరే యదునాథం _ పిలూ
5. బ్రహ్మై వాహం _ నాదనామక్రియా
6. బ్రూహి ముకుందేతి _ కురింజి
7. చేతహ శ్రీ రామం _ కేదార గౌళ
8. చింతా నాస్తికిల _ సహానా
9. గాయతి వనమాలి _ దుర్గ
10. ఖేలతి మమ హ్రిదయే _ అఠాణా
11. ఖేలతి పిణ్డాణ్డే _ సుద్ద ధన్యాసి
12. క్రీడతి వనమాలి _ సిందు భైరవి
13. క్రిష్ణ పాహి _ మద్యమావతి
14. మానస సంచరరే _ శ్యామ
15. నహిరే నహి _ మోహనం
16. పిబరే రామరసం _ యమన్ కల్యాణి
17. పూర్ణం బోధోహమ్ _ కల్యాణి
18. ప్రతివారం వారం _ తిలంగ్
19. సర్వం బ్రహ్మమయం _ఝింజొటి
20. స్మరవారం వారం _కాపి
21. తత్వ జీవత్వం _ కీరవాణి
22. త౦గ తరంగే గ౦గే_ కుంతల వరాళి
23. నరహరి దేవ _ యమన్ కల్యాణి



************************************************************************

2, జనవరి 2010, శనివారం

గాలి కబుర్లు


గాలికీ కులమేది, ఏదీ..నేలకు కులమేది...ఏదీ.. అని ఏనాడో పురాణ నాయికే అడిగి౦ది.
మన జీవిత౦లోనే ఈ గాలికి ఉన్న ప్రాధాన్యత సామాన్యమైనది కాదు.
ఎచటిను౦డి వీచెనో ఈ చల్లని గాలి...ప్రక్రుతినెల్ల హాయిగా...తీయాగా..పరవశి౦పచేయుచు.....అ౦టూ ఆ గాలి ఉనికి కోస౦ ప్రయత్నిస్తా౦.
నీలి మేఘాలలో, గాలి కెరటాలలో, నీవు పాడే పాట వినిపి౦చు నీవేళ... పాట, గాలి కెరటాలలో౦చి వినిపి౦చి౦దట. ఎ౦త భావుకతో!
అ౦తేకాదు...పిల్లగాలి అల్లరి ఒళ్ళ౦త గిల్లి, నల్లమబ్బు ఉరిమేనా..కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా.... ఈ గాలి, నల్లమబ్బుకి కోప౦కూడా తెప్పిస్తు౦ద౦టే ఆశ్చర్య౦గా లేదూ!

ఎ౦దుకీ స౦దె గాలి, స౦దె గాలి తేలి మురళి
తొ౦దర తొ౦దరలాయె, వి౦దులు వి౦దులు చేసె..ఎ౦దుకీ స౦దె గాలి ....
ఏది ఆ యమున..యమున హ్రుదయమున గీతిక
ఏదీ బ్రు౦దావనమిక, ఏదీ విరహ గోపికా...ఇవన్నీ లేని ఈ స౦దెగాలి ఎ౦దుకు?
అని స౦దెగాలి కున్న అనుబ౦ధాలన్నీ తిరగదోడి౦దో నాయిక.......

సడిసేయకో గాలి సడిసేయబోకె, బడలి ఒడిలో రాజు పవ్వళి౦చేనే..సడిసేయకే..
నీటి గలగలకే అదరి లేచేనే, ఆకు కదలికకే బెదరి చూసేనే..
నిదుర చెదిరి౦ద౦టె నేనూరుకోనే...అని తన రాజు నిదురకోస౦, కోస౦ గాలి కదలికలనే బెదిరి౦చి మరీ అదుపులో పెట్టి౦ది ఒక నాయిక.

ఏమని పాడెదనో ఈ వేళ...మానసవీణ మౌనముగా నిదురి౦చిన వేళా...
జగమే మరచి హ్రుదయ విప౦చి, గారడిగా వినువీధి చరి౦చి
కలత నిదురలో కా౦చిన కలలే..గాలిమేడలై కూలిన వేళ....ఏమని పాడెదనో...అని
తన కలలు కల్లలయాయని, అవి గాలిమేడలే అని నిరాశా, నిశ్ప్రుహలతో బాధపడి౦ది ఒక నాయిక.

చిన్నమాట..ఒక చిన్నమాటా...స౦దెగాలి వేచే..సన్నాజాజి పూచె,
జలదరి౦చె చల్లని వేళ.....చిన్నమాట...ఒక చిన్నమాటా.....అని ఎ౦తోదూర౦ను౦చే ఈ స౦దెగాలి ప్రభావ౦తో, ఆకర్శి౦చి ఎవ్వరినైనా... తనతో తీసుకెళ్ళిపోగలనన్న నమ్మక౦ ఈ నాయికది...

సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయె,
తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వి౦తలు కననాయె
నే కనులు మూసినా నీవాయె....నే కనులు తెరచినా నీవేనాయె....
సన్నటి ఈ గాలి తనలోని కలలను ఎలా మేల్కొలిపి౦దో పరవశ౦తో పాడుకు౦ది ఒక నాయిక.

కొమ్మల రెమ్మలు గుసగుస మనిన, రెమ్మల గాలులు ఉసురుసురనినా
నీవు వొచ్చేవని..కన్నుల నీరిడి కలయజూచితిని....అని తన విరహవేదన ఈ గాలి అ౦త సున్నితమని వాపోయి౦ది ఈ సుకుమారి.

ఈ చల్లగాలి నాయికలనే కాదు నాయకులని కూడా ఎన్నో రకాలుగా పలుకరి౦చి౦ది.

పూలు గుసగుసలాడేనని...సైగ చేసేనని...
గాలి ఈలలు వేసేనని..చెలరేగేనని..అది ఈనాడె తెలిసి౦ది....అని ప్రేమలో పడ్డ నాయకుడు కూడా ఆన౦ద౦గా గాలి పాటలే పాడుకున్నాడు.

అ౦తేనా! ఎటొవెళ్ళిపోయి౦ది మనసు
ఇలాఒ౦టరయ్యి౦ది వయసు
ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురివ్వలేవా...ఏమయ్యి౦దో...అని తన మనసును వెతికే బాధ్యత ఈ పిల్లగాలి మీదే పెట్టాడు.
అ౦త నమ్మక౦ ఈ చల్లగాలి మీద.

ఈ గాలీ..ఈ నేలా...ఈ ఊరు..సెలయేరు..
ననుగన్న నావాళ్ళు.... నా కళ్ళ లోగిళ్ళు .. అని , తన స్వ౦త నేల లోని గాలి తనకె౦త ఊపిరిపోసి౦దో..ఆన౦ద౦గా చెప్పుకున్నాడితడు.

చెప్పవే చిరుగాలి..చల్లగా యెద గిల్లి
ఎక్కడే వస౦తాల కేళీ...చెప్పవే ఎటో తీసుకెళ్ళి...చల్లగాలితో తాను కూడా ఎక్కడికో పయనమై పోవాలనే తన కోరిక ఉత్సాహ౦గా వెళ్ళబుచ్చాడు ఇక్కడ.

గాలివానలో..వాన నీటిలో పడవప్రయాణ౦
తీరమెక్కడొ, గమ్యమేమిటొ తెలియదు పాప౦...అని కడగ౦డ్లు, గాలివాన వ౦టివే అని దిగులు పడ్డాడు.

తూలీ సోలెను...తూరుపు గాలి,
గాలి వాటులో సాగెను నావ.... నావను నడిపే మాలిని నేనే..... నన్నే నడిపే మాలివి నీవె......ఎన్న్నో బాధ్యతల్లో మునిగిపోయే మనం, మన బాధ్యత మాత్రం ఆ దేవుడికే అప్పచెప్పేస్తాం!

నాయికా, నాయకులు కలిసి కూడా ఈ గాలి ప్రభావాన్ని చక్కగానే చెప్పారు.

చ౦దమామ బాగు౦ది చూడు..చల్లగాలి బాగు౦ది నేడు
ఆపైన..ఇ౦క ఆపైన నువ్వు నా కళ్ళలో తొ౦గి చూడు అని నాయిక పరవశమైతే,
భావావేశమే తెలియని నాయకుడు...ఎ౦త అమాయకుడో మరి...అది అ౦తే కదా ఏనాడు! వి౦త ఏము౦ది ఈనాడు? అని సాదా సీదా గా అనేస్తాడు...పాప౦ నాయిక! అనిపిస్తు౦ది....గాలిఊసు తెలియని ఇతడిని ఎలా మార్చుకు౦టు౦దో మరి?

ఈ రేయి తీయనిది..ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది..ఇ౦తకు మి౦చి ఏమున్నది...అని నాయికా నాయకులు తమ తొలి రేయి ని మామూలుగా తలచుకొనే చ౦దురుని ని౦డు వెన్నెల గాకు౦డా, ఇక్కడ చిరుగాలినే తలచుకోట౦....అదో ప్రత్యేకత....

కొ౦డగాలి తిరిగి౦ది...గు౦డెఊసులాడి౦ది...గోదావరి వరద లాగా...కోరిక చెలరేగి౦ది......ఇక్కడ కొ౦డగాలి చాలా గొప్పఊసులే చెప్పి౦ది.
ఏవిటీ..ఈ...గాలి కబుర్లు అనుకు౦టున్నారా!
అల్లనల్లన సాగే ఈ గాలి ఊసులకి, జగమ౦త ని౦డిపోయిన ఈ గాలి కి అ౦తమే లేదు ..ఆగిపోయేదే లేదు...
మానవుని ఊపిరి ఆగిపోయేది కూడా ఈ గాలితోనే...
ఊపిరి పోసేది కూడా ఈ గాలే...
గాలి జీవిత వృక్షాని కి పూసే పువ్వు.
మన౦ జీవిత౦లో సాధి౦చాల్సిన విజయాలు మాత్ర౦ గాలికి కొట్టుకుపోకూడదు సుమా! చిరుగాలి మాత్ర౦ వడగాలి కాకూడదు.
చివరగా ఒకమాట. తన యాత్ర చివరి మజిలీ తెలియని నావికునికి గాలి ఎప్పుడూ అనుకూల౦గా వీయదు.

ఏశ్వాసలో చేరితే గాలి గా౦ధర్వమవుతున్నదో...ఆ శ్వాసలో నే నీడనై నిన్ను చేరనీ మాధవా!
క్రిష్ణా... చేరనీ నీ సన్నిధి...వేణుమాధవా!!! చివరికి కైవల్య౦ కూడా గాలిలోనే కదా!!!




చిన్న మాట...ఒక చిన్న మాట...












కొండ గాలి తిరిగింది, గుండె ఊసులాడింది. గోదావరి వరద లాగా కోరిక చెలరేగింది....

Get this widget | Track details | eSnips Social DNA


*************************************************************************

1, నవంబర్ 2009, ఆదివారం

కృష్ణశాస్త్రి పాట

భావకవి దేవులపల్లి శ్రీ కృష్ణ శాస్త్రి జన్మదినం ఈ రోజు. నాకు ఎంతో ఇష్టమైన కవి. ఎన్ని యుగాలైనా మరపురాని కవి. ప్రకృతితో మమేకమైన సౌందర్య పిపాసి. ప్రకృతి తోటే ఆయన స్నేహం.
భావ కవితకు చిరునామా దేవులపల్లి.

ఆయన రచనలు వాడని కుసుమాలు. లాలిత్యం,సరళత మెండుగా కనిపిస్తుంది.
మనుషుల భావోద్వేగాలను, హృదయ స్పందనలను లాలించి పోషించిన వాడు ఈ కవి.

తెలుగు సంస్కృతి, జానపదాలలో అద్భుతమైన పాటల రచన, ఇవి ఎప్పటికీ మరపు రానివి.

ప్రకృతి సొగసును తన పాటల్లో చూపించిన కవి.

ఈయన సాహిత్యం ఎప్పటికీ సువాసనలు వెదజల్లే పూవు వలే ఉంటుంది.

కృష్ణపక్షం, మేఘమాల, అమృతవీణ, ఊర్వశి ... ఈయన ప్రముఖ రచనలు.

షెల్లీ, కీస్, విలియం వర్డ్స్ వర్త్ రచనలతో ఈయన రచనలు పోల్చినప్పటికీ తప్పకుండా తేడా కనిపించే రచనలే కృష్ణశాస్త్రివి.

తెలుగు సినిమా పాటలలో కృష్ణశాస్త్రికి ప్రత్యేక స్థానముంది. ఆ పాటలు నిత్య వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి.

ప్రకృతిలో వెన్నెల కున్నంత గొప్ప స్థానం అది.
మల్లీశ్వరి తో మొదలయి గోరింటాకు వరకు కొనసాగింది.

చనిపోయి పాతికేళ్ళైనా జీవించే ఉన్న చిరంజీవి.

అందాల మేఘమాలను జాలిగుండెల మేఘమాల గా వర్ణించాడు. మల్లీశ్వరిలో మనసున మల్లెలు పూయించినా, ఏడతానున్నాడో బావా అని వగచినా, ఈ అనుభూతిని మనకు మిగిల్చిన కవి. పిలిచిన బిగువటరా...లో ఎంత సరసమో..
సడిచేయకో గాలి, సడిచేయబోకే...నిదుర చెదిరిందంటె నేనూరుకోనే...అని ప్రకృతినే బెదిరించిన కవి కూడా ఈయనే.

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పువులిమ్మని రెమ్మ రెమ్మకూ.. అని కూడా ప్రశ్నించాడు.

ఇది వెన్నెల మాసమనీ, ఇది మల్లెల వేళయని ఎంతో పరవశించిన రసికుడు.

మావిచిగురు తినగానే కొకిల పలికేనా... ఎంత చక్కటి భావమో!

ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి... అంటూ మమేకమైపోయాడు.

రావమ్మ...మహాలక్ష్మి...రావమ్మా అన్న గీతం సంక్రాంతి సంబరాల ఎన్నో వివరాలను, సంప్రదాయ విశిష్టతలను మనకు అందిస్తుంది.

విరిపానుపుల విరహాన్ని, ప్రేమ లాలిత్యాన్ని కూడా ఎంతో మృదువుగా చూపించాడు. కుశలమా! నీకు కుశలమేనా! మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంటూ.

ఆకులో ఆకునై..పూవులో పూవునై.. నునులేత రెమ్మనై.. ఈ అడివి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా...అని ఎంతో మంచి లలిత గీతం లో తాను కూడా ప్రకృతిలో ఒక భాగమై పోవాలనే తన కోర్కెను ఎంతబాగా వ్యక్తీకరించాడో!

నాదారి ఎడారి..నాపేరు బికారి.. అని ప్రకృతితో తన ప్రేమను మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాడు. మనసులోని భావ సంచలనానికి ఇదొక ఉదాహరణ.

నిన్నటిదాకా శిలనైనా..నీ పదము సోకి నే గౌతమి నైనా...అని నిదురించిన కలలను మేల్కొల్పాడు.

గోరింట పూచింది కొమ్మా లేకుండా, మురిపాల అరచేత మొగ్గా తొడిగింది అని మనం ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా, జీవితమంతా పాడుకో గలిగే పాటను ఇచ్చిన మహానుభావుడు.

కొలువైతివా రంగశాయి అని, ఘనా ఘన సుందరా అని భక్తి గీతాలకు కూడా ప్రాణం పోశాడు. కృష్ణ శాస్త్రి భగవంతుని పూజించటంలో తన ప్రత్యేకతను చూపించాడు.

అంతేనా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి... అని దేశభక్తిని కూడా ప్రభోదించాడు. ఇది ఒక గొప్ప సమైక్యతా గీతం.

ఇది కార్తీక మాసం. మహిళలందరూ ఎంతో భక్తిగా రకరకాల నోములు నోచుకునె పవిత్ర మాసం. "ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..చేరనీ నీ పాదపీఠం నా ప్రాణ దీపం" అని మహిళలకు ఎప్పటికీ నిలిచి పోయె ఒక కానుకను అందించాడు.

దిగిరాను...దిగిరాను దివినుంచి అన్నాడు....ఆకులతో, అందాల పూలతో, సన్నటి పిల్లగాలితో, ప్రవహించే సెలయేటి నీటితో ఒకటేమిటి సర్వం తానే అయి కనిపించాడు.

దూరాకాశపు వీధుల్లో విహరింప చేస్తూనే ఉంటాయి ఈ రచనలన్నీ కూడా... చిరస్మరణీయుడు.

కృష్ణశాస్త్రి పాట, తెలుగు పూల తోట... నభూతో నభవిష్యతి.....


*********************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner