10, మార్చి 2013, ఆదివారం

కళా హృదయ సమ్మేళనం....



చల్లని పిల్ల గాలి తెమ్మరలు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది!
మినుకు మినుకు నక్షత్రాలు, ఇదిగో...నిన్నే... చందమామ నిన్నుకూడా రమ్మంటున్నాడు...రా... అంటే!!....
సుకుమార పారిజాత పుష్పాలు మాలాగే మొత్తం...అంతా...పరుచుకుందువుగాని....వచ్చేయ్...అని తొందర చేస్తూ ఉంటే.....ఎలా ఉంటుంది!!!
ఇదిగో అదే జరిగింది.....ఏ నాటి స్వప్నమో ఈనాడు నిజమయింది...జన్మ జన్మల సంబరం నా సొంత మయింది....ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోనివ్వండి మరి...

ఫ్రెంచ్ సంగీత కారుడు పియర్ తిల్వా. ఆఫ్రికా, మధ్య ఆసియా తూర్పు దేశాలు పర్యటించి వివిధ రకాల సంగీతాన్ని అధ్యయనం, పరిశీలనా చేశాడు.   ’ప్రపంచ సంగీత పరిమళానికి నేను వివశుడనై తిరిగాను’ అని చెప్పుకున్నాడు. సంగీతం ఒక్కటే, వేరు వేరు పేర్లతో ఉంది, సంగీత జ్ఞానాన్ని సమన్వయం చేయాలి అని భావించాడు. అనేక సంగీత కార్యక్రమాలకు స్వర రచన చేసాడు.  ఇతను స్వర పరచిన సంగీత విభావరి పేరు 'అనంత ఓపస్ 195'. సంస్కృత పదం 'అనంతం' తీసుకొని తన స్వరరచనకు ’అనంతమైన సృజన” అనే పేరు పెట్టుకున్నారు. అనేక దేశాల్లో పర్యటించి ఈ అనంతమైన విశ్వ సంగీతాన్ని వ్యాపింప చేసారు. ఎందరో కళాకారులు ఇతని సంగీత విభావరిలో పాల్గొన్నారు. అనంతమైన ఆనందాన్ని అనుభవించారు. సంగీతం ఒక మహా సాగరం, పాశ్చాత్యమైనా...భారతీయమైనా అని నిరూపించారు.  ప్రెంచ్, భారత సంగీత సమ్మేళనంతో భారత దేశంలో కూడా అనేక ఆధునిక,  శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు.  ప్రపంచ పర్యటనలో భాగంగా భారత శాస్త్రీయ సంగీత వేత్తల తో కూడా చర్చించారు. వారి   అభిప్రాయాలతో, సలహాలతో భారతీయ విజ్ఞాన సంపదతో  ఏర్పడినదే ఈ సంగమ ఫలితమం.  ఇదే ’ఇండో-ఫ్రాన్స్' స్నేహపూర్వక ఉత్సవాలకు వన్నె తెచ్చింది.

 ఇంతటి మహోన్నతమైన సంగీత కార్యక్రమాన్ని మనసారా ఆస్వాదించే అదృష్టం హైద్రాబాదీయులను వరించింది. అది మామూలు అదృష్టం కాదు. యాభై మంది ఫ్రెంచ్ కళాకారులతో శిల్ప కళా వేదిక పై పియర్ తిల్వా స్వరపరిచిన వాద్య సంగీత సమ్మేళనం. వయొలిన్, సెలో, గిటార్ తదితర పరికరాల స్వరాలు సంగీత ప్రియుల వీనుల విందు చేసాయి. చల్లని మలయ మారుతం లా, వెన్నెల జల్లుల్లా హృదయాలకు 'అనంత మైన సృజన ' ఇచ్చింది.   ఈ విభావరిని శామ్యూల్ జాన్ నిర్వహించారు.

  అక్కడే, ఈ సంగీత అనంత వాహిని లో ఒక అద్భుతమైన మలుపు హృదయాలను పూర్తిగా మైమరపింపచేసింది. ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్,  తన ఇద్దరు సంగీత వారసులైన కుమారులు అమానలీ ఖాన్, అయాన్ అలీ ఖాన్ లతో వేదిక మీదకి విచ్చేసారు. ముగ్గురూ తమ సరోద్ లను సవరించుకొని కూర్చున్నారు. అప్పటి వరకూ విన్న ఫ్రెంచ్ క్లాసికల్ సంగీతాన్ని సరోద్ ల పై సవ్వడిస్తూ, ఓ ప్రభంజనంలా, ఓ జలపాతంలా మధురమైన సంగీత పరిమళాన్ని అందరి మనసుల్లో ప్రవహింపచేసారు. కొమ్మ కొమ్మ కూ కోయిలలు పరిగెత్తుకొచ్చాయి....కొత్త కొత్త రాగాలు తీయతీయగా ఉన్నాయని... గ్వాలియర్  సంస్థానంలో  హిందూస్థానీ సంగీత కళాకరుల కుటుంబానికి చెందిన అంజద్ అలీఖాన్ ఈ సంగీత కార్యక్రమం కోసం యువకుడైన తిల్వా తో రెండు మూడు నెలలు రిహార్సల్స్ చేసారు.

 ఇంతటి అద్భుత రసాస్వాదనను, ఇటీవలే దివంగతులైన పండిట్ రవిశంకర్ కు అంకిత మిచ్చారు.  ఇరు సంస్కృతుల సమ్మేళనమిది. ఎంతో ముచ్చటైన సన్నివేశం. అంతేలేని ఓ అద్భుతం. సంగీత ప్రియులకు ఇచ్చిన మహారాజ విందు ఇది. ఇండియా లో జరిగిన ఫ్రెంచ్ పండుగ. ఎంతో మంది దేశ విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.    నేను మొదటిసారి, నా అభిమాన దర్శకుడు 'కళా తపస్వి' కె. విశ్వనాధ్ గారిని ఇక్కడ చూసే అదృష్టం కూడా కలిగింది. ఆ కళాకారుల దగ్గరికి ఎన్నో కళా హృదయాలు ఆటోగ్రాఫుల కోసం, ఫొటోగ్రాఫుల కోసం పరుగులెత్తాయి.....ఈ బుల్లెట్లను మాత్రం ఎవ్వరూ ఆపలేక పోయారు. ఇది ఒక  Fusion అంతే.

“It is a harmonious blend of Hindustani Classical Music and Divine French Compositions”…..





Bonjour India 2013 festival - Ananta Opus 195







***************************************************************************************************************************************************










10 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

బాగుందండీ. మీ సంతోషమంతా టపాలో తెలుస్తూంది. :) Lucky you.

KumarN చెప్పారు...

WOW!! Lucky You!!

<>
ప్చ్. కొద్ది నెలల క్రితం Pt Ravi Shankar concert మా ఇంటికి ఓ నలబై నిమిషాల దూరంలో జరగాల్సింది, కాని ఆయన అనారోగ్యంతో చివర్లో కాన్సల్ అవడంతో పిల్లలకి చూపించాలనుకున్న ఆశ తీరలేదు.

జలతారు వెన్నెల చెప్పారు...

మీరు రాసినది చదువుతుంటేనే ఎంతో అనందం కలిగింది.
అనుభవించిన మీరు నిజంగానే అదృష్టవంతులు జయ గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Nice... మీ సంతోషం అంతా మాటల్లో తెలుస్తుంది .సంగీతం ఆత్మ లాంటి అంటారు. అది ఆస్వాదిస్తేనే కాని అర్ధం కాదనుకుంటాను. స్వయంగా అనుభవించారు. కొద్ది రోజులు ఆ అనుభూతిలో విహరించండి

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీ ఆనందాన్ని మాకూ పంచారు...ఇలాంటివి జన్మ కొక్కటి చూసినా చాలు అనిపిస్తుంది. I envy you:(

జయ చెప్పారు...

@ అవును శిశిరా, ఇన్నాళ్ళకు శిశిరని ఇక్కడ చూసిన సంతోషం కూడా దానితో చేరింది.

@కుమార్ గారు, ఇన్నాళ్ళకు మా ఇంటికొచ్చారు:) థాంక్యూ. ప్రతి రోజూ ఇంతో అంతో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినకపోతే నాకస్సలు తోచదండి.

@జలతారువెన్నెల గారు, మీతో పాటు వెన్నెల తీసుకొని మరీ వస్తారు కదా:) థాంక్యూ.

@వనజ గారు ఎంత బాగా చెప్పారండి సంగీతం గురించి. ఆ సంతోషం మాటల్లో చెప్పే శక్తి నాకు లేదండి.

@మువ్వగారు, మీరు మరీను:)
అవునండి జన్మకో శివరాత్రన్నమాట. థాంక్యూ.

Sravya V చెప్పారు...

Nice Jaya gaaru !

జయ చెప్పారు...

థాంక్యూ శ్రావ్య గారు.

శ్రీలలిత చెప్పారు...


సంగీత రస ఝరిలో ఓలలాడినప్పటి సంతోషమంతా మీ మాటల్లో కనిపించింది. అభినందనలు..

జయ చెప్పారు...

Thank you Sri lalitha gaaru

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner