27, ఏప్రిల్ 2011, బుధవారం

ఈ కళ చాలా బాగుంటుంది...




(సమ్మర్ స్పెషల్ 3)

మీకోసం ఇంకో సమ్మర్ స్పెషల్. వేసవిలో ఎన్నో రకాల పళ్ళు వస్తాయి కదూ. అవి తినటమేకాకుండా కొంత 'కళాపోషణ’ కూడా చేయొచ్చు. ఇది అరవైనాలుగు కళల్లో ఉందో లేదో...లేకపోతే కలిపేద్దాం....

ఎలా అంటే...ఇలా అన్నమాట.

ఫ్రూట్ కార్వింగ్...ఇప్పుడు బాగా అభివృద్ధి లోకి వస్తోంది...దానిని వృత్తిగా స్వీకరిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది....
ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా..స్వయంఉపాధికి ఇది చాలా సహాయపడుతుంది. 'ఈవెంట్ మానేజ్ మెంట్’ ఇప్పుడు అందరికీ తెలిసిందే.
ఇది ఒక హాబీ గా ఎంజాయ్ చేయొచ్చు....లేదాఒక 'గృహిణ' కాదంటే 'హోంమేకర్'...దీనినే వృత్తిగా స్వీకరించి 'ఆర్ధికాభివృద్ధి’ కూడా సాధించవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ కి అంటే పుట్టిన రోజుల్లాంటివన్నమాట, తానే స్వయంగా అక్కడి అలంకరణ చేపడితే...అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగానూ ఉంటుంది....త్తృప్తిగా కూడా ఉంటుంది. కాదంటారా!!!

మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అలంకరణలో భాగంగా, ఫ్రూట్ కార్వింగ్...ఐస్ కార్వింగ్, చూస్తూనే ఉంటాము. చూడటానికి చాలా బాగుంటుంది కదూ. దీనికోసం ఎంత కష్టపడ్తారో కదా!!!అలా చూసీ చూసీ నాక్కూడా నేర్చుకోవాలనిపించింది. నెలా...మూడు నెలల్లో హోటల్ మానేజ్ మెంట్ ఇనిస్టిట్యూషన్స్ లో నేర్పిస్తారు. ఫీజ్ కూడా పెద్ద ఎక్కువేంకాదు. అలాగే ఒక సమ్మర్ లో నేను ఫ్రూట్ కార్వింగ్ నేర్చుకున్నాను. అలా తయారు చేసిందే ఇది. మా ఫ్రెండ్ కూతురి పుట్టిన రోజుకి వాళ్ళ ఇంట్లో ఇలా అలంకరించాను. బాగుందా!!!

ఇప్పుడు వాటర్ మిలన్ పళ్ళు చాలా దొరుకుతాయి. దీనికి కావాల్సిందల్లా కొంత ఓపిక, శ్రద్ధా, ఇంకొంచెం ఆలోచనా అంతే...చేతిలో ఒక చిన్న కత్తి ఉంటే చాలు. ఇంక ఆ 'చురకత్తితో' దీన్ని ఇష్టమొచ్చినట్లు పొడిచి పారేసి అంతం చూట్టమే:) వేరే పరికరాలు కూడా ఏం అఖ్ఖర్లేదు. ఆలోచించుకుంటూ అలా ఒడుపుగా చేసుకుంటూ పోవటమే. కాకపోతే, మొదట్లో కొన్ని పళ్ళు కుదరక పాడుచేస్తాంలెండి:) ఖర్చు కూడా చక్కగా సరిపోయే ఒక పెద్ద 'పుచ్చకాయ’ కొనుక్కోవటమే.

మరి మీకు నచ్చిందా... ఈ సమ్మర్ లో మీరు కూడా ఇలాటి ప్రయోగాలు చేస్తారు కదూ....చిన్నపిల్లల ఫంక్షన్ కయితే రకరకాల పళ్ళతో రూం అంతా ఇలా అలంకరిస్తే బలూన్స్ కన్నా, తళతళ లాడే రంగు కాగితాలకన్నా ఇవే పిల్లల్ని తమవైపు తిప్పేసుకుంటాయి. అప్పుడు జంక్ ఫుడ్ కన్నా ఇవే ఎక్కువ తినేస్తారు. పిల్లల ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది.... అదన్నమాట అసలు కథ. ఇవాళ స్టోరీ టెల్లింగ్ డే కదా! పిల్లలకి కథలు చెప్తూ ఈ పళ్ళన్నీ తినిపించేయండి...మీరుకూడా కొన్ని తినేయండేం:)


ఇదిగో ఇది చూడండి...ఎంత మజా వస్తుందో....మీకిప్పుడే ఇలా చేయాలనిపిస్తోంది కదూ...నాకు తెలుసు. మరెందుకాలస్యం....హాయిగా, హుషారుగా, మొదలెట్టేయండి....ఈ సమ్మర్ సఫలమవుతుంది:)





ఇదిగో ఇది కూడా చూసేయాలి మరి.....ఇంకా, చాలా చాలా చాలా ..ఎంతెంతో బాగుంటుంది. నా మాట నమ్మాలి మరి.....





************************************************************************

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆఆహాఆ...పున్నమి చంద్రుడి లా రోజుకో కళతో కనిపిస్తున్నారు జయగారు
సరే కానీ కార్వింగ్ చెయ్యడానికి వెజెటబుల్స్ ఎలాంటివి తీసుకోవాలి. అవి వాడిపోకుండా తాజాగా వుండాలంటే ఏం చెయ్యాలి . ముఖ్యంగా వంకాయ నల్లబడకుండా ఏం చెయ్యాలో చెప్పండి ( నాకు వంకాయతో పెంగ్విన్ చెయ్యడం వచ్చు అదన్నమాట బడాయి)

లత చెప్పారు...

చాలా బావుంది జయగారూ,
శారీస్ పైన వర్క్,జ్యూయెలరీ డిజైనింగ్,ఇప్పుదు కార్వింగ్ అమ్మో మీ దగ్గర చాలా నేర్చుకోవాలండీ

శిశిర చెప్పారు...

హమ్మో.. ఎన్ని విద్యలొచ్చో మీకు! నేను కుళ్ళుకుంటున్నా. ట్యూషన్‌కొచ్చేస్తానండి.. ప్లీజ్... నేర్పిస్తారుగా!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

చాలా బావుంది జయగారూ,సమ్మర్ స్పెషల్
ఫ్రూట్ కార్వింగ్.

కొత్త పాళీ చెప్పారు...

క్యూట్.
లలితగారి చంద్రుడి కామెంట్ సూపర్ .. అండ్ ఎప్రాప్రియేట్.

మురళి చెప్పారు...

ఇది నాకు కుంచంగా వచ్చిన విద్య.. నేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాను కానీ, కుదరలేదు.. అప్పుడప్పుడూ కేరట్ తో తొండలూ, బల్లులూ లాంటివి (అలా చూడకూడదు మీరు) ప్రయత్నిస్తూ ఉంటానండీ..

జయ చెప్పారు...

లలిత గారు, మీ బడాయి ఎంత ముద్దుగా ఉందో తెలుసా....
ఏదో వేసవి కాలమొచ్చింది కదా అని, కాస్త చేంజ్ కోసం , మనందరితో ఇలా కాస్త కబుర్లు చెప్పుకోవాలనిపించిందే తప్ప, నేనెక్కడా...ఆ చంద్రుడెక్కడా చెప్పండి:)
ఇది ఎక్కువ కాలం జీవించే కళ కాదండి. అదే బాధకలిగించే విషయం. అందులో వంకాయ లాంటివి ఇంకా తొందరగా అలిసి పోతాయి. వీటిమీద కెమికల్స్ ఉపయోగించే కన్నా ఉప్పుకలిపిన నీరు అడుగున పోస్తారు. ఐస్ మీద ఉంచుతారు. ఆ వంకాయకి కొంచెం వైట్ కలర్ పూసేయొచ్చు:) ఎలాగూ ఏ.సి. ఉంటుంది కాబట్టి వీటి జీవిత కాలం పెంచటానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకే బీట్రూట్, కారట్, ముల్లంగి లాంటివి ఎక్కువ వాడుతారు. మీ పింగ్విన్ ఎప్పుడు చూపిస్తారు.

జయ చెప్పారు...

@లత గారు థాంక్సండి:) శలవుల్లో మీరూ, మీ పాపా కలిసి ఈ ప్రయోగాలన్నీ చేయాలి మరి. ఆ తర్వాత మా అందరికీ చూపించాలి. సరేనా...

@హమ్మో శిశిరకున్నంత అవగాహనా, పరిశీలనా శక్తి నాకు లేదని నేనెంత కుళ్ళుకుంటున్నానో . నా దగ్గరికి ట్యూషన్ కి రావటానికి ఎవ్వరూ ఇష్టపడరు తెలుసా:)

@@ జడ్జ్ గారికి నచ్చిందంటే నాకూ ఆనందంగానే ఉంది రాజీ. ఎక్జాంస్ అయిపోయాయా. బాగా ప్రిపేర్ అయి మా అందరికీ పేరు తేవాలి:) మాకో జడ్జ్ గారున్నారని మేమందరం గర్వపడాలి. తెలిసిందా.

జయ చెప్పారు...

@ కొత్తపాళీ గారు ధన్యవాదాలు. నే నెక్కడా ఆ చంద్రుడెక్కడా. ఇది అతిశయోక్తి అనిపించట్లేదు:)

@ మురళి గారు మీకు తెలుసా!!! పిల్లలు పండ్లతో చేసిన పూలకన్నా, తొండలు, బల్లులు లాంటి రెప్టైల్సే ఎక్కువ ఇష్టపడ్తారు. ఒకళ్ళమీద ఒకళ్ళు పడేసుకుంటూ, భయపెట్టుకుంటూ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీ చాయిస్ కే ఎక్కువ డిమాండ్ ఉంది. ఆల్ ద బెస్ట్:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner