8, మార్చి 2011, మంగళవారం

’ఫస్ట్ లేడీస్’





నూరు వసంతాలు నిండిన మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డలైన మన నారీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకసారి 'మొదటి మహిళ’ ల గురించి నేను సేకరించిన కొంత సమాచారం మీతో పంచుకోవాలని, నా ఈ చిన్ని ప్రయత్నం. మీకు తెలిసిన వారి గురించి కూడా చెప్తారు కదూ. మరి మొదలు పెట్టనా....

* దేశం లో తొలి మహిళా ఉపాధ్యాయిని - సావిత్రీ బాయి పూలే
* భారత పోలీస్ సర్వీస్ తొలి మహిళా అధికారి _ కిరణ్ బేడీ
* విదేశీ గడ్డపై భారత పతాకాన్ని గర్వంగా ఎగురవేసిన తొలి మహిళ _ మేడం బికాజీ రుస్తుం కామా
* తొలి కమర్షియల్ పైలట్ మహిళ _ ప్రేమ్ మాథుర్
* ఐక్యరాజ్య సమితి లో తన గళ మాధుర్యాన్ని వినిపించిన తొలి మహిళ _ యం.యస్. సుబ్బలక్ష్మి
* దూరదర్శన్ లో మొదటి సారిగా వార్తలు చదివిన మహిళ _ ప్రతిమా పురి
* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ తొలి గ్రహీత _ దేవికారాణి
* తొలి జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత _ ఆశాపూర్ణాదేవి
* నోబల్ బహుమతి పొందిన తొలి మహిళ _ మదర్ థెరిస్సా
* రాజ్యసభకు ఎన్నుకోబడిన మొదటి భారతీయ సినీనటి _ నర్గీస్ దత్త్
* ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ పారిస్ నుంచి అందుకున్న తొలి భారతీయ నటి _ షబానా ఆజ్మీ
* ఫ్రాన్స్ లో అత్యున్నత పురష్కారాన్ని పొందిన ఆసియా నటి _ స్మితా పాటిల్
* మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్ _ షన్నోదేవి
* హైకోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి _ జస్టిస్ లీలాసేఠ్
* క్రికెట్ లో ఆంపైరింగ్ చేసిన తొలి మహిళ _ బచేంద్రీ పాల్
* బాడ్మింటన్ అర్జున అవార్డ్ ను సాధించిన తొలి మహిళ _ మీనా షా (1961)
* కేంద్రంలో అతి చిన్న వయస్కురాలైన తొలి మహిళా మంత్రి _ కుమారి షెల్జా (రాజస్థాన్)
* కేరళ హైకోర్ట్ తొలి మహిళా న్యాయమూర్తి _ అన్నావైండి
* వాలీబాల్ అర్జున అవార్డ్ పొందిన తొలి మహిళ _ జి. మృణాళినీ రెడ్డి
* జిమ్నాస్టిక్ లో అర్జున అవార్డ్ పొందిన తొలి మహిళ _ సునితా శర్మ (1985)
* మొట్టమొదటి మహిళా కానిస్టేబుల్ _ బెయిల్ నూన్యిద్ సేన్
* స్పీడ్ టైపింగ్ లో జాతీయ రికార్డ్ సాధించిన తొలి ఆంధ్ర వనిత (నిమిషానికి 118 పదాలు ) _ డి.వి. పద్మావతి(విశాఖపట్నం)
* మొదటి చిత్రం తోటే ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మహిళ _ ఆండ్రీ పెప్ బర్న్
* జవహర్ లాల్ అవార్డ్ ను అందుకున్న తొలి మహిళ (81 సంవత్సరాలు, స్వీడన్, 1981) _ ఆల్వామిర్ధాల్
* పోస్ట్ కార్డ్ పై 81,544 అక్షరాలు వ్రాసి గిన్నీస్ బుక్ లో చోటుచేసుకున్న మహిళ _ కుమారి ఉమామహేశ్వరి (విశాఖపట్నం)
* అథ్లెటిక్స్ లోఅర్జున అవార్డ్ పొందిన తొలి మహిళ _ అనసూయాబాయ్ (1975 )
* ఆసియా మహిళా చెస్ చాంపియన్ షిప్ టైటిల్ ను వరుసగా అయిదు సార్లు గెలుచుకున్న మొదటి మహిళ _ రోహిణీ ఖదిల్కర్
* భారతదేశ మొదటి మహిళా జర్నలిస్ట్ _ హమాయివ్యారవల్లా
* దేశంలో మొదటి వేలిముద్రల నిపుణురాలు _ బ్రగతంబాల్ (తమిళనాడు)
* పారాచూట్ ఉపయోగించిన తొలి భారతీయ మహిళ _ గీతాచంద్
* భారత ‘సాహస’ పురస్కారాన్ని అందుకున్న తొలి బాలిక _ దూద్ బెన్ బోడాబాయ్ (14 సంవత్సరాలు)
* ప్రపంచంలో అత్యధిక భాషలలో, అత్యధిక పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన తొలి భారతీయ గాయని ( 20 భాషలలో 25 వేలకు పైగా పాటలు) _ లతామంగేష్కర్
* వింబో స్కేటింగ్ లో గిన్నీస్ బుక్ ఎక్కిన మొదటి బాలిక _ కుమారి శైలజ (విశాఖపట్నం)
* మూడు సంవత్సరాలకే కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్ లలో అద్భుత నైపుణ్యాన్ని చూపి ప్రపంచాన్నే అబ్బురపరచిన భారతీయ బాలిక _ జుహీ అగర్వాల్
* సుప్రీం కోర్ట్ లో తొలి మహిళా జడ్జ్ _ ఫాతిమా బీబీ
* అంత్యక్రియలు స్వయంగా నిర్వహించిన ప్రధమ మహిళ _ గులాబ్ మహరాజన్

...ఈ మహిళలు మహరాణులు....మనందరం ఎంతో మంచి ’సీ గాన పెసూనంబ’ లం. ఈ నాటి మహిళ అసమర్ధురాలు కాదు. ఆడపిల్లల జనన రేట్ సంరక్షించాల్సిన బాధ్యత స్త్రీలదే. స్త్రీ లేని ప్రపంచం ఎలా ఉంటుంది....అందుకే స్త్రీలను గౌరవంగా ఉన్నత స్థానం లో ఉంచాల్సిన భాద్యత పురుషులదే.......ఏదీ తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. విజయం సాధించాలంటే నిరంతర పరిశ్రమ, అచంచలమైన ధృఢసంకల్పం ఉండాలి అని ఏనాడో స్వామీ వివేకానంద చెప్పారు. అంతేకాకుండా "If you want to change the society, educate the woman’ అని కూడా స్త్రీల మీద ఉన్న తన నమ్మకాన్ని చూపించారు.

చూసారుగా ఎన్ని ముందడుగులో మనవి. ఇంకా, ఇంకా ముందుకు పోతూనే ఉండాలి.....ఎన్ని ముందడుగులో వేయాలి. ఆ ఆకాంక్ష తీరే రోజు దగ్గరిలోనే ఉంది......ఉందిలే మంచి రోజు ముందు ముందునా.....
అంతేనా....మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ....రాగం లో అనురాగంలో తరగని పెన్నిధి మహిళ.....
మన నైటింగేల్ ఆఫ్ ఇండియా....సరోజినీ నాయుడు, బ్రోకెన్ వింగ్, గోల్డెన్ త్రెష్ హోల్డ్ ...ఈ బుక్స్ ఎంత చదివినా తనివి తీరదు కదా.....
ద గ్రేట్ కల్పనా చావ్లా...మన మహిళా స్వాతంత్యం కోసం పోరాడిన దుర్గాబాయ్ దేశ్ ముఖ్.....
అంగవైకల్యాన్ని మరచి ముందుముందుకు సాగిపోతున్న, రోజ్, సుజ్జి మనకి ఆదర్శమేగా...
విజయనిర్మల కూడా రికార్డ్ బద్దలకొట్టిందిగా...
సుభద్ర, థాయ్ లాండ్... ఒంటినిండా జుట్టుతో రికార్డ్ సాధించింది. అబ్బో ఇలా ఇంకా చాలా...చాలా మంది తెలుసు నాకు:)))

"Climb high
Climb far,
Your goal the Sky
Your aim the Star".....
What is impossible if you have intelligence?
What is unachievable if your will is firm?


"Success is counted sweetest
by those who never succeed
to comprehend a nectar,
requires sorest need." ..... Emily Dickinson

Persistence is the key to success
Hope is the last thing that we loose. ...కదా. మరి అందరం ఫాలో అయిపోదామా.

"ఎందరో మహిళలు. అందరికీ వందనాలు."... "A Rome is not built in a day"...సో, సడలని ఆత్మ విశ్వాసంతో...చెదరని ధైర్యంతో అందరం కష్టాలు అనే అడ్డుగోడలు చీల్చుకుని... విజయాల వైపు పయనిద్దామా....


లేచింది నిద్ర లేచింది మహిళా లోకం...దద్దరిల్లింది పురుష ప్రపంచం:)

ఈ మాటలు వింటుంటే రైన్ డ్రాప్ లా డాన్స్ చేయాలనిపించటం లేదూ. ఐస్క్రీం లా కరిగి పోవాలనిపించటం లేదూ....




*********************************************************************

24 కామెంట్‌లు:

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుందండి మీ సేకరణ .

"ఎందరో మహిళలు. అందరికీ వందనాలు."... "A Rome is not built in a day"...సో, సడలని ఆత్మ విశ్వాసంతో...చెదరని ధైర్యంతో అందరం కష్టాలు అనే అడ్డుగోడలు చీల్చుకుని... విజయాల వైపు పనిద్దాం...
మీకు కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Sasidhar Anne చెప్పారు...

mee post lo chinna update..

Naaku telisi best cook - Amma.
First Friend - Amma.

Admin చెప్పారు...

మీ సేకరణ SUPER....

లత చెప్పారు...

చాలా బావుందండీ
మీకు మహిళా దినొత్సవ శుభాకాంక్షలు

శ్రీలలిత చెప్పారు...

మీ సేకరణ చాలా బాగుంది.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

తృష్ణ చెప్పారు...

మీరు మరీను... పంతులమ్మగారికి ఆ మాత్రం సంగతులు తెలియక పోతే పిల్లలు మాట వినొద్దూ...?

ఏమండీ ఏమైపోయారసలు? ఇలా పాత మిత్రులందరూ నల్లపూసలైపోతుంటే ఎలాగండి...? రాస్తూ ఉండండి...వంద టపాలకు చేరాలని కోరమన్నారు కదా. కోరేసి చాలా రోజులైంది...:) ఇక మీదే ఆలస్యం.

మరోసారి.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

sunita చెప్పారు...

అబ్బ ఎంత ఓపిక? Good job. మీకు , హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

కొత్త పాళీ చెప్పారు...

అంతేనంటారా?
సరే కానివ్వండి, మీ మాట కాదనడం ఎందుకు?

మాలా కుమార్ చెప్పారు...

నీ సేకరణ చాలా బాగుంది .
శశిధర్ గారు ,
మీ సవరణ కూడా చాలా బాగుంది :)

శిశిర చెప్పారు...

బాగుందండి సేకరణ. కొత్త విషయాలు కొన్ని తెలిశాయి. Thanks for the post.

శివరంజని చెప్పారు...

wowwwwwww సూపర్ పోస్ట్ నేను ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటా........ మీకు మహిళా దినొత్సవ శుభాకాంక్షలు

Hima bindu చెప్పారు...

మంచి ఇన్స్పిరషన్ ఇస్తుందండీ మీ ఆర్టికల్ .ధన్యవాదాలు ఇంత మంచి సమాచారం పంచినందుకు .

sarayu చెప్పారు...

chala bagundandi

జయ చెప్పారు...

@ రాధిక గారు థాంక్యూ

@ శశిధర్, మీ అప్డేట్ ఆనందంగా ఒప్పుకుంటాను. థాంక్యూ. మరి నేనొక చిన్న సప్లిమెంట్ ఇవ్వనా:) బెస్ట్ కుక్ = శశిధర్.

@ లక్ష్మి గారు, మహిళా దినోత్సవాన నా బ్లాగ్ కు స్వాగతం. థాంక్యూ.

@ లత గారు, చాలా చాలా థాంక్స్.

@ శ్రీలలిత గారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

జయ చెప్పారు...

@ తృష్ణ , మీరు మరీను...అలా అంటే ఎలా...పడ్డ కష్టం కొంతైనా గుర్తించాలి కాని. పాత మితృలందరూ ఒక్కొక్కరే కనుమరుగవుతున్నారు. అంత ఇంట్రెస్ట్ అనిపించటంలేదు. బహుశ: సెంచురీ కొట్టలేనేమో:) థాంక్యూ.

@ సునిత గారు నిజంగా నచ్చిందా. ఎంత కష్టపడ్డానో చెప్పలేను. థాంక్యూ.

@ కొత్తపాళీ గారు, అంతేనంటారా. సరే కానివ్వండి. మీ మాట నేనెందుకు కాదనటం:)Thanq

@ అక్కా థాంక్యూ.

జయ చెప్పారు...

@ శిశిరా, థాంక్యూ. శిశిర పోస్టుల్లో ఎన్ని మంచి విషయాలు తెలుస్తాయో తెలుసా...

@ హాయ్ హాయ్ శివాని ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటానంటే ...నేను హ్యాపీ హ్యాపీ...మరి బోల్డన్ని థాంకూలు కూడా.

@ చిన్ని గారు, మిమ్మల్ని చూస్తేనే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. మీరు ఇంకా చాలా చాలా ప్రోగ్రెస్ సాధించాలి. అది మేమందరం చూడాలి. మీకు ధన్యవాదాలు.

@ సరయు గారు, స్వాగతం. మీ పేరు వింటుంటే మొత్తం రామాయణమే పారాయణం చేసినట్లనిపిస్తోంది. చాలా మంచి పేరు. థాంక్యూ.

అజ్ఞాత చెప్పారు...

mI blagulo post lu selective ga chadavalante kudaradam ledu. nelavariga kani, label variga kani chadavalsi vastundi. dayachesi Blog Archive marchandi. heirarchical vacchelaga. appudu kavalasina tapa chadavadaniki viluntundi.

Ennela చెప్పారు...

అదేంటీ...మొట్టమొదటి సారి వర్చువల్ చెట్టూ పుట్టల్లొ తిరిగిన వనిత అని నా పేరు వ్రాయలేదు..?? యీ సారి మిమ్మల్ని తీసుకెళ్ళట్లే!! నేనొక్కదాన్నే తిరుగుతా...!!

జయ చెప్పారు...

* అజ్ణాత గారు ప్రయత్నిస్తానండి.



*ఎన్నెలా సారీ...సారీ...సారీ...ఓకే. ముత్యంగా మూడుసార్లు అడిగాను కాబట్టి క్షమించేయాలి మరి. ఇప్పటికీ సరిపోలేదా? సరే అయితే. అయాం వెరీ సారీ అన్నాగా లక్షోసారి....సరదాగా నవ్వేసెయ్ ఒకసారి.సరేనా. కాబట్టి ఇంక...నన్ను వొదలి నీవు పోవలేవులే..అదీ నిజములే:) సో, నన్ను భీ గుడంగా తోల్కపోవాలె.

Sasidhar Anne చెప్పారు...

@ శశిధర్, మీ అప్డేట్ ఆనందంగా ఒప్పుకుంటాను. థాంక్యూ. మరి నేనొక చిన్న సప్లిమెంట్ ఇవ్వనా:) బెస్ట్ కుక్ = శశిధర్.

tinakunda ela cheppagaluguthunnaru abba [alochisthunna budugu bomma ikkada]

ప్రణీత స్వాతి చెప్పారు...

చాలా బాగుందండీ. చాలానే శ్రమపడి వుంటారు ఇంత విషయ సేకరణ కోసం.

ప్రణీత స్వాతి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జయ చెప్పారు...

శశిధర్ గారు, తమరేగా చెప్పుకున్నారు...నేను వంట చాలా బాగా చేస్తాను అని:)


ప్రణీతస్వాతి గారు ధన్యవాదాలండి.

జయ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner