20, జనవరి 2011, గురువారం

ఈ కోరిక తీరాలా!!!

నాలోని నవరసాలు - కరుణ




పార్క్ లో అలా మెల్లిగా అన్నివైపులా చూసుకుంటూ, ఏదో లోకంలో ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాను. ఇంతలో చాలా గట్టిగా ఓ పాట వినిపిస్తోంది.. ...జీజమ్మ జీజమ్మా అమ్ముకున్నా చీకతిలో..తుమ్ముకొచ్చే ఎలుగువమ్మా...గజ్జ కత్తి కచ్చి పడితే...తిత్తు రేపీ పాడు అమ్మా.నీ కన్ను తురిమి చూడగానే ..జేజిమ్మా...మాయమ్మా....ఓయమ్మా...మాయమ్మా...జేజమ్మా...మా జోజమ్మా.... అంటూ. విన్న పాట లాగే ఉంది గాని ఆ పదాలేవిటో అర్ధం కాలేదు. మహా కర్ణకఠోరంగా ఉంది. వెనక్కి తిరిగి చూసాను. అక్కడే మూలకి ఒక అమ్మవారి గుడి ఉంది. గ్రిల్స్ మూసి ఉన్నాయి. వాటి సందుల్లోంచి, చేతులు ఇరికించి లోపలికి చాపి చాలా ఆవేశంగా జేజమ్మ పాట పాడుతున్నాడు ఓ ఏడెనిమిదేళ్ళ అబ్బాయి. ఎంతో బాగా ఖూనీ చేస్తూ మరీ పాడుతున్నాడు ఆ పాటని. వాడి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒకసారి వాడిమొహం చూడాలనిపించి దగ్గరికెళ్ళాను. వాడి మొహం గ్రిల్స్ లో ఇరికించి మరీ పాడుతున్నాడు. భుజం మీద చేయివేసి వెనక్కి తిప్పాను. గిర్రున తిరిగి చాలా కోపంగా నా వైపు చూసాడు. వాడు గుడ్లురిమి మరీ నన్ను చూస్తున్నాడు. అంత కోపమెందుకా అని తెల్లబోయి చూసాను. అంతే కాదు వాడి కళ్ళనిండా నీళ్ళు నిండి ఉన్నాయి. నా చేతులు బలంగా తోసేస్తూ...మా అమ్మను సంపేయాలా...అన్నాడు. అద్దిరిపోయాను. ఏమీ అర్ధం కాలేదు.

ఈ లోపలే ఇంకో ఇద్దరు ముగ్గురు చేరారు. ఎవరో ఓ పెద్దాయన అడిగారు, ఏమయింది బాబూ అని. నీ కెందుకు బే ...అన్నాడొక్కసారిగా. వాడి భాషకు పాపం ఆయన తల్లడిల్లి కొంచెం వెనక్కి తప్పుకున్నారు. వాడిలో అంత విసురు చూసాక ఇంక ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు. వాడు మళ్ళీ గ్రిల్స్ లో చేతులు దూర్చేసి, ఈసారి ఇంకా గొంతు పెంచేసాడు. వాడికేదో చాలా పెద్ద సమస్యే ఉందనిపించింది.
ఇంతలో ఒకబ్బాయి, అంకుల్ వాళ్ళమ్మ అక్కడే ఉంది అన్నాడు. దూరంగా ఒకావిడ శూన్యంలోకి చూస్తూ చాలా అతీతంగా కనిపించింది. కూలీనాలీ చేసుకునే ఆవిడ లాగుంది. వాడి గొంతు భరించలేక ఒకాయన ఆవిడ్ని పిలిచారు. ఏంటమ్మా..ఏమయింది, ఏంటీ గోల అన్నారు. ఆవిడేం మాట్లాడలేదు. ఏంటమ్మా, చూడు వాడెట్లా గొడవ చేస్తున్నాడో...నువ్వేంచెప్పకపోతే ఎట్లా అంది ఒకావిడ. అప్పటికీ ఆమేం మాట్లాడలేదు. ఇంకా ఏం చేయాలో ఎవరికీ తెలీక ఒక నిముషం అక్కడ మౌనం రాజ్యమేలింది. కాని వాడి పాట భరించలేక పోతున్నాము.

ఆమె మెల్లిగా అక్కడినుంచి వెళ్ళిపోతోంది. ఎవరికీ ఏమీ అర్ధంకాలేదు. ఇంతలో వాచ్మన్ వచ్చి ఆమెతో, తుమ్హారా లడకాకో లేకే బాహర్ చలేజావ్, జల్దీ...అన్నాడు. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా, నిర్లిప్తంగా, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. ఎవరోవెళ్ళి ఆ అబ్బాయిని బలవంతాన గ్రిల్స్ లోంచి బయటికి లాగారు. వాడు విపరీతమైన కోపంతో, అరె ఓ సైతాన్...అంటూ, ఎగిరి ఒక్క తన్ను తన్నాడు. బిత్తరపోయి కిందపడిపోతున్న ఆయన్ని పక్కన వాళ్ళు అతి కష్టం మీద ఆపగలిగారు. ఇంక చూస్తున్న వాళ్ళ ఓపిక నశించిపోయింది. ఆయన వాడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకొని, ఏవమ్మా...అలా వెళ్ళిపోతావ్. నీ మొగుడు బాగా తాగొచ్చి వీడ్ని కొట్టాడా ఏంటి....ఇట్లా ఊరిమీద పడ్డారు ఇద్దరూ...అని కోపంతో అరిచాడు.

ఒక్కసారిగా భళ్ళున పగిలిన ఆ తల్లి హృదయం బయట పడేసిన జీవన సత్యం ఇదే.....

వాళ్ళు ఉంటున్న స్లమ్ ఏరియా గవర్నమెంట్ ది. పొద్దున్నే వాళ్ళ గుడిసెలన్నీ కూల్చేసారు. ఉన్న ఒక్క పెట్టె, కొంచెం వంట సామాను పాడైపోయాయి. ఆ పెట్టెలో వాడినెంతో ప్రాణపదంగా చూసుకొనే...తన కళ్ళముందే భవంతి నిర్మాణం లో అనుకోకుండా పైనుంచి కిందపడి చనిపోయిన ... వాళ్ళ అయ్య ఫొటో ఉంది. అది ఎందుకూ పనికి రాకుండా పూర్తిగా చినిగిపోయింది. పొద్దుటినుంచి తినక పోయినా, ఉండటానికి చోటులేకున్నా వాడికి బాధేలేదు. వాళ్ళ నాన్న ఫొటో మళ్ళీ తేలేని తల్లిని చచ్చిపొమ్మంటున్నాడు. మాటలు కూడా సరిగా రాని వాడికి తన జీవితంలో మంచికీ చెడుకీ అన్నిటికీ , ఎప్పుడూ తన కళ్ళముందుండే తల్లే కారణమనుకుంటున్నాడు. కాని ఉన్న ఆ ఒక్క నీడకూడా వాడికి లేకుండా పోతే ...తరువాత ఏమిటి అన్న ఆలోచనే లేక వాళ్ళ నాన్న కోసం, అమ్మ మీది కోపంతో తనకు వచ్చిన పాటతో ఆ దేవతను వేడుకుంటున్నాడు. వాడికళ్ళల్లో బాధ...ఉక్రోషం...ధ్వేషం... ప్రజ్వరిల్లిపోతోంది.......

ఇపుడు ఎవరి తల్లో జేజమ్మ దిగివచ్చి వాడి బాధ తీర్చాలి? తాను క్షణాల్లో పోగొట్టుకున్నది జీవితమంతా ఎదురుచూసినా మళ్ళీ పొందగలడా!!!! ప్రేమరాహిత్యానికి మించిన శిక్ష మనిషికి ఉందా!!!!!

కొంచెం కళ్ళు మూసుకోండి....ప్లీజ్...ఇది జరగకపోతే బాగుండు..........


***********************************************************************************

23 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చదువుతుంటే చాలా బాధ గా ఉంది.

తృష్ణ చెప్పారు...

no words jaya gaaru..

లత చెప్పారు...

చాలా బాధేసిందండీ

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Very Sad :(

Ennela చెప్పారు...

oooooh!very sad

Sasidhar Anne చెప్పారు...

Akka, Starting aa song chadivi entha navvano.. chivarlo antha badha paddanu.
Tandri photo poyindi ani aa abbayi badha paduthunte. Kanna thalli ni chi po ante, aa thalli hrudayam entha badha paduthundo oohinchukunte edo rakam ga vundi.

chadivini maaake ila vunte, chusina meeru entha bada padi vuntaro..

శిశిర చెప్పారు...

హ్మ్.. పసి మనసు. ఆ మనసుని ఊరడించలేని తల్లి మనసు. నిజమేనండి. ప్రేమరాహిత్యానికి మించిన శిక్ష ఉండదేమో.

మురళి చెప్పారు...

మీ టపాలు చాలా వరకూ ఇంతేనండీ.. చదివి వెళ్లి పోలేం.. మాతోపాటు తీసుకుపోతాం....

జయ చెప్పారు...

@ అను గారు నిజంగా చాలా బాధనిపిస్తుంది.

@ రాధిక(నాని) గారు, ఏవిటో ఇదంతా అనిపిస్తుంది.

@ తృష్ణా, అవును ఇది ఏ మాత్రం మాటల్తో తీరేది కాదు.

@ లత గారు, మనకు తెలియని ఇటువంటి 'బాధలు ' ఇంకా ఎన్ని ఉన్నాయో కదా!!!

@ వేణూ శ్రీకాంత్ గారు, ఇటువంటి సమస్యలు లేకుంటే బాగుంటుంది కదూ!!!

జయ చెప్పారు...

@ శశిధర్, మనమేం చేయగలం, ఇలాంటివి చూస్తూ బాధపడుతూ ఉండటమే.

@ శిశిరా, ప్రేమరాహిత్యం అనేది తలచుకుంటేనే ఎంత భయమేస్తుందొ. ఇటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడగలిగేది వాళ్ళలోని ప్రేమాభిమానాలే కదా. అదికూడా కరవైతే ఎలా?

@ మురళి గారు ధన్యవాదాలండి. ఏవిటో అలా పిచ్చి రాతలు రాసేస్తూ ఉంటాను అంతే.

ప్రణీత స్వాతి చెప్పారు...

అయ్యో..పాపం! చాలా బాధేసింది చదువుతోంటే..

జయ చెప్పారు...

అవును ప్రణీత. అది మన చేతిలో లేని విషయం కదా.

Ennela చెప్పారు...

దొరికిందిలే...దొరికిందిలే..జోయగారి బ్లాగ్ మళ్ళీ పిలిచిందిలే.....

జయ చెప్పారు...

రియల్లీ అయాం వెరీ సారీ ఎన్నెల గారు. మీ కామెంట్ కి నా ఆన్సర్ ఎలా మిస్ అయ్యిందొ, నేను గమనించలేదు. ఏమీ అనుకోకండి. ప్లీజ్.

Ennela చెప్పారు...

మీరు భలేవారే...అయ్యో, మీరు కనబడట్లేదు-మీ బ్లాగ్ తెరుచుకోవట్లేదు అని బెంగ పడ్డానన్నమాట..మీకు తెలుసుగా బెంగ పెట్టుకుంటే ఏమవుతుందో...ఇప్పుడు మళ్ళీ హాప్పీస్...అందుకని...ఆనందంలో...అలా దొరికిందిలే సాంగ్ వేసుకున్నా...అంతే అంతే..మీరు నొ వర్రీస్ ఓ కే నా?
అయినా మీరు నన్ను మిస్స్ చేసారని నేను చూడను కూడ చూడలేదు.. ఇప్పుడు మీరు చూపించి నన్ను ఫీల్ చేయించేసారు...అస్సలు మీరు నన్ను ఎలా మిస్స్ అయ్యారండీ..ఎలా మిస్స్ అయ్యారూ?

జయ చెప్పారు...

అయ్యో, ఇప్పుడు మీరు ఫీల్ అయి...నేను వర్రీ పెట్టేసుకుంటే...తెలుసుగా, నేనేమైపోతానో:)

Ennela చెప్పారు...

నిజమేనండి. ఇంక నేను, మీరు
నొ వర్రీస్-హాప్పీస్... ఓ కే నా?

కృష్ణప్రియ చెప్పారు...

అయ్యో.. :((

జయ చెప్పారు...

కృష్ణప్రియ గారు థాంక్యూ. మనం చూస్తూ, బాధపడల్సిందే. చేయగలిగేది ఏమీ లేదు. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకేదైనా దారి చూపిస్తే బాగుండు.

శిశిర చెప్పారు...

జయగారు, ఎన్నెలగారు,
మీరిద్దరూ ఇక్కడ మట్లాడేసుకుంటున్నారా? నేనేమో అక్కడ నా బ్లాగులో విషయమేమిటో అర్ధంకాక అమాయకంగా మొహం పెట్టి జయగారొచ్చి చెప్పకపోతారా అని ఎదురుచూస్తూ కూర్చున్నా. :( ఎన్నలగారు ఏదో హింట్ ఇవ్వబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇటొచ్చా గానీ, లేకపోతే "ఏమిటి రామయ్యా, దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్" టైపులో విషయమేమిటా అని దీర్ఘాలోచన చేస్తూ కూర్చుందును. ధన్యవాదాలు ఎన్నెల గారు. :)

శివరంజని చెప్పారు...

జయ గారు ఏడుపొచ్చింది తెలుసా పోస్ట్ చూస్తుంటే .....పాపం ఆ బాబు

జయ చెప్పారు...

ఏమ్మా శిశిరా మేడం, మీ బ్లాగ్ లో బాగానే డిస్కషన్ పెట్టేసుకున్నారుగా. నేను చాలానే మిస్ అయిపోయాను. ఓకే, అయాం వెరీ సారీ...అన్నాగా వెయ్యో సారీ. ఇదిగో సారీలు చెప్పాల్సిన శివరంజని వచ్చేసింది:)



హాయ్ శివాని, హౌ ఆర్ యూ. చూసావా, ఇప్పుడు నేను సారీ చెప్పాను:) ఒద్దు అంత బాధ పడొద్దు. మనకు చాతనైన సహయం చేద్దాం. అంతకు మించి చేయగలిగేది ఏముంది.

Ennela చెప్పారు...

శిశిర గారు అవునా, మీ కామెంటు చూసి ఎంత నవ్వానో చెప్పలేను....మీరు నా మాటిని మీ గొడ్ల చావడికి చార్మినార్ రేకులు వాడెయ్యండి...నాణ్యతకీ మన్నికకీ పేరెన్నిక గన్నవి అవేగా...!!!!

జయ గారు సారీ అండీ మీ అనుమతి లేకుండా శిశిర గారి దీ ఈ ఈ ఈ ర్ఘాలోచనకి చుక్క పెడదామని ప్రయత్నించా...


పాపం శివరంజని పేటెంట్ 'సారీ'ని అందరం ఎడాపెడా వాడెయ్యల్సి వస్తోంది..

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner