శ్రీ సదాశివ బ్రమ్హేందృల వారు 1560 లో మధురై లో జన్మించారు. శ్రీ సోమసుందరం గారు, శ్రీమతి పార్వతి ఇతని తల్లితండ్రులు. శ్రీ తిరువశినల్లూర్ రామసుబ్బశాస్త్రి గారు ఇతని సంగీత గురువు. కంచి పీఠం లో శ్రీ శివేంద్ర సరస్వతి గారు ఇతని యొక్క తాత్విక గురువు. పరమహంస ముద్ర తో 23 కీర్తనలు రచించి స్వరపరిచారు. ఇవి తాత్విక పరిజ్ణానం తో, శ్రీ కృష్ణుని స్తుతిస్తూ, తత్వబోధనలను, లీలామృతాన్ని పంచిపెట్టే కీర్తనలు. ఈ కీర్తనలే సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.
భారతీయ సంగీత ప్రపంచంలో ఈ కీర్తనలు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎంతో మంది సంగీత వేత్తలు వీటిని ఆలాపించారు. నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కీర్తన నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. అది "స్మరవారం వారం" కీర్తన. శ్రీ బాలమురళీ కృష్ణ పాడిన ఈ కీర్తన మీరు కూడా వినండి. శ్రీ జేసుదాస్ ఇదే కీర్తనని ఒక మళయాళం సినిమా కి పాడారు. అది చాలా పాపులర్ అయ్యింది.
స్మరవారం వారం
రాగం: కాపి
తాళం: ఆది
స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు
భాష: సంస్కృతం
పల్లవి
స్మర వారం చేతహ
స్మర నందకుమారం (స్మర)
చరణం 1
గోప కుటీర పయో ఘృత చోరం
గోకుల బ్రందావన స౦చార౦ (స్మర)
చరణం 2
వేణురవామృత పానకిశోరం
విశ్వ స్థితిలయ హేతువిచారం (స్మర)
చరణం 3
పరమ హంస హృత్పంజర కీరం
పటుతర ధేను బక సమ్హారం (స్మర)
|
ముద్ర: ఫరమహంస
శ్రీ సదాశివ బ్రమ్హేంద్ర స్వామి వారి కీర్తనలు:
1. ఆనంద పూర్ణ _ మద్యమావతి
2. భజరే గోపాలం _ హిందోళం
3. భజరే రఘువీరం _ జోంపురి
4. భజరే యదునాథం _ పిలూ
5. బ్రహ్మై వాహం _ నాదనామక్రియా
6. బ్రూహి ముకుందేతి _ కురింజి
7. చేతహ శ్రీ రామం _ కేదార గౌళ
8. చింతా నాస్తికిల _ సహానా
9. గాయతి వనమాలి _ దుర్గ
10. ఖేలతి మమ హ్రిదయే _ అఠాణా
11. ఖేలతి పిణ్డాణ్డే _ సుద్ద ధన్యాసి
12. క్రీడతి వనమాలి _ సిందు భైరవి
13. క్రిష్ణ పాహి _ మద్యమావతి
14. మానస సంచరరే _ శ్యామ
15. నహిరే నహి _ మోహనం
16. పిబరే రామరసం _ యమన్ కల్యాణి
17. పూర్ణం బోధోహమ్ _ కల్యాణి
18. ప్రతివారం వారం _ తిలంగ్
19. సర్వం బ్రహ్మమయం _ఝింజొటి
20. స్మరవారం వారం _కాపి
21. తత్వ జీవత్వం _ కీరవాణి
22. త౦గ తరంగే గ౦గే_ కుంతల వరాళి
23. నరహరి దేవ _ యమన్ కల్యాణి
************************************************************************
16 కామెంట్లు:
చాలా మంచి టపా. మిగిలిన కీర్తనలు కూడా రాసారు.బావుందండీ.
బాగుంది జయ కీర్తన. నేనైతే ఎప్పుడూ వినలేదు ఈ కీర్తన, అంటే నా సంగీత జ్నానం తక్కువేలే. అన్ని కీర్తన లు రాసేరు. సీడీ లు దొరుకుతాయా? ఎక్కడో ఈయన విగ్రహం చూసిన గుర్తు నాకు.
మంచి కీర్తనని దానితో నాకున్న జ్ఞాపకాలని గుర్తు చేసారు. తమిళనాడులో చదివేటప్పుడు..అక్కడ రోజూ ఉదయం సాయంత్రం అందరం కలిసి దైవప్రార్థన చేయాలి..అందులో రోజూ రెండుపూటలా ఈ కీర్తన పాడించేవారు..అప్పడు ఇది ఎవరు వ్రాసిందో మాత్రం తెలియదు.
సంక్రాంతి శుభాకాంక్షలు.
జయ గారూ !
మంచి కీర్తన. మంచి పరిచయం. మన కర్ణాటక సంగీతాన్ని దాదాపుగా మరచి పోతున్న ఈ తరుణంలో ఇలాంటి పరిచయాలు చాలా చాలా అవసరం. మీ కృషి అభినందనీయం. కొనసాగించండి.
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
బాగుంది పరిచయము . ఏదో చిన్నపుడు నేర్చుకున్నానే కాని ఏదీ గుర్తులేదు .
సంక్రాంతి శుభాకాంక్షలు .
రామదాసుకీర్తనలూ అవీ విన్నానుకానీ ఇవివినలేదు .కీర్తన బాగుంది .
మీకు ,మీ కుటుంభసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు .
ఎపుడూ వినలేదండి. తెలియదు కూడా. నాకు తెలియని ఒక ప్రముఖ వాగ్గేయకారుని గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ధన్యవాదములు.
మంచి కీర్తనని పరిచయం చేశారు జయగారు.. నా భక్తి ఫోల్డర్లో దాచేసుకున్నాను :-)
మీకూ, మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :-)
వినలేదండి..చాలా రేర్ కలెక్షన్. చాలా బాగుంది.
http://www.andhrabharati.com/kIrtanalu/sadASiva/index.html
థాంక్యూ తృష్ణా.
భావనా థాంక్యూ. సిడీలు దొరుకుతాయి. మొత్తం కృష్ణ భక్తి గీతాలే.
సిరిసిరిమువ్వ గారు, థాంక్యూ. నాక్కూడ ఈ కీర్తనతో చిన్నప్పటినుంచి చాలా పరిచయం ఉంది. మిగతా వాటిలో మూడు, నాలుగు తెలుసు కాని అన్నీ రావు.
రావ్ గారు, థాంక్యూ వెరీ మచ్. ఈ కీర్తనలు నాకు చాలా ఇష్టం. రేడియో లో పొద్దున్నే భక్తిరంజని లో ఎప్పుడూ ఒచ్చేవి. ఎక్కువ కీర్తనలు బాలమురళీకృష్ణ వే వొచ్చేవి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
అక్కా, థాంక్యూ. మీ అందరికి కూడా నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
రాధిక గారు ఈ కీర్తనలు విన్నా కొద్దీ వినాలనిపిస్తాయి. చాలా బాగుంటాయి. మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు.
శిశిర థాంక్యూ. ఇందులో పిబరే రామరసం లాంటివి అందరికీ తెలిసినవే. వాటి మాధుర్యం లో మనం రచయిత ని పట్టించుకోము.అంతే.
శ్రీనిక గారు, ఇవన్ని మీరు విన్నారు. భజరే గోపాలం, ఖేలతి మమ, మానస సంచరరే...ఇవన్నీ విన్నారు కదూ! గుర్తుకొస్తున్నాయా...చాలా చక్కటి కీర్తనలు.
అజ్ఞాత గారు, థాంక్యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన లింక్ చూసాను. కాని, నాకు డీకోడ్ చేయటం రాదే మరి. ఎలా?
సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనల్ని తెలుగువారికి అందించడంలో బాలమురళి కృషిని గుర్తు చేసుకోవాలి. విజయవాడ రేడియోలో ప్రొడ్యూసరుగా ఉండగా అనేక కీర్తనల్ని తానే పాడి రికార్డు చేశారు. ఇవి తరచూ భక్తి రంజనిలో వస్తుండేవి. తరవాత అనేక రికార్డుల్లోనూ కచేరీల్లోనూ కనీసం ఒక్క కీర్తనైనా పాదుతుండేవారు. శంకరాభరణం సినిమాలో వినిపించే మానస సంచరరే, పడమట సంధ్యారాగంలో పిబరే రామరసం కూడా సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలే.
సారీ కొత్తపాళీ గారు. ఇన్నిరోజులు గమనించలేదు. అవునండి, బాలమురళీకృష్ణ పాడిన ఈ కీర్తనలు చాలా ప్రసిద్ధి. బ్రమ్హేంద్ర వారి కీర్తనలు మొత్తం లిస్ట్ ఇచ్చానండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి