1, జనవరి 2011, శనివారం

జ్ఞాపకాల నీడలు....




మిత్రులందరికీ...మనసారా... హృదయపూర్వక... నూతనసంవత్సర శుభాకాంక్షలు.....

నూతన సంవత్సర వేడుకలు అంటే నాకు బ్లాక్ అండ్ వైట్ పాత సినిమాల్లో లా గిర గిరా గింగిరాలు తిరుగుతున్న ఆ చక్రాలు నన్ను తీసుకెళ్ళి నేను బరోడాలో రీసెర్చ్ చేస్తున్న రోజుల్లో ఆపేస్తుంది. హాస్టల్ జీవితం, మా స్నేహాలు నన్ను, గుర్తుకొస్తున్నాయి.....అంటూ అక్కడే ఆగిపొమ్మని వెనక్కి పిలుస్తూ ఉంటాయి....అదే అంతం...అదే ఆరంభం....

మేము అయిదుగురు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళం. నేనూ, మంజు, జస్పాల్, నీహాల్, పురుషోత్తం. ఎమ్.ఎస్. యూనివర్సిటీలోరీసెర్చ్ చేస్తూ ఉండగా అక్కడే మాకు మంచి స్నేహం కలిసింది. మా సబ్జెక్ట్స్ ఒకటి కాకపోయినా మా స్నేహం ఎలా కలిసిపోయిందో నాకే గుర్తు లేదు. జస్పాల్ పంజాబ్ అమ్మాయి. మా ఇద్దరికి ఎక్కువగా బాంబే ట్రిప్స్ ఉండేవి. మంజు తమిళమ్మాయి. నా రూంమేట్. తెలుగు బాగా వచ్చు. పురుషోత్తం పక్కా తెలుగు. ఇంకపోతే నీహాల్ గుజ్జూ..అంటే గుజరాతీ. మంజూ, పురుషోత్తం పెళ్ళి చేసుకో బోతున్నారని నాకు మాత్రమే తెలుసు. రోజూ మంజు రాత్రిపూట మేము వర్క్ చేసుకుంటున్నప్పుడు రకరకాల టీలు చేసిచ్చేది. బ్లాక్ టీ..ఒక్కోసారి అందులో పల్లీలపొడి కలిపేది. ఇంకోసారి ఏలకులు కలిపేది. ఇలాగే చాలా ప్రయోగాలు చేసేది. అవన్నీ నాకు ఎంతో రుచిగా అనిపించేవి. ఇప్పటికీ తన చేతి టీ రుచి మళ్ళీ ఎక్కడా దొరకలేదు.

రోజూ సాయంత్రం కాగానే నీహాల్, పురుషోత్తం మా హాస్టల్ దగ్గరికొచ్చేవారు. రీసెర్చ్ స్కాలర్స్ ఏ టైం కయినా బయటికి పోవచ్చు. యూనివర్సిటీ పొడుగునా మధ్యలో రోడ్, అటువైపు ఎంతో అందమైన కమాటీ బాగ్ ఉండేది. రాత్రి పదింటికి అక్కడికి పోయి కూర్చుని కబుర్లేసుకునేవాళ్ళం. రోడ్ పక్కనే ఉన్న టీ బంక్ లో అక్కడే కూచుని వేడి వేడి టీ చేయించుకొని తాగేవాళ్ళం. ఆ పక్కనే ఒక చాట్ బండి కూడా ఉండేది. అది ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ముఖ్యంగా ఉల్లిగడ్డను ఒడుపుగా పట్టుకొని ఒక చిన్న అబ్బాయి చకాచకా సన్నటి ముక్కలు కోసేయటం నాకు భలే నచ్చేది. ఎన్నోసార్లు ఆ అబ్బాయి దగ్గిర నేర్చుకోవాలని మేము ప్రయత్నించాం కాని, నీహాల్ ఒక్కడే చాలా చక్కగా ఆ టెక్నిక్ నేర్చుకున్నాడు.

నూతన సంవత్సరం అని అందరూ రకరకాల సందడితో ఎక్కడెక్కడికో పోతుంటే మేము మాత్రం ఆ గార్డెన్ లోనే గడపాలనుకున్నాం.
ఆరోజు కూడా అలాగే పార్క్ లోకి చేరుకున్నాం. మాకు ఎంతోనచ్చే కలర్ ఫౌంటెన్ దగ్గర కూచున్నాం. ఒక వైపు చక్కటి గడ్డి, ఇంకోవైపు ఇసుకతో చాలా బాగుంటుంది ఆ చోటు. అక్కడే గడ్డిమీద ఎత్తుగా ఒక గడియారం పెద్ద పెద్ద ముల్లులతో ఏర్పాటు చేసారు. ఆ రాత్రంతా రకరకాల ఆటలతో గడిపేయాలనుకున్నాం. వాళ్ళకే ఆటలు తెలియవు. అందుకే నేనూ మంజూ లీడింగ్ తీసుకున్నాం. తెలుగులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళను నానా తికమక పెట్టేసాం. ఇంక మేమాడిన ఆటలు ఏంటో తెలుసా!!!

(ఈ పాటలన్నింటిలో కూడా దీర్ఘ వ్యాధులను తగ్గించే ఆయుర్వేద ఔషధాల గురించే ఉంటుంది (మెడిసినల్ ప్లాన్ట్స్.) గమనించండి)

అందర్నీ కాళ్ళు జాపుకొని కూచోమని...కాళ్ళ గజ్జి కంకాళమ్మా...
వేగూ చుక్కా వెలగా మొగ్గా
మొగ్గా కాదూ మోదుగ నీరు
నీరూ కాదు నిమ్మల వాయ
వాయా కాదు వాయింట కూర
కూరా కాదు గుమ్మడి పండు
పండూ కాదూ పాపాయి కాలు....లింగూ లిటుకూ పందమేల పటుకూ...
కాలూ తీసీ కడగా పెట్టుకో.....అని ఆడించి వాళ్ళందరితో ఒక్కో కాలే మడత పెట్టించి, మేము మాత్రం మా దగ్గిరికొచ్చే సరికి మా కాళ్ళమీద చేయి ఆనించకుండా..చివరికి ఆ ముగ్గురితో నీల్డౌన్ చేయించాం. మేము చెప్పినట్లల్లా ఆడుతున్న ఆ ముగ్గురినీ చూసి మాకు భలే సరదా వేసింది. అందుకని ఇంకో ఆట మొదలుపెట్టాం. అదే....
చెమ్మా చెక్కా చారడేసి మొగ్గా
అట్లుపోయంగ ఆరగించంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా
రాత్నాల చెమ్మచెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరేయంగా
పందింట్లొ మా బావ పెళ్ళి చేయంగ
సుబ్బరాయుడి పెళ్ళి...చూచి వత్తము రండి
మా ఇంట్లొ పెళ్ళి..మళ్ళీ వత్తము రండి....
దొరగారింట్లో పెళ్ళి దోచుకు వద్దాం రండి....అని చక్కగా వాళ్ళతో చెమ్మచెక్క ఆడించాం. నీహాల్ అయితే ఎంత ముద్దుగా ఆడాడో:)
ఊహూ.. మాకు తృప్తి కలగ లేదు. వీళ్ళతో బిస్తి గీయిద్దామా మంజూ అని మెల్లిగా అడిగితే తను అంతకంటే హుషారుగా ఒప్పుకుంది. ఇంకేముంది మళ్ళీ ఇంకో ఆట మొదలయ్యింది. అదేనండి.....
ఒప్పులకుప్పా వయారి భామా
మినపా పప్పు.. మెంతీ పిండి
తాటీ బెల్లం ...తవ్వెడు నెయ్యి
గుప్పెడు తింటే ...కులుకూలాడి
నడుమూ గట్టె... నా మాట చిట్టి
సన్నబియ్యం.. చాయ పప్పు
కొబ్బరికోరు..బెల్లపు అచ్చు
చిన్ని మువ్వ... సన్నగాజు
రోట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు...నీ మొగుడెవరూ....అని చేతులు పట్టుకొని గిర గిరా తిరిగాం. జస్పాల్ కి ఈ ఆట భలే నచ్చింది. నీ మొగుడెవరూ అంటూ నీహాల్ వెంట పడింది. మేము నవ్వలేక చచ్చాం.ఎంతో ఆనందంగా మనమయిదుగురం మా పంజాబ్ లోని అయిదు నదులం కదూ అంది...పరవశంగా కళ్ళు మూసుకొని. పురుషోత్తం ఊరుకుంటాడా...నేనే నదో చెప్పవా..జీలమా..చీనాబా....కాదు కాదు నేను సట్లెజ్ అని నిహాల్ అంటూ నవ్వుకోటం మొదలుపెట్టారు. పాపం జస్పాల్ చాలా ఉడుక్కొంది. అప్పటికే గిరగిరా తిరిగిన నీహాల్ కళ్ళు తిరగటం తో ఇంక కూచొని ఆడుకొందాం అని డిసైడ్ అయ్యాం.
గుడు గుడు కుంచెం గుండే రాగం
పాములపట్నం పడగే రాగం
చిన్నన్న గుర్రం చిట్టికి పోయే
పెద్దన గుర్రం పెళ్ళికి పోయె
మా అన్న గుర్రం మా ఇంటికొచ్చే ...అని ఒకళ్ళ చేతిమీద ఇంకోళ్ళు గుప్పిట్లు మడిచిపెట్టుకొని ఆ ఆట అడుకున్నాం. ఇంతలో దూదూ పుల్ల ఆట ఆడదాం అంది మంజు. ఇంకేముంది..హాయిగ ఇసుక దగ్గరగా పోగుచేసి పొడుగ్గా చేసాం. దూదూపుల్ల...దురాయ్ పుల్ల...చూడాకుండా జాడా తీయ్....ఊదాకుండా పుల్లా తీయ్....అని వాళ్ళకు తెలియకుండా పుల్లను అందులో దాచేసి, రెండు చేతుల వేళ్ళు మడిచి ఎక్కడో అక్కడ మూయాలి. వాళ్ళు మూసిన చోట పుల్ల ఉంటే వాళ్ళు గెలిచినట్లు లేకపోతే వాళ్ళ కళ్ళు మూసి దోసిట్లో ఇసుక పోసి అందులో మళ్ళీ ఒక పుల్ల ఉంచి, ఎంతెంత దూరం అని వాళ్ళతోటి అడిగిస్తూ మేమేమొ కూసింత దూరం అని పాడుకుంటూ ఎక్కడో అక్కడ వాళ్ళ చేతిలో ఇసుక పోసేసి, ఆ తరువాత మళ్ళీ మొదటికే వచ్చి ఆ చోటు కనుక్కోమన్నాం. పాపం వాళ్ళకి ఈ ఆట తెలియదు. కాని పురుషోత్తం మాత్రం వేళ్ళ సందుల్లోంచి చూసేసి కనుక్కున్నాడు. అందుకని మా కళ్ళు మూసి, వీరీ వీరి గుమ్మడిపండు..వీరీ పేరేమి అని మా తోటి ఆడించాడు. ఈ ఆట నీహాల్ కి చాలా నచ్చింది. తనకు కళ్ళు మూయమని మమ్మల్ని ఎదురుగ్గా కూచోమని చేయిపెట్టి ఊపుతూ భలే ఆడాడు. అందరు ముక్కు గిల్లుతుంటే బాగుందంట. కాని మొత్తానికి మా అందరినీ కూడా బాగానే గుర్తుపట్టాడు. ఒక రాత్రిపూట రీసెర్చ్ స్కాలర్స్ అలా చిన్న పిల్లలాటలాడుతోంటే మాకే గమ్మత్తుగా అనిపించింది:)

మా ఆటల సందడి లో గమనించనేలేదు. ఆ గడ్డిగడియారం ముల్లులు పన్నెండు దగ్గరికొచ్చేస్తున్నాయి. మరి మేము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలికదా! ఇంతలో మా జస్పాల్..జోయా..ప్లీజ్ ప్లే రుద్రవీణ అంది. ఏ మాత్రం దీర్ఘాలు, కొమ్ములు, వత్తులు వంటివి లేని నా పేరుని తను జోయా అని బెంగాలి వాళ్ళలాగా పిలిచేది. మా వాళ్ళు కూడా నన్నేడిపించటానికి అలాగే పిలిచేవాళ్ళు.తనకి తెలుగు నేర్పించటానికి నేనూ మంజూ చాలా ట్రై చేసాం కాని తనకి, వాడు..అది... అనే పదాలు తప్ప ఇంకేం రాలేదు. మమ్మల్ని కూడా వాడూ, అది అనే పిలిచేది. నేర్పించిన ఖర్మకి మాకు పలకక తప్పలేదు. అక్కడ ఫైన్ అర్ట్స్ డిపార్ట్మెంట్ చాలా ఫేమస్. నేనూ మంజూ అక్కడ రుద్రవీణ నేర్చుకునేవాళ్ళం. మంజు దాన్ని కూడా తీసుకొచ్చింది. ఇద్దరం వంతుల వారిగా పలికిస్తూ ఉండగానే న్యూ ఇయర్ ఒచ్చేసింది. రుద్రవీణ మీద హ్యాపీ న్యూ ఇయర్ ప్లే చేస్తూ మా ఫ్రెండ్స్ ని విష్ చేసాం. ఆ నాద తరంగాలు గాలిలో తేలిపోతుంటే మాకు చాలా సంతోషమేసింది. మేమందరం రీసెర్చ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వీణ తను తీసుకొని వాయించే షటిల్ మాత్రం నాకిచ్చింది మంజు:)

వెంటనే ఆకలి గుర్తొచ్చింది. నిజమే ..మేము తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. ఇప్పుడెలా!!!అందరం పార్క్ బయటికెళ్ళాం. మా బండి ఉంది గాని ఇక్కడ ఒక ఆరేళ్ళ పిల్ల తప్ప ఎవ్వరు లేరు. ఆ పిల్ల కునికిపాట్లు పడుతోంది. వెంటనే నిహాల్ ఉల్లిగడ్డలు తీసుకొని చకచకా కట్చేసి ఆ బండి మీద చాట్ చేసి మా కందరికీ పెట్టాడు.ఎంత రుచిగా ఉందో నేను చెప్పలేను. ఆ పిల్లని లేపి చేతిలో డబ్బులు పెడితే ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది పాపం. మేము ఏ హోటల్ కెళ్ళలేదు. కాని మేమాడుకున్న ఆటలు..తిన్న ఆ చాట్ ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా మాకు మిగిలిపోయాయి. మాకు ఏమాత్రం చెప్పకుండానే కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.

జరిగిపోయిన ఆ కాల గమనంలో చివరకు మాకు మిగిలిందేమిటి? ఎంతో తెలివైన మా అందరికంటే చిన్నవాడైన డా. నిహాల్ చావ్డా చిన్నతనంలోనే కదలలేని పరిస్థితిలో, గొప్ప శాస్త్రజ్ఞుడవ్వాలని కలలు గని, భవిష్యత్తన్నదే లేకుండా మంచాని కంటుకుపోయాడని చెప్పటానికి గుండెగొంతుకడ్డుపడుతోంది. ఎన్నో ఆశలు నింపుకున్న ఆ అమాయక ముఖాన్ని ఎలా మర్చిపోను.... ఆకేసి ఉప్పేసి, పప్పేసి అన్నంపెట్టి నెయ్యేసి..అమ్మకో ముద్ద, నాన్నకో ముద్ద, చెల్లికో ముద్ద అని తినిపించాలని ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కలలు కన్న నా ప్రియ స్నేహితురాలు డా. జస్పాల్ కౌర్ దత్ పంజాబ్ లో, పెళ్ళిచేసుకొని ఒక మారు మూల గ్రామంలో ..వంటింటిలో మగ్గిపోతోందని చెప్పనా. ‘దాని’ దగ్గిరికెళ్ళి కొండాపల్లి కొయ్యాబొమ్మా....నీకో బొమ్మా నాకో బొమ్మా...నక్కాపల్లి లక్కా పిడత...నీకో పిడత నాకో పిడత ....నిర్మల పట్నం బొమ్మల పలకలు...నీకో పలక నాకో పలక...చూస్తూ ఉండు ఇచ్చేదాకా.... అని పాడాలని ఉంది. ఏడవకు ఏడవకు వెర్రిపాపాయి...ఏడిస్తె నీ కళ్ళ నీలాలు కారు..నీలాలు కారితే నే చూడలేను...పాలైన కారవే బంగారు కళ్ళ...అని తనివి తీరా ఓదార్చాలని ఉంది.

ప్రొఫెసర్ మంజూ పి. రావ్ కీర్తి కిరీటాలు పెంచుకుంటూ ఒంటరిగా బెంగళూరు లో కాలం గడుపుతోందని చెప్పనా. లేకపోతే...బుర్రుపిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది...పడమటింటి కాపురం చేయనన్నది...అని పాడనా. మల్లెమొగ్గల నవ్వులారబోసే భార్యకన్నా మించిన ఎంతో గొప్ప కీర్తి కిరీటాల కోసం... ప్రొఫెసర్ పురుషోత్తమ రావ్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావట్లేదని చెప్పనా..... ఉడతా ఉడతా వెంటనే రా...చక్కని ఉడతా వెంటనే రా..జామ చెట్టు ఎక్కిరా..సగం పండు నీకు...సగం పండు మంజుకు....కలసి మెలసి ఉండు ...రా....అని పాడానా. ఇప్పుడు ఏ పాట పాడాలి. గడప లన్నింటి లోన ఏ గడప మేలు...అని వెతక్కు...అన్ని గడపల్లోన నీ మహలక్ష్మి నివసించు గడప మేలు...అని ఎప్పుడు తెలుసుకుంటావయ్యా....పురుషోత్తమా!!!!

నా మదిలోని ఆ జ్ఞాపకాలే నా జీవితాంతం నా నూతన సంవత్సర సంబరాలు. అది దాటి ముందుకు రాలేక పోతున్నాను. అక్కడే ఆగి పోయాను. అడుగు ముందుకు పడటం లేదే...మరి ఏం చేయను. మేమయిదుగురం ఎప్పటికైనా కలవాలి. అదే నా ప్రతి నూతన సంవత్సరపు ఆకాంక్ష...తీరని కోరిక. నిజమైన ఆనందం స్నేహమే... కదా......

***************************************************************************

34 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

జోయా,
మీ నూతన సంవత్సర జ్ఞాపకాలు బాగున్నాయండి.
నిహాల్,జస్పాల్ కౌర్ ల గురించి చదువుతుంటే బాధగా అనిపించింది.మీ స్నేహితులను కలుసుకోవాలన్న మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

తృష్ణ చెప్పారు...

heart touching...మీ కోరిక తీఆలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Happy New Year అండి...!

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

హ్యాపీ న్యూ ఇయర్

krsna చెప్పారు...

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు...!!

sunita చెప్పారు...

mee naestaalandarinee meeru malhlhee kalavaani andaroo aroegyamgaa haayigaa unDaalani koerukunToo,

I wish a happy and prosperous new year to you and your friends.

భావన చెప్పారు...

Happy Happy New Year Jaya. జీవితం తీసుకువెళ్ళే దారిలో నడీచే వారు కొందరైతే కొట్టుకుని పోయే వారు కొందరు. ఎదురు గాలికి నిలబడి నిబ్బరించుకునే వాళ్ళు మరి కొందరు. హ్మ్ నిట్టూర్పుల భారాల వెనుక సర్వే జనా సుఖినోబవంతు.. అని మనస్పూర్థి గా కోరుకోవటం తప్ప.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

e-book చేతికి రాగానే వెతికానండి మీ టపా కోసం :) చాలా బాగా రాసారు. మీకోరిక తీరాలని కోరుకుంటూ.. మీకూ మీకుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

మంచు చెప్పారు...

మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జయ గారు.

మీ పిజ్జా బేస్ గురించి త్వరలొనే రాస్తాను .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

లత చెప్పారు...

చాలా బావుందండీ.అంతా చదివేసరికి కళ్ళు చెమర్చాయి.
మీరంతా మళ్ళీ కలవాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Hima bindu చెప్పారు...

Happy newyear

శ్రీలలిత చెప్పారు...

మీ ఙ్ఞాపకాలెంత గిలిగింతలు పెట్టాయో.. ఒక్కసారి చిన్ననాటి ఆటలన్నీ గుర్తుకొచ్చేలా చేసారు. మీకూ, మీ కుటుంబసభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.....

రాధిక(నాని ) చెప్పారు...

జయగారు,నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ నూతన సంవత్సర వేడుక జ్ఞాపకాలు నాకూ చాలా నచ్చాయండి.మీ స్నేహితులందరూ మళ్ళి కలుసుకోవాలని ,ఆ ముచ్చట్లు కుడా మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
చిన్నప్పటి పాటలు పూర్తిగా గుర్తులేవు .అవన్నీ చాలా బాగా రాసారు.

మాలా కుమార్ చెప్పారు...

happy new year

Ennela చెప్పారు...

అయ్యారే అయ్య..వండర్ఫుల్ జొయ.

అలాంటి తెలుగు ఆటలు ఆడించేసారా!నాతొ చెప్పి ఉండొచ్చుగా నేనూ అక్కడ రిసర్చీ చేసేదాన్నీ

'ఎవరికెవరు యీ లొకంలో ఎవరికి ఎరుకా...యె దారెటు పొతుందో ఎవరినీ అడుగకా....పాట గుర్తొచ్చింది యెందుకొ....

శిశిర చెప్పారు...

బాగున్నాయండి మీ జ్ఞాపకాలు. ఈ సంవత్సరం మీరందరు తప్పక కలవాలని, మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శివరంజని చెప్పారు...

జయగారు,నూతన సంవత్సర శుభాకాంక్షలు.జ్ఞాపకాలు బాగున్నాయండి.
మీ స్నేహితులను కలుసుకోవాలన్న మీ కోరిక తప్పక నెరవేరుతుంది

Ennela చెప్పారు...

jaya gaaru..mee blog kudi top corner lo unna neelam rangu machine yenTo bhalegaa undi..mississauga ani nannu choopinchestondi...bhale bhale....(idi panjaabee bhalle bhalle kaadu....mari...telugu bhale bhale annamaata..nenu chappatlu kuda kodutunnaa alaa annappudu)

జయ చెప్పారు...

@ అను గారు మా జస్పాల్ నా పక్కనే ఉందనిపించారండి:) థాంక్యూ.

@ తృష్ణా థాంక్యూ.

@ వంశీకృష్ణ గారు థాంక్యూ.

@ krsna గారు మీకు కూడా థాంక్స్.

@ సునిత గారు, అవునండి...మ స్నేహితులందరం తప్పకుండా కలుస్తామనే గాఢ నమ్మకం నాకుంది. థాంక్యూ.

@ భావనా...ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...థాంక్యూ.

@ వేణూ శ్రీకాంత్ హారు, నిజ్జంగా...ముందుగా, నా టపా కోసమే చూసారా:).అవునండి. ఎప్పటికైనా మేము కలుస్తాం. లేకపొతే ఎలా!

జయ చెప్పారు...

@ మంచు గారు థాంక్యూ. పిజ్జా గురించి మరచిపోకండేం.

@ సుబ్రహ్మణ్యం గారు థాంక్యూ. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

@ లత గారు చాలా థాంక్సండి. తప్పకుండా మా స్నేహితుల్ని కలుసుకొని మీకు మళ్ళీ ఆ ముచ్చట్లు చెప్తాను.

@ చిన్ని గారు థాంక్యూ.

@ శ్రీ లలిత గారు థాంక్సండి. అప్పుడప్పుడిలా చిన్నపిల్లలమైపోతే చాలా మజా వస్తుంది కదూ:)

జయ చెప్పారు...

@ రాధిక గారు థాంక్సండి. మీకు తప్పకుండా ఆ ముచట్లు చెప్తాను. తొందరలోనే వాళ్ళని కలవాలనుకుంటున్నాను.ఎప్పుడూ అలా ఆడుకుంటూ...పాడుకుంటూ ఉంటే భలే బాగుంటుంది కదూ:)

@ అక్కా థాంక్యూ.

@ ఎన్నెల గారు మా జస్పాల్ నన్ను పిలిచినట్లనిపించింది. ఆ ఆటలు ఇప్పుడు మీ దేశంలో ఆడించేయండి. ఇంకా ఎక్కువ మజా వస్తుంది:) నిజంగా చాలా మంచి పాట గుర్తు చేసారండి. చూసారా! నాకు ఆ బ్లూ కార్నర్ లో ఎవరు ఏఊరో ఎలా తెలిసిపోతుందో కదా. మరి మీరు కూడా ఓ కార్నర్ పెట్టేయండి.మీకు నా డబుల్ భల్లె భల్లె...పంజాబిలోనే:)

@ శిశిర ఏమైపోయారీమధ్య. దిగులుపెట్టేసుకున్నాను తెలుసా! థాంక్యూ.

@ హాయ్ సెంచురీ శివానీ. ఈ మధ్య ఎక్కడికో చెక్కేసినట్లుందే:) థాంక్యూ.

Ennela చెప్పారు...

urgent..urgent..urgent....
jaya gaaru, mee paatha postulonchi 4 cheeralu urgentgaa kaavalenu..naaku oka parama veera chakra..oka bhaarata ratna, oka padma bhooshan, oka bettee chakra ane birudulu iyyadaaniki auschahikulu busy gaa dates fix chestunnaaru...mee daggara cheeralu techchukuni vastaa ani cheppaanu...chaalaa urgent please!

జయ చెప్పారు...

ఓ.కే...ఒ.కే...ఓకే...పరమవీరచక్రకి రెడ్,భారతరత్న కి వైట్, పద్మభూషణ్ కి బ్లూ, ఇంకపోతే ఇంకేదో చెప్పారే దానికి యెల్లో కట్టుకోండి బాగుంటుంది. మరి నన్ను కూడా రానిస్తారా. ఆ ఫొటోలన్నీ మళ్ళీ నా బ్లాగ్ లో పెట్టుకుంటానే. ఇంతకీ...నాకేంటంట....

Ennela చెప్పారు...

thanks jaya gaaru, badulugaa naakochchina saaluvaallonchi okati meekichchestaa..poola dandalannee meeve..okna?

Sasidhar Anne చెప్పారు...

Bavunnayi andi mee new year jnapakalu :) College lo dabbulu lekapoyina entho anadam ga gadipey vallam.. Kani ippudu anni vunna.. inka kavali ani kalam parugu pandem lo parigeduthune vuntam..
Anduke college life andariki valla jeevithala lo oka madhura jnapakam. mee madhura janpakanni maa mundu vunchi nanduku danyavadalu

పరిమళం చెప్పారు...

తీపి ...చేదు ...జ్ఞాపకాల కలయికే జీవితం...జయ గారు మీ కోరిక ఈ నూతన సంవత్సరంలో సఫలం కావాలని కోరుకుంటున్నాను.Happy new year!

జయ చెప్పారు...

@ హాయ్ ఎన్నెల, శాలువ వద్దులే గాని...చలి ఎక్కువగా ఉంది చక్కటి స్వెట్టర్ ఇవ్వమని నాకోసం అడిగి తీసుకోండి. సరనా.

@ శశిధర్ గారు థాంక్యూ. మీ మటలు అక్షర సత్యం. అందుకే అన్నారు గతకాలం మేలు వచ్చుకాలం కంటే:) అని.

@ పరిమళం గారు థాంక్యూ. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా అని ఆ దేవుడిని అడగాలనిపిస్తుంది.

Sasidhar Anne చెప్పారు...

jaya akka.. nannu sasigaru ani analsina pani ledu.. meekante chinna vadini.. thammudu la bavinchi sasi anandi chalu..
Nestam akka la.. meeru ee blog lokam lo naaku maro akka annamata :)

జయ చెప్పారు...

Thankyou Sasidhar:)

Sasidhar Anne చెప్పారు...

akkaya.. sankranthi subhakanshalu..

SRRao చెప్పారు...

జయ గారూ !

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

జయగారు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి. నా బ్లాగు తాత్కాలికంగా ఆపాను. త్వరలోనే మరల మొదలుపెడతాను.

ధన్యవాదములు.

మురళి చెప్పారు...

చాలా చాలా బాగుందండీ టపా.. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..

జయ చెప్పారు...

శశిధర్, రావ్ గారు, విశ్వప్రేమికుడు గారు, మురళి గారు ధన్యవాదాలు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner