22, అక్టోబర్ 2012, సోమవారం

Let flowers do the talking ...


  
  
Each of us is a flower
Growing in life’s garden.....   

 వాడిపోతాను, అని తెలిసినా వికసించక మానదు పువ్వు. జీవితం క్షణ భంగురమే అయినా ఎలా పరిమళించాలో ఈ పూల గుసగుసలు, గాలిలో ఈలలు వేసుకుంటూ మరీ మనకి నేర్పిస్తాయి.
పువ్వు చెట్టుకుంటే అందాన్ని ఇస్తుంది.
భగవంతుని చెంత చేరితే పరిమళిస్తుంది.
ఆడపిల్ల జడ నలంకరిస్తే నింగిలో చందమామలా వెలుగొందుతుంది.
సిపాయి మృతదేహం తాకితే పువ్వు జన్మ పరిపూర్ణత చెందుతుంది.

ఓ అందమైన పూవా!
నీవు అందం...నీ మనస్సు అందం...
నీ మనస్తత్వాన్ని సువాసనలతో వెదజల్లుతావు
నీ వంటి మనస్సు మాకుందా!

నన్ను నీవు నాటినప్పుడు
నాకు జన్మ నిచ్చిన తల్లి వనుకున్నాను
నాకు నీరు పోసి పెంచినపుడు
నా మేలు కోరే తండ్రి వనుకున్నాను
నేనొక పూవు పూయగానే
నువ్వు సంతోషిస్తావనుకున్నాను
తీరా నువ్వు ఆ పువ్వును కోసి నప్పుడు
నేను కొంత కృంగిపోయాను
కానీ ఆ పువ్వును భగవంతుని
పాదాల చెంత ఉంచినపుడు
నేనెంతో సంతోషించాను
చివరకు నా జన్మ సార్ధకమైనందుకు
నేను మరీ మరీ ఆనందించాను . . . .
నేనెప్పుడో రాసుకున్న ఈ కవిత గుర్తొచ్చింది.....ఈ పూలతో దానిని జత కూర్చాలనిపించింది....

దేవుణ్ణి పూలతో కొలుస్తాం...ఆ పూలనే దేవుడిగా కొలుస్తే!!!!





రక రకాల రంగు రంగుల పూలు
భలె భలె పూలు... పసందైన పూలు
అందమైన పూలు... కొత్త కొత్త పూలు
ముట్టుకుంటె వదలి పోలేమండి.....
కోరుకున్న పూలు...పూలంటె పూలు కావండి:) 
పూలను   చేకొనరండి ఓ అమ్మల్లారా.....ఓ అయ్యల్లారా...



పూజలు చేయ పూలు తెచ్చాను 
నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా
ఈయరా దర్శనము 






నీ వుండే దా కొండ పై, నా స్వామీ!  నే ఉండే దీ నేలపై.  ఏ లీల సేవింతునో....ఏ పూల పూజింతునో....
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె.....ఈ పేద రాలి మనస్సెంతొ వేచే......


                                                    


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మని రెమ్మరెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు..ప్రొద్దు పొడవక ముందె పూలిమ్మని...
 కొలువైతివా దేవి నా కోసము.. తులసీ..తులసీ దయా పూర్ణ కలసి...
మల్లెలివి నాతల్లి వరలక్ష్మికి..మొల్లలివి నన్నేలు నా స్వామికి 
ఏ లీల సేవింతు ఏ మనుచు కీర్తింతు...
సీత మనసే నీకు సింహాసనం...



ఒక పువ్వు పాదాల..ఒక దివ్వె నీ మ్రోల ఒదిగి నీ ఎదుట...
ఇదె వందనం.. ఇదె వందనం...  


 


ముద్దు ముద్దు రోజావే ముద్దు లొలుకు రోజావే 
ప్రేమ మంత్రమే, వాడని రోజావే
నిన్ను చూస్తే నన్ను నేను మరచిపోనా!




జగన్మాత నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు.....మీరెల్లరూ ఉల్లాసంగా రంగు రంగుల, వన్నె చిన్నెల పూనవ్వులతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలి......జయ






**************************************************************************************************************************************

                                   

22 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అందమైన పువ్వులతో, అందమైన మనన్సుతో
మీరు చెప్పిన ఈ పండుగ శుభాకాంక్షలతో
మా పండుగ నిజంగానే ఆనందంగా జరుగుతుందండీ :)

మీ శుభాకాంక్షలకు ధన్యవాదములు..
మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు..!

Priya చెప్పారు...

ముద్దబంతుల మాలంత అందంగా రాశారండీ కవిత!
అన్నట్లు ఆ పెయింటింగ్స్ మీరే చేసారా? చాలా బాగున్నాయి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పూల్ కి చాహ్.. అద్భుతంగా ఉంది.
మనస్వి చాహ్.. పువ్వులా అందంగా సుతిమెత్తగా ఉంది.
పెయింటింగ్స్ చాలా చాలా బావున్నాయి.
మీరే వేసారు కదూ.. పింక్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది.నాకు బాగా నచ్చాయి.

జయ గారు.. ముందస్తుగా విజయ దశమి శుభాకాంక్షలు.

శిశిర చెప్పారు...

అంతందంగా పెయింటింగ్స్ ఎలా వేయాలో నాకు ట్యూషన్ చెప్పకూడదూ! మీకూ దసరా శుభాకాంక్షలు.

మధురవాణి చెప్పారు...

అబ్బా.. ఎంత బాగా వేసారండీ బొమ్మలు.. చాలా అందంగా ఉన్నాయి.. మీక్కూడా నవరాత్రుల శుభాకాంక్షలు..

Padmarpita చెప్పారు...

అందమైన పూలవనంలో కూర్చుని పరిమళాలని ఆస్వాధిస్తున్నట్లుంది మీ పోస్టు...
మీకు కూడా నవరాత్రుల శుభాకాంక్షలు..!

శశి కళ చెప్పారు...

పూవులు యెంత చక్కగా ఉన్నాయో...మీ అక్షరాల అల్లిక అంట అందంగా ఉంది

SRRao చెప్పారు...

జయ గారూ !
పూల ఊసులు, బాసలు అందంగా చెప్పారండీ !

మీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక

జయ చెప్పారు...

@ రాజీ, థాంక్యూ. మీ పండగ విశేషాలన్నీ చెప్పేయాలి మరి.

@ ప్రియ గారు ధన్యవాదాలండి. అవునండి:)

@ హేవిటో, వనజ గారు మీరు నన్ను భూమి మీద ఉండనిచ్చేట్లు లేరు:) థాంక్సండి.

@ శిశిరా, నేను వేసే పిచ్చి పైంటింగ్స్ కే అంత పరవశమైతే ఎలా:) మన బ్లాగ్ ప్రపంచంలో ఎంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్ట్స్ ఉన్నారో తెల్సా!!! వాళ్ళ నడుగుదాం మనిద్దరికీ నేర్పిస్తారేమో.





జయ చెప్పారు...


@ మధుర గారు థాంక్స్. మరీ అంత మెచ్చుకునేట్లు లేవులెండి:)

@ పద్మర్పిత గారు ఈ పూల వనం లో మీరు అడుగు పెట్టి ఎంత అందాన్నిచ్చారో తెల్సా! ధన్యవాదాలండి.

@ శశికళ గారు థాంక్స్.

@ రావ్ గారు ధన్యవాదాలండి.

జ్యోతిర్మయి చెప్పారు...

బొమ్మలు చాలా అందంగా వేశారు జయ గారు.

జయ చెప్పారు...

Jyotirmayi garu thank you.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

పండగ వాతావరణాన్ని పూల పరిమళంతో నింపేసారు కదా..అభినందనలు జయ గారు..

జయ చెప్పారు...

Thanq Varma garu

సృజన చెప్పారు...

హాయిగా ఉంది చదివి చూస్తూ పరిమళాలని ఆస్వాదిస్తుంటే

జయ చెప్పారు...

ధన్యవాదాలండి. మీ బ్లాగ్ టేంప్లట్ అంటే నాకు చాలా ఇష్టం సృజన గారు. ఎంతో బాగా రాస్తారు మీరు.

Unknown చెప్పారు...

ఎప్పుడో రాసుకున్న మీ కవిత, మీ పెయింటింగ్స్ తో, ఈ నవరాత్రి కి అందరికీ ఇలా పువ్వులతో ముస్తాబై కనిపించి కనువిందు చేసింది, చదివే మనసుకీ ఆనందం కలిగించింది. పువ్వు ఎక్కడ చేరితే ఎలా తరిస్తుందో చక్కగా చెప్పారు.
కవితా, బొమ్మలూ ఎంతో బాగున్నాయి.
దేవుణ్ణి పూలతో కొలుస్తాం...
ఆ పూలనే దేవుడిగా కొలుస్తే!!!!
నిజమే, కొలిస్తే ఎలా ఉంటుందో కదూ!
ఆలశ్యం అయినా...మీకూ శుభాకాంక్షలు!

జయ చెప్పారు...

చిన్ని ఆశ గారు అలా ఎక్కడెక్కడికో పంపించేస్తే ఎలా:) నేనిక్కడే ఉందామనుకుంటున్నాను. థాంక్స్.

జలతారు వెన్నెల చెప్పారు...

ఆలశ్యంగా చదివానండి మీ పోస్ట్.బాగుంది.
చాలా బాగున్నాయి పూల చిత్రాలు.

జయ చెప్పారు...

జలతారు వెన్నెల గారు థాంక్యూ.

సుభ/subha చెప్పారు...

జయ గారూ దీపావళి శుభాకాంక్షలండీ..

జయ చెప్పారు...

Thank you Subha garu. I wish you the same.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner