20, జూన్ 2011, సోమవారం
పక్షి గోల!!!
మనం రోజూ మాట్లాడుకొనే మాటల్లో పక్షులకు సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి గుర్తుకు తెచ్చుకుంటె ఎంత తమాషాగా ఉంటుందో.... చూడండీ, మీకైతే ఇంకా చాలా తెలుసు. కలిపించి కల్పించి...కల్పించుకొనీ మరీ చెప్పుకోవచ్చు.
అబ్బా! ఏమిట్రా కాకిగోల, బయటికి వెళ్ళి ఆడుకో.
వాడి చూపులు మండ! గుడ్లగూబలా అలా చూస్తాడేం?
నీ డబ్బు వాడికి చూపించకురా వాడు చూసాడంటే డేగలా ఎత్తుకుపోతాడు.
వడ్రంగి పిట్టలా తలుపు టకటకా కొడతావెందుకురా?
ఆ వాళ్ళకేంటి హాయిగా చిలకా గోరింకల్లా ఎంత హాయిగా ఉన్నారో.
ఆహా ఏమిటా స్వరం, కోకిల స్వరంలా.
ఏమిటా అరుపులు ఊరపిచ్చుకలా.
నామీదనాండీ మీ కోపం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా!
ఇది నలుగురికీ తెలిస్తే ఏమన్నా వుందా!!! లోకం కోడై కూస్తుంది.
ఇకచాల్లేవోయ్ కొంగ జపం.
ఆహా ఏమిటా నడక, హంస నడకలా....
పాపం అతన్ని చూడు రెక్కలు తెగిన పక్షిలా ఎలా విల విల్లాడుతున్నాడో...
వాళ్ళిద్దరికీ అస్సలు పడదండీ ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు.
చకోర పక్షిలా ఎదురుచూస్తునే ఉన్నాడు. అయినా పాపం ఇంకా ఉద్యోగం రాలేదు.
బాగున్నాయా....ఏవిటీ నీ పక్షి గోల అంటారా...సరేనండి...ఇంక ఆపేస్తాను:)
మీరు కూడా కొన్ని చెప్పొచ్చుగా!!!!!!
***********************************************************************************
లేబుళ్లు:
సరదాగా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
బావున్నాయి కబుర్లు.
చిన్నపిల్లల మాటలను చిలకపలుకులు అంటాము
మీకు ఇలాంటి టపాల ఐడియాలు భలే వస్తుంటాయి. :)
చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటుండగా తరచుగా విన్న ఒక సామెత - వెనకటికి ఒకామె నా కోడీ, కుంపటీ లేకపోతే తెల్లారదందట.
ఏమీలేదండి, ఇందాకటి నా వ్యాఖ్య చదువుకుంటే నాకే కొంచెం డౌట్ వచ్చి డిలీట్ చేసాను. :)
అన్నీ మీరే చెప్పేశారుగా :))
* లత గారు థాంక్స్. చిట్టి చిలకమ్మ పలుకులు... తేనెలూరే చంటి పిల్లల పలుకులు ఒకటే కదూ. బాగా చెప్పారండి.
* ఎందుకూ డౌట్ శిశిరా, నిజమేగా:)
* మురళి గారూ, అన్నీ కాదు కొన్నే...మీకు ఎన్నో ఇంకా చాలా చాలా నే మిగిలాయి:)
జయ గారు బాగున్నాయి మీ కబుర్లు
Thank you David garu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి