25, జులై 2011, సోమవారం
మా అక్క పుట్టింరోజండీ ఇవాళ...
అక్కా!!! హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పేరుకు అక్కే అయినా తల్లి కన్నా నాకు ఎక్కువే.
ఎన్నో సలహాలు....ఎన్నో సహాయాలు...ఎంతెంతో ప్రేమా అభిమానం చూపిస్తావు.....
కోపమొచ్చినప్పుడు తిట్టినా....సరి అయిన మార్గం చూపిస్తావు....
నా పిరికి తనానికి కోపం తెచ్చుకొని....నన్ను సరిదిద్దుతావు.......
ఊరికే ఏడ్చేసే నాకు లోకాన్ని తెలియచేసావు......
ఆవేశపడిపోతానని.....తొందరపాటుతో నేనేం చేసేస్తానో అని భయపడిపోతావు......
నేను సంతోషంగా ఉంటే...నా చిన్న నవ్వుకే పులకించి పోతావు.....
నాకు చిన్న కష్టమొస్తే చాలు.....విలవిలలాడిపోతావు......
ప్రేమ చూపి, తోడునీడగా నిలచి, బ్రతుకు నేర్పిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను....
చిన్నప్పుడు ఇంటిపట్టునుండకుండా, ఎక్కడెక్కడో తిరిగి పిచ్చి ఆటలన్నీ ఆడి వచ్చే నన్ను అమ్మ తిడితే....ఎంత ఆదుకునే దానివో....
నాకోసం చిన్న చిన్న త్యాగాలు కూడా చేసేదానివి....నాకు ఇంకో అక్కకూడా ఉండేది. కాని నేను తనని చూడనుకూడాలేదు. నేను పుట్టకముందే చనిపోయింది. తనుకూడా ఉంటే నాకు ఇద్దరు అక్కలుండే వారు. కాని ఆ లోటేం తెలియకుండా అందరికన్నా నువ్వే ఎక్కువనిపించావు.....
నా చదువంతా నీ దగ్గిరేగా.....నీ పిల్లలతో సమానంగా చూసుకున్నావు....వాళ్ళతోపాటూ నాకూ అన్నీ కొనిచ్చావు...నాకు బావగారంటే చాలా భయం....కాని ఆ భయమంతా పోగొట్టేసావ్......ఇప్పుడైతే...కొన్నిసార్లు పోట్లాడే స్థాయికొచ్చాను......బావగారంటే నాకెంత గౌరవమో చెప్పలేను...ఏం చెప్పినా...వెంటనే మాట్లాడకుండా చేసేస్తాను:) చివరికి నా పెళ్ళి కూడా మీ ఇద్దరి చేతుల మీదేగా జరిగింది.......
నాకు డాక్టరేట్ అవార్డ్ అయితే నీకే డిగ్రీ ఇచ్చినంత గర్వపడిపోయావ్....అందరికీ ఎంత గొప్పగా చెప్పావో......
నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంబరపడిపోయావో....నేను ఉన్నత శిఖరాలు అందుకోవాలని...ఎంతమంది దేవుళ్ళకు ఎన్ని మొక్కులు మొక్కావో...అవి తీర్చటానికి ఎన్ని అవస్థలు పడ్డావో....నేనెలా మరచిపోగలను....
ప్రతి సంవత్సరం ఓ రెండుమూడు రోజులెక్కడికన్నా పోవాలి అని ప్లాన్ వేసుకున్నామ్. కాని నువ్వేమో గుళ్ళూ గోపురాలు అంటావ్...నేనేమో చెట్లూ తోటలూ అంటాను.....మెల్లిమెల్లిగా మనం దూరమైపోతున్నామేమో అనిపిస్తోంది కొన్ని సార్లు.
బ్లాగులంటే తెలియని నన్ను బ్లాగ్ మొదలుపెట్టమన్నావ్. నేనూ గుడ్డిగానే దూకేసాను....ఆ తరువాత తెలిసింది లోతు....బ్లాగ్ జోలికి పోను అని మొండికేసిన నన్ను....ఎన్నో మురిపాల కబుర్లు చెప్పేసి...ఏదేదో చేసేసి... ఉబ్బేసి..స్వీట్స్ పెట్టేసి...ఎలాగో మళ్ళీ దింపేసావ్. ఇదిగో ఇప్పుడిలా ఈదుతున్నాను.
నీ చేయూత నాకు బలమివ్వాలి.....ప్రతి విషయమూ నీ తోనే చెప్పుకోవాలి. అన్నిటికీ నువ్వే అండ కావాలి. ఎప్పుడూ అక్కా...అక్కా అంటుంది....అని నన్ను ఎవ్వరేమన్నా సరే....నీ నీడనే నేను.....నీ దీవెనలు...ఆశీస్సులు ఎప్పటికీ కావాల్సిందే......
నేనేమివ్వాలి....ఏమివ్వగలను.....
ఎదుటివారి సంతోషాన్ని కోరే నీవు...జీవితమంతా సంతోషంగా గడపాలి.
అపకారికి కూడా ఉపకారాన్ని కోరే నీ ఉన్నత మనస్సు తో గొప్ప ఆనందాన్ని పొందాలి....
ఇవాళ మా అక్కకు అరవై ఏళ్ళు వచ్చాయండి....ఎంతో ఆనందంగా పండగ జరగాలి....మా అక్క ఫ్రెండ్స్ ..చాటింగ్...ప్రమదావనం...ఇంకా బజ్జు ఫ్రెండులు....అందరూ ఇక్కడికే వచ్చి తప్పకుండా మీ శుభాకాంక్షలందించాలి... బ్లాగ్ లోకంలోని నా ఫ్రెండ్స్....మా అక్క ఫ్రెండ్స్.....అందరూ వచ్చేయాలి....రాకపోతే నేను చాలా ఫీల్ అయిపోతానన్నమాట..
సత్యవతి గారి ఇంట్లో ఈ సీజన్ లో పూసిన మొదటి బ్రహ్మకమలం పుష్పాన్ని మా అక్కకి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే తనకిష్టం కాబట్టి....అక్కా, సత్యవతి గారేమన్నా అంటే మాత్రం నువ్వే జవాబు చెప్పేసుకో:)
ఇంతకీ మీ అక్క ఎవరు తల్లీ అంటారా...మీ అందరికీ బాగా తెలుసులెండి.....’సాహితీ మాల’. కేకులు, చాకలెత్తులు, బిసెకత్తులు, గట్రా గట్రా ఏమన్నా కావాలంటే మాత్రం మా అక్కనే అడగండేం:
అవునూ..అక్కా, ఇంతకీ నీ బర్త్ డే కి నాకేమిస్తున్నావ్.....
యాపీ యాపీ బర్త్ డే టు యూ......
***********************************************************************************************************************************************
లేబుళ్లు:
శుభాకాంక్షలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
31 కామెంట్లు:
జయ గారూ, మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునే మీ అక్కయ్య కి ఇక్కడకూడా మా అందరితరపున జన్మదిన శుభాకాంక్షలు.
మీ ప్రియమైన అక్కయ్య మాలగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
జయగారూ ఒక్కమాట
మీరు అరవై వచ్చాయని రాశారు.
మాలగారు ఏమో అరవై నిండాయని రాశారు.
అక్కా, ఇంతకీ నీ బర్త్ డే కి నాకేమిస్తున్నావ్
-----------------------
హ హ సో స్వీట్ :))))
మాల గారికి జన్మదిన శుభాకాంక్షలు !
Hearty Birthday wishes maala gaaru.
మీ ప్రియమైన అక్కయ్య మాలగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మా
మీ...మా...మాలగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
జయగారూ
మాల గారికి జన్మదిన శుభాకాంక్షలు !
మాలా గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
వచ్చేశా. మాలగారికి జన్మ దిన శుభాకాంక్షలు. వారి ముద్దుల చెల్లెలికి అక్క పుట్టినరోజుకి అక్క నుండి బహుమతి కొట్టేయబోతున్నందుకు శుభాకాంక్షలు.
>>>అవునూ..అక్కా, ఇంతకీ నీ బర్త్ డే కి నాకేమిస్తున్నావ్.....
యాపీ యాపీ బర్త్ డే టు యూ......<<<
ఇంత ముద్దుగా అడిగి విషెస్ చెప్పాక ఏ అక్కయినా ఇవ్వకుండా ఉండగలదా! జయగారు, చెల్లెళ్ళందరూ ఇంతే ముద్దుగా, అక్కలందరూ అంతే గొప్పగా ఉంటారేమో కదండీ.!!! ;)))
హేమిటో..
పుట్టినప్పట్నించీ అంత దగ్గర వాళ్ళమని చెపుతున్న మీతో పోటీ పడి మేం కూడా మాలాగారికి అంత దగ్గరివాళ్ళమే అనుకుని మీకన్న ఎక్కువగా ఫీల్ అయిపోతున్నామండీ..
అందుకే.. మీ అక్కగారు మీకేమిస్తారో దానిలో మాకు కూడా వాటా కావాలండోయ్..
HAPPY BIRTHDAY MALA..
అక్కా, ఇంతకీ నీ బర్త్ డే కి నాకేమిస్తున్నావ్...హ్హ..హ్హ..హ్హా
మీ (మా) మాలా గారికి జన్మదిన శుభాకాంక్షలు.
నిజంగా అక్క..ఎవరికైనా జీవితంలో పెద్ద అండ! మీ ప్రతి మాటలో మాలాగారి మీద మీకున్న ప్రేమ..అభిమానం..గౌరవం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. మీ ఇద్దరూ అదృష్టవంతులే! మీ ఈ అనుబంధం కలకాలం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Sweet sisters! :)
మాల గారికి జన్మదిన శుభాకాంక్షలు!
మా మాలగారికి పొద్దుటినుంచీ మూడుసార్లు విషెస్ చెప్పాను ( ఎక్కడ కనపడితే అక్కడ) మరి మీ అక్కగారికి చెప్పకపోతే ఏం బావుంటుంది. జయ గారి అక్కగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు . చెప్పేసానండీ జయగారూ మరి నాకేవిస్తారూ
వావ్.. నా శుభాకాంక్షలు అందజేయండి..
@Malaa Kumar
అక్కా!!! హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
-chinni
బాగారాసావు జయా :) ( మరే అంత పొగిడి తే హి హి హి :))
మాలా కుమార్ గారికి నా హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు
భాస్కర రామి రెడ్డి గారు ,
లత గారు ,
శ్రావ్య ,
తృష్ణ గారు ,
జ్యోతి గారు ,
మంజు ,
అనూరాధ గారు ,
సుజాత గారు ,
శిశిర,
శ్రీలలిత గారు ,
సిరిరి మువ్వ గారు ,
మధురవాణి ,
లలిత గారు ,
మురళి గారు ,
చిన్ని చెల్లెలు గారు ,
అందరికీ బోలెడు బోలెడు థాంకూ లు .
రాజి ,
థాంక్ యు .
జయగారు,
మాల గారు మీకు పుట్టినరోజు బహుమతి ఇచ్చారో లేదో గానీ నాకిచ్చారండీ.. నా పేరు ప్రక్కన 'గారు' తగిలించలేదోచ్.. ఎన్నేళ్ళ నుండి బ్రతిమాలుకుంటున్నాను ఆవిడని, నాకు 'గారు', 'మీరు' తగిలించద్దని. థాంక్యూ మాలగారు. :))
@ భాస్కర రామి రెడ్డి గారు ధన్యవాదాలండీ.
@ లత గారు ధన్యవాదాలు. ఏదో అప్పుతచ్చండి. వచ్చాయి బదులు వెళ్ళాయి అని చదివేసుకోండి:)
@ శ్రావ్య గారు థాంక్యూ. ఏదండీ ఇంకా ఏమివ్వనేలేదు:)
@ తృష్ణా థాంక్యూ
@ జ్యోతి గారు థాంక్యూ.
@ మంజు గారు థాంక్యూ
@ అనురాధ గారు థాంక్యూ.
@ శిశిరా థాంక్యూ. మా అక్క ఎప్పుడూ గొప్పే. నేనే కొంచెం తిక్క:) మొత్తానికి కోరుకున్న బహుమతి సంపాదించేసావుగా. నాకే ఇంకా ఏం దొరకలేదు.
@ శ్రీ లలిత గారు థాంక్యూ. ఇట్లాంటి మస్కాలు చెల్లవండోయ్:)
@ సిరిసిరిమువ్వగారు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అదృష్టవంతురాలినే కాని పాపం నాతో మా అక్క పడే ఇబ్బందులే కొంచెం కష్టం.
@ మధురవాణి గారు, తీయతీయని ధన్యవాదాలు.
@ లలిత గారు థాంక్యూ. మీకేం కావాలన్నా, ఆ లావాదేవీలన్నీ మా అక్కతోనే అని చెప్పేసానుగా:)
@ మురళి గారూ ధన్యవాదాలండి.
@ చిన్ని గారు మా అక్కని పంచేసారా. అయితే మనిద్దరం సిస్టర్స్. ఒప్పుకుంటారా మరి.
@ రాజీ, చాలారోజులయింది కదూ కనిపించి:) థాంక్యూ.
సుజాత గారు ధన్యవాదాలండీ.
Belated Birthday best wishes to Mala garu
కొత్తపాళీ గారు ధన్యవాదాలండీ.
sooper gaa unnai.. mee HaPpY BirtHdAy wishes... Vaatiki naa wishes kooda jodinchandi please....
-Ravi Komarraju
Ravi, Thankyou so much:)
మా పెద్దమ్మలా ఉన్నారు మీ అక్కయ్యగారు, నా శుభాకాంక్షలు కూడా అందజేయ్యండి.
O.Kay శ్రీ గారు మీ పెద్దమ్మ గారికి శుభాకాంక్షలు అందజేద్దాం. Thank you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి