కేరళ లో నేను......
హాయ్ ఫ్రెండ్స్.....బాగున్నారా...నేను చూసినవన్నీ మీరూ చూసేయాలని నా కోరిక....మీరు అంతకుముందు చూసేసినా సరే....ఎప్పుడూ చూడనేలేదనుకొని...నా కనులు మీవిగా చేసుకొని మంచి పిల్లల్లాగా చూసేయాలి:)......ఇన్ని ఫొటోలా...అనకండి....ఎందుకంటే అన్ని ఫొటోలు తీసానన్నమాట......ఇంక చాలానే వదిలేసానులెండి....
కొచ్చిన్ నుంచి మున్నార్ దారిలో, కలడీ గ్రామం దగ్గరి పూర్ణా నదీ తీరంలో శ్రీ ఆది శంకరాచార్యులవారి జన్మస్థలం. కేదారీనాథ్ లో వీరి సమాధి ఉంది. అది దర్శించే భాగ్యం కూడా నాకు కలిగింది. (కాకపోతే ముందు సమాధి ఆ తరువాత జన్మస్థలం చూసానన్నమాట)
మున్నార్ అడవుల్లో జలపాతాలు....."వర్షం లో వాటర్ ఫాల్స్"
ఇంత చిక్కటి అడివి....ఏ దిక్కు ఏవిటో......దిగి కింద దాకా వెళ్ళిపోతే నాచురల్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు ఎటునుంచి ఎటువంటి జంతువులొస్తాయో చెప్పటం మాత్రం కొంచెం కష్టం. కాని, చుట్టూ ఉన్న సుగంధ ద్రవ్యాల చెట్లు...వాటి సువాసన మాత్రం మిమ్మల్ని అక్కడే కట్టేస్తుంది:)
ఇదే మున్నార్ అడవుల్లోని ఫారెస్ట్ హెవెన్ రిసార్ట్...
ఇక్కడినుంచి బాగుంది కదూ.....ఇలా అయితే ఏ జంతువులూ మన దగ్గిరికి రావు.
మున్నార్ లోని స్పైసీస్ గార్డెన్ లో ఎన్నో సుగంధ ద్రవ్యాల చెట్లు. ఇవి ఇలాచీలు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ తోటలో కాసేపుతిరిగామంటే చాలు ఏ రోగాలూ రావనిపిస్తాయి. ఆ సువాసనలు ఎన్నటికీ మరిచిపోలేముకూడా. నేనైతే ఎన్నో స్పైసీస్ తెచ్చుకున్నాను. రకరకాల పులావ్ రైస్ లు చేసుకోవచ్చు....
ఇది టచ్ మి నాట్....చూడండి ఎంత బాగుందో....ముట్టుకుంటేనే ఎలా ముడుచుకుపోతోందో....పూలు చూడండి, ఎంత మురిపెంగా ఉన్నాయో.....
ఇదిగో ఇవే చాలా ఫేమస్ టీ ఎస్టేట్స్......నేను కూడానెత్తికి బుట్ట తగిలించుకొని వాళ్ళకి చాలా హెల్ఫ్ చేసానన్నమాట.....ఎంతమంచిదాన్నో కదా:)
నేను చూసిన పూలతోటల్లోని కొన్ని పూలు....అబ్బో ఎన్ని రంగులో....ఎన్ని పూలో....నేను చెప్పలేను. ఫ్రకృతి అంతా ఎంతో దూరం అలా అలా పరుచుకొని...ఎన్నో అందమైన తివాచీల మీద కొత్తకొత్త డిజైన్స్ చిత్రిస్తోంది.....
Eravikulam National Park కొండల మీద దారిలో జింకలు.....
నేషనల్ పార్క్ కొండల మీద అలా అలా పోతూఉంటే మేఘాలు కూడా ఇలా ఇలా మాతోటే వచ్చాయి.....
తెక్కడీ లో ఏనుగులు......
తెక్కడి లో నేను చూసిన కథకళీ.....
అలెపీ లో నేనున్న చిన్న ఐలాండ్ లోని బ్యాక్ వాటర్ హెరిటేజ్ రిసార్ట్.....బయటి ప్రపంచంతో సంబంధమే లేదు.
ప్రపంచమే మరపించిన బాక్ వాటర్స్ విహారం....
ఎంత అందంగా ఉందో....అదిగో బోట్ హౌజ్ కూడా ఉంది.....ఎన్ని రకాల బోట్ హౌజ్ లో...ఎన్నిసౌకర్యాలో...
పోర్ట్ సిటీ కొచ్చిన్ లో సెంట్ ఫ్రాన్సిస్ చర్చ్ (వాస్కోడగామా)....ఇక్కడ ఒక పెద్ద Old Jews Street, వాళ్ళ Cemetery కూడా ఉంది. ఇక్కడి బజార్లో పాత Antique వస్తువుల దుకాణాలు వరుస పెట్టి ఉన్నాయి. చివరికి పాత Snake Boats కూడా ఇక్కడ అమ్ముతున్నారు. 16 వ శతాబ్దం లోని Jewish Synagogue, ఈ చర్చ్ కూడా బాగుంది.
చైనీస్ ఫిషింగ్ నెట్......అబ్బే ఇక్కడ మాత్రం అస్సలు బాలేదు.....సముద్రపుటంచులలో తెగిపోయిన కోళ్ళ కాళ్ళు ఎన్ని ఉన్నాయో......ఇంకా కొట్టుకొస్తూనే ఉన్నాయి కూడా....
భూమి గుండ్రముగా ఉండును...అంతేగా మరి...బ్యాక్ టు ది పెవిలియన్...:(...:(...:(..
************************************************************************************

25 కామెంట్‌లు:
Pics మరియు మీ టూర్ కబుర్లు బాగున్నాయండి
హాయ్ జయ గారు మీ కేరళ టూర్ విశేషాలు ,ఫోటోస్ చాలా బాగున్నాయి.
అక్కడి విశేషాలన్నీ మీ కళ్ళతో మాకు చూపించారన్నమాట..
చాలా చాలా బాగున్నాయి జయ. ఆకు లో ఆకునై పువ్వు లో పువ్వునై అని పాడుకోవాలనిపించలేదా మీకు? అడవి లో ఆ ఒత్తైన పచ్చదనం చూస్తే ఒక క్షణం నేను అక్కడే వున్నానేమో ఓ కొమ్మ అంచున వూగుతూ అనిపించింది అంత బాగా మంచి హై క్వాలిటీ తో ఫోటో లు తీసేరు (నేను ఒక్కో దాని మీద క్లిక్ చేసి పెద్దది చేసి చూసేను. అది సంగతి). చాలా బాగున్నాయి.
చాలా బావున్నాయి జయగారూ మీ కేరళ ట్రిప్ కబుర్లు.
మున్నార్ చూడాలని కోరిక నాకు మీ ఫొటోస్ చూశాక ఆ కోరిక ఇంకా బలపడింది
గ్రేట్ హాలిడే ! అన్నమాట. బావుందండి. ఫోటోలు బాగున్నాయి. వర్షాకాలంలో అయితె ఇంకా బాగా ఎంజాయ్ చేయచ్చు.
ఏడాదిన్నర క్రితం తమ్ముడువాళ్ళు వెళ్ళొచ్చాకా ఆ ఫోటోలు చూసి వెళ్లాల్సిన ప్రదేశాల లిస్ట్ లో చేర్చేసా. క్రిందటేడు అన్నయ్యవాళ్ళు వెళ్ళొచ్చాకా ఉబలాటం మరీ ఎక్కువైంది. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళొచ్చాకా ఇచ్చిన రకరకాల టీ పొడాలు, ఘుమఘుమలాడే ఫ్రెష్ స్పైసెస్ ఇంకా వాడుతున్నా. కానీ అక్కడి ఫైన్ క్వాలిటీ టీ అంటా ఎక్స్పోస్ట్ కి వెళ్పోతుందట. మనకి వచ్చేది చివరకి మిగిలిన చెత్తా చెదారమేట.
ఓ విహారయాత్ర వెళ్ళొచ్చేసారా? బాగున్నాయి మీ ఫోటోలు యాత్రా విశేషాలు. మేమూ మున్నార్ వెళ్ళొచ్చాం. అక్కడ ఓ సాహసోపేతమైన ట్రెక్కింగు చేసి చచ్చి బతికాం...మున్నార్ అనగానే అదే కళ్ళముందు మెదులుతుంటుంది నాకు.
టూర్‌ని ఎంజాయ్ చేసిన ఆనందమంతా మీ టపాలో కనిపిస్తూంది. :)
చాలా బావున్నాయి జయగారూ మీ కేరళ ట్రిప్ కబుర్లు.ఆ ఫొటోస్ లో కనిపిస్తుంది మీరేనా
@ అను గారు థాంక్సండి.మీరు చూస్తానూ అంటే ఇంకా బొచ్చెడు ఫొటోలు, బోలెడు కబుర్లు ఉన్నాయి:)
@ రాజి, నా కళ్ళతో చూసే కన్నా, చదివీ చదివీ అలసిపోయి ఉన్న మీ లాంటి వాళ్ళు ఒక్క రెండు రోజులు అలా వెళ్ళొస్తే బాగుంటుంది కదూ:)
@ అవును భావనా, నాకైతే ఉన్న ఆ కొంత కాలం అలాగే అనిపించింది.
అదిగో భావన అక్కడే...ఆ ఎర్రపూల అంచులో కనిపిస్తోంది.
పాటలు పాడుకుంటూ...చెట్లూ...పుట్టలూ పట్టుకొని గడిపేసాను.
మీ టపా కోసం ఎదురుచూస్తున్న మాకు...మీ కబుర్లు ఎప్పుడో!!!
@ లత గారు మీరు తప్పకుండా మున్నార్ చూడాల్సిందే. అబ్బాయికి ఉద్యోగం వచ్చిన సందర్భంలో సంతోషంగా ఒక్కసారి అటేపు వెళ్ళిరాకూడదూ.
@ తృష్ణ గారు, నాకైతే ఇది గ్రేట్ హాలిడేనే. అసలే ఏది చూసినా తొందరగా సంతోషపడిపోతాను. నాకు ప్రతిఒక్కటీ ఎంతో అందంగానే కనిపించింది. ఏవిటో నాకైతే అస్సలు ఓ చిట్టడివి లోపల ఎక్కడో ఉన్నానన్న భయమే అనిపించలేదు. మంచి తరుణం మిచిన రాదన్నట్లు అంతగా లీనమై పోయాను. తప్పకుండా ఒకసారి వెళ్ళిరండి.
స్పైసీస్ బాగానే ఉన్నాయిలెండి. బ్రహ్మాండమైన ఘుమఘుమలైతే ఉన్నాయి:)
@ సిరిసిరిమువ్వ గారు, యు గయీ యు ఆయీ:) నాకు ట్రెక్కింగ్, రాఫ్టింగ్ ఇలాంటివంటే చాలా భయమన్న మాట. ఇకో టూరిజం జోలికే పోను. అందరూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళను చూసి నేను ఎంజాయ్ చేసాను. అక్కడే నాచురల్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళని కూడా ఎక్కువ సేపు ఉండనీయకుండా పైకి ఒచ్చేయమని ఒకటే తొందరపెట్టేసాను. అంత ధైర్యమన్నమాట నాకు. తెక్కడీ లో పాపికొండల్లాగానే చాలా దూరం కొండల మధ్య అడవి చుట్టూ తిరుగుతూ నదిలో బోటింగ్ ఉంది. అక్కడ దూరంగా ఒడ్డున నీటి కోసం వచ్చే కొన్ని జంతువులు మాత్రం కనిపించాయి. ఎన్నో అందమైన పక్షులు కనిపించాయి.ఎంత చక్కటి రాగాలు వినిపించాయనుకున్నారు. నేనైతే ఎప్పటికీ మరచిపోలేను.
@ కదూ శిశిరా:) నాతో శిశిర ఉండిఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా అలెపీ లో బాగా తలచుకున్నాను తెలుసా!!!
@ హాయ్ శివానీ...హౌ ఆర్ యూ. చాలా కాలమైంది కదూ. బాగున్నాయా కబుర్లు. నేనంతే మొదలు పెడ్తే ఆపనన్నమాట:)
మీరు చూస్తానూ అంటే ఇంకా బొచ్చెడు ఫొటోలు, బోలెడు కబుర్లు ఉన్నాయి
-----------------------------------
మరి ఆలశ్యం దేనికి జయ గారు ? ఆ ఫొటోలు కూడా చూపించి,మిగతా కబుర్లు చెప్పేయ్యండి :)
@ అను గారు, మీకొక ఫొటో తప్పకుండా చూపించాలి. మున్నార్ లో చాలా సేపు మేమున్న రిసార్ట్ దగ్గిర పూల చెట్లల్లో తిరిగాము. కొద్దిగా చీకటిపడిన ఆ వెలుగులో పూలు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. అక్కడ ఒక ఫొటో తీయాలనిపించింది. ఆ తరువాత ఆ ఫొటో చూసుకున్నప్పుడు, ఆ ఫొటోలో చెట్ల లోంచి పొడుగ్గా తెల్లని నాగుబాము కనిపించింది. అంత వరకు అక్కడున్న పాముని చూడనే లేదు. ఆ తరువాత ఫొటో లో అది కనిపించే సరికి ఎంత అదిరిపోయానో. ఆ ఫొటో ఇంకో కామెరా లో ఉంది. చూపిస్తాను...మీరు కూడా చూడాలి కదా...ఆ అడ్వెంచర్ మరి.
మళ్ళీ మున్నార్ వెళ్ళాలనిపిస్తోందండీ....
మురళి గారు, నిజంగా మళ్ళీ మళ్ళీ చూసే అదృష్టం కలుగుతుందంటారా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు...అని అప్పుడే పాడేసుకున్నాను లెండి. జన్మకో శివరాత్రి:) Anyway, I hope you fulfill your wish once again.
వావ్!! చాల బాగున్నాయి ఫోటోస్..
జయ గారూ, మీరు వేయి పడగలు సమీక్ష అని అడిగారు కదా..యీ రోజు సమీక్ష భావ నిక్షిప్త బ్లాగ్లో కనిపించింది..మీరూ చదవండి..కథని చాలా ఓపిగ్గా క్లుప్తంగా భలే బాగా వ్రాసారు...
http://bhava-nikshipta.blogspot.com/2011/05/blog-post_28.html
చాలా రోజులకి కురిసిన ఈ ఎన్నెల ఎంత బాగుందో.
తప్పకుండా చూస్తాను. అంతపెద్ద బుక్ చదవలేను. కాని తెలుసుకోవాలని ఉంది. థాంక్యూ.
Thanks andee anta manchigaa commentinanduku...
హాయ్ జయ గారు మీ కేరళ టూర్ ఫొటోస్ చాల బాగున్నాయ్
@ Ennelamma :)
@ Thank you Ratnamala garu.
ఎంత బాగున్నాయో !నాకు కేరళ చాలా ఇష్టం .
అవును చిన్ని గారు, కేరళ చాలా బాగుంటుంది. God's Country అట.
బాగున్నాయి ఫోటోలు , కబుర్లు
థాంక్యూ వంశీ. ఇప్పుడు ఇంజనీర్ గారు ఏం చేస్తున్నారు. కొత్త సుత్తేమీ లేదేంటి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి