నిన్నుచేరాలని...
మల్లెసౌరభాల నీ నిండు హృది లో
మధురగానం వినిపించే నీ తీయని మాటలు...
మదిలో రాగాలను వింటున్న నేను
పదపదము నీ అలికిడికై ఎదురుచూస్తూ
ఆనందమయంలో మునిగి నీ ప్రేమలో పరవశించి
ప్రకృతినే ఆహ్లాదపరిచే...సర్వకాలాల్లో చిగుళ్ళు తొడిగే
లహరిలో ఓలలాడించె...దివ్యమైన మధురస్మృతి అయిన
నీ ప్రేమకు ప్రతిబింబమునై నిలిచిపోవాలని నా తపన...
నీ ప్రేమలో మైమరచి నన్ను నేను మరచి
నేను నేనుగాక నీవే నేనుగా నిలిచిపోవాలని మన ప్రేమకు సాక్షి అయిన
ఆ నిండుచందురునే కోరుకుంటున్నాను
నింగిలోన తారనైపోనా నిన్నుచూడడానికి...
నిండు చందమామనైపోనా నీ మనసు దోచుకోడానికి...
చల్లని గాలినై రానా నిన్ను చేరడానికి...
వానజల్లునై రానా నీ మనసు తడపడానికి...
మెరుపులా రానా నీ గుండెలో ఉండిపోడానికి...
ఏదో మా అక్క అడిగిందని రాయడమే గాని....ఈ రవివర్మ అందానికి కవిత రాయటం నా తరమా, నేను రాయలేను. ఆ మధ్య నా మనస్వి తో చెప్పుకున్న 'నాకోసం’ కవిత గుర్తొచ్చింది.
రేపు నా కళ్ళనిండుగా చూడాలని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఆ బంగారు 'మహా చందురుని' కే ఇది అంకితం....
నాకెంతో ఇష్టమైన...రవివర్మకే అందని, ఒకే ఒక అందానివో.....ఈ పాటకూడా గుర్తొస్తోంది.....
|
********************************************************************************
24 కామెంట్‌లు:
vaahvaa, vaahvaa!!!!
bomma- Old is gold
kavitaa- beautiful new fold
verasi-adurs....
చాలా బావుంది జయ గారు
జయగారూ,
బాగుందండీ . మీరు కవితలు కూడా వ్రాస్తారా! వావ్!
ఫోటో చూడగానే ఇంత అందమైన కవితలు పుట్టుకోస్తున్నాయో!!!
చాలా బాగుంది!
జయ,
చాలా బాగుంది . థాంక్ యు .
చాలా బాగా రాశారండీ! మహా చందురునికి అంకితం ఇస్తూ, రవి వర్మ బొమ్మా, పాటా చక్కగా ఉంది.
ఈ కవిత చూస్తుంటే ఎప్పుడో రాబోయే పున్నమి ఇప్పుడే వచ్చినట్టుగా అనిపిస్తోంది.
చాలా బాగా రాసారండీ...
ఏటి ఒడ్డున వెన్నెల తిన్నెల్లో, ఎదురుచూపున కొమ్మా
ఎదలోని జాబిలి ఎదురుగా దోబూచులాడుతున్నాడు చూడు.
నీడ కమ్మిన నింగి జాడ తెలుపుతున్న కృష్ణవేణీ
వలకాడు నిను చేర వేయిబారలు ఒక్క ఉదుటున దాటుతున్నాడు కాబోలు!
నీ తనువు కాంతులిక సప్త స్వరాలాపనలుగా మారునని ఏటినీరు గలగలల గోల
[కొమ్మ అంటే అమ్మాయి అని కూడా అర్థం ఉంది;కృష్ణవేణీ - నల్లని కురులు కలది]
ఇంత చక్కగా రాసి ఎలాగుందో అంటారేమండీ. చాలా బాగుంది. నాకూ ఉత్సాహం వచ్చి ఒక పాత కవిత వెతికి నా బ్లాగ్లో పెట్టాను. వీలున్నప్పుడు చూడండి.
ఉషా ,
మీ సీక్రెట్ తెలిసిపోయింది :)
మంచి కవిత తో కనిపించారు . వచ్చిన మీకు , వచ్చేట్లుగా చేసిన జయకు థాంకూలు .
చాలా బావుంది జయ గారు
@ నాగలక్ష్మి గారు, మీ టోటల్ కామెంట్ అదుర్స్. థాంక్యూ.
@ లత గారు థాంక్యూ.
@ ఎన్నెల గారు, అప్పుడప్పుడు ఇలా భయపెడ్తూ ఉంటానన్నమాట, నా సకల కళలూ చూపించి:)థాంక్యూ.
@ లక్ష్మీ రాఘవ గారు, మీరు కూడా ప్రయత్నించండి. చాలా బాగా రాస్తారు. అది బొమ్మలోని మహత్యం అన్నమాట. థాంక్యూ.
@. అక్కా థాంక్యూ. ఇదేదో నువ్వడగబట్టే కదా:)
@ చిన్నిఆశ గారు చాలా థాంక్సండి. ఎందుకో చంద్రునికే ఇచ్చేయాలనిపించింది.
@ శ్రీలలిత గారు ధన్యవాదాలండి. అఖండ చందమామ చాలా బాగున్నాడు కదూ. మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తామో.
@ ఉషా గారు ధన్యవాదాలండి. ఒకే 'సాగర తీరాన' పెరిగినవాళ్ళం. అప్పుడప్పుడూ ఇలా చిన్ననాటి నెచ్చెలిని కలవటానికి వొస్తూ ఉండాలి. పసితనపు ముచ్చట్లు మాట్లాడుకోవాలి కదా మరి:)
@ తృష్ణ గారు మీరిలా పొగిడారనుకోండి, కొంచెం ఉబ్బి తబ్బిబ్బైపోతానన్నమాట:)మీ కవిత ఇంతకంటే డబల్ బాగుంది. థాంక్యూ.
@ మంజు గారు ధన్యవాదాలండి.
ఐతే మాలగారు అందరినీ రంగంలోకి దించారన్నమాట. చాలా బావుంది జయ...
jayagaroo..chala bavundi!!
బాగుందండీ.. పాట అయితే నాకు ఇష్టమైనది.. జయచిత్ర ఈ పాటలో ఉన్నట్టు ఇంకెక్కడా కనిపించదు..
@ జ్యోతి గారు ధన్యవాదాలండి.
@ ప్రణీతస్వాతీ థాంక్యూ.
@ మురళి గారు థాంక్సండి. ఆ పాట మాత్రం ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ కదండి. నాక్కూడా చాలా ఇష్టం.
నింగిలోన తారనైపోనా నిన్నుచూడడానికి...
నిండు చందమామనైపోనా నీ మనసు దోచుకోడానికి...జయ గారు బాగా రాశారు...అలాగే మీరు పెట్టిన పాట కూడ సంధర్బోచితంగా ఉంది...మీనుండి ఇలాంటి ఇంకా రావాలని ఆశిస్తూ...
డేవిడ్ గారు స్వాగతం. ధన్యవాదాలండి.
మంచి భావోద్వేగం తో బాగానే రాసారండి కవిత్వం..
రవివర్మ గీసిన బొమ్మ కు తగ్గట్టు గా వుండండి..
మంచి టపా
కథాసాగర్ గారు ధన్యవాదాలండి.
కవిత బాగుంది జయగారు. మీకు ఉగాది శుభాకాంక్షలు.
థాంక్యూ శిశిరా. హమ్మయ్యా, ఇన్నాళ్ళు ఎదురుచూడాలా!!! ఇదిగో,నేను చెప్పినట్లుగా ఉగాది పచ్చడి చేసుకుని, చక్కగా ఇంటి ముందు ముగ్గేసుకొని, తోరణాలు అవీ కట్టుకొని....ఆనందంగా ఉగాది జరుపుకోవాలి...సరేనా..
కామెంట్‌ను పోస్ట్ చేయండి