22, ఏప్రిల్ 2011, శుక్రవారం
చీరలోని సింగారం...
(సమ్మర్ స్పెషల్స్ 2)
అదిరేటి చీర చూపిస్తాను.....బెదిరేటి లుక్ లు మాత్రం ఇయ్యకండేం.....
ఏంలేదండీ...ఇంకో క్రియేషన్ మీ మీద వదిలేద్దామని:)
ఇవన్నీ నేనే నా చీరలమీద మాత్రమే నేను చేసిన ప్రయోగాలన్నమాట....వేరే కొంచెం జిగ్రీ దోస్తులకి కూడా వేసిచ్చాను కాని...పాపం ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఏ భావం వ్యక్తం చేయలేక పోయారు. కాని చీరలు మాత్రం తీసేసుకున్నారులెండి.
సింగారమనే రంగులద్ది ఆనందంగా తయారు చేసిన చీరలండి ఇవి...
మొన్నామధ్య ,వొద్దు వొద్దు నాకీ చీర చాలా ఇష్టం అన్నా కూడా వినిపించుకోకుండా...ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చేయ్ ఆ చీరా..అంటూ, .జయప్రద..అదిగో ఆ ఎల్లో చీర తీసేసుకుంది...
.
సుహాసిని కూడా నండి...మరీను, అస్సలు మర్యాద లేకుండా...నల్లచీర కట్టుకున్నా...నవ్వాలి చిన్నమ్మా...నలుపు నవవిధాల లాభం అంటూ....ఆ నల్ల చీర తీసుకెళ్ళిపోయింది....నా కెంత బాధేసిందో....మీకు కాకపోతే, ఇంకెవరికి చెప్పుకోమంటారు చెప్పండి....
ఆ స్కైబ్లూ చీర...నాకు చాలా ఇష్టమండి...వెండి వెన్నెల పోగుల్లాంటి చీర అది....చాలా బాగుందని, నేనెటొ చూస్తుంటే..ఇట్నుంచిటే తీసుకెళ్ళిపోయి....మళ్ళీ ఈనాటి వరకూ కనిపించలేదు. ఎవరనుకుంటున్నారు....వాణిశ్రీయే!!!....
నా బంగారు జలతారు చీర....అదేనండి ఆ ఎర్రచీరన్నా ఎవరూ చూడకముందే దాచేద్దామనుకున్నానండి. మరేమో....నా ప్లాన్ ముందే తెలిసిపోయినట్లుంది.....నీకు నేనంటే ఇష్టంగా.....నేను ఏనాటికైనా ఈ చీరే కట్టుకుంటానంటూ....గోదారీ గట్టుందీ...అని పాడుకుంటూ, జమున జబర్దస్తీగా తీసుకెళ్ళిపోయిందండి....
ఆ పర్పుల్ చీరేమో....మా ప్రిన్సిపల్ అండీ...మొన్నేదో మీటింగ్ కి నేను రాలేదని, నేను చెప్పిన మాటినటం లేదంట...చాలా కోపంతో, ఆ చీర పట్కెళ్ళిపోయారు.....ప్లీజ్ ప్లీజ్ నేను మీతో చెప్పానని మాత్రం ఎక్కడా అనకండేం.....కావాలంటే మీక్కూడా ఓ చీర చాలా షోగ్గా చేసిస్తాను...సరేనా...
ఇంక మిగిలిందేముంది లెండి....జగమే మాయ...నా చీరలేమాయె...
ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ కాస్ట్యూమ్...మన చీరే కదండి....మన జాతీయ జెండాకి సమానంగా నిలిచేది మన చీరేనట:)
ఈ సారి రాజమండ్రీనో...కేరళానో వెల్దామనుకుంటున్నా....అక్కడినుంచి వాళ్ళ స్పెషల్ చీరలేవో కూడా తెచ్చుకుంటాలెండి:)
ఇదిగో...పనిలో పనిగా...ఎంత చక్కని పాటో....ఇదికూడా వినేసి...ఆ చీరలు కూడా చూసేయండి....
చీరలోని గొప్పతనం తెలుసుకో......
*******************************************************************************
లేబుళ్లు:
సమ్మర్ స్పెషల్స్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
31 కామెంట్లు:
ఎంత బాగున్నాయో! మరి నాకెప్పుడు చేసిస్తారు? :)
మరి నాకు ఎప్పుడు వేసిస్తారు చెప్పండి కొత్త చీర కొనుక్కొచ్చి ఇస్తాను..
నాకు ఆ రెండవ చీర బాగా నచ్చిందండీ. అది నా ఫేవొరేట్ కలర్...:)
వర్క్స్ చాలాబాగున్నాయండి.
జయ గారూ,
మీ ఇంటి అడ్రసు కాస్త చెప్తారా.. అలాగే మీరు ఇంట్లో ఏ టైములో ఉండరో కూడా చెప్పండి.. ;) :D
Simply superb! Awesome color combinations and design selections! :)
బావున్నాయండి . మరి మీరు ఇంత అందం గా తయారు చేస్తే తీసుకుపోరు :) నాకు క్రింద నుంచి మూడోది బాగా నచ్చింది .
జయ గారు మీ శారీ డెజైనింగ్ చాలా బాగుందండీ..
బ్లాక్ & యెల్లో శారీస్ చాలా బాగున్నాయి...
కొన్ని డెజైన్స్ మీవి కాపీ చేయాలనుకుంటున్నాను.
బ్లూ sareeని మళ్ళీ చూద్దామని వచ్చానండీ..అంత బాగుంది. నా బీరువా నిండా కాస్త అటు ఇటుగా చాలా చీరలు స్కైబ్లూ షేడ్సే ఉంటాయి..:)ఒకప్పుడు అలా black కలర్ వి ఎక్కువ ఉండేవి..got into old memories..:)
వెంటనే రాజమండ్రీ వచ్చేయండి జయగారు. అలా ఉప్పాడ, పెద్దాపురం తీసుకెళతాను. తేలికైన పట్టుచీరలు దొరుకుతాయి అక్కడ. పెయింటింగ్ కి చాలా బావుంటాయి. నేను వేసినవి నా బ్లాగులో చిత్రాలు లేబుల్ లో వున్నాయి వీలయితే చూసిపెట్టండి .
చాలా బావున్నాయండీ.బ్యూటిఫుల్
ఎంత బాగున్నాయో చీరలు.. అలా చూస్తూ వుండిపోవాలనిపిస్తోంది.
అయినా నాకు తెలీకడుగుతానూ...
ఇంత అందంగా చీరలు డిజైన్ చేసుకుని మమ్మల్ని ఇలా ప్రలోభపెట్టడం మీకైమైనా న్యాయంగా వుందా ... చెప్పండి..
చాలా బాగున్నాయండి.మా యింట్లో కూడా ఒక చిత్రకారిణి ఉంది.అమ్ముదామనో,వాళ్లవాళ్లకు ఇవ్వాలనో చీరాల్నుంచో మరెక్కడ్నుంచో పదిపదిహేను చీరలు తీసుకోవటం,రాత్రింబగళ్ళు నడుం పడిపోయేదాకా ఫాబ్రిక్ పెయింటొ మరొక వర్కో చెయ్యటం అంతా అయ్యాక...అమ్మా! యింత కష్టపడి చేసి వాళ్ళకీవీళ్ళకీ ఇవ్వటమా అని కట్టేయ్యటం ఇదీ వరస :)
జయ గారూ !
చీరలు, వాటి కంటే మీరు మంచి అభిరుచితో వాటి మీద చేసిన కళాకృతులు చాలా బావున్నాయి. అభినందనలు.
nice!
పట్టు చీరల మీద కూడా పెయింట్ చేస్తారా?
ఎటువంటి పెయింట్లు వాడతారు? నేను టీ-షర్టులు పెయింట్ చేశాను.
జయగారు,
నీలం చీర, చివరనున్న చీరా నేను తీసుకెళ్ళిపోతున్నా. :)
చీరలు కొత్తందాలతో మిడిసిపడుతున్నాయి. ఎంత శ్రద్దగా చేయాలీ పనులు కదా అనిపించింది జయాగారు. అందునా చీరలనేసరికి కుచ్చిళ్ళు, అంచులు, పైటంచు ఇలా లెక్కకట్టి మరీ డిజైన్ గీసుకోవాలిగా. ఇది కూడా సెలెక్టివ్ అభిరుచి. మీవంటివారిచ్చిన రేర్ కలక్షన్ మాత్రముంది నా దగ్గర పదిలంగా. స్నేహ టీ-షర్టులు పెయింట్ చేస్తుంది. మీ వర్క్స్ చూస్తే "వావ్" అనుకుంటుంది.
@ హాయ్, శిశిరా, బాగున్నాయా చీరలు. చెప్పాను కదా, చీరలు ఎత్తుకెళ్ళిపోయారని:) పోన్లే, ఇంకో నీలిరంగు చీర తీసుకొచ్చాను. ఇదికూడా బాగానే ఉంటుంది. చాలా పెద్ద కొంగు ఇంకా పెద్ద బార్డర్. కట్టుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. దీనికి వాడిన రంగులు కూడా చాలా స్ట్రాంగ్. ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తాయన్నమాట. అల్లరి చేయకుండా ఇది తీసుకోవాలి మరి. అలాగే అన్నిటికన్నా ముందున్న యెల్లో చీర మీద నెమళ్ళ వర్క్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫొటో తీయటం కోసం కింద వేసిన బేస్ ఆరెంజ్ కలర్ తో ఉండి అది ఈ చీరలో రెఫ్లెక్ట్ అయి డల్ గా కనిపిస్తోంది కాని, ఎంత అందమైన చీరో తెలుసా. మరి ఆ యెల్లో బదులు ఇది కావాలా. ఒప్పుకోవాలి మరి.
@ జ్యోతి గారు మీకెందుకు చేసివ్వను చెప్పండి. తప్పకుండా :) మీకే కలర్ చీర , డిజైన్ కావాలో చెప్పండి. కాటన్ అయినా సరే, సిల్క్ అయినా సరే. థాంక్యూ.
@ తృష్ణా , మీకు నచ్చిన ఆ బ్లూ కలర్ చీర ఆల్రెడీ ఎగిరిపోయింది కదా:) ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చి చూసినా ఏం లాభం చెప్పండి. అలాంటిదే మీకు తప్పకుండా చేసిస్తాను లెండి. థాంక్యూ.
@ మధురవాణి గారు నేను ఇంట్లో ఉన్నప్పుడొస్తేనే లాభం. లేకపోతే మా అత్తగారు మీ పప్పులుడకనివ్వరు. థాంక్యూ.
@ శ్రావ్య గారు మీకు నా బ్లాగ్ కి ఘన స్వాగతం. సో చీరలంటే ఎన్నడూ రాని వారు కూడా వచ్చేస్తారన్నమాట.:) మీకు నచ్చిన చీర కి ఏ డిమాండ్ లేకుండా అలాగే ఉండిపోయింది పాపం. మీరు హాయిగా తీసుకెళ్ళిపోవచ్చు. థాంక్యూ.
@ రాజీ, థాంక్యూ. జడ్జ్ గారికి అంత టైం ఉందా:) హాయిగా కాపీ కొట్టేయచ్చు.
@ లలిత గారు మీకు కూడా ఘన స్వాగతం. మీ చీరలు చాలా బాగున్నాయండి. మళ్ళీ మళ్ళీ చూసి వచ్చాను. నన్ను రాజమండ్రికి రమ్మంటున్నారా. ఎంత మంచివాళ్ళండి. మీకు డబుల్ థాంక్స్. ఉప్పాడ, పెద్దాపురం చీరలు చాలా బాగుంటాయికదూ. నాకు యెల్లో కలర్ లో అన్ని షేడ్స్ ఇష్టం. చక్కగా కొనుక్కొచ్చుకుంటాను.
@ లత గారు థాంక్సండి. మీరు, మీకు మీ పాపకి కూడా ఇలా రకరకాలుగా పైంట్ చేసుకోండి. సరదాగా ఉంటుంది.
@ శ్రీలలిత గారు అదే కదండి మరి ఆడబుద్ధంటే:) హాయిగా మీకు నచ్చిన చీర తీసేసుకోండి. లేదా ఏదైనా మీకు నచ్చినట్లు ఆర్డరేసేయండి. ఏం పర్లేదు.
@ రాజేంద్రకుమార్ గారు, అంతేకదండి మరి. మీరు ఆ కళాత్మకతను, సృజనాత్మకతను నోరారా మెచ్చుకొని, మరీ మరీ పొగిడి అడిగినప్పుడల్లా కావల్సినన్ని రకరకాల చీరలు కొనిచ్చి కళాపోషణ చేయాలి మరి. అప్పుడే కదా చిత్రకారిణికి ఊపిరందేది:)
@ రావ్ గారు ధన్యవాదాలండి.
@ కొత్తపాళీ గారు ధన్యవాదాలు. రకరకాల ఫాబ్రిక్స్, పోప్లిన్ కలర్స్, ట్యూబ్స్, బ్రషెస్, షైనింగ్ కలర్స్, రిచ్ గోల్డ్ & సిల్వర్ కలర్స్ , ట్రాన్స్పరెంట్ కలర్స్ (ఎర్రచీర మీద వాడిన కలర్) లాంటివి ఉపయోగిస్తూఉంటానండి. మరి మీ షర్ట్స్ ఎప్పుడు చూపిస్తారు. మావాడికి షర్ట్ మీద చేసిస్తానంటే అస్సలొప్పుకోటమేలేదు.
@ ఉష గారు థాంక్యూ. ఒక్క చీరలతోటే అయిపోతుందా. మరి వాటిమీద బ్లౌజెస్ కూడా సరిగ్గా తయారుచేసుకోవాలికదా. మీ స్నేహ చేసిన షర్ట్స్ మాకు కూడా చూపించొచ్చుకదా. మేముకూడా కొన్ని డిజైన్స్ కాపికొట్టుకోవచ్చు. అయితే మీదగ్గిర మంచి కలెక్షనే ఉందన్నమాట.
హ హ జయ గారు ! చీరలు కాదు నేను ఏవో కొన్ని తప్ప మీవి అని పోస్టులు చదివాను , ఎక్కడన్నా కామెంట్ పెట్టె ఉంటాను అన్న నమ్మకం తో మీకు సాక్ష్యం చూపిద్దామని ఇప్పుడు ఈ బ్లాగు మొత్తం తిరిగా కాని చూపించలేకపోతున్నా :( .
సరే. మీరేం చెప్తే అదే. :)అవునండి. చెప్పడం మరచిపోయాను. ఆ నెమళ్ళ వర్క్ కూడా చాలా బాగుంది. మీ ఈ టపా, ముందు టపా చూసిన తరువాత ఇవి నాకు ఈ జన్మలో సాధ్యమయ్యే విద్యల్లా అనిపించడం లేదు. :)
జయ గారు ఆ చీరలన్నీ నాకు చాలా నచ్చేసాయి ........... అబ్బా నాకు హేండ్ ఎంబ్రాయడరీ వచ్చు కాని....... శారీ. పెయింటింగ్ రాదు :( అందుకే కొంచెం మీ ఇంటి అడ్రస్ చెబుతారా ???? అలాగే మీరు ఇంట్లో ఏ టైములో ఉండరో కూడా చెప్పండి.. ;) :ద మధుర గారు నేను వస్తాం
@ హమ్మయ్యా! ఈ చీర ఎక్కడ వద్దంటుందో శిశిరా, వేరే ఇంకా ఏ చీర చూపిద్దామా అనుకుంటున్నా. చీరల షాప్ అయిపోయేదే:)
ఏమీ లేదు నేను చెప్పిన ప్రతి ఒక్కటీ చాలా ఈజీ బూజీ వే. ఇవన్నీ ఈ సమ్మర్ లో చేసేయాలి మరి. ఇదిగో ఇంకో వెరైటీ కూడా రాబోతోంది. అలా అంటే ఎలా మరి. నేనేమైపోవాలి.
@ హౌ ఆర్ యూ శివానీ. ఎంబ్రాయిడరీయే చాలా కష్టం కదూ. చెప్పనుగా మధురకి. మీ ఇద్దరూ నేనున్నప్పుడు వస్తేనే, ఆశించిన ఫలితం దక్కుతుంది మరి.
శ్రావ్య గారు, నేను నిజనే చెప్తాను కదూ:)
i am new to blogs. i have seen ur blog serching for something else which i hav not found yet. good work.
Thanq, Valli garu.
మీ ఈ టపా లేటుగా చూసా..అందుకే లేటుగా అయినా లేటెస్టుగా చెప్తున్నా..అన్నీ చాలా చాలా బాగున్నాయి.
Thanq sirisiri muvva garu. I am too late:)
namaste,
nenu blogs ki kotta. Mee cheeralu chala chala bagunnai. Naku kuda vesi istara? Mimmalni contact cheyadam ela. Nenu HYD lo ne vuntunna. Naku oka papa. just 5 months. future lo tanaki kuda dresses meeda designs meeru veyyali.
Padmini.
కామెంట్‌ను పోస్ట్ చేయండి