9, జూన్ 2011, గురువారం

నింగికెగిసిన నవీనాంధ్ర

"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ముత్యాల సరాలల్లె ముచ్చటైన కవితలల్లిన
నవయుగ వైతాళీకుడు "గురజాడ".

"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని"
అంటూ రమ్యలోకాన అమరప్రేమను చాటిన
మన యుగకర్త "రాయప్రోలు"

ఆంధ్ర కవితల అలరించి
గోదారి అలలపై నిదురపుచ్చి
అందమైన సొగసు తొడిగిన
ఎంకి పాటల "నండూరి".

ఆధునిక సమాజపు అలజడులపై
వేయిపడగలెత్తి బుసకొట్టి
రామాయణ కల్పవృక్ష శాఖల
జ్ఞానపీఠమెక్కాడు మన "కవిసామ్రాట్"

ఏదేశ చరిత చూసినా ఏమున్నది గర్వకారణం
అంటూ చరిత్రకు నూతన అర్ధాన్ని ఇచ్చి
"నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చా"
అంటూ జగన్నాధ రధమధిరోహించి
మరో ప్రపంచ ’మహాప్రస్థానం’ చేసిన
విప్లవకవి శ్రీ శ్రీ.

"నా తెలంగాణ కోటి రతనాల వీణ"
అని "రుద్రవీణ"ను
అగ్ని ధారలు కురిపించిన
మహారధి "దాశరధి".

పుష్పవిలాపాన పూలబాధలు తెలిపి
అహింసా తత్వ భాష్యాన్ని ప్రవచించి
జగతిన సుస్థిరమై నిలిచాడు
కరుణారస కవి "కరుణశ్రీ".

ఆకులో ఆకై పూవులో పూవై
ఊర్వశి హృదయ తరంగాలను తాకి
కవితా సుందరిలో వలపు రగిలించిన
భావుకుడు "కృష్ణశాస్త్రి"

కర్పూరవసంతాలతో
కమ్మని కవిత్వ మందించి
విశ్వంభరలో విశ్వమానవ పరిణామం
విపులంగా చూపించి
కవితా నర్తనమాడిన
నవ కవన చక్రవర్తి "సి.నా.రె".

తెలుగు భాషకు సాహిత్యానికి ఔన్నత్యాన్ని పెంపొందించి... గౌరవస్థానం కల్పించి, ఆంధ్రదేశం పట్ల మమకారాన్ని పెంచి, చక్కటి గుర్తింపు నిచ్చిన ఈ మహానుభావులు...ఎందరో,ఎందరో, ఇంకెందరో మహాను భావులు...అందరికీ వందనాలు......ఈ వైభవం కలకాలం నిలవాలి. ఎన్నో తరాలు తరించాలి. (ఈమధ్యే ఇవన్నీ చదువు.....తూ....ఉన్నాను)

*********************************************************************************

10 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

చాలా చదివేస్తున్నారన్నమాట. నాకు కూడా "వెంటనే ఇవి చదువమ్మాయ్" అని కొన్ని పుస్తకాలు చెప్పకూడదూ. అవును, వైభవం కలకాలం నిలవాలి. ఎన్నో తరాలు తరించాలి.

మురళి చెప్పారు...

ఆకులో ఆకై పూవులో పూవై
ఊర్వశి హృదయ తరంగాలను తాకి
కవితా సుందరిలో వలపు రగిలించిన
భావుకుడు "కృష్ణశాస్త్రి" ...Brilliant!!!

జయ చెప్పారు...

@ ఏవిటీ చదివేది. ఆ వేయి పడగలు నా జీవితమంతా చదవాల్సిందే::)) శిశిరకి చెప్పగలిగేంత పెద్దదాన్నా నేను:)

@ మురళిగారు థాంక్సండి. ఈ మధ్య ఎందుకో కవితల మీదకి గాలి మళ్ళింది. అంతే.

శిశిర చెప్పారు...

>>>శిశిరకి చెప్పగలిగేంత పెద్దదాన్నా నేను:)
అదే మరి. ఏడిపించడానికి నేనే దొరికానా? అలిగేస్తానంతే. :)

శివరంజని చెప్పారు...

జయ గారు మీరు సూపర్ ..........అందరు కవుల గురించి ఇంత అందం గా ఒకే పోస్ట్ లో చెప్పే మీ కాన్సెప్ట్ సూపర్

శివరంజని చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శివరంజని చెప్పారు...

శిశిరకి చెప్పగలిగేంత పెద్దదాన్నా నేను:) >>>>>>>>>>>. శిశిర గారి దగ్గర ఈ మాట అనాల్సింది నేను జయ గారు

Ennela చెప్పారు...

బాగా వ్రాసారు జయ గారూ

Ennela చెప్పారు...

బాగా వ్రాసారు జయ గారూ

జయ చెప్పారు...

@ శిశిరా, నేనెప్పుడో చెప్పాగా, నాకున్న నాలెడ్జ్ చాలా చిన్నదని:

@ శివానీ...థాంక్యూ. ఓకే శిశిర దగ్గిర ఆ మాట అనెయ్యాలి మరి.
సరేనమ్మా...శిశిర నాకు కూతురు, శివాని నా మనవరాలు. సరేనా:)

@ ఎన్నెల గారు థాంక్యూ.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner