26, అక్టోబర్ 2009, సోమవారం

నా చిత్రలేఖనాలు



నా చిత్రలేఖనాలు చూస్తారా! కలర్, ఆయిల్ పైంటింగ్స్ పెట్టను లెండి. ఎందుకంటే అవి ఎలాగో స్కానింగ్ చేయటానికి రావుకాబట్టి. చిన్న చిన్న పెన్సిల్ స్కెచెస్ పెడుతాను. అవికూడా కొన్నే పెడతాను లెండి. o.kay!!!

















33 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

జయ గారూ !
మీ పెన్సిల్ స్కెచ్ లు బాగున్నాయి. కలర్ పెయింటింగ్స్ ను కూడా స్కాన్ చేయించవచ్చు. ఫ్లాట్ బెడ్ స్కానర్ కాకుండా డ్రమ్ స్కానింగ్ చేయించండి. హై రిసల్యూషన్ తో చేస్తారు. చాలా వరకూ అసలు వాటికి దగ్గరగా వస్తాయి. సీ.డి. లో భద్రపరుచుకోవచ్చు కనుక ఒరిజినల్ పాడైనా నకలు ఉంటుంది. లక్ది క పూల్ ప్రాంతంలో చాలా ఆఫ్ సెట్ ప్రోసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అక్కడ స్కాన్ చేస్తారు. అపురూపమైన కళా ఖండాలను పదిల పరిచి ముందు తరాలకు అందించినపుడే వాటికి సార్థకత. అల్ ది బెస్ట్.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

బొమ్మలు చాలా బాగున్నాయండి.

Giridhar Pottepalem చెప్పారు...

జయ గారూ!
మీ 'చిత్రలేఖనాలు ' చాలా బాగున్నాయి. కలర్, ఆయిల్ పెయింటింగ్స్ కూడా పెట్టండి. మీ దగ్గర డిజిటల్ కెమెరా ఉంటే, దాంతో ఫొటో తీసి అయినా పెట్టొచ్చు. మీ స్కెచెస్ లో ఎక్కడా సంతకం, తేది లేవు. సాధారణంగా అర్టిస్టులు సంతకం, తేది లేకుండా ఆర్ట్ ని ముగించరు, బహుశా ఇవి మీ ఆయిల్ పెయింటింగ్స్ కి రఫ్ స్కెచెస్ ఏమో.
మీ నెక్స్ట్ పోస్ట్ లో మీ పెయింటింగ్స్ పెట్టండి.

- గిరిధర్ పొట్టేపాళెం

మరువం ఉష చెప్పారు...

oh wow, superb!!!!! ఆ ఉమర్ ఖయ్యాం, చివరి చిత్రం ఏదో స్పందనని పురికొల్పుతున్నాయి. బాగా వేసారు. ఇందులో నాకు ప్రవేశం తక్కువ కానీ ఏదో ప్రత్యేకత మాత్రం చూడగలుగుతున్నాను.

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా బాగున్నాయి. మీరి గీసిన బొమ్మలు అన్నీ పెట్టినా చూస్తాం, మీదే ఆలస్యం.

మీ కొత్త బ్లాగు శ్రీ శాంకరి ఈ రోజే చూసాను, మంచి మంచి పాటలు పెట్టారు, బాగుంది. అభినందనలు.

anagha చెప్పారు...

చా....................ల బాగున్నాయండి ,వాటికీ టైటిల్స్ పెట్టండి .

మాలా కుమార్ చెప్పారు...

బాగున్నాయి .
యస్. ఆర్ .రావు గారు చెప్పినట్లు చేసి , నీ పేంటింగ్స్ అన్ని పెట్టు.

మురళి చెప్పారు...

ల్యాండ్ స్కేప్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి అనిపిస్తోంది మీకు.. బాగున్నాయండి మీ డ్రాయింగ్స్..

Aparanji Fine Arts చెప్పారు...

బాగున్నాయి. కాలం కొంచెం ముందుకి జరపండి.

జయ చెప్పారు...

రావ్ గారు ధన్యవాదాలు. అవి చాలా పెద్ద పైంటింగ్స్ అందుకే నేను చేయలేదు.మీరన్నట్లు ట్రై చేస్తాను.

భస్కర రామిరెడ్డి గారు మీకు స్వాగతం. నా బొమ్మలు నచ్హినందుకు ధన్యవాదాలండి.

గిరిధర్ గారు మీకు స్వాగతం. అవి ఫొటోలు తీసి పెట్టాలి కదా! ఎప్పుడో తోచినప్పుడు ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాను. అదేవిటో నాకు సంతకం, డేట్ వేయటం అస్సలు అలవాటు లేదు. నేనొక ఆర్టిస్ట్ నని అసలే అనుకోను. కొన్ని సార్లు అలోచిస్తానుకూడా, ఈ పైంటింగ్ ఎప్పుడు వేసుకున్నానబ్బా! అని. ఆయిల్ పైంటింగ్స్ కి రఫ్ స్కెచ్ వేసే అలవాటు కూడా నాకు లేదు. ఆయిల్ పైంటింగ్స్ లో మిస్టేక్స్ ఒస్తే కరెక్ట్ చేసుకోవచ్హు కదా.
మీరు నిశితంగా ఇన్నివిషయాలు గమనించి నందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్స్.

జయ చెప్పారు...

ఉష గారు థాంక్యూ. నేను ఈ ఉమర్ఖయ్యాం & సాకీ వేసి చాలా కాలమే అయింది. ఎందుకో గాని దానిమీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువే. చివరిది అజంతా వెళ్ళినప్పుడు రఫ్ స్కెచ్ వేసుకొచ్హాను. తరువాత పూర్తి చేసుకున్నాను. మీకు నచ్హినందుకు ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ గారు, నా బొమ్మలు మీకు నచ్హినందుకు చాలా హాపీగా ఉంది. ఇవంటే ఏదో ఒక బుక్ లో ఉన్నాయి, పెట్టేసాను. మిగతావాటికి కొంచెం కష్ట పడాలి కదా. తప్పకుండా ప్రయత్నిస్తాను.
శ్రీ శాంకరి లో పాటలు బాగున్నాయి కదండి. అప్పుడప్పుడూ ఒకే చోట వినొచ్హు, చూడొచ్హు అని పెట్టుకున్నాను.

జయ చెప్పారు...

అనఘ గారు అంత సాగదీసి మరీ నచ్హాయా. మీరందరు బాగున్నాయి అంటే నాకు కూడా ఆనందంగానే ఉంది. మరీ అంత గొప్పగా లేవు. అది నాకు తెలుసు. థాంక్యూ.

అక్కా, ఆపన్లన్నీ నేనెప్పుడు చేయాలి. ప్రయత్నం చేస్తాను. థాంక్యూ.

జయ చెప్పారు...

నిజంగా నా డ్రాయింగ్స్ మీకు నచ్హాయా మురళీ గారు. థాంక్యూ. ప్రకృతి అంటే ఎవరు ఇష్ట పడరు చెప్పండి. నాకు వీలుకాదు గాని ఎప్పుడూ చెట్లల్లో పుట్టల్లో పడి తిరగాలనిపిస్తుంది. ఆకులో ఆకునై, పూవులో పువ్వునై అన్నట్లుగా. నేను, గోదావరి, కొబ్బరిచెట్లు తోటి ఒక కోనసీమ చిత్రం కూడా వేసుకున్నాను.(అదే మీ గోదావరి జిల్లా అన్నమాట).

అపరంజి గారు మీకు స్వాగతం మరియు ధన్యవాదాలు కాలం ముందుకు జరపడం అంటే? మోడ్రన్ చిత్రాలు వేయమంటారా.

Rani చెప్పారు...

chaala baavunnaayi :)
post more

జయ చెప్పారు...

రాణి, థాంక్యూ వెరీ మచ్.

Anil Dasari చెప్పారు...

మొదటిది చాలా బాగుంది - వపా బొమ్మంత. చివరిది చూస్తుంటే పాత కాలం జానపద సినిమాల సెట్టింగుల కోసం గోఖలే లాంటి కళాదర్శకులు వేసుకునే స్కెచ్‌లు గుర్తొచ్చాయి. ఎక్కడ గీశారది?

నేస్తం చెప్పారు...

నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అందరూ ఇంత బాగా బొమ్మలు వేసేస్తుంటే :)

భావన చెప్పారు...

జయా చాలా బాగున్నాయి మీ పిక్చర్స్.. మొదటి వుమర్ ఖయ్యాం చూస్తుంటే చిన్ను రుబాయి రాసెయ్యాలని వుంది :-)... చాలా బాగున్నాయి.

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

చాలా బాగ వేస్తున్నారు.

జయ చెప్పారు...

అబ్రకదబ్ర గారు చాలా థాంక్స్. మొదట వేసినది యువ లో ఒచ్హిన వడ్డాది పాపయ్య బొమ్మనే కాపీ కొట్టాను. యువలో ఒచ్హిన చాలా అమ్మయి బొమ్మలు కూడా కాపీ కొట్టుకున్నాను. కావాలంటే ఆ అమ్మాయిలందర్ని కూడా ఒక సారి పెడ్తాను. చివరి బొమ్మ అజంతా వెళ్ళినప్పుడు అక్కడి ఒక గుహను చూసి వేసుకున్నాను. ఇంటికి ఒచ్హాక పూర్తి చేసాను. మీ మొనాలిసా నే చాలా బాగుంది. మీ అసలైన మొనాలిసాని గుర్తు పట్టమన్నారుగా! కాని ఆ పనిచేయలేకపోయాను.

నేస్తం గారు, మీ నేస్తం బొమ్మ ఎంత ముద్దుగ ఉందో తెలుసా! అంతకంటే అందంగా ఎవరు వేయగలరు. ఆ బంగారు బొమ్మను పెట్టుకున్న మీరే వేయగలరు.

జయ చెప్పారు...

భావన గారు,థాంక్యూ. ప్లీజ్ నా ఉమర్ ఖయ్యాం మీద ఒక రుబాయి తప్పకుండా రాయాలి. వెంటనే చేస్తారు కదూ. కవితా శక్తి ఉన్న మీకు ఇదేమంత కష్టం కాదు.

విశ్వప్రేమికుడు గారు, మీరు మెచ్హుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరియైన విమర్శకుల చేతిలో పడితేనే ఏదైనా రాటుతేలుతుందని నా నమ్మకం.

cartheek చెప్పారు...

జయక్క అన్ని బొమ్మలు చాలా బాగున్నాయ్...

జయ చెప్పారు...

థాంక్యూ కార్తీక్.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చాలా బాగున్నాయి బొమ్మలు...నేర్చుకున్నారా లేక స్వతహాగానే వచ్చిందా..అంటే నా ఉద్దేశం ఇంప్రూవ్ మెంట్ కోసం ఎక్కడికైనా వెళ్ళారా అని...
మీరిలాంటి బొమ్మలు ఎన్ని పెట్టినా చూస్తామండీ...

జయ చెప్పారు...

థాంక్యూ శేఖర్, నేర్చుకోవాలని చాలా కోరిక. కాని ఏనాడు ఆ అవకాశం రాలేదు. కళాపోషకురాలవ్వాలని చాలా కోరికన్నమాట. తోచినప్పుడల్లా ఏదో పిచ్చిగా గీసుకోవటమే.

jnthy చెప్పారు...

chaala bavunnai me arts.

జయ చెప్పారు...

జయంతి గారు థాంక్యు.

తృష్ణ చెప్పారు...

నేనీ టపా మిస్సయ్యానండీ..అందుకని ..నచ్చకపోవటమేమిటండీ..అంత చక్కగా ఉంటేనూ...నేను వేసినవి చూసారా?

ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాల్సినవి...వీలయినప్పుడు చూడాలి..
కలర్ వి , ఆయిల్ పైంటింగ్స్ కూడా పెట్టండి మరి...

జయ చెప్పారు...

థాంక్యూ తృష్ణా! చూసారా, మీరు రాకపోతే నాకెంత దిగులో. మీ బొమ్మలు ఇప్పుడే చూసాను. చాలా రోజులైందనుకుంటా. మరినేనప్పుడు చూడలేదుకదా! చాలా బాగున్నాయి. నావి చాలానే ఉన్నాయి కాని, మెల్లగా వీలైనప్పుడల్లా అప్పుడు కొన్ని ఇంకెప్పుడో కొన్ని పెడ్తాను. అందర్నీ వరసపెట్టి మరీ మొహమాట పెట్టేయకూడదు కదా.

sowmya చెప్పారు...

వావ్ చాలా బాగ వేసారండీ బొమ్మలు. నేను టాగూర్ ది ఇదే బొమ్మ వేసాను, వీలైతే నా పోస్ట్ లో పెడతాను.
మీ ప్రావీణ్యతకి జోహార్లు...simply superb !

జయ చెప్పారు...

థాంక్యూ సౌమ్య గారు.

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

వావ్ ! బాగున్నాయి ...ఐతే మీరు డ్రాయింగ్ చెప్తారా అమాయకపు పిల్లలకి ?

జయ చెప్పారు...

వావ్..ఇన్నాళ్ళ తర్వాత, ఈ టపాకి కామెంట్. అనుకోకుండా ఎందుకో అన్నీ ఒకసారి చూసుకుంటూ వొచ్చి మీ కామెంట్ చూసాను. థాంక్యూ. మీ సుత్తి కంటేనా.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner