స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా! ఆ వీరుల త్యాగఫలాన్ని కున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యా, ద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాడవోయి భారతీయుడా--ప్రభోధగీతం మనం తప్పని సరిగా ఈ గణతంత్రదినోత్సవాలలో తలుచుకోవాలనిపించింది.
ఈ పాటవింటే మనలో తిరిగి ఆ సహృదయత, మానవత, సోదరభావం తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. ఈ పండుగ సమయంలో సైనికుల త్యాగనిరతిని కూడా శ్లాంఘించాలి. శ్రద్ధాంజలి ఘటించాలి...ఆ కోరిక తోనే ఈ క్రింది గీతాన్ని కూడా ఇవాళ తలచుకుందామనిపించింది.
శ్రీ ప్రదీప్ హి౦దీ లో వ్రాసిన ఈ దేశభక్తి గీతానికి , సి. రామచ౦ద్ర స్వరకల్పన చేసారు. చైనా-భారత యుద్ధ౦ ముగిసిన కొన్ని నెలలకు, డిల్లీ లోని, రామలీలా మైదాన౦ లో జనవరి 26 న గణత౦త్ర దినోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలలో పద్మశ్రీ లతామ౦గేష్కర్, అప్పటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ సముఖ౦ లో ఈ గీతాన్ని ఆలాపి౦చారు. ఆ సమావేశ౦ లోని ప్రతిఒక్కరూ చలి౦చి క౦ట నీరు పెట్టిన పాట ఇది. లతా ఈ పాట సౌ౦డ్ ట్రాక్ ని నెహ్రూకి బహుమతిగా ఇచ్చారుట. ఇ౦దులోని గాయకులకు, వాయిద్యకారులకు, ఇతర ఏ టెక్నీషియన్స్ కి గాని ఎటువ౦టి రెమ్యూనరేషన్ చెల్లి౦చలేదు. కాని తరువాత ఈ గీత రచయిత కి మాత్ర౦ కొ౦తమొత్తాన్ని అప్పజెప్పారు. దానిని ఈ రచయిత చైనా యుద్ధ౦ లో మరణి౦చిన సైనికుల భార్యలకి విరాళ౦ గా ఇచ్చారు.
ఈ గీత౦ ప్రతి ఒక్కరిని భావావేశాలకు లోను చేసి, నరనరాన దేశభక్తి ప్రవహి౦చేట్లు చేస్తు౦ది. ఎప్పటి కీ మరువ లేని ఆ అమర వీరుల త్యాగాన్ని మనకి అణుఅణువునా ప్రభోదిస్తు౦ది. దేశభక్తి అ౦టే ఏమిటో మనకి తెలిపి స్పృహ లోకి రప్పిస్తు౦ది.
'యె మెరె వతన్ కి లోగో, జర ఆంఖ్ మె భర్లో పానీ....జొ సహేద్ హుయె హై ఉనకీ, జర యాద్ కరో ఖుర్బానీ'....
జయ జయ జయ హే...
జై హి౦ద్!
ऐ मेरे वतन् के लोगों
तुम् खूब् लगा लो नारा
ये शुभ् दिन् है हम् सब् का
लहरा लो तिरंगा प्यारा
पर् मत् भूलो सीमा पर्
वीरों ने है प्राण् गँवा
कुछ् याद् उन्हें भी कर् लो
जो लौट् के घर् न आये
ऐ मेरे वतन् के लोगों
ज़रा आँख् में भर् लो पानी
जो शहीद् हु हैं उनकी
ज़रा याद् करो क़ुरबानी
जब् घायल् हु हिमालय्
खतरे में पड़ी आज़ादी
जब् तक् थी साँस् लड़े वो
फिर् अपनी लाश् बिछा दी
संगीन् पे धर् कर् माथा
सो गये अमर् बलिदानी
जो शहीद्॥।
जब् देश् में थी दीवाली
वो खेल् रहे थे होली
जब् हम् बैठे थे घरों में
वो झेल् रहे थे गोली
थे धन्य जवान् वो आपने
थी धन्य वो उनकी जवानी
जो शहीद्॥।
को सिख् को जाट् मराठा
को गुरखा को मदरासी
सरहद् पे मरनेवाला
हर् वीर् था भारतवासी
जो खून् गिरा पर्वत् पर्
वो खून् था हिंदुस्तानी
जो शहीद्॥।
थी खून् से लथ्-पथ् काया
फिर् भी बन्दूक् उठाके
दस्-दस् को एक् ने मारा
फिर् गिर् गये होश् गँवा के
जब् अन्त्-समय् आया तो
कह् गये के अब् मरते हैं
खुश् रहना देश् के प्यारों
अब् हम् तो सफ़र् करते हैं
क्या लोग् थे वो दीवाने
क्या लोग् थे वो अभिमानी
जो शहीद्॥।
तुम् भूल् न जा उनको
इस् लिये कही ये कहानी
जो शहीद्॥।
जय् हिन्द्॥। जय् हिन्द् की सेना
जय् हिन्द् जय् हिन्द् जय् हिन्द्
|
*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
5 కామెంట్లు:
నాకెంతో ఇష్టమైన పాట. ఇదివరకు ఇంచు మించుగా ప్రతీ రోజూ వినేదాన్ని. ఈ మధ్యన బిజీ ఐపోయి(అంటే ఈ ఐదు నెలలు కాకుండా)పాటలు వినడం బాగా తగ్గిపోయింది.చాలా రోజులకి మళ్ళీ మంచి పాట వినిపించారు జయగారూ. థాంక్ యు.
మనసును ద్రవింపచేసే పాట ఇది .
జీవని గారు మీరు చెస్తున్న సేవలమోఘం. మీది ఒకరి సలహాలు తీసుకొనే పరిస్థితి కాదు. ఎన్నో తెలిసిన వారు మీరు. మీకు నా అభినందనలు.
ప్రణీత స్వాతి, చాలా కాలం తరువాత పునర్దర్శనానికి ఇదే నా స్వాగతం. థాంక్యూ.
అక్కా నిజంగా ఈ గీతాలను ఇష్టపడని వరెవ్వరూ ఉండరు. థాంక్యూ.
jaya gaaru chala baaga raasaru..naaku dialogues raayadam lo help cheyyaruu
అయ్యబాబోయ్! మీ లాంటి ఫిల్మ్ రైటర్స్ కి నేను హెల్ప్ చేయటమేమిటండి బాబు. తమాషా చేయటానికి నేనే దొరికానా మీకు...
నా బ్లాగ్ కొచ్చిన మీకు థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి