9, సెప్టెంబర్ 2013, సోమవారం

మహా గణపతిం భజే!


ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా శుక్లాం బరధరం చదవాల్సిందేకదా!
వినాయకుని కెంతో ఇష్టమైనది భాద్రపద  శుద్ధ చవితి. సకల గణాధిపతి. ఈ వినాయకుని శ్రద్ధతో ఈ రోజు ఆరాధిస్తే సకల ఇష్టసిధ్ధి కలుగుతుంది. నైవేద్య ప్రియుడు ఈ దేవుడు. ఉండ్రాళ్ళతో పాటు రకరకాల పిండివంటలు సమర్పిస్తాము. గుంజీళ్ళు తీసినా, రెండుచేతులు ముడిచి తలపై కొట్టుకున్నా మన తప్పులన్నీ క్షమించేస్తాడట. సంకష్ట హరుడు. స్వయంభువు. ఇట్టి వినాయకుని మనసార పూజించితే సంభవించే కష్టాలను హరించగలడు.

ఎర్రరంగు వినాయకుని మన ఇంటి గుమ్మం ఎదురుగ్గా పెట్టుకున్నట్లైతే ఎటువంటి ఆరోగ్య సమష్యలు తలెత్తవట. తెల్లటి వినాయకుని ఇంటిలో ఉంచుకున్నట్లైతే ఎంతో స్వచ్చమైన మనసుతో సంతోషంగా ఉంటారట. ఆకుపచ్చ, పసుపుపచ్చ కలిపి వినాయకుని తయారు చేసుకున్నట్లైతే సకల సంపదలతో, సౌభాగ్యంతో విలసిల్లుతారట. బంగారు వన్నెలో మెరిసిపోయె వినాయకున్ని తయారుచేసుకున్నట్లైతే సకల గుణాభిరాములవ్వటమే కాక, దయార్ద్ర హృదయంతో సంఘసేవా తత్పరులౌతారట.

ఓంకారం అంటే గణపతి స్వరూపమే! ముక్కోటి దేవుళ్ళలో గణపతికే పెద్ద పీట వేసాం. మొదట స్మరించేది కూడా ఆయన్నే! చిన్నపిల్లలు విద్యాప్రాప్తి కోసం పూజించే దేవుడు.ప్రతి ఒక్కరు అంతుపట్టని ఆ వింత దేవుణ్ణి మనసుల్లో కలకాలం నిలుపుకున్నట్లైతేసకల సుఖాలను కలిగించే దేవుడు ఈ గణపతి....

మరి నేను తయారు చేసుకున్న ఈ గణపతులు ఎలా ఉన్నారు?

స్నేహితులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.













*************************************************************************************************************************************************** 


26 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

3,4 చాలా చాలా బాగున్నాయండి..వెరీ నైస్..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగున్నాయండీ పెయింటింగ్స్..

..nagarjuna.. చెప్పారు...

ఒకదాన్ని మించిమరొకటి అన్నట్టు ఉన్నాయి--3,4,5 మరీనూ

శ్రీలలిత చెప్పారు...


చాలా బాగా వేసారండీ. అభినందనలు..
వినాయకచవితి శుభాకంక్షలు...

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా బాగా వేశారు జయ గారు. మీకింత టైం ఎక్కడుంటు౦దండి. మీ దగ్గరనుండి చాలా నేర్చుకోవాలి.
మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.

ఫోటాన్ చెప్పారు...

అన్నీ చాలా బాగున్నాయి, గ్రేట్ వర్క్ :)

మధురవాణి చెప్పారు...

బ్రహ్మాండంగా ఉన్నాయి జయ గారూ బొమ్మలు .. :-)

శిశిర చెప్పారు...

వావ్ జయగారూ.. నేనేదైనా అనాలి అంటే నాకు ఆ విషయం గురించి కాస్తైనా తెలిసుండాలిగా. మీ ఉత్సాహానికీ, మీ కళాతృష్ణకీ, టాలెంట్ కీ హ్యాట్సాఫ్.

Unknown చెప్పారు...

వావ్ చాలా బాగా వేసారు.బాగున్నాయన్నీ .రాధిక (నాని)

ranivani చెప్పారు...

మాటలు అవసరం లేదిక.మీకుమీరే పోటీ .అన్నిటితో పాటు ఆఖరుది కొంచెం ఎక్కువ నచ్చేసింది.పక్కకు తిరిగి ,విభిన్నమైన కిరీటంతో మొఘలాయీలను గుర్తుకు తెస్తున్నాడు మీ గణపయ్య.

జయ చెప్పారు...

తృష్ణ గారు, వేణూజి, నాగార్జునా, శ్రీలలితగారు థాంక్సండి.

జయ చెప్పారు...

జ్యోతిర్మయిగారు థాంక్సండి. టైలేకపోడానికి నేనేమన్నా సఫ్ట్వేర్ ఇంజనీర్ నా:)

జయ చెప్పారు...

పోటాన్, థాంక్యూ వెరీ మచ్.

జయ చెప్పారు...

మధురవాణి గారు థాంక్యు.

జయ చెప్పారు...

కళాతృష్ణ ఉంది, కాని కళ లేదులే శిశిరా. అది ఎప్పటికొస్తుందో చెప్పలేను:) థాంక్యూ.

జయ చెప్పారు...

@ రాధిక గారు థాంక్యూ.

@ నాగరాణి గారు అవునండి ఆ బొమ్మ కొంచెం వెరైటీ. ఆ కాలం నాటిదే ఈ బొమ్మ. భలే కనుక్కున్నారు. థాంక్యూ.

సిరిసిరిమువ్వ చెప్పారు...

దేనికదే బాగుందండి. నిన్న పూజ ఈ వినాయకుళ్ళకే చేసేసారా!

జయ చెప్పారు...

లేదండి మువ్వ గారు, మట్టి వినాయకునికి చేసాము. నిమజ్జనం చేయాలి కదా:) థాంక్సండి.

అజ్ఞాత చెప్పారు...

చాలా చాలా చాలా బాగా వేశారు జయ గారు. :-)

జయ చెప్పారు...

Thamkyou Chandrakala garu:)

Meraj Fathima చెప్పారు...

చాలా బాగున్నాయి. అభినందనలు జయ గారు.

జయ చెప్పారు...

Thankyou meraj garu.

Unknown చెప్పారు...

totalgaa cheppalante ee post ganapathi bappa moria ani anipinchettugaa undi.superb
totalgaa ive adubutamgaa undi
http://www.googlefacebook.info/

జయ చెప్పారు...

Thank you Sir.

Karthik చెప్పారు...

Wowww..chaalaa baagunnaayiiiii..:):)

జయ చెప్పారు...

థాంక్యూ కార్తీక్:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner