18, జూన్ 2010, శుక్రవారం

ఆమెన్......



O Lord, Jesus Christ, the Son of God
have mercy on us!


ఈ మధ్య అనుకోకుండా ఒక చర్చ్ కెళ్ళాను. అప్పుడే నా గత స్మ్రుతులు గుర్తుకొచ్చాయి. ఎందుకో ఒకసారి నా ’క్రైస్తవ మతం’ గురించి చెఫ్ఫాలనిపించింది....నా చిన్నప్పటి జ్ఞాపకాలు తరుముకొచ్చేసాయి.

నా చిన్నప్పుడు నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో. అది మామూలు క్రిస్టియన్ స్కూల్ కాదు. ప్రొటెస్టెంట్ స్కూల్. పూర్తిగా మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇచ్చే స్కూల్ అది. అక్కడ స్కూల్ లోనే ఒక చాలా పెద్ద, ఎంతో అందమైన చర్చ్ ఉండేది. ప్రతిరోజు పొద్దున చర్చ్ లోనే మా ప్రేయర్. అన్ని స్కూళ్ళల్లో లాగా బయట గ్రౌండ్ లో మామూలు పద్ధతిలో ప్రేయర్ ఉండేది కాదు. అందరమూ తప్పని సరిగా ఒక గంట సేపు మోకాలి మీద కూర్చొని ప్రేయర్ చేయాల్సిందే. ఆ చర్చ్ లో జీసెస్ క్రైస్ట్ జీవిత చరిత్రకు సంబంధించి ఎన్నో పైంటింగ్స్ ఉండేవి. ప్రతిరోజు ఆ చిత్రాలు చూసే నా మనసు నిండా క్రీస్తు జీవితమే నిండిపోయేది.

అందరికీ ఏదో సహాయం చేయాలి అంటూ ఎటో వెళ్ళిపోతూఉండేదాన్ని. రోడ్డుమీద చిన్నకుక్కపిల్ల కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. ఎక్కడ ముసలివాళ్ళు కనిపించినా వెళ్ళి కాళ్ళో, చేతులో వత్తేదాన్ని. చిన్నపిల్లలకి భక్తి గీతాలు నేర్పించేదాన్ని. ఇంట్లో ఏ మందులు కనిపించినా ఎవరోవొకరికి వద్దన్నా వినిపించుకోకుండా ఇచ్చేసేదాన్ని. ఇలా ఎంత సేవ చేసేదాన్నో ఇప్పుడు చెప్పటం చాలా కష్టం:)

మా మదర్ సుపీరియర్ ఎక్కడ కనిపించినా వెంటనే మోకాలిమీద కూర్చొని క్రాస్ చేసుకొని, ఆమె దీవించే వరకు కదిలేదాన్ని కాదు. ఆవిడకు కూడా నేనంటే చాలా అభిమానమే. ఎన్నో ముఖ్యమైన పనులే నాకు చెప్పేవారు. నేను చాలా బాధ్యత గలదాన్ని అని ఎప్పుడూ ఎంతో మెచ్చుకునేవారు.

చిన్నప్పుడు మనకు కొంత మంది టీచర్ల మీద ప్రత్యేక అభిమానం ఉంటుంది కదా!!! అలాగే అప్పుడు నాకు మా క్లాస్ టీచర్, సిస్టర్ ఫిలోమినా అంటే చాలా పిచ్చి ప్రేమ ఉండేది. ఆమె కేరళ నుండి వచ్చింది. ఒక్క రోజు ఆమెని చూడకపోయినా ఎంతో బాధపడిపోయేదాన్ని. ఆమె మా అందరికీ ఎప్పుడూ చిన్న చిన్న బైబిల్స్, రోజరీ లు బహుమతిగా ఇచ్చేది. అవన్నీ ఎంతో ప్రాణప్రదంగా దాచిపెట్టుకొనే దాన్ని. ఆమె చెప్పేకథలు నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించేవి. జీసెస్ అంటే చాలా ఇస్టపడడం మొదలుపెట్టాను. మాకెప్పుడూ "టెన్ కమాండ్మెంట్స్" గురించి ఎక్కువగా చెప్పేది. రాత్రి బైబిల్ చదవకుండా ఎప్పుడూ పడుకోలేదు. నా దిండు కింద అన్ని సైజులల్లో బైబిల్స్ ఉండేవి. దిండు అడ్డదిడ్డంగా ఉండేది. సరిగ్గాపడుకోటానికే కుదిరేది కాదు. నాదిండు ఒక ఇండియా మాప్ లాగా ఉండేది.

రకరకాల క్రాస్ లు మా ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దాచిపెట్టేదాన్ని. పాపం ఒకసారి మా అమ్మ వత్తులడబ్బాలో చూసుకుంటే అందులో చక్కటి తెల్ల రాళ్ళతో మెరిసిపోయే క్రాస్ కనిపించింది. మా నాన్నగారి పర్స్ లో కూడా క్రాస్ పెట్టాను. అది నల్లటి క్రాస్. పాపం, అది తేలనుకొని భయపడ్డారుకూడా. అప్పుడప్పుడూ నన్ను మందలించేవారు. మా పనమ్మాయి కి మంచి రంగురంగుల పూసలతోటి, అందమైన క్రాస్ ఉన్న రోజరీ ఒకటి ఇస్తే ఎంతో మురిసిపోతూ వేసుకొంది. కాని మర్నాడు, ఆ రోజరీ లో క్రాస్ కి బదులు అమ్మవారి బొమ్మ ఉంది. వాళ్ళమ్మ కోప్పడి లాకెట్ మార్చేసిందిట. ఇంక, బజార్ లో రంగురంగుల కొవ్వత్తులు కనిపిస్తే అవి కొనిపించేదాకా వదిలేదే లేదు. బుక్స్ లో నెమలిఈకలు దాచి వాటికి మేత వేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నేనైతే మేతతోపాటు రకరకాల క్రాస్ లు కూడా పెట్టేసేదాన్ని. అవన్నీ బాగా ఒత్తుకొని క్వాటర్లీ ఎక్జామ్స్ కల్లా నా బుక్స్అన్నీ చినిగిపోయేవి.

ఏదైనా పండగ వస్తే ఇంట్లో నాతోటి పెద్ద గొడవే జరిగేది. నాకు తెల్లటి పెద్ద లాంగ్ ఫ్రాక్ మాత్రమే కొనమనేదాన్ని. అన్ని వైట్ బట్టలే వేసుకోటం మొదలుపెట్టాను. ఇంట్లో ఏ పూజా పునష్కారం జరిగినా నేను ఆబ్సెంట్ అవటం మొదలుపెట్టాను. ఇంట్లో గనుక కోపం చేసి బలవంతాన కూచోపెడితే ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మోకాలిమీద కూర్చొని, నెత్తిమీద తెల్లటి కాపో, కర్చీఫో, టవలో కప్పుకొని క్రాస్ చేసుకుంటూ, కళ్ళుమూసుకొనే ఉండేదాన్ని. అది సత్యనారాయణ వ్రతమైనా సరే ఇంకే పూజైనా సరే. నా పోస్ట్యర్ మాత్రం అదే. అంతేకాదు, అయిన దానికి కానిదానికి క్రాస్ చేసుకుని ఆమెన్ చెప్పుకొనే దాన్ని. నా పేరు సిస్టర్ ఫిలోమినా గా మార్చమని ఒకటే గొడవ చేసే దాన్ని.

అప్పుడు నాకో కోరిక ఉండేది. అదేంటంటే ఎప్పటికైనా సరే ఒకసారి రోమ్ వెళ్ళాలి, పోప్ ని చూడాలి అని. పోప్ ని చూడటం జీవితంలో చాలా పెద్ద అచీవ్మెంట్ అని నాకు గొఫ్ఫ నమ్మకం. క్రిస్మస్ కైతే మా ఫ్రెండ్స్ ని పోగేసి "మాస్" చేసేదాన్ని. బయట తలుపుకి పొడగాటి సాక్స్ వేలాడేసి, మర్నాడు శాంతాక్లాజ్ ఇచ్చిన బహుమతుల కోసం తెగవెతుక్కొనేదాన్ని. అమ్మ వెంటపడి మరీ మంచి కొత్త డ్రెస్ కొనిపించుకొనేదాన్ని. న్యూఇయర్ కి కూడా ఇలాగే చేసేదాన్ని. ఇంక గుడ్ ఫ్రైడే వచ్చిందంటే, మన ఇంట్లో చచ్చిపోయినవాళ్ళెవరు, ప్రేయర్ చేద్దాం రా, ఇవాళంతా మనం ఏడవాలి...అని మాఅమ్మ వెంట పడి పిచ్చి తిట్లుతినేదాన్ని. ఈస్టర్ రోజైతే ఇంటినిండా రకరకాల కొవ్వొత్తులు వెలిగించి పెట్టేసేదాన్ని.

మెల్లిగా ఇంట్లో వాళ్ళకి నా సంగతి అర్ధమైపోయింది. మాది అసలే నిప్పులు కూడా కడిగే శుద్ధ బ్రాహ్మణ కుటుంబం.
ఒకసారి మా అమ్ముమ్మ వచ్చింది మా దగ్గరికి. మా అమ్ముమ్మ దేవుడికి పూజ చేసుకుంటూ, హారతిచ్చే సమయానికి నన్ను పిలిచి మంగళ హారతి పాడమని అడిగింది. నేను వెంటనే మోకాలి మీద కూర్చొని, ఎంతో భక్తితో కళ్ళుమూసుకొని, క్రైస్తవ భక్తి గీతం పాడడం మొదలుపెట్టాను. ఒక్కసారిగా మా అమ్ముమ్మ అదిరిపోయింది. నా చేయిపట్టి గుంజుకోని పోయి, అదేవిటే, పిల్లని కిరస్తాని దాన్ని చేస్తారా ఏవిటి. దాని సంగతి అసలు ఎవరైనా గమనిస్తున్నారా? అని మా అమ్మను నిలదీసింది. ఈ పిల్లని ఇంకో బళ్ళో వేస్తారా, లేకపోతే నేను తీసుకెళ్ళిపోనా? అని మా నాన్న గారి వెంట పడింది.

అప్పటి వరకు నా వ్యవహారం ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడింక తప్పలేదు పాపం. నన్ను ఆ ఊరినుంచి మార్చేసి వేరే రెసిడెన్సియల్ స్కూల్ లో వేసేసారు. టెన్త్ క్లాస్ కొచ్చేటప్పటికి, అక్కడి హాస్టల్ వాతావరణం లో, కొత్త ఫ్రెండ్స్ మధ్య క్రమంగా నా క్రైస్తవమతం నన్నొదిలేసి వెళ్ళిపోయింది. లేకపోతే ఈపాటికి నేను నా బ్రాహ్మణత్వం వదిలేసి, క్రైస్తవ మత ప్రవచనాలు చెప్పుకుంటూ, ఏ చర్చ్ లోనో ఒక క్రైస్తవ సన్యాసిని గా బ్రతుకు గడుపుతూ ఉండేదాన్నేమో:) ఆమెన్!

ఇప్పటికీ అల్లంతదూరాన, క్రిష్ణమ్మ ఒడిలోని సాగర్ డామ్ కనిపిస్తూ, అందమైన ప్రక్రుతిలో, కొండల మధ్య ఉన్న నా చిన్నప్పటి పాఠశాలని తలచుకుంటూనే ఉంటాను.

**************************************************************************************************

28 కామెంట్‌లు:

Anandakiran చెప్పారు...

chinnappdu evaraina anthe kanapadede follow avtaru

తృష్ణ చెప్పారు...

:) :) ఆమెన్!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ప్రభువు మిమ్ములను రక్షించుడు గాక :)

శివరంజని చెప్పారు...

మీ పోస్ట్ చదువుతుంటే మెరుపు కలలు సినిమా గుర్తుకొచ్చిందండి

శిశిర చెప్పారు...

:):):) చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు ఎదుగుతున్న పిల్లలని ఎంతగా ప్రభావితం చేస్తాయో మీ టపా చెప్తూంది. ఇంతకీ "ఆమెన్" అంటే ఏమిటండి?

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఆవయసులోని నిష్కపటవ్తం మిమ్మల్ని అలాచేసుండొచ్చు. కానీ మీచర్చ్ కం స్కూల్లోని పాస్టర్లు, సిస్టర్లు వగైరా వగైరా అలాకాకపోవచ్చు. వాళ్ల వాళ్ళ అజెండాలు వాళ్ళకుంటాయి.
మీకీమాట బాధేసి ఉంటుంది. కానీ నాఅనుభవం ఇది. నేను చదివింది అలాంటిస్కూలే.అంతేకాదు నాపుట్టినరోజు క్రిస్మస్. ఇవన్నీ కలిసి నన్నుమార్చాయి. మరి ఇప్పుడు ఎందుకు మారాను? అంటే అవన్నీ పెద్దపెద్దకథలు. పసిపిల్లల్లోని నిర్మలత్వాన్ని ఈసంస్థలు స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అన్నది నాఅభిప్రాయం. మనకు జీవితాతం వాళ్ళపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.
అందులో ఇలాంటి ప్రభావం బ్రాహ్మణపిల్లలో ఎక్కువగా ఉండటం సర్వసాథారణం.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మిషనరీ స్కూల్లో చదివే చాలా మంది పిల్లలకు ఇది అనుభవమే. ఆ స్కూల్స్ లో అన్నీ తెగ నచ్చే నాకు ఈ ఒక్క విషయం మాత్రం అస్సలు నచ్చదు.
పోనీలెండి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు మార్చారు..లేదంటే ఈ పాటికి మేము సిస్టర్ 'జయా ఫిలోమినా' బ్లాగు చదవాల్సి వచ్చేది...:-)

ప్రణీత స్వాతి చెప్పారు...

జయగారూ..నాదీ శేఖర్ గారి మాటే.

సమూహము చెప్పారు...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
-- ధన్యవాదముతో
మీ సమూహము

హను చెప్పారు...

chinnappuDu evaru edi chepte ade mari gurtumDipoyedi, amte kadaa

జయ చెప్పారు...

@ఆనంద్ కిరణ్ గారు, అంతేకదండి మరి. అందుకే బాల్యం మధురం అన్నారు. చెరిగిపోని తీపిగుర్తులవి. ధన్యవాదాలు.


@Trishna, how are you. ఆ దేవుని కరుణ సదా మిమ్ములను, మీ బిడ్డలను కాపాడు గాక.

జయ చెప్పారు...

@ భాస్కర రామి రెడ్డి గారు, మీ అభిమానమునకు క్రుతజ్నురాలను. ఆ భగవంతుని దయ మీ పై సదా వర్షించు గాక. (Iam sorry, my lekhini is not working).


@శివరంజని గారు. అవునా! అయితే తప్పకుండా నేను ఆ సినిమా చూడాల్సిందే.

ramnarsimha చెప్పారు...

@JAYA GARU,

Bagunnayandi..Mee jnapakalu..

Nagarjuna Sagar..lo maa relatives

Pillalu..School(Missionary) nunchi

Raagane.."Chinna gorre pillanu

nenu Esaiah"!! antoo patalu

padutoo untaaru..

@SHISHIRA..Garu..

"JEEVITHA SATHYANNI"..Chepparu..

Her analasys shd be congratulated..

జయ చెప్పారు...

@ శిశిరా ఎప్పుడు చుట్టూఉన్న పరిస్థితులు మనమీద ప్రభావం చూపిస్తునే ఉంటాయి. అదేకదా సహజం.
ఆమెన్ అన్నపదం గ్రీకు హీబ్రూ బైబిల్, న్యూటెస్ట్ మెంట్ నుంచి తీసుకున్నారు. ఓల్డ్ లాటిన్ లో ఎక్కువ ప్రసిద్ధి చెందింది. క్రమంగా యూరప్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ వాడటం మొదలయింది. The word Amen is a declaration of affirmation. It is adopted in Christian worship as a concluding word for prayers.దీని గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా ఉంది.

ramnarsimha చెప్పారు...

@SHISHIRA & JAYA GARU:-

1)AMEN.. is origined from AUM(OM)..

2)CHRIST..z origined from KRISHNA..

3)ROME..Z origined from RAM..

జయ చెప్పారు...

@ సుబ్రహ్మణ్య చైతన్య గారు ఇందులో నేను బాధపడేదేముందండి. ఇది తెలిసీతెలియని వయసులో కేవలం నా అనుభవం అంతే. కాని నాకు ఇప్పటికీ క్రైస్తవమతం మీద అభిమానమే. చిన్నప్పటి ప్రభావం జీవితమంతా తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పటికీ నాకు చాలా మంది స్నేహితులు వారే. కాకపోతే అప్పటిలాగ ఇప్పుడు చేయనులెండి. థాంక్యూ.

@ శేఖర్, ఏమో ఇప్పుడు ఆ సిస్టర్ జయాఫిలోమినా బ్లాగ్ రాసేది కాదేమో. చర్చ్ కంకితమై పవిత్ర జీవితం గడుపుతూ ఉండేదేమో:) తెలిసిందా, నాకెందుకు ఏడుపెంకులాట తెలియదో. మరి ఏడుపెంకులాట టపా కోసం ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి?

@ ప్రణీత స్వాతి గారు, మీకూ శేఖర్ కిచ్చిన సమాధానమే:) థాంక్యూ.

జయ చెప్పారు...

@hanu gaaru, అదేకదా, పసితనపు అనుభవాల ప్రభావం. పెద్దయ్యాక ఎన్నో మర్చిపోతామేమో గాని చిన్నప్పటి జ్నాపకాలు మాత్రం మనసుపొరలనుంచి ఎప్పటికీ తొలగిపోవు. థాంక్యూ.

@ramnarsimha gaaru thanq. నాకు ఇంకా రకరకాల పాటలు వచ్చేవి. మీ చిన్నపిల్లలకి నా దీవెనలు. అవునండి శిశిర ఎప్పుడూ జీవితసత్యాలే చెప్తారు.

భావన చెప్పారు...

బాగుంది జయ మీ మీద మత ప్రభావం. :-) అలానే కదా వాళ్ళు క్రైస్తవ మత ప్రచారం చేసేది. చిన్నప్పుడు ఇష్టమైన టీచర్ చెపితే క్రాస్ ఏమిటీ వొంటి మీద కొరడా దెబ్బలైనా ఏమనిపించదు కదా.. ఆ పైన చక్కని బహుమతులు అందమైన కొవ్వొత్తులు. :-)

జయ చెప్పారు...

థాంక్యూ భావనా! మరి అదేకదా ఆ చిన్నారి వయసులోని మాయాజాలం.

Bhãskar Rãmarãju చెప్పారు...

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా -
ఆ ప్రభువు అందర్నీ కాపాడుగాకా

జయ చెప్పారు...

భాస్కర్ రామరాజు గారు ధన్యవాదములతో, మీకు నా బ్లాగ్ కి స్వాగతం. ఆ పరిశుద్ధ ప్రభువు కృప సదా మీకు లభించుగాక!!!

మరువం ఉష చెప్పారు...

ముందే డిస్క్లైమర్: ఇవి మరీ నాలుగేళ్ళ వయసు నాటి నుంచి వూహ వచ్చేవరకు సాగిన జ్ఞాపకాలు కనుక ఇవన్నీ నవ్వుకోవటానికే..ఎవరి మనోభావాలూ దెబ్బతీయటానికి కాదు సుమా!
********************
ఎంత పనిచేసాను..వద్దొద్దనుకుంటూనే అంతా చదివేసాను.. :( ఇప్పుడు చెప్పండి మా సిస్టర్ మరియట్ట, సుపీరియర్ సిస్టర్ ఫ్రాన్సిస్, బ్రదర్ జాన్, ఫాదర్ జోసఫ్ మొదలగువారలు, ఇవాంజలిన్, రెజీనా, సవరయ్య సారమ్మ/య్యలు, నా తోటివారలగు మేరీబ్యూలా, మరియ బొంబీనా ఎక్కడున్నారో..నా అభిమానపాత్రులనదగువారలైన దేవదానం, ఏసుపాదం గట్రా ఏమి చేస్తున్నారో..నా బైబిల్ ఎవరు దాచేసారో, నా కొవ్వొత్తులు ఎవరు ఊదేసారో..నేను తుడిపిన బొట్టు మళ్ళీ ఎవరు దిద్దేసారో, ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొతే.."నడిపించు నా నావ" వందసార్లు ఇంపోజిషన్ రాయండి..నిజమే కదా ఎంత అమాయకంగా విన్నవన్నీ నమ్మేస్తూ..నేనూ మీలో ఒకరిని అప్పట్లో.. కాకపోతే మాది కాథలిక్ కాన్వెంట్..తరవాత్తరవాత తెలుగు తెగ అర్థం అయ్యేంతగా వచ్చాక నేను వాడిని తెగ తిట్టిపోసాను కానీ నేను నాకు తెలిసినలాగ అంగ్ల ప్రార్థన చేస్తూంటే మా అమ్మమ్మ గారి ఊర్లో బావ వరస వాడొకడు ఇక్కడ అలా పాడిస్తే తెలియదే, ఇదిగో ఇలాగ చెప్పాలి అని నేర్పినది.."దే...వా! వారలు పా..తకుండలు..నేను ఉత్త...." ఇలా సాగేది. అలాగే నేను నాగిని డాన్స్ మీద మక్కువతో సాతాను గా వేసిన నృత్యనాటిక వలన ఎన్ని చర్చుల్లో నన్ను నిజ భక్తులు చీదరించుకునేవారో.. :) ఆదాము అవ్వ కథలో పాము రూపంలో వచ్చి అవ్వకి జ్ఞాన ఫలం తినిపించిన సాతాను, ఆ పాప ఫలితంగా దేముని శాపానికి గురై పాముగా మారిపోవటం ఉంది. నా వరకు డాన్స్ ఒక్కటే లెక్క, చూసేవారికి నేను పాపాత్మురాలైన సాతానుని మరి!

అభిప్రాయం, అవగాహనలో మార్పులు వచ్చినా నాకు ఇప్పటికీ నచ్చి పాడుకునే పాటలివి.

.. వరగుణ దీపిక వెలిగించే విశ్వవిథాతా జయము జయము
.. దేముడు మంచివాడు, మననందరనూ సృష్టించాడు
.. సాగరతీర సమీపానా తరగని కావ్యసుధా మధురం [నాగపట్టణం వేలాంగణీ మాత మీద గీతం]

ఇక, క్రిష్ణమ్మ ఒడిలోని సాగర్ డామ్ అన్నమాట, ఎక్కడకో ఎగరేసి పడేసింది.

జయ చెప్పారు...

ఉషా గారు, నాకిప్పుడెంత ఆనందంగాఉందో చెప్పలేను. ఒక్కసారిగా మీతో కలిసి చిన్నపిల్లలాగా స్కూల్ కెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకూ ఒక తోడుదొరికినందుకు పరవశంగా ఉంది. మీరు సైతాను గా వేసారా:( నా తోటి జొసెఫ్ గా వేయించేవారు. అందులో చేయటానికి పెద్ద యాక్షన్ ఏమీ ఉండేది కాదు. ఎంతసేపు గడ్డాలు సవరించుకోటంతో సరిపోయేది నాకు. మీరు చెప్పిన కొన్ని పదాలు నేనుకూడా రాద్దామనుకొని, కొంచెం భయంతో మానుకున్నాను. ఇప్పటికీ నానోట్లో ఎన్నో పాటలు నానుతూనే ఉంటాయి. జేసుదాసు పాడిన సాగరతీర సమీపాన పాట నాక్కూడా చాలా ఇష్టం. రీసెర్చ్ చేసే రోజుల్లో మెడ్రాస్ సెమినార్ కి వెళ్ళిన నేను వేళాంగణ్ణి చూడకుండా ఉండలేకపోయాను. అదేవయసులోని నా జ్ఞాపకాలని మీరు ఇంకా ఇంకా తట్టి లేపారు. ఇప్పుడు నేనేమైపోవాలి? మీకు, మీ శిశువులకు ప్రభువు దీవెనలు సదా లభించుగాక. So, both of us are sailing in the same boat. Now I am really happy:)

శిశిర చెప్పారు...

@jaya garu, @ramnarasimha garu, Thanks for the info.

Bhãskar Rãmarãju చెప్పారు...

జయ గారూ నమస్తే
ఇది వినండి.
కేవలం హాస్యం కోసమే సుమా.
http://bhaskar.posterous.com/13989172

జయ చెప్పారు...

భాస్కర్ రామరాజు గారు, మొత్తానికి చాలా రోజుల తర్వాత మంచి సువార్తే వినిపించారు నాకు. ఈ ప్రార్ధన మీరేనా చేసింది:) ఇప్పుడు నా గతేంటి? "దేముడెక్కడున్నాడు" అనుకుంటూ వెళ్ళిపోతానో ఏవిటో....

మురళి చెప్పారు...

నాక్కూడా 'మెరుపు కలలు' సినిమా గుర్తొచ్చేసిందండీ.. ఇంతకీ మీరు చూశారా?? పాటలు బాగుంటాయి..

జయ చెప్పారు...

మురళి గారు, లేదండి, ఇంకా ఆ సినిమా చూడనే లేదు. కాని తప్పకుండా చూస్తాను. నా లాంటి వాళ్ళు ఉన్నారంటే నాకూ క్యూరియసిటీ యేగా :)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner