27, జులై 2013, శనివారం

నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....

'ఎంకెవ్వరని లోకమెపుడైన కదిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు'.... 

నాయుడు బావ దే యెంకి .... యెంకి వంటి పిల్ల లేదోయి బావా! 

  నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....




గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
      కూకుండనీదురా కూసింతసేపు !




ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే !
       యీ చిత్తమునకు వెలుగు నీ యెంకితనమే !



ఎకసకె మెవరికి తెలుసు ?
 ఎంకిచిలుక మనుసు గడుసు !




అద్దమేలంటాది అందాలు తెలప
ముద్దుమాటలకెంకిదె ముందునడక




జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని
 సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
  మెల్లంగ వస్తాది నా యెంకీ !
   సల్లంగ వస్తాది నా యెంకీ !



సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ
బారెడైనా కొండ పైకి సాగిందేమొ
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ

తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు
కాలుసేతులు పక్కకంటుకొని పోనాయి 



  ఎంకి వన్నెల చీర నెగిరె వెన్నెల పూలు
      ఎండుటాకుల గొలుసు వెండి తీగెలుచేరె!

***************************************************************************************************************************************************************************************************


33 కామెంట్‌లు:

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

:)
బొమ్మలు చాలా బావున్నాయ్...
ఎక్కడివి?
కొన్ని మీరే గీసినట్టుందే!

జయ చెప్పారు...

థాంక్సండి. అన్నీ నేనేసినవే రహ్మనుద్దీన్ గారు:)(అంటే కొన్ని కాపీ కొట్టాను)

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా చాలా బావున్నాయి జయ గారు.

జయ చెప్పారు...

జోతిర్మయి గారు, నిజంగానా:) థాంక్యూ.

నిషిగంధ చెప్పారు...

జయ గారూ, అన్నీ బావున్నాయండీ.. కానీ అన్నిటికంటే ఎక్కువగా చంద్రుడిలో ప్రతిబింబం చూసుకుంటున్న బొమ్మ మాత్రం చాలా చాలా బావుందండీ.. అది గీయడం కష్టం కదా!!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఎంకి వన్నెల చీర నెగిరె వెన్నెల పూలు ఎండుటాకుల గొలుసు వెండి తీగెలుచేరె!
బొమ్మలు బాగున్నాయి. చంద్రునిలో తనను చూసుకునేది , ఆ పైది బాగున్నాయి. నేనూ కాపీ కొట్టి వేస్తా. :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పదహారేళ్ళనబోయి నూటపదహారేళ్ళన్నారా!!!!!

Unknown చెప్పారు...

చాలా బాగున్నాయన్నీ జయగారు . కాపీచేసాను అంటున్నారు ,అలా వేయడమైనా రావాలి కదా రాదిక(నాని)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వావ్ మాటల్లేవండీ.. ఉన్నవన్నీ చప్పట్లే :-) బొమ్మలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయ్.

తృష్ణ చెప్పారు...

superb!చందమామలో చూసుకుంటున్న ఎంకి చాలా చాలా బాగుంది.. కొబ్బరిచెట్టు కూడా!

KumarN చెప్పారు...

Outstanding!!
Thanks for showing.

ప్రేరణ... చెప్పారు...

సూపర్ పోస్ట్....చాలా నచ్చింది

జయ చెప్పారు...

@ నిషిగంధ గారు థాంక్సండి. మీకు తెలుసా నేనిప్పుడు మిమ్మల్నే తలుచుకుంటూ 'ఊసులాడే ఒక జాబిలంట!' గురించి రాసుకున్నాను:)

@ లక్ష్మీదేవి గారు చక్కటి ఎంకి పాటనే గుర్తు చేసారండి.చాలా థాంక్స్. మరి మీ బొమ్మలు చూపించరూ! ఎంకి ఎప్పుడూ పదహారేళ్ళేనండి. నండూరివారికండి నేను నూటపదహార్లు ఇచ్చింది:)

జయ చెప్పారు...

@ రాధిక గారు థాంక్సండి. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు, వేయగా వేయాగా అందరం కాపీ కొట్టగలమండి. కాని అందులో పర్ఫెక్షనే లోపిస్తుంది.:)

@ వేణుగారు బొమ్మలన్నీ బాగున్నాయా. మీరు మరీ! అస్సలు మనసు నొప్పించరు కదా:) థాంక్సండి.

జయ చెప్పారు...

@ తృష్ణ గారు అది ఒకప్పటి వడ్డాది గారి బొమ్మండి. నాకు చాలా నచ్చి కాపీ కొట్టేసాను. థాంక్యూ.

@ కుమార్ గారు, థాంక్యూ సో మచ్.

@ ప్రేరణ గారు థాంక్యూ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు...బొమ్మలు చాలా బావున్నాయి.ఎంకిని గుర్తు చేసారు.

శిశిర చెప్పారు...

ఆ మూడో బొమ్మ ఎంత బాగుందో!

..nagarjuna.. చెప్పారు...

సూఊఊపర్బ్ జయగారు ... అన్నీ చాలా బాగున్నాయి, బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నావి ఇంకా బాగున్నాయి, చంద్రుడిని అద్దంగా చేసి అందులో ప్రతిబింబం చూపిస్తున్నది ఇంకా చాలా బాగుంది, ఇంకో మాటలేదంతే !

A Homemaker's Utopia చెప్పారు...

దేనికదే ప్రత్యేకం గా అద్భుతం గా ఉన్నాయి జయ గారు...చాలా చాలా బాగున్నాయి..చాలా నేర్చుకోవాలి మీ దగ్గర..:-)

Sravya V చెప్పారు...

Beautiful Jaya gaaru !

జయ చెప్పారు...

@ వనజ గారు థాంక్సండి.

@ శిశిరా, నాక్కూడా అదే నచ్చింది. నలుపుతెలుపుల్లో ఉన్న ప్రత్యేకత బాగా పట్టేసుకున్నట్లుంది:) థాంక్యూ.

జయ చెప్పారు...

@ నాగార్జున ఇంకో మాట లేదంతే:) థాంక్యూ.

@ నాగిని గారు థాంక్సండి. కాని అంత సీన్ లేదండి:)

@ శ్రావ్య గారు థాంక్స్.

శ్రీలలిత చెప్పారు...


ఈ బొమ్మలన్నీ మీరు వేసినవా! చాలా బాగా వేసారండీ. నాకు కూడా యెంకి అంటే చాలా ఇష్టం. యెంకి నాయుడుబావల అనుబంధం ఎంతో గొప్పగా అనిపిస్తుంది.
మీ బొమ్మలన్నీ నేను save చేసేసుకున్నాను మీ అనుమతి లేకుండానే.
Thanks చెప్పేస్తున్నాను కూడా...

జయ చెప్పారు...

శ్రీలలిత గారు, నిజంగా అంత బాగున్నాయా:) థాంక్సండి.

Unknown చెప్పారు...

ఏమేమీ ఎంకికి నూటాపదహారేళ్ళా!OLD IS GOLD!పూవుకు తావి అబ్బినట్లు,పాటకొక బొమ్మ!నండూరివారు మాటలతో బొమ్మకట్టిన పాటలకు,రంగుల రేఖలతో జయగారు ప్రాణం పోశారు!ఎంకి నాయుడు బావలు తెలుగువారికి పరమ ఆప్తులు!

జయ చెప్పారు...

సూర్యప్రకాష్ గారు, ఎంత అందంగా చెప్పారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

భారతి చెప్పారు...

అద్భుతః
మీలో ప్రతిభకు ముగ్ధురాలినయ్యాను జయగారు!

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా చాలా బావున్నాయి. నాకు ఎక్కువ నచ్చినవి మొట్టమొదటిది, చంద్రుడిలో ప్రతిబింబం చూస్తున్నది.

జయ చెప్పారు...

భారతి గారు అతిశయోక్తి కదూ:) థాంక్సండి.

జయ చెప్పారు...

అమ్మయ్యా! మొదటిది నచ్చిందా. సంతోషంగా ఉందండి. ప్రతి బొమ్మా కూడా డిఫెరెంట్ టెక్నిక్ తో వేసినవండి. థాంక్యూ సౌమ్య గారు.

David చెప్పారు...

బొమ్మలు చాలా బాగున్నాయి జయ గారు..

జయ చెప్పారు...

Thank you Devid garu.

Praveena చెప్పారు...

Superb !! Extremely beautiful sketches/paintings :)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner