1, డిసెంబర్ 2010, బుధవారం

సరికొత్త చీర ఊహించినాను......

ఎవరికైనా వెంకటగిరి చీరలు కావాలంటే చెప్పండి. ఈ చీరలు కట్టీ కట్టీ మా కలీగ్స్ తో బాగా తిట్లు తింటున్నాను. ఈ చీరలకు నేను బ్రాండ్ అంబాసిడర్నట. నేనే ప్రమోట్ చేస్తున్నానట. అన్నీ అవే కడ్తున్నాను కాబట్టి నా పేరు వెంకటమ్మట. అబ్బో చాలా మాటలే పడ్తున్నానులెండి. ఎవ్వరూ నామీద కొంచమైనా జాలిచూపించట్లేదు.

ఇంతకీ నీ గొడవేంటి అంటారా!!! ఏం లేదండి. చాలా కాలంగా వెంకటగిరి నుంచి అక్కడే చీరలు తయారు చేసే ఒకాయన ప్రతినెలా ఇక్కడికి వస్తున్నాడు. చీరలన్నీ తెలిసిన వాళ్ళకి అమ్ముకుని పోతాడు. గత కొంతకాలంగా ఈ పని జరుగుతోంది. వచ్చినప్పుడల్లా తప్పకుండా నాక్కూడా రెండో మూడో చీరలు అంటగట్టకుండా పోడు. దాంతో, నేను అన్నీ వెంకటగిరి చీరలే కట్టాల్సి వస్తోంది. ఎవరికన్నా పెట్టాల్సినా నేనివే చీరలు ఇస్తున్నాను. పెళ్ళిళ్ళకి పబ్బాలకి నేనే గిప్ట్ ఇస్తానో అందరికీ ముందే తెలిసి పోతోంది. మా అక్కా మా అమ్మా అయితే ఊరికే ఆ వెంకటగిరి చీర తీసుకొని రాకు మా దగ్గరికి అని నాకు గాట్ఠిగా వార్నింగ్ ఇచ్చేసారు కూడా. మా అత్తగారు కూడా ఒప్పుకోటం లేదు. ఎందుకులెండి...నా కడుపు చించుకుంటే నా కాలిమీదేగా పడేది.

వద్దయ్యా బాబూ ఈ చీరలు నాకింక, నే కూడా నీతోపాటు ఓ షాప్ పెట్టాల్సిందే ... అంటే అతను ఒప్పుకోటంలేదు. తెగ బతిమలాడుతున్నాడు. నా కష్టాలు చెప్పినా వినిపించుకోటం లేదు. పైగా తన కష్టాలు నాకు చెప్తాడు. మీకు చాలా తక్కువ రేట్ కిస్తాను తీసుకోమంటాడు. అక్కడ నేసిన చీరలు డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాను అంటాడు. ఈ చీర మీకు చాలా బాగుంటుంది ... ఈ రంగు బాగుంటుంది అంటూ తెగ ఉబ్బేస్తాడు.ఈ చీర మీ కోసమే తెచ్చాను, ఇంకెవరికీ అడిగినా ఇవ్వలేదు అంటాడు. మరి కరిగి పోకుండా ఎలా ఉంటాను చెప్పండి. నా మనసేమో వెధవ మొహమాటం నువ్వూనూ....తీసుకో...అంటుంది. నేనేమో ఒకటే మొహమాటపడిపోతూ ఉంటాను. ఒక్కోసారి గట్టిగా చెప్పినా వినిపించుకోడు. అంత పెద్దమనిషిని కోప్పడలేంకదా. కానీ నాకు మాత్రం ఆ చీరలన్నీ చూడగానే రంగురంగుల తమాషా పిట్టలన్నీ రకరకాల రాగాలు తీసుకుంటూ నా చుట్టూ తిరుగుతు ఎంత హొయలు పోతున్నాయమ్మా అనిపిస్తుంది. నా కళ్ళల్లోంచి మెరుపుల జిలుగులు ఆ చీరలంతా పరుచుకుంటాయి.

అతడు ముస్లిం. కాని చక్కని తెలుగు మాట్లాడుతాడు. తన ఇద్దరు కొడుకులు కూడా ఈ పనిలోనే ఉన్నారట. ఏం చదువుకోలేదు అంటాడు. వేరే ఉద్యోగాలు ఏమీ చేయలేరు. స్వంత మరదలే పెళ్ళి చేసుకోను అందట. వాళ్ళకు ఎక్కడా పెళ్ళి సంబంధాలే కుదరట్లేదట. మా పిల్లలు చాలా అమాయకులు, సిటీలోకొచ్చి బతకలేరు. ఇప్పుడేమో ఈ చీరలెవరూ కొనటంలేదు, అని మొన్న కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యో పాపం అనిపించింది. కాని నేనేం చేయగలను. ఆ చీరలు కూడా చాలా ఖరీదైనవి. ఎవరైనా ఎన్నని కొనగలరు....ఆయన కొడుకులకు నేను పెళ్ళిసంబంధాలు ఎలాగూ కుదర్చలేను కదా....అందుకని చీరలైనా కొనాలికదా పాపం.

ఎలా నేను తప్పించుకోవాలో తెలియటం లేదు. కాని ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. చీరలు మాత్రం అస్సలు వదులుకోబుద్ధికాదు. చాలా ముద్దుగుంటాయి. కావాలంటే మీరూ చూడండి. ఎంతబాగున్నాయో. నిజంగా ఏ చీరకుంది ఇంత అందం అనిపించటం లేదు.






























అబ్బాయిలూ నిజం చెప్పండి..."మీ కోసం" కొనేయాలనిపించటం లేదూ... అమ్మాయిలూ మీ మనసు దోచేయటంలేదూ...తప్పకుండా ఇప్పుడే కొనేస్తారు...నాకు తెలుసు

ఈ చీరలు చూస్తూంటె ఎంతో అందమైన ఈ పాటే నాకు గుర్తొస్తుంది.

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచునేయించినాను
మనసూ మమతా పడుగు పేక
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెల రాణికీ సరి జోత
అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోసానే....కొంగుకు చెంగును ముడివేస్తానే
చుర చుర చూపుల ఒకమారు
నీ చిరు చిరు నవ్వుల ఒకమారు
మూతి విరిపుల ఒకమారు
నువ్వు ఈ కళనున్నా మా బాగే...ఈ చీర విశేషం అల్లాగే..........
సరికొత్త చీర ఊహించినాను..........

ఇంకా చూడండి...రంగురంగు చీరల వన్నెచిన్నెలు..........

చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా.........

Get this widget | Track details | eSnips Social DNA


****************************************************************************

30 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

వెంకటమ్మ గారి వేంకటగిరి చీరలు :-)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మనస్వి చీరల దుకాణం కన్నా వెంకటమ్మ చీరల కొట్టు బాగా సరిపోతుంది.
నామకరణం చేశానుకదా అని నాకు బహుమతిగా ఇవ్వకండి బాబూ, నాకు కాటన్ చీరలు అస్సలు నచ్చవు.

జ్యోతి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శిశిర చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శిశిర చెప్పారు...

నాకు కావాలి. అడిగారు కదా కాదనను. రెండు చీరలతో సరిపెట్టుకుంటానులెండి. రెండవ, ఆఖరి చీరలు నాకు పంపించండి. :)

కొత్త పాళీ చెప్పారు...

వెంకటగిరి చీరలు బాగుండవు అన్నవాళ్ళకి హృదయం లేదు, వాళ్ళు కృరులు, సున్నితత్వం తిలీనివాళ్ళు ఎట్సెట్రా ఎట్సెట్రా .. అంచేత వాళ్ల మాటలు మీరు పట్టించుకోనక్కర్లేదు. ఫొటోల్లో పెట్టినవన్నీ ఎంత బావున్నయ్యో. కేవలం వెంకటగిరి చీరకట్టుకునేందుఖే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు.

Vinay Datta చెప్పారు...

very beautiful!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నిజమేనండి చీరలు చాలా బాగున్నాయి.

Hima bindu చెప్పారు...

xlnt colectn...

Unknown చెప్పారు...

Mee sarees anni chala bagunnai... venkatagiri chiralu yekkada baaga dorukutayo meeru kasta cheppagalara

అజ్ఞాత చెప్పారు...

చీరలు చాలా బాగున్నాయండి.

sunita చెప్పారు...

కళ్ళు చెదిరేంత బాగున్నాయి. ఏమిలాభం? వాటి కి గంజి పెట్టడాలూ, ఇస్త్రీలూ, డ్రై వాష్లూ బాధలు పడలేక ఎప్పుడో కాటన్ నా లిస్ట్ లోంచి తీసేసాను.ప్చ్....

నేస్తం చెప్పారు...

ఎంత బాగున్నాయో.. ఇక్కడ సంవత్సరానికో మారు చీరకడుతూ ఎంత మిస్ అయిపోతున్నానో.. ఇండియా వచ్చాకా కేవలం చీరలు మాత్రమే నా షెల్ఫ్ లో ఉంచాలని డిసైడ్ జేసినా.. జయ గారు ఆ చీరలన్నీ ప్రక్కన పెట్టండి ఎవ్వరికీ ఇవ్వద్దు.. అన్నీ నాకే :)

మధురవాణి చెప్పారు...

అబ్బ.. ఎంత బాగున్నాయో చీరలన్నీ.. ఇవన్నీ ఇంత బాగుంటే.. అందరూ మీ చీరాలని ఎలా కామెంట్ చేస్తున్నారని నేను నిలదీస్తున్నాను అధ్యక్షా! నా సపోర్టు మీ టేస్టుకే! :)

జయ చెప్పారు...

నన్ను వెంకటమ్మ అంటే మీకెందుకండి అంత సంతోషం రామి రెడ్డి గారు. మొన్నెప్పుడో మా ఫ్రెండ్ పోచంపల్లి చీర కడితే నేను తనని పోచమ్మ అన్నాలెండి. అందుకు ఇది రివెంజ్ అన్నమాట:)


మందాకిని గారు, అలాగే వెంకటమ్మ చీరల కొట్టు అనే పెట్టుకుంటాకాని చక్కటి కాటన్ చీరల అందం దేనికొస్తుందండి.


జ్యోతి గారు, హాఫ్ రేటేం ఖర్మండి, మీకు ఫ్రీనే తీసేసుకొండి.

జయ చెప్పారు...

శిశిరా, ఓకే ....ఆ చీరలమీద శిశిరపేరే ఉంది. కనీసం ఈ శిశిర ఏ ఊర్లో ఉందో కూడా తెలీదే....ఎలా పంపాలి:)

కొత్తపాళీ గారు భలే కరెక్ట్ గా చెప్పారు. నేను నా చీరలు స్వర్గానిక్కూడా తీసుకెల్తాను. ఆ విష్ణుమూర్తి బతిమిలాడుకున్నా ఇవ్వను గాక ఇవ్వను.


మాధురి గారు థాంక్యూ. మరిమీకొద్దా:)

జయ చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ థాంక్యూ.

చిన్ని గారూ థాంక్యూ. మీరెప్పుడన్నా వెంకటగిరికెళ్ళినప్పుడూ తప్పకుండా ఓ నాలుగు చీరలు తెచ్చుకోండేం.

వసంత గారూ, అయ్యో వెంకటగిరి చీరల అడ్రెస్ అడుగుతున్నారా:) ఏ ఊర్లో అయినా ఈ షాప్స్ కావాల్సినన్ని ఉంటాయ్ కదండి. మీది ఏ ఊరో తెలీదుకదా. పోనీ హైద్రాబాద్ రండి. కావాల్సినన్ని ఇప్పిస్తాను.

జయ చెప్పారు...

అను గారు థాంక్యూ. వెంకటగిరి చీరలు తీసుకోండి. ఎన్ని రకాలుంటాయో.

సునిత గారు, ఇంత కళ్ళుచెదిరే అందమైన చీరలు వద్దంటే ఎలాగండి. గంజి పెట్టిన కాటన్ చీరలు ఎంత నిండుదనం ఇస్తాయో.మనకి కాంఫిడెన్స్ కూడా పెంచుతాయి:) అయినా అక్కడ మీరేం చేయగలరులెండి.

ఓకే నేస్తం గారూ ఈ చీరలన్నీ మీకే. నా కే దిగులు లేదు. ఎలాగూ మీరొచ్చేలోపు ఇంకా నాకు కొన్ని చీరలు అంటగడుతాడుగా. అవి నేనుంచుకుంటాలెండి.

మధురవాణి గారు, మీ సపోర్ట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం అలాగే ఘాట్టిగా నా వైపు నిలబడాలి మరి. సరేనా....

శివరంజని చెప్పారు...

మీ కొలీగ్స్ కి అస్సలు టేస్ట్ లేదు నేను మీకు సపోర్ట్ ... నిజం గా మీ దుకాణం పెడితే నాకు కావాలి ఆ చీరలు ..అన్నీ నేస్తం అక్కకే ఇచ్చేస్తే నాకు ......ఇప్పుడు కాకపొతే తరువాత ఉపయొగించుకుంటా

మురళి చెప్పారు...

కొత్తపాళీగారి వ్యాఖ్యే నాదీనండీ.. వెంకటగిరికి సాటి మరేదీ లేదు, లేదంతే..

జయ చెప్పారు...

శివానీ...డోంట్ వర్రీ. చిన్నపిల్లలకే ఫస్ట్. మీ నేస్తం అక్క వస్తే అప్పుడు ఏదో ఒకటి మానేజ్ చేసేద్దాంలే.

మురళి గారూ, మీరిలాగే ఎప్పటికీ సపోర్ట్ చేయాలి మరి.అలా చేస్తేనే మీకు స్పెషల్ థాంక్స్.:)

తృష్ణ చెప్పారు...

ఈ టపా మిస్సయానండోయ్...చీరలు సూపర్ ఉన్నాయి. వెంకటమ్మ అన్నా, గిరమ్మా అన్నా మీరేం ఫీలవకండీ. అన్నట్లు మా జయగారు బహుమతి ఇచ్చారని చక్కగా మేమందరం కట్టుకుంటాం కదా...తలో చీర కొనేయక ఇంకా ఆలోచిస్తారేంటండీ??

జయ చెప్పారు...

Yes, You are correct. Common get your choice Trishna:)

vijay చెప్పారు...

మీ పోష్టు కంటే చీరల కొట్టు ( సారీ ఫోటోలు ) బావుంది.పోష్టు చదివినప్పుడు కంటే చిత్రాలు చూసినప్పుడు చీరల గురించి మీరెంత కష్టపడ్డారో
( ఇష్టపడ్డారో ) అనిపించింది.

అజ్ఞాత చెప్పారు...

meerila cheeralu choopinchi tempt cheyyatam emi baagaledandi.alanti cheeralu ekkada dorukutayo hyderabad lo selaveeyandi. nenu hyderabad vachinappudu konukkuntanu. if u dont mind can you give the details of the guy please!!!. meeru manasu pado leka pothe jaali pado konna cheeralu oorike ivvoddu lendi

Madhavi

జయ చెప్పారు...

@మగవారినే ఎంతో ఇష్టం తో నా చీరల కొట్టు అంత ఆకర్షిస్తూ ఉంటే ఇంక పోస్ట్ చూసే అవకాశ మెక్కడండీ విజయ్ గారు. అంతగా నచ్చాయా:)

@మాధవి గారు హైద్రాబాద్ లో వెంకటగిరి షాప్ ల అడ్రస్ ఏముందండి. ఊరంతా దొరుకు తాయి. మీ అడ్రస్ ఇవ్వండి. ఆ అబ్బాయిని మీ ఇంటికే పంపిస్తాను. ఇంక జన్మలో మీరొద్దన్నా మిమ్మల్ని వదలడు:)

అజ్ఞాత చెప్పారు...

Dear Jaya First of all thanks for responding.hyderabad anta dorukutaayemo kaani naaku teliyadu. endukante for the last 13 yrs am living outside hyderabad/india

address ikkade blog lo ivvamantaara lekapothe mee email isthaara?cos am not confortable giving contact details on blogs.hope you understand.Thank you

అజ్ఞాత చెప్పారు...

BTW ikkada personal message PM box undunte chala baagundedi!!!hmm

జయ చెప్పారు...

మీరు ఇండియా వచ్చినప్పుడు ఇలాగే ఒక మెస్సేజ్ ఇవ్వండి. అప్పుడు నేనే మీకు కావాల్సినన్ని చీరలు ఇప్పిస్తాను. సరేనా.

Sirisha చెప్పారు...

nijam ga cheeralu chala bagunnayi...if u r also from hyderabad pls give us his no...i wanna buy too :)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner