30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

’నే చూసిన దసరా మంటపం ’

సకల జనుల సమ్మె......
రాజధాని బంద్......
నేను కూడా ఫ్రీ:)
చక్కగా దొరికిన ఈ అవకాశం. ఏం చేయాలి. అవునూ...ఎంతో అందమైన అమ్మవారి మంటపాలు చూసి రావచ్చుకదా! అనుకున్నాను. ఇదిగో, నేను చూసిన ఒక అందమైన దసరా మంటపాన్ని మీరు కూడా చూడండి మరి. నాకు తెలుసు...మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ పాటికే మీరు చాలా చూసేసే ఉంటారు. అయినా సరే, ఇది కూడా చూసేయండి మరి.


ఎంతో అందమైన ఈ దీప తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి. అందమైన స్వాగతాలు పలుకు తాయి.


అదిగో అల్లంత దూరాన ఎత్తైన ఆ గుడి గోపురం మనల్ని పలకరిస్తుంది. అనంత పద్మనాభ దేవాలయం సొగసులు ఇక్కడ పొందుపరిచారు. ఆ నేలమాళిగలు ద్వారాలుగా రూపుదిద్దుకున్నాయి. చూడండి, ఎంత అందంగా ఉందో!!!


ఇదే ఆ నేల మాళిగ తలుపు. పక్కనే నాగబంధం, వినాయకుడు, గోడమీద దేవతా విగ్రహం కూడా చూడొచ్చు.









మెట్లెక్కి లోనికి ప్రవేశించాలి. అక్కడే మనకు నిలువెత్తు అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తాడు. ఆ పక్కనే మునులు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారు.





ఇక్కడినుంచి సన్నటి ద్వారం గుండా లోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనకి అగ్నిపరీక్ష. అంటే నిప్పులమీద నడచిపోవాలన్న మాట:) ఇదిగో ఇలాగ.



మెలికలు తిరిగిన ఆ దారిలో ఒక పులి కూడా ఉంది. మనల్ని పలకరిస్తోందా!!!! తస్మాత్, జాగ్రత్త అంటోందా!!!!!



ఆ తరువాత మనం ఈ 'లక్ష్మణ ఝూలా' కూడా దాటాలి. ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు కూడా చేసుకుంటున్నారు.




ఆ తరువాత ఒక సన్నని గుహ లోకి ప్రవేశించాలి. పాపం ఆయనెవరో!!! ఆయనకి తెలీదు ఆయన ఫీట్ నేను ఫొటో తీస్తున్నానని:)


హు: అప్పుడే ఎక్కడయిందండీ, బాబు. ఇప్పుడు మనం ఈ వైతరిణి దాటితే తప్ప ఆ అమ్మవారు మనకి దర్శనమివ్వదు.


ఈ దీర్ఘ ప్రయాణం తర్వాత, ఇంక మనం గర్భ గుడిలోకి ప్రవేశించినట్లే. అదిగో, చూడండి. ఆ జగజ్జనని శ్రీమతా దుర్గాదేవి దివ్యమంగళ స్వరూపం. అక్కడి దీపాల వెలుగులో, రకరకాల రంగులలో, మిరుమిట్లు గొలిపే ఈ ప్రాంతం, దివ్యలోకాన్ని చూపిస్తోంది.


ఇంతటి దివ్యమంగళ స్వరూపం మనలో భక్తి భావాలను తట్టి లేపుతుంది. ఈ హారతులు, ఇక్కడ ఆలాపించే కీర్తనలు పరవశింప చేస్తాయి.






పవిత్రమైన ఈ తపోవనాలను దాటుకుంటూ, మెల్లిగా...బయటి ప్రపంచంలో మళ్ళీ ప్రవేశిస్తాం.....



ఇక్కడ మనల్ని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి.


ఇక్కడే మనకు ప్రసాదాలు, కావలసిన వారికి చల్లటి నీరు, శీతలపానీయాలు లభిస్తాయి.






ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని, కార్యక్రమాలను వీక్షిస్తూ, ఫలహారాలు, పానీయాలు సేవిస్తూ......ఎంతకాలమైనా హాయిగా గడిపేయొచ్చు కదూ....



బాగుందా! నా తీర్ధయాత్ర.:)
దసరా పండుగలోని ఈ సరదాలు ఎంతో తృప్తినిస్తాయి. అలరిస్తాయి. అలసిన మనసును సాంత్వన నిస్తాయి. ఈ తొమ్మిది రోజులు స్వర్గలోకాన్నే చూపిస్తాయి. మీరందరు కూడా నవరాత్రు లు బాగా సరదాగా, జరుపుకోవాలి. శుభాకాంక్షలు........

******************************************************************************************

11 కామెంట్‌లు:

లత చెప్పారు...

బావుంది జయగారూ,ఇంతకీ ఎక్కడ ఉంది ఈ ఆలయం

రసజ్ఞ చెప్పారు...

బాగుందండీ! మా రాజమహేంద్రవరంలో దేవి చౌక్లో ఈ దసరా నవరాత్రులు అత్యద్భుతంగా చేస్తారు. ఒక సారి మా ఊరిని తపలించేదిగా ఉంది మీ ఈ టపా.

శిశిర చెప్పారు...

చాలా బాగున్నాయండీ ఫోటోలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

@ లత గారు, కాచిగుడా లో ఉందండి. పేపర్ లో చూసి వెళ్ళాను. మీరు కూడా చూసి రండి. పిల్లలు చాలా సరదాగా చూస్తారు.దసరా శుభాకాంక్షలండి.

@ రసజ్ఞ గారు, మీ జ్ఞాపకాలను తవ్వి తీసిందాండి, ఈ దేవాలయం. హైద్రాబాద్ లో ఈ మధ్యనే కొన్ని ఏళ్ళనుంచి మాత్రమే ఈ సంస్కృతి మొదలయిందండి.దసరా శుభాకాంక్షలండి.

@ శిశిరా హౌ ఆర్ యు! మీ ఊళ్ళో దసరా బాగా చేస్తారుగా. విశేషాలు చెప్పాలి మరి. దసరా శుభాకాంక్షలు.

Ennela చెప్పారు...

eTTeTTaa..ilaanTi guDi kaachiguDaalO undaa? nEneppuDuu chooDalEdabbaa...
baagundanDee...ekkaDakeLLipOyaaru innaaLLu?

జయ చెప్పారు...

అయ్యో, అది దసరా కోసం వేసిన టెంపరరీ సెట్(గుడి):) వినాయకుడి మంటపాల్లాగానే ఇప్పుడు ఇవి కూడా మొదలయ్యాయి.

అవునూ...ఎన్నల గారూ, ఇంత కాలం ఏమయ్యారు? ఆ మాట అడగాల్సింది, నేను కదూ....

Sasidhar Anne చెప్పారు...

Akka... Chala bavunnayi.mee dussera visheshalu..

maa oorlo(peda vadlapudi) kooda grand chestham.. first photo lo chudagane.. maa oorlo lighting anukoni shock tinna..

ee samvathsaram.. maa family ki amma vari vigrahanni pette avakasam vacchindhi. 10 days akkade vunnam..

Sasidhar Anne చెప్పారు...

@jaya akka - vennela akka , hyderabad lo emadhya modhalu ayyayi emo.. maa oorlu last 30 years nunchi chesthunnaru.. :)

జయ చెప్పారు...

శశిధర్, అయితే ఈ సారి దసరా చాలా బాగా జరుపుకున్నారన్నమాట. నిజమే, పల్లెటూళ్ళల్లో చాలా బాగా సంబరాలు జరుగుతాయి. ఈ సారి అమ్మవార్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిందన్నమాట. అభినందనలు. దసరా శుభాకాంక్షలు.

శిశిర చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు జయగారు.

Chinni చెప్పారు...

Nice post and nice pics. :)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner