17, ఆగస్టు 2013, శనివారం

చక్కని తల్లి కి ఛాంగు భళా!



శ్రావణమాసం వస్తోందంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ నెలంతా పండగ శోభే కదా!
వరలక్శ్మి పూజ కూడా నాకు చాలా ఇష్టం. చక్కగా అమ్మవారిని (మనల్ని కూడా:) అలంకరించి పేరంటాళ్ళను పిలిచి తాంబూలాలిచ్చుకోవాలంటే మరీ ఇష్టం. మరి మా అమ్మవారిని చూస్తారా...ఎలా ఉన్నారు....నాకైతే నిండుగా దీవెనలిచ్చేట్లుగా కనిపిస్తున్నారు.




లక్ష్మీనారాయణులకు, పార్వతీపరమేశ్వరులకూ ఎంతో ఇష్టమైన శ్రావణం లో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.




నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమోనమ:




పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా
చెదరని వెదముల చిగురు భోడి
ఎదుట శ్రీ వెంకటేసునిల్లాలవై నీవు
నిధువ నిలిచె తల్లి నీ వారమమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి......





ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా! వరలక్ష్మి తల్లి!
ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ
వరలక్ష్మి తల్లి
ఆట్లాడె బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి
కోట్లా ధనమిచ్చే తల్లి
వేయి నామాల కల్పవల్లి , మాపై కరుణించి సాయము ఉండు తల్లి!


క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకు ఇదె నా నీరాజనం....




*************************************************************************************************************************************************** 

10 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

అమ్మవారు చాలా బాగున్నారండి.'ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా' పాట మా అమ్మ ప్రతి ఏడూ పాడేది. నాకు భలే ఇష్టం.

Unknown చెప్పారు...

బాగున్నారు మీ అమ్మవారు .డెకరేషన్ బాగా చేసారు.రాదిక(నాని)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అలంకరణ చాలా బాగుందండీ :-)

ranivani చెప్పారు...

జయ గారు !నిజంగా గుడిలో అమ్మవార్ని చూసినట్లే ఉంది.అభయహస్తంతో అమ్మచాలా బాగుంది .చాలా ఓపికగా చేశారు .బావుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

అమ్మవారు చాలా బాగున్నారండి.

జయ చెప్పారు...

తృష్ణ గారు, రాధిక గారు, వేణు గారు, నాగరాణి గారు, మంజుగారు మీ అందరికీ చాలా చాలా థాంక్స్.

Unknown చెప్పారు...

మీ లక్ష్మీదెవి చాలా బాగుంది.చేతులు ఎలా చేసారు? బంగారు లక్ష్మీ ఫోటో కొంచం బ్లర్ ఐంది:))మీరు చూడాలనుకుని చూడకుండా ఒక్కళ్ళని మిస్స్ అయ్యానన్నారు:)) ఎవరండీ:)) చెబితే నేనుకూడా చూస్తా:))

శిశిర చెప్పారు...

అలంకరణ చాలా బాగుంది. ఎన్ని విద్యలున్నాయో మీ దగ్గర.

జయ చెప్పారు...

@సునిత గారు అమ్మవారి బొమ్మలు అమ్ముతున్నారండి. మనకు కావాల్సిన మొహం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు అలంకరించుకోటమే. అవునండి, ఆ ఫొటో కొంచెం హడావుడిగా తీయాల్సొచ్చింది. అప్ప్పుడే ఎవరో వచ్చారు:)

జయ చెప్పారు...

@ శిశిరా, అలంకరణ బాగుందా. నాదగ్గిర విద్యలేం లేవులే, అంత నేర్చుకోటానికి :)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner