15, అక్టోబర్ 2010, శుక్రవారం

`అమ్మవారు’






అందమైన ఆహార్యం తో, ఆకర్షణీయమైన చిరునవ్వుతో సినీ అమ్మవారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కె.ఆర్.విజయ. గుర్తుంది కదూ.
అమ్మవారు అనంగానే తనే గుర్తొస్తుంది.

'నమ్మ వీతు దైవం' అనే చిత్రంలో వేసిన అమ్మవారి పాత్ర ఆ తరువాత అనేక చిత్రాల్లో దేవత గ నిలబెట్టింది.

తెలుగు సిన్మాల్లో ఎందరో దేవతా మూర్తులుగా నటించినప్పటికి, కె.ఆర్.విజయ కొచ్చినంత గుర్తింపు ఎవరికి రాలేదు.

అమ్మవారు నవ్వితే ఇలాగే ఉంటుంది అనే నమ్మకాన్ని ఆమె నవ్వు నిరూపించింది.
"పున్నగై అరసి" (క్వీన్ ఆఫ్ స్మైల్స్) అనే బిరుదుని తనకే స్వంతం అని ఇప్పటికి కూడా నిలబెట్టుకో గలిగింది.

అమ్మవారి రకరకాల అవతారాల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది.

దేవీ లలితాంబ, అష్టలక్ష్మీ వైభవం, జగన్మాత, మా ఇలవేల్పు, శుక్రవారం మహాలక్ష్మి, శ్రీ వినాయక విజయం, త్రినేత్రం, శ్రీ దత్త దర్శనం వంటి అనేక చిత్రాల్లో ఆమె అమ్మవారుగా నటించింది.

అనేక రకాల ఈ అమ్మవారి పాత్రలు మనమీద ఇప్పటికి కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

ఒక దేవతగా సుకుమార, సౌందర్య, శాంత, లాలిత్య స్వభావాలను మనలో పెంచుతుంది.

అంతేకాదు దీనికి అవతలి కోణాన్ని కూడా మనకి చూపిస్తుంది.

అవసరమైనప్పుడు ఒక పాలకురాలిగా, దుష్టశక్తి సంహారిగా, జ్ఞానిగా, చాముండిగా మారాలి అనే స్పూర్తినిస్తుంది.

సున్నిత మనస్కురాలైన స్త్రీ అవసరమైనప్పుడు రౌద్రమూర్తిగా, ఉగ్రస్వరూపాన్ని పొందే శక్తినిస్తుంది

అవరోధాలను అధిగమించి, మనలోని శక్తిని మనమే బయటికి తీసుకొని రావాలనే ఆవేశాన్ని కలిగిస్తుంది.

రౌద్రం, శౌర్యం, ఉత్సాహం మనలో పెంచుతుంది.

అతి సౌమ్యమైన, అందాల అంబిక రూపం నుంచి భయంకర కాళిగా మారగలిగే కఠినత్వాన్ని ఇస్తుంది.

భక్తి ద్వారా శక్తిని పొంది ముక్తి వైపు నడిపిస్తుంది.

స్త్ర్రీ అబల కాదు సబల.

ఇదే అమ్మవారి వివిధ రూపాల సందేశం.

ఓంకార రూపిణీ...జగదేక మోహినీ....ప్రకృతీ స్వరూపిణీ...... రక్ష రక్ష జగన్మాత! నమో! నమో:





"అందరికి దసరా శుభాకంక్షలతో" ............ జయ

" జయము నీయవే! అమ్మా! భవానీ "














**********************************************************************************

16 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

జయగారు
విజయదశమి శుభాకాంక్షలు

శిశిర చెప్పారు...

దసరా శుభాకాంక్షలు జయ గారు.

తృష్ణ చెప్పారు...

బాగా రాసారు.
మీకూ మీ కుటుంబ సభ్యులకూ అమ్మవారి కృపాకటాక్షాలందాలని మనసారా కోరుకుంటున్నాను.

SRRao చెప్పారు...

ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

- SRRao

శిరాకదంబం

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయగారు మీకూ మీ కుటుంబ సభ్యులకూ
విజయదశమి శుభాకాంక్షలు

శివరంజని చెప్పారు...

జయగారు మీకూ మీ కుటుంబ సభ్యులకూ విజయదశమి శుభాకాంక్షలు....నర్తన శాలలో పాట నాకు చాలా ఇష్టమైనా సాంగ్ చిన్నప్పుడు ఎంతో కష్టపడి నేర్చుకున్నా టేప్ రికార్డర్ లో విని thank you

జయ చెప్పారు...

@ మంచు గారు ధన్యవాదాలు. చాలా ఏళ్ళ తర్వాత కనిపించారు. బాగున్నారా.

@ శిశిరా థాంక్యూ

@ తృష్ణా థాంక్యూ.

జయ చెప్పారు...

@ రావ్ గారూ థాంక్యూ.

@ రాజీ థాంక్యూ. నవరాత్రుల విశేషాలు ఇంకా పూర్తి చేయలేదెందుకు.

@ హాయ్ శివానీ, ఏవిటి ఇంకా ఎంతకాలం వైట్ చేయాలి నీ కొత్త పోస్ట్ కోసం. నా చిన్నప్పుడు నేను కూడా ఇష్టంగా పాడుకున్న పాటే అది. పైగా దానికి డాన్స్ కూడా:)

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది.
జననీ శివకామిని సుశీల పాడిన ఆణిముత్యాల్లో టాప్ టెన్లో ఉండే పాట.
అన్నట్టు మీ ప్రొఫైల్ బొమ్మ కూడా చాలా బావుంది

జయ చెప్పారు...

కొత్తపాళీ గారు, ఆ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగే కదా. ఎప్పటినుంచో గూగులమ్మని బతిమాలగా బతిమాలగా చివరికి నా బాధ పడలేక నీకు సరిగ్గా సరిపోయె బొమ్మ ఇదే అని ఇచ్చింది. మీకు నచ్చిందా. థాంక్సండీ.

అజ్ఞాత చెప్పారు...

జయ గారూ!
ఎందుకోగానీ ఈ మధ్య మీ బ్లాగు చూడకపోయినందువల్ల ఆలస్యంగానైనా 'మీకు దసరా శుభాకాంక్షలు' మరియు 'అడ్వాన్స్‌గా దీపావళి శుభాకాంక్షలు'.

జయ చెప్పారు...

ధన్యవాదాలు రెడ్డిగారు. మీకు కూడా నా శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

Dear Jaya gaarua!
CNN Hero of the Year కు సంబంధించిన ఒక మోటివేషనల్ కధనాన్ని నా బ్లాగులో వ్రాసాను @ http://dare2questionnow.blogspot.com/2010/10/catch-he-brings-hot-meals-to-indias.html. వీలుంటే మీ బ్లాగులో పెట్టండి, లేదా మీ మిత్రులందరికీ మెయిల్ చెయ్యండి.

SRRao చెప్పారు...

జయ గారూ !
మీరు నిశ్శబ్దంగా ఉండిపోవడం బాగులేదు. దీపావళికి కూడా రాయండి.
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
- శి. రా. రావు
శిరాకదంబం

శిశిర చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు జయగారు. మీకు అన్ని పండుగల శుభాకాంక్షలూ ఒకే పోస్ట్‌లో చెప్పవలసి వస్తూంది. :) క్రొత్త పోస్ట్ లేదు మరి.

జయ చెప్పారు...

రావ్ గారు,
శిశిరా
ధన్యవాదాలు. మీకు కూడా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొంచెం తీరిక దొరికినప్పుడు తప్పక రాస్తాను.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner