10, నవంబర్ 2010, బుధవారం

నా కోసం......
గగనాన హత్తుకున్న చంద్రునిలా
నీదరిని చేరని నన్నిలా
అప్పుడే ఆలపించిన గీతంలా...
నా మది గలగలా, సముద్రపు జీవనదిలా,
నీ దరహాసం చేరాలి నను గాలితరంగంలా
ఓ నా ప్రియ నేస్తమా, వెన్నెల్లా ఎల్లకాలం
నా గుండె గుడిలో దాగిపో...
తారలతోనే జీవిత కాలం గడిపే చంద్రునిలా
కడలితోనే మమైకమైన కెరటంలా కలకాలం
నీ కోకిల గానం, నా మూగ మదిలో నింపిపో...
ఎండల్లో, వానల్లో నా కోసం వేచి ఉంటానని మాటిచ్చిపో
ఎందుకంటే నా మనసంతా ఉండిపోయింది నీ చెంతనే
అందుకే ఈ దిగులంతా ఓ నా నేస్తమా!
మేఘమా కదలిపోకు
పవనం వచ్చే వేళయింది
పుష్పమా పుప్పొడి రాల్చకు
భ్రమరం వచ్చే వేళయింది
స్వప్నమా జారిపోకు
నిదుర వచ్చే వేళయింది
హృదయమా కన్నీరు రాల్చకు
స్పందన ఇంకా మిగిలే ఉంది.....
మాటలే రాని వేళ, పాట ఎలా పాడను
కళ్ళలోన కడలి సాకి, ఎంతసేపు ఆపను
నిన్ను మరచి పోవాలని
నా హృదయాన్ని ఒక శిలగా మార్చుకున్నా,
నీ జ్ఞాపకాలు వాటిని శిల్పంగా మార్చాయి,
ఆ శిల్పమే నువ్వైతే నిన్ను మరిచేదెలా.....


****************************************************************************

15 వ్యాఖ్యలు:

మందాకిని చెప్పారు...

భావం బాగుందండి.
వాటిని శిల్పంగా మార్చాయి అని రాయబోయి శిల గా మార్చాయి అని రాశారా అనిపిస్తుంది.

చిన్ని చెప్పారు...

చాలా బాగుందండీ .

రాజి చెప్పారు...

"నిన్ను మరచి పోవాలని
నా హృదయాన్ని ఒక శిలగా మార్చుకున్నా,
నీ జ్ఞాపకాలు వాటిని శిల్పంగా మార్చాయి,
ఆ శిల్పమే నువ్వైతే నిన్ను మరిచేదెలా....."

జయగారూ మీ కవితాభావాలు చాలా బాగున్నాయండీ...

శిశిర చెప్పారు...

స్వప్నమా జారిపోకు
నిదుర వచ్చే వేళయింది

మాటలే రాని వేళ, పాట ఎలా పాడను
కళ్ళలోన కడలి సాకి, ఎంతసేపు ఆపను

Superb జయగారు.

శివరంజని చెప్పారు...

నిన్ను మరచి పోవాలని
నా హృదయాన్ని ఒక శిలగా మార్చుకున్నా,
నీ జ్ఞాపకాలు వాటిని శిల్పంగా మార్చాయి,
ఆ శిల్పమే నువ్వైతే నిన్ను మరిచేదెలా.....జయ గారు సూపరో సూపర్

చెప్పాలంటే.... చెప్పారు...

చెప్పలేనంత గా నచ్చింది మాటలు లేవు చాలా బావుంది.

జయ చెప్పారు...

చిన్ని గారు
రాజి
శిశిర
శివరంజని
చెప్పలంటే
మీ అందరికీ నచ్చిందా. ధన్యవాదాలు.
మందాకిని గారు మీకు స్పెషల్ థాంక్స్:)

satya చెప్పారు...

బాగుంది.

జయ చెప్పారు...

సత్యా గారు థాంక్యూ.

మురళి చెప్పారు...

మీబ్లాగేనా? అని సందేహం కలిగిందండీ ఒక్క క్షణం.. కవిత చాలా బాగుంది.. నాకెందుకో 'మంచు పల్లకీ' లో "మేఘమా దేహమా" పాట గుర్తొచ్చింది.. బహుశా ఉదయాన్నే విని ఉండడం వల్లనేమో..

అశోక్ పాపాయి చెప్పారు...

chaala baaga raasaru...

తృష్ణ చెప్పారు...

ఇంకా లేట్ చేస్తే ఇలానే నన్నంతా మర్చిపోతారని వచ్చేద్దామని ప్రయత్నిస్తున్నానండి...:)

బాగుంది..

జయ చెప్పారు...

@ఎందుకంట..మురళి గారికి నా బ్లాగ్ మీద అంత సందేహం కలిగింది. అప్పుడప్పుడలా..అలా...కొంచెం కొంచెం 'నాలో నేను' అన్నది మనకు తెలియకుండానే వెలుపలికొస్తూ ఉంటుందనుకుంటా. నాకెంతో ఇష్టమైన అంత మంచి పాట గుర్తుకొచ్చినందుకు మాత్రం హ్యాపీ:)

@అశోక్ పాపాయ్ గారు ధన్యవాదాలు.

@ఎందుకో అంతలేట్ మరి. బయటకొచ్చేస్తే సరిపోతుందిగా. థాంక్యూ తృష్ణా.

kRsNa చెప్పారు...

very nice. double like it. :-)

జయ చెప్పారు...

kRsNa gaaru thanks.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner