30, జనవరి 2010, శనివారం

దేవుని కటాక్షం...!బలం కావాలని అడిగాను
నన్ను బలపరిచేందుకు
డేవుడు కష్టాలనిచ్చాడు...

జ్ఞానం కావాలని అడిగాను
దేవుడు సమస్యలనిచ్చాడు
పరిష్కరించమని...

సంపద కావాలని అడిగాను
దేవుడు తెలివి, కండబలాన్నిచ్చాడు
పనిచేసేందుకు...

ధైర్యం కావాలని అడిగాను
దేవుడు అపాయాలనిచ్చాడు
జయించమని...

ప్రేమ కావాలని అడిగాను
దేవుడు బాధల్లో ఉన్న మనుషులనిచ్చాడు
సహాయం చేయమని...

ఉపకారాన్ని అడిగాను
దేవుడు అవకాశాలనిచ్చాడు
ఇందులోనుంచే నేర్చుకొమ్మని...

కోరుకున్నదేదీ నాకు దొరకలేదు కాని.....
అవసరమైనవన్నీ నాకు లభించాయి.

***********************************

నేను ఆరు రోజుల క్రితం రాసిన పోస్ట్
ఎవరూ చదవలేదుగా దేవా! అనడిగితే
ఇదే దురాశ, అయిదు రోజుల క్రితం కోల్పోయిన
మీ కళాశాల 'బాక్ బోన్ ',
మీ 'పితృసమానులకు ', వందనమర్పించు
అసలైన బాధవిలువ నీకు అర్ధమవుతుంది....
నీవు నిజంగా ఏం కోల్పోయావో...
మీ అందరికీ జరిగిన నష్టమేమిటో...
తీరని లోటేమిటో
మీ కంట నీరు నిండితే సరిపోదు...
అనుసరించు ఆ మహానుభావుని ఆశయాలను
నిలబెట్టండి అతని పేరు ప్రతిష్టలను కలకాలం...
అని అన్నావుగా దేవా!

***************************************

ఇప్పటివరకు మేమనుభవించినవన్నీ
ఈ దేవుని కటాక్షమే...
మా అదృష్టానికి, ఆనందానికి,
పరిపక్వతకు,నేర్చుకున్న జీవిత పాఠాలకు
కారణమైన ఆ దేవుడు...మా కళాశాల గౌరవ కార్యదర్శి గారు.
ఇప్పుడు విధి వక్రించి, ఆ దేవుని కోల్పోయి
అనాధలమైపోయాము.

మా దేవునికి అశృనివాళి తో ఇది అంకితం....


***************************************************

10 వ్యాఖ్యలు:

శిశిర చెప్పారు...

మీరుదహరించిన వివేకానందుడి వాక్యాలు స్ఫూర్తిదాయకాలు. మీ కళాశాల కార్యదర్శి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ...

భావన చెప్పారు...

అయ్యో మీ కార్యదర్శి గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిద్దాము. ఆయన ఆశయాలు మీలో ఎప్పుడూ పలకలాని ఆశిస్తూ..

జయ చెప్పారు...

శిశిర, వివేకానందుని వాక్యాలా? ధన్యవాదాలు.

అవును భావనా...ఆయన్ని మర్చిపోవటం మాత్రం ఎప్పటికీ జరగదు.

SRRao చెప్పారు...

జయ గారూ !
మీ అవేదన చూస్తే అర్థమవుతోంది ఆయన వ్యక్తిత్వం. దిగిలు చెందదండి. ఆయన ఆత్మ మీ కళాశాలను ముందుకు నడిపిస్తుంచి. మీ కర్తవ్యం ఆయన ఆశయాలను నెరవేర్చడమే! ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.....

మాలా కుమార్ చెప్పారు...

మీ కార్యదర్శి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాను .

జయ చెప్పారు...

S.R.Rao గారు ధన్యవాదాలు.

అక్కా థాంక్స్.

కొత్త పాళీ చెప్పారు...

వారి పేరు, జీవిత వివరాలు చెబితే మాకందరికీ కూడా ప్రేరణగా ఉంటుంది.

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు ధన్యవాదాలండి. మా సర్ పేరు చెప్పంగానే మిగతా వివరాలన్నీ తెల్సిపోతాయి. మరి నా కాలేజ్ పేరు ఇక్కడ చెప్పకూడదుగా:) అయినా మీకు ఇంకా ఏం ప్రేరణ అవసరం ఉందండి. మీరే ఇంకోళ్ళకి ప్రేరణ కదా! ఇక్కడ మళ్ళీ ఒచ్చి నా సమాధానం చూస్తారా?

తృష్ణ చెప్పారు...

good quote...!! may his soul rest in peace.

జయ చెప్పారు...

థాంక్యూ తృష్ణ.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner