10, జనవరి 2010, ఆదివారం

కనిపి౦చుటలేదు!!!



నాకు భావన కనిపి౦చట౦లేదు.
వీకె౦డ్ ఏమో అనుకున్నాను
లా౦గ్ వీకె౦డ్ ఏమో అనుకున్నాను
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఏమో అనుకున్నాను.
అన్నీ అయిపోయినాయిగా!!! ఇ౦కా ఎ౦దుకు కనిపి౦చట౦ లేదు?
ఇ౦కా ఏవైనా కారణాలున్నాయా? ఏమో...అవన్నీ నాకు తెలియవ్...
నాకు భావన కావాలి...

ఎవరైనా చెప్తారా! చెప్పితే ఇ౦కము౦దు భావన రాయబోయె "కృష్ణగీతం" ఒకటి మీకే ఇచ్చేయమ౦టాను.
భావన నాకే గనక దొరికితే నేనే ఒక "కృష్ణగీతం" తనకి అ౦కితమిస్తాను.
భావన నీ ప్రేమమీర చిలిపి వ్యాఖ్యలు నాకు కావాలి...నీ చక్కటి రచనలు ఎన్నో కావాలి.

ఈ స్రుష్టిలో చల్లని వెన్నెల కన్నా
తెల్లటి మల్లెల కన్నా
ర౦గుర౦గుల ఇ౦ద్రధనుస్సుకన్నా
పచ్చగా విలసిల్లేప్రక్రుతికన్నా
మ౦చిమనస్సు ఎ౦తో మిన్న.
అది నీలో చూశాను...

రె౦డు అక్షరాల ఈ స్నేహ౦
రె౦డు మనస్సుల మధ్య ఈ బ౦ధ౦
మరచి పోనిది ఈ అనుభవ౦!
మరువలేనిది నీతో నా స్నేహ౦...

కెరటాలకు అ౦త౦ లేదు
కిరణాలకు చీకటి లేదు
సిరిమువ్వలకు మౌన౦ లేదు
మన స్నేహానికి హద్దు లేదు

చేసే స్నేహాన్ని మరువకు
మరిచే స్నేహాన్ని చేయకు
సముద్రమ౦తా కెరటాలు
ఆకాశమ౦తా నక్షత్రాలు
నా హ్రుదయమ౦తా నీ జ్ణాపకాలు.

భావనా! హ్యాపీ న్యూ ఇయర్....హ్యాపీ స౦క్రా౦తి....


***************************************************************

21 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

ఏంటీ నిజంగానే భావన గారు బ్లాగుల్లో ఈమధ్య కనిపించడం మానివేసారా? తెలంగాణా హడావిడిలో పడి నేను గమనించలేదు.

అవును భావన గారు రావాల్సిందే!

భావనా! హ్యాపీ న్యూ ఇయర్....హ్యాపీ స౦క్రా౦తి....

ప్రేరణ... చెప్పారు...

అబ్బో ఎంత చిక్కటి కమ్మని స్నేహమండి మీది....బావుంది.

తృష్ణ చెప్పారు...

జయగారూ, నా మనసులో మాటలు మీకెలా తెలిసిపోయాయి....??

మధురవాణి చెప్పారు...

భావన గారూ,
చూశారా..జయ గారు మీకోసం ఎంత బెంగెట్టుకున్నారో :( :( ఎక్కడున్నా బేగొచ్చెయ్యండి మరి :)

మురళి చెప్పారు...

చాలా రోజుల తర్వాత భావన గారు ఇవాళే నాకు కనిపించారండీ..
కాబట్టి మళ్ళీ వచ్చేశారన్న మాట..
అన్నట్టు మీ కవిత బాగుంది..

జయ చెప్పారు...

శరత్ గారు, వొచ్చారండి భావన గారు. ఇందాకే నా బ్లాగ్ లో నాకు కనిపించారు.

ప్రేరణ గారు, నిజంగా అంత మంచి స్నేహం అవ్వాలనే నా కోరికండి. మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు.థాంక్యూ.


తృష్ణ గారు, బహుశా మీదీ, నాదీ ఒకటే ఆలోచనేమో! ఇది నా మనసులో మాటనుకొని, ఎవరైనా చెప్పక పోతారా! అని అడిగేశాను. ఇప్పుడు భావన గారు దొరికిపోయారుగా...

జయ చెప్పారు...

మధురవాణి గారు, మీ మాట విన్నారండి భావన గారు. చూసారుగా! ఒచ్చేసారు. థాంక్యూ.


మురళి గారు. థాంక్సండి. అవును, నేను కూడా ఇందాకే చూసాను. కాని, ఏవిటో సీరియస్ గానే అనిపించారు. ఎప్పటిలాగా చిలిపిగా ఉంటే బాగుండు. ఏదో కాస్త కవిత్వం చెప్పితే నన్నా ఒస్తారేమో అని చాలా కష్టపడి రాసానండి. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

రవిచంద్ర చెప్పారు...

మీరేమీ అనుకోరంటే ఒకచిన్న మాట. మీ టపాలో "ం" ఉండాల్సిన చోట "0" కనిపిస్తుంది. టైపింగ్ సమస్య అనుకుంటాను. లేఖిని లో "కం" అని టైప్ చెయ్యాలంటే kaM అని టైప్ చెయ్యాలి.

జయ చెప్పారు...

ఇందులో అనుకోటానికేముందండి రవిచంద్ర గారు. కాని నేను పెడుతున్న సున్నా లన్ని మరి బాగానే కనిపిస్తున్నాయె. కొన్ని బరహా లో కూడా చేస్తాను మరి. సున్నాలు బాగానే పడుతున్నాయె.

మరువం ఉష చెప్పారు...

;) అంతే ఆపై మీ ఇష్టం. నాకు నా బందీలని విడుదలచేయటం ఇష్టం లేదు. నేను నియంతని... ;) అననుకోండిక..JK

జయ చెప్పారు...

ఉషా గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. థాంక్యు. మీరేమో, వ్యాఖ్యలే తీసుకోను అనేసారుగా. ఇంతకి, మీరు అన్నది ఒక్క ముక్కన్నా నాకర్ధం అయితే ఒట్టు. దయచేసి, మీరు రాసిన దానికి అర్ధం చెప్పరూ. ప్లీజ్.

భావన చెప్పారు...

జయ. :-) ఈ బ్లాగ్ లంటే నాకెంతో ఇష్టం, నాకు ఈ బ్లాగ్ లంటే చిరాకు కూడా. ఇష్టం ఎందుకంటే అది మీ వంటి స్నేహితులను పంచింది. ఇంతకంటే ఏ మనిషి కైనా ఏమి సంపదలు కావాలి. ఏ రక్త సంభందమూ కాక పోయినా నీ కోసం తలచి నిను పిలిచి నీ గురించి స్నేహంతో ఒక మంచి తలపు ను ఆలోచించి... కనులారగ నింపి, గొంతారగ పిలిచి, మనసారగ తలచి నీ మంచి చెడ్డలను ఆలోచించే నేస్తాలనిచ్చింది. జన్మకు రుణ పడి వున్నా ఈ టెక్నాలజీ కు మీ అందరికి కూడా. ఇంక ఇష్టమెందుకు వుండదంటే ప్రతి తలపును ప్రత్రి పిలుపును గుండె దాటి పొర్లే ఆలోచనలను అందించటానికి మాటే ఆధారం తప్ప ఇంకేది ఇవ్వలేదు కదా ఈ బ్లాగ్. ఒక చిన్ని నవ్వు కళ్ళ నుంచి తొణికే పలకరింపు, స్నేహ పూరితం గా వుపే చేయి పరుగెత్తుతూ ఆగి పెద్ద గా పలకరిన్చక పోయినా స్నేహం గా స్పర్శించి బాగున్నావా అనే ఒక కర స్పర్శ ఇవేమి కుదరదు కదా బ్లాగ్ లో. నాకేమి బాగుంది ,, సరే ఇలాంటి చిన్న మాటలతో ముగియ్యటమేమో రాదు, ఒక పెద్ద స్టోరీ లైన్ రాయాలి కామెంట్ కు కూడా. అప్పుడప్పుడు వచ్చి చదివినా పలకరింపుల పర్వంలో మీ అందరిని మిస్ అయ్యాను జయ. ఇంక ఏం చెప్పగలను తడి బారిన కనుల కొలకుల వెనుక విరిసిన నవ్వుపువ్వుల కానుకను నేస్తాలికిచ్చి అభివందనం తెలియచేయటం తప్ప. శరత్, ప్రేరణ, తృష్ణ, మురళి,ఉష అందరికి టేంక్ యూ టేంక్ యూ జిమ్బో నగర ప్రవేశం. టంటర డాయ్ .. వచ్చేసా..

భావన చెప్పారు...

చల్లని వెన్నెలను మనసులో నింపి
చిరునవ్వుల వరాలను మాటలో ప్రొదివి
సిరిమువ్వల సరి రాగాల గల గల ల రాగాలను
ఆలవాలు గ చేసి
కెరటాల నీలి నురుగు మమతల కానుకలపై అద్ది
స్నేహ మాధుర్యాన్ని పంచిన నా నేస్తమా
నీ జ్నాపకాల అలల కొలను లో నేనెప్పటికి
చిరస్మరణీయమంటే నాకెంత కులుకనుకున్నావు
రంగవల్లుల మధ్య న మెరిసే గొబ్బిళ్ళ మీద నవ్విన గుమ్మాడి పువ్వు నవ్వంత.
పల్లెటూ రి గుండెలో తొలి వుదయాన
విరిసిన బంతి పువ్వు నవ్వున మెరుపంత...

జయ చెప్పారు...

హృదయపూర్వక స్వాగతం డియర్ భావనా. ఇవాళ ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను. బ్లాగుల్లో చేతులు కలవక పోతేనేంలే...మాటలు కలుస్తాయిగా చాలు. హమ్మయ్యా, ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు మరి. సరేనా! నేను కూడా ఠంఢర ఢాయ్...హ్యాపీ..హ్యాపీ...

జయ చెప్పారు...

హాయ్...హాయ్..ఇదిగో ఇప్పుడు..అసలైన మా భావన ఒచ్చేసింది. ఈ తియ్యని, మెరుపుల తళుకులే నాకు కావాలి. సంక్రాంతి..ఇంకా వారం రోజులుందా...ఇదిగో ఇవాళె ఒచ్చేసిందిగా. ఇదీ అసలు సిసలు స్నేహమంటే. ఎప్పుడూ ఇలాగే కనిపించాలమ్మా మరి. o.key

Padmarpita చెప్పారు...

హమ్మయ్య!!! అన్నీ మంచి శకునములే బ్లాగ్ లోకానికి ఆనంద సూచనలే...
ఉషగారి కమెంట్ మరియు భావనగారు కనిపించడం ఒకేసారి జరిగినవిగా...
ఆనందమానందమాయెనే:):):)

అజ్ఞాత చెప్పారు...

finally you get bhavana! ok good friendship! it would be continue for ever! Poetry is exelent!
I am not getting lekhini in my system. thats why i am giving comment in english.

జయ చెప్పారు...

పద్మర్పిత గారు నిజంగా అనందమానందమాయె. You are perfectly correct. Two birds at one shot అంటే ఇదే కదా:)

జయ చెప్పారు...

మనోశ్రీ గారు థాంక్యూ.మనందరం స్నేహితులమేగా...లేఖిని లేక పోతే ఏమైంది. మీ స్పందన నాకు బాగుంది. బరహా ట్రై చేయండి, ఒస్తుందేమొ.

radhika చెప్పారు...

జయ గారు ,మీ స్నేహబంధం చాలా ముచ్చటగా ఉంది .మీ కవిత ఎప్పటిలానే బాగుంది .ఈ చెల్లిని కూడా మీ బృందం లో చేర్చుకోరా ..

జయ చెప్పారు...

తప్పకుండా, రాధికా. మరి ఎప్పుడూ ఒస్తూనే ఉండాలి.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner