(సమ్మర్ స్పెషల్స్ 1)
ఎన్ని రకాల చీరల గురించి చెప్పుకోవచ్చో ....అలాగే అన్ని రకాల నగల గురించి కూడా చెప్పుకోవచ్చుకదా....
ఆభరణాలంటే ఇష్టపడని అతివలుంటారా అసలు.
వెండి బంగారాలు, వజ్రవైడూర్యాలు కొనే రోజులు పోయాయిగా...అందుకే ఉన్నవాటినే రకరకాలుగా తయారు చేసుకొని మన నగల ముచ్చట తీర్చుకోవచ్చు.
కొంత క్రియేటివిటీ చూపించామంటే ఎటువంటి ఖర్చు లేకుండా, ఉన్నవాటినే ఆకర్షణీయంగా రూపొందించుకొని సంతోషపడొచ్చు.....
నేను చేసిన ఒక చిన్న క్రియేషన్ చెప్పనా...
ఏంలేదండి...కొన్ని నగలకి వెనకాల బంగారు గొలుసుకి బదులుగా...పొడుగాటి ఒక కుచ్చుల తాడు కూడా వాడుతుంటాంకదా...ఇదిగో ఇలాంటివి.
మన నగలు ముందు వైపు ఎంత అందంగా ఉంటాయో చూసుకొని మురిసిపోతుంటాం, అంతేగాని కొన్ని నగలకు వెనకాల వేలాడే తాడు గురించి మాత్రం పట్టించుకోము. ఈ తాడు చివరన ఉన్న కుచ్చులు కొన్నాళ్ళకి పాతపడిపోతాయి. అంతే కాకుండా చూడటానికి అస్సలు బాగుండకుండా అయిపోతాయి. అలా కాకుండా మనం ఆ కుచ్చులకి కొంత అలంకారం చేసామనుకోండి...ఎంత చూడ ముచ్చటగా ఉంటాయో. అస్సలు పాడవ్వవుకూడా. వెరైటీగా కూడా ఉంటుంది. చందమామ కథలో చూశా ఎంత బాగుందో...అంటూ పాటలు పాడుకోవచ్చు:)
ఇట్లాంటి పనులు చాలా ఈజీ గా చేసుకోవచ్చు.ఎలా అంటే...ఇలా....
మన దగ్గిర ఆర్టిఫిషియల్ గొలుసులు, గాజులు ఉంటాయి కదా. అలాంటివి పాతపడినప్పుడు పారేయకుండా దాచిపెట్టుకోవాలి. వాటికుండే రంగు రంగుల గోల్డెన్ బీడ్స్, రకరకాల రాళ్ళతో చేసిన చిన్న, పెద్ద బిళ్ళలు...కుందన్స్...అలాగే గాజులకి ఉండే చిన్న చిన్న హాంగింగ్స్ లాంటివి ఈ పనికి ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి వాటిని తాడువెనకాల ఉండే కుచ్చుకి ఒడుపుగా కట్టేయటమే. అప్పుడు అది చూడ టానికి కొత్తరకంగా అందరినీ ఆకట్టుకుంటుంది. అబ్బా...ఎంత బాగుందో, ఎక్కడ కొన్నారండీ అని అడుగుతారుకూడా. పైగా ఆ తాడు గాలికి ఎగరకుండా...ఆ తరువాత తాడు పాతబడ్డా కూడా కుచ్చుగురించితెలియకుండా నిత్యనూతనంగా ఉండిపోతుంది.
నేను ఎలా చేసుకున్నానో చూడండి....అసలు గొలుసుకన్నా....వెనకాల వేలాడే ఈ తాడునే అందరూ ఇష్టపడ్తున్నారు. అంతేకాదు...మిమ్మల్ని బాగా పొగుడ్తారు కూడా:) అబ్బాయిలు కూడా అమ్మాయిలకి ఇలా తయారుచేసి ఇవ్వచ్చు. కావాలంటే...అబ్బాయిలు కూడా...ముత్యాలు, పగడాలు వేసుకుంటునేఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని వేసుకోవచ్చు. షర్ట్ మీంచి వెనకాల వేలాడుతూ తమాషాగా....బాగుంటుంది:)
కాబట్టి అందరూ కూడా ఈ ఉగాదికి చక్కటి పట్టుచీర కొనిపించుకొని, వెనకాల అందంగా వేలాడే తాడున్న నగలతో ఆనందంగా జరుపుకుంటారని,......
అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలతో........మీ అందరికోసం ఉగాది పచ్చడి ....ఇలా చేసుకొని తినేయండేం......
ఇదిగో..రంగోలికూడా ఇలా, మంచిగా వేసుకోవాలి మరి.
ఇంకేంలేదండి చూడటానికి, ఇంతే...ఇహ మొదలుపెట్టేయండి.......
***********************************************************************
3, ఏప్రిల్ 2011, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
19 కామెంట్లు:
"ఆభరణాలంటే ఇష్టపడని అతివలుంటారా అసలు".
NENUNNAANU:-)
HAPPY UGADI
జయ గారూ !
మీకు, మీ కుటుంబానికి శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు
శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
( అమాయకపు పిల్లలు దొరికారుకదా అని పొద్దుటినుంచి సాయంత్రం వరకు లెక్చర్లు దంచుతూ ఉండాలని కోరుకుంటూ :) )
బావుందండి మీ ఐడియా, చాలా బావున్నాయి.
ఉగాది శుభాకాంక్షలు
Jaya గారు ఉగాది శుభాకాంక్షలు... :)
జయ గారూ....
ఈ నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని అనుగ్రహించాలని ఆ భగవంతుని కోరుకుంటూ....
శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు
జయ గారు మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు..
జయగారూ,
బలే రాసారండీ..
పెళ్ళిపుస్తకం లో ముళ్ళపూడి వెంకటరమణగారి డవిలాగ్ ఒకటి వుంది.
"నవ్వొచ్చినప్పుడు అందరూ నవ్వుతారుట..
ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో.." అని.
అలాగ.. అందరూ నగల డిజైన్లు ముందు వైపు కనిపించేవి చెపితే మీరు వెనకాల వేళ్ళాడేవి చెప్పి" హీరోయిన్ " అనిపించుకున్నారు.
అసలా అవిడియా ఎలా వచ్చిందండీ బాబూ.. చాలా బాగా చెప్పారు. చూడ్డానికి చాలా అందంగా వున్నాయి.
ఎప్పుడో చేసేస్తానేమో కూడా...
ఉగాది శుభాకాంక్షలతో...
శ్రీలలిత....
చాలా బాగుందండి మీ సృజనాత్మకత. బాగా చేశారు.
@ అయ్యో, చిన్ని గారూ...అలా అంటే ఎలాగండీ...కనీసం చిన్ని చిన్ని ఆభరణాలు కూడా ఇష్టంలేదా? ఇప్పుడు ఇలా చేసుకోని చూడండి. అప్పుడు మీరే ఎంతో ఇష్టపడ్తారు.
@ రావ్ గారు ధన్యవాదాలండి. మీకు కూడా శుభాకాంక్షలు.
@ పరుచూరి వంశీకృష్ణ, మీ కోరిక తీర్చటానికి నాకేమాత్రం అభ్యంతరంలేదు గాని...పాపం పిల్లలే:)
@ లత గారు,ఐడియా బాగుందా. మరి మీరెప్పుడు ఇలా తయారుచేసుకుంటున్నారు.
@ రాజేష్ గారు థాంక్యూ. మరి మీరు కూడా:)
@ అను గారు థాంక్యూ.
@ డేవిడ్ గారు ధన్యవాదాలండి.
@ శ్రీలలిత గారు నన్ను హీరోయిన్ చేసేసారే!!!:) ఎప్పుడో చేసేస్తాను ఏంటి, ఇప్పుడే చేసేయండి. లేకపోతే తరువాత మూడ్ పోతుంది. ఉగాది బాగా చేసుకున్నారా? థాంక్యూ.
@ శిశిరా, బాగుందా సృజనాత్మకత:) మరి అలా తయారుచేసుకోవాలి కదా....
ee post nenu kandisthunna... em pandagante ammayilaki mathramena.. abbayilaki kada.. maaku kooda abbayilaki mathrame ani oka post dedicatec cheyali ani demand chesthunnam leka pothey .. mee inti mundu.. 1 million march chestam ;)
అమ్మో.. అంత ఓపిగ్గా చేసి వేసుకోవడం నా వల్ల కాదు. :) అభినందనలు జయగారు. ఎందుకో మీకు తెలుసుగా. :)
@ అబ్బచ్చా,అదంతా కోపమే... ఎందుకంత అలక శశిధర్, చెప్పానుగా...అబ్బాయిలు కూడా వెనకాల వేలాడేసుకోవచ్చని:)
@ శిశిరా, అమ్మాయిలకంత బద్దకమేమిటసలు. దొరికిందేదో తీసుకొని వెనకమాల తాడుకు కట్టేసుకొని వేలాడేసుకుంటే అయిపాయె:) శశిధర్ కి చూడు ఎంత కోపమొచ్చిందో:)
ఇదెప్పుడు రాసారు? టపా మిస్సయ్యా కానీ ఉగాది విషెస్ ముందే చెప్పేసా..:)
"ఆభరణాలంటే ఇష్టపడని అతివలుంటారా అసలు" ఉన్నా ఉన్నా నేనున్నా...:)
నేను బాగా ఇష్టపడి కొనుక్కునేవి గాజులేనండీ. అవి కూడా సాదా మట్టి గాజులు. మిగతావి తప్పనిసరైతే తప్ప ఉన్నవే పెట్టుకోను.
మీ శ్రధ్ధకు మాత్రం ముచ్చటేసింది.nice.
తృష్ణ గారు అప్పుడప్పుడూ చిన్నో పెద్దో పేరంటాలకో పెళ్ళిళ్ళూ పబ్బానికో వెల్తూనే ఉంటాముగా. చిన్న చిన్న నగలన్నా వేస్తూనే ఉంటాముగా. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమండి. ఆడపిల్ల అంటే ఆ కళే వేరు. ముద్దుగా పట్టులంగా కట్టి వడ్డాణం పెట్టి చక్కటి నగలేసి నాతొటే పేరంటాలకి తీసుకెల్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది.మొగపిల్లలతో ఇలాంటి ముద్దూ ముచ్చట తీర్చుకోలేముగా. అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి తిక్క పనులేవో చేస్తూ ఉంటానన్నమట. మీరేసుకోపోయినా, మీ పాపకి ఒకటి ఇలా చేసి చూడండి. ఎంత ఇష్టపడుతుందో.
నేను చదివేశానండీ..
అలాగా, సరే ...మురళి గారు, కానీయండి మరి:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి