30, డిసెంబర్ 2012, ఆదివారం

కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుందా!!! ఎప్పటిలా పాతగానే ఉంటుందా!!!! THUNDER 13





వ్రాద్దామంటే అ ఆ లు రావటం లేదు
చెప్దామంటే భాష రావట్లేదు.....ఎందుకిలా పూర్తిగా మూగ బోయింది!!!!!
తెలియటం లేదు....
నిండుపున్నమంటి ఆలోచనలు పరచుకోటమే లేదు...
మబ్బు చుక్కల నీలపు చీర పరచుకున్న గగనమలా రెప రెపలాడుతోనే ఉంది.....
ఆ రెప రెపల సందడి, సయ్యాటలా!!!....అలజడి పరుగులా!!!
ఆకాశమంతా అగ్నిపర్వతాలు చిందులేస్తున్నాయా!!!....మరెందుకలా వేడి వేడి సెగల శ్వాస ఎర్ర రంగు తివాచీ పరుస్తోంది!!!!
పాదయాత్రల తాకిడికి కందిపోయిన భూమాత ప్రతి రూపమా అది?
ఈ అత్యాచార ప్రపంచంలో ప్రతి రోజూ యుగాంతమేనా!!!
 అలా ఓ అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే...అరె, ఈ అమ్మాయి జాగ్రత్తగా ఇంటికి చేరేనా! అనెంత భయమో!!!
తల్లీ, నీవు బయటకు రాకమ్మా...ఇంట్లోనే ముసుగేసుకొని నీ జీవితాన్ని చంపేయ్....
నే కోరుకున్న వెలుగులు  ఈ పుడమిని ఏనాటికీ చేరవా !!!
 ఒడుపుగా చీకటి తెరలను తొలగించి...జీవితాన్ని ఎలా వెతుక్కోవాలో.....
ఏదో శక్తి వచ్చి భళ్ళున వెలుతురు నింపితే ఎంత బాగుండు!!!!
ప్రకృతి కాంత కళా హస్తం ఒక సుందర ప్రతిబింబాన్ని తీర్చి దిద్ది ఇస్తే బాగుండు...
రేయింబవళ్ళు కష్టపడిన జీవితపు చరమ దశలో వెనక్కి తృప్తి గా తిరిగి చూసుకోవచ్చు.....
జీవితంలో మల్లెల సుగంధాల్ని వెదజల్లాలి...  జ్ఞాపకాలు జార్చుకోనివ్వద్దు ...  హృదయాన్ని స్పందింపచేయాలి
ఎక్కడ చూసినా యాంత్రికత....నిరాశా నిస్పృహలు....ఎంతకాలమిలా!!!!
 జీవితం అగాధాల ఆశల నిలయం
అంతు పట్టని జీవన వలయం...కానీ,
నీవు మలచుకుంటే అది ఆనందాలకు ఆలయం.
స్వార్ధం...కపటం...కుట్ర...అసూయా...ఈ మాయాజాలపు ముసుగుల్ని ఛేధించి, చింపేసి...
స్వఛ్చమైన తెల్లటి గులాబీ హృదయం విచ్చుకుంటే ....ఎంత నూతనం గా ఉంటుందో కదా!!!

ఆశల నందనం విరబూయాలి... విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది.

మనం ఖచ్చితంగా మెరుగు పరచగలిగిన ప్రదేశం  ఈ మొత్తం విశ్వం లో ఒక్కటే...అదే మన మనసు

అమ్మాయిల చిరునవ్వుల మల్లెల మాలలు స్వీకరించే నూతన సంవత్సరం వస్తుందా!!!!
ఊహూ...ఇది కల కాకూడదు....నిజమే..ఇదిగో ఈ నూతన సంవత్సరంలో...జగమంతా పసిపాప నవ్వులా...జలజలా....కిల కిల రావాలతో ఉప్పెనగా ముంచేస్తోంది. రండి అందరం అందులో మునిగిపోయి సరిగంగ స్నానాలు చేద్దాం....

    Positive thinking..Self Esteem...Is it wrong?????

  ఇంపాజిబిల్ అన్నది నా డిక్షనరీ లోనే లేదు....నెపోలియన్

 శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో....ఇలాగే ఉంటుంద,  ఇలాగే కావాలి!!!!!!!


******************************************************************************************



10 కామెంట్‌లు:

శ్రీలలిత చెప్పారు...


ఈ ఆశావాదమే మనల్ని ముందుకి నడిపిస్తుంది. ముళ్ళబాటను చక్కటి రహదారిగా మార్చి రేపటి పాపలను నిండుగా నవ్వేలా, స్వేఛ్ఛగా తిరిగేలా చెస్తుంది. పోరాడదాం. ఈ అశావాదం తొనే పోరాడదాం. మన పాపలకి అందమైన నందనవనంలో విహరించేలా చేద్దాం. మన మనసులను దానికి సిధ్ధం చేద్దాం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాల గమనంలో అన్నీ మరుగునపడతాయి. కానీ గడచినా వ్యధలు అన్నీ మమైరపించే ఆశా వాద దృక్పదం తో.. ముందుకు సాగుతుంటాం అదే జీవితం
అందరికి మంచి తెస్తుందనే ఆశతో.. స్వాగతిద్దాం కొత్త సంవత్సరాన్ని. .

Padmarpita చెప్పారు...

"ఆశల నందనం విరబూయాలి... విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది"
ఇలా సాగిపోదాం...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మనం ఖచ్చితంగా మెరుగు పరచగలిగిన ప్రదేశం ఈ మొత్తం విశ్వం లో ఒక్కటే...అదే మన మనసు"

నిజమనేండీ అందుకే ఈ కొత్తసంవత్సరం అందరికీ మంచి తెస్తుందని,మంచి చేస్తుందని ఆశను మనసులో నింపుకుని స్వాగతిద్దాం..

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్

జయ చెప్పారు...


@ శ్రీ లలిత గారు మీ మాటలు చాలా ధైర్యమిస్తున్నాయండి. మీకు ధన్యవాదాలు.

@ అవును వనజ గారు, అందరం కలిసి కట్టుగా మంచికై పాటుపడదాం.ధన్యవాదాలు.

@ పద్మర్పిత గారు అందరం కలిస్తే ఎంత బలమో కదా! అలాగే ముందుకు సాగుదాం...ధన్యవాదాలు.

@ నిజమే రాజీ, ఈ నూతన సంవత్సరం మంచిని మూటగట్టుకుని ఎప్పటికీ మనతొ ఉండిపోతుందనే ఆశావాదంతో ముందుకు సాగుదాం...

@ వంశీ, నీక్కూడా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

అందరికీ, అంతటా మంచే జరగాలని ఆశిస్తూ ముందుకి సాగిపోవటమే ప్రతి నూతన సంవత్సరం ఇచ్చే నూతనోత్సాహం...
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జయ చెప్పారు...

థాంక్సండి. అలాగే కోరుకుందాం!మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శిశిర చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు జయగారూ. సంక్రాంతి పోస్ట్ ఏదీ?

జయ చెప్పారు...

I also wish you the same. శిశిర ప్లస్ లో కనిపించినప్పుడే సంక్రాంతి:))))

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner