8, మార్చి 2012, గురువారం

ఇంటిదీపం






స్త్రీ - సిరి, విరుల పరిమళం వెదజల్లే కమనీయ మనోహర కమలం. స్త్రీ అంటే శుభాలనొసగే సుమధుర సుమహారం. సిరి సంపదలకు మూలాధారం. ఆనందానికి, అభిమానానికి...ఆత్మీయతకు జీవనాధారం. తన రక్త మాంసాలను పంచి పెంచి పోషించే కల్పతరువు. భావి సత్పౌరులను తీర్చి దిద్దటానికి శిక్షణ ఇవ్వటం లో, శిక్షించటం లో దూరదృష్టి గల దృష్ట. తన సంతానం సర్వసుఖాలను కోరుకునే అభిలాషిణి. తన పిల్లల ఆకలిని గుర్తించి అన్నం పెట్టే కడుపుతీపి గల కరుణామూర్తి స్త్రీ. తన కలలు కల్లలైన వేళ కడుపుకోతతో కుమిలికుమిలి పోయే అభాగిని...అమ్మ...స్త్రీయేగదా!!!

తాను వలచి సరసన నిలచి మనోహరుడైన వరుని లాలించి స్వర్గసుఖాల్లో తేలించే వనిత స్త్రీయేగదా!!! మనసిచ్చిన మగువ తన మనసు మార్చుకోలేదు. మమతల మణిహారాన్ని ప్రియుని మదిలో వేసి ఎదలో నిలచే స్నేహప్రియ...దేవత.... స్త్రీ....

జీవితంలో మల్లెల సుగంధాల్ని వెదజల్లి తరింపచేసేది స్త్రీ.... కాటుక చారికతో జ్ఞాపకాలు జార్చుకోనివ్వద్దు ...స్త్రీ హృదయాన్ని స్వీకరించి స్పందింపచేయాలి....

ఈ సుకుమారపు మొక్కకు అనురాగపు నీరు పోస్తే, మానవత్వం అనే మొగ్గలు వికసిస్తాయి. ప్రేమ అనే పువ్వులు ప్రకాశిస్తాయి....






దీన జన రక్షిణి...సేవకురాలు...సున్నితమైన సువాసనలు వెదజల్లే ఈ గులాబీకి అంటించొద్దు చీకటిమరకలు... ఈ వసంతాన్ని చిగురింపచేస్తే...సరిగమల ఆమని అవుతుంది...

రంగుల వెలుగులుజిమ్మే ఇంటిదీపం పై నల్లరంగు పారబోయొద్దు......

స్త్రీ నిర్జీవ శిల కాదని, ఒక బొమ్మ అసలే కాదని, పరిపూర్ణ ఆదిశక్తి స్వరూపమనీ...మంచికి మారుపేరైన మమత నిండిన హృదయమని...స్త్రీ సరిహద్దులు లేని స్వేచ్చాస్థలాన్ని చేరుకోవాలని.....నిజమైన శాంతి కపోతాన్ని ఎగురవేయాలని....

ఆశిస్తాను...ఆకాంక్షిస్తాను....ఆక్రోశిస్తాను.

“All Nations have attained greatness, by
Paying proper respect to women. That Country
And nation which does not respect women
Has never become great, nor will ever be in future.” ---Swami Vivekananda.

W - Women
O - Of
M - Modern
E - Era
N - Need to protect Social Values.

A woman who fights for her rights is successful in every aspect of life.
“Women get what she likes.
And likes what she gets.
And it is easy to her to protect social values”…..


"ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుంటున్న నా స్నేహితులందరికీ, జీవితమంతా ఇలాగే గడచిపోవాలని..... ఆనందమయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో"..... జయ





***********************************************************************

24 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Very nice..

Happy women's Day..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ "ఆనందమయ మహిళాదినోత్సవ"
శుభాకాంక్షలకు థాంక్సండీ..
మీకు కూడా హోళీ,మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Happy women's Day..

http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html

భావన చెప్పారు...

బాగుంది జయ. మీకు కూడా మహిళా దినోత్సవం, ఇంకా హోళీ శుభాకాంక్షలు.

Padmarpita చెప్పారు...

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.

సుభ/subha చెప్పారు...

Nice andii..
Happy Women's Day Also..

Murthy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Murthy చెప్పారు...

నమస్తే జయ గారు,
మహిళా దినోత్సవ శుభాకంక్షలు.
Excellent reflections.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా చెప్పారండీ! మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ ఆఖరి పైంటింగ్ నాకెంతగానో నచ్చేసింది! పంజాబీ వాళ్ళది కదూ!

శశి కళ చెప్పారు...

మీకు కూడా మహిళా దినొత్సవ శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

వనజ గారు
రాజి
భావన
పద్మర్పిత
సుభ గారు
D.S.R.మూర్తిగారు
శశికళ గారు
రసజ్ఞ గారు, ఆ బొమ్మ గూగులమ్మది. నాక్కూడా నచ్చి కొట్టేసాను:)

....మీ అందరికీ బోలెడు థాంక్స్.

Zilebi చెప్పారు...

మనస్వి ఐన జయ గారు,

చాలా బాగా విశ్లేషించారు. శుభాకాంక్షలు.

జిలేబి.

జయ చెప్పారు...

జిలేబి గారు, ధన్యవాదాలు.

David చెప్పారు...

జయ గారు స్త్రీ గురించి చక్కగా వర్నించారు...మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

జయ చెప్పారు...

Thank you Devid garu.

శివరంజని చెప్పారు...

స్త్రీ గురించి ఇంత అందంగా రాయలంటే ఒక స్త్రీ నే రాయగలదేమొ అన్నంత బాగా రాసారు జయ గారు ...మీరు ఇలాంటి పోస్ట్ లు ఎంత బాగా రాస్తారు అంటే మీ బ్లాగ్ కి నన్ను రప్పించేలా చేస్తుంటాయి

జయ చెప్పారు...

హాయ్ శివానీ.Thanks for coming after a long time. శివరంజని ని రప్పించటానికి అంత ఎక్షర్సైజ్ నేను చేయలేనమ్మా!!!

మధురవాణి చెప్పారు...

ఆలస్యంగా చూస్తున్నాను. చాలా బాగున్నాయండీ మహిళ గురించి మీరు చెప్పిన మాటలు. :)

జయ చెప్పారు...

Madhuravani, no problem:) Thanq very much.

పరిమళం చెప్పారు...

మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

జయ గారు , నందన నామ సంవత్సర శుభాకాంక్షలు ...

జయ చెప్పారు...

పరిమళం గారు థాంక్సండి. బాగున్నారా. పండగ బాగా చేసుకున్నారా.

హెలో వంశీ, బాగున్నారా. థాంక్యూ. ఇంజనీర్ గారి పండగ సంబరాలు ఏవిటో!

SRRao చెప్పారు...

జయ గారికి
శ్రీరామనవమి శుభాకాంక్షలతో...........

జగదభిరాముడు శ్రీరాముడే !

జయ చెప్పారు...

More Entertainment gaaru, S.R.Rao gaaru Thank you very much.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner