3, ఆగస్టు 2011, బుధవారం

Intellectually Challenged!!!

'Mentally Retarded' అనేకన్నా 'Intellectually Challenged' అంటే ఇంకా బాగుంది కదూ.
ఇదిగో వీళ్ళతోటే మేము Friendship Day చేసుకున్నాం. ఎంతమాత్రం మంచీచెడూ తెలియదు. ఎవరెలాంటివారో అసలే తెలీదు... తమగురించి తమకే తెలీదు...పూర్తి మానసిక వైకల్యమే...అయినా అదేవిటో వారికే తెలీదు.... ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగానే గడుపుతారు. ఏమైనా నేర్పిద్దామని ప్రయత్నిస్తే నవ్వుతూ చూస్తారు. ఆ...బా...వా....అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కానీ, మళ్ళీ నవ్వుకుంటూ మనదగ్గిరికే వచ్చేస్తారు. ఎంతమంచివాళ్ళో, ఎంత అమాయకులో....వాళ్ళు పిచ్చిపిల్లలట. కాదు...ఎంతమాత్రం కాదు. సరి అయిన శ్రద్ధ చూపించి ముద్దారా నేర్పిస్తే, అన్నీ తెలుసనుకునే మనకన్నా చాలా తెలివితేటలే చూపించగలరు. వీరే హైద్రాబాద్ లోని "మానస" స్కూల్ విద్యార్ధులు. నాకు తెలిసిన వారు.

ఈ రోజు వారి ఆటపాటలతో చాలా సంతోషంగా ’స్నేహితుల దినోత్సవం’ చేసుకున్నాం. ఎంతో చక్కగా డాన్స్ లు, పాటలు పాడారు.



ఈ పాప ఎంత చెప్పినా, స్టేజ్ మూలకి వెళ్ళిపోయి చేస్తోంది. కాని చక్కటి క్లాసికల్ స్టెప్స్ ఎక్కడా తప్పకుండా చేసింది, తెలుసా!!!!

ఇదిగో ఇక్కడ నించుంది చూసారా! ఈ పాపే డాన్స్ చేసింది. తెల్లగులాబీ లాగ ఎంత అందంగా, అమాయకంగా నవ్వుతోందో....




ఈ అబ్బాయి వయసెంతనుకుంటున్నారు? మీరు చెప్పలేరు. నాకు తెలుసు. ఎంతోకాదు. కేవలం పదిసంవత్సరాలు మాత్రమే. నమ్మగలరా!!!
చూడండి. హృదయమెక్కడున్నది....అంటూ ఎంతబాగా డాన్స్ చేసాడో....అంతేకాదు, మిగతా పిల్లలందరినీ క్రమశిక్షణ మీరకుండా కాపాలాకాసాడుకూడా. నా కళ్ళతో చూడకపోతే నేనస్సలు నమ్మేదాన్నేకాదు....



ఈ పాప ఎంత చక్కగా రామదాసు కీర్తన పాడిందో...స్పస్టత లేకపోయినా, చక్కటి నిష్ట, ఏకాగ్రతా ఉన్నాయి. సో గ్రేట్.




చక్కటి Friendship Day Bands తయారు చేసారు. అంతేకాదు అందమైన రాఖీలు కూడా తయారు చేసారు. అవన్నీ తీసుకొచ్చి మాకు పంచిపెట్టారు. ఎంతో కళాత్మకంగా చక్కటి గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేస్తారు.

ఇంతతెలివైన పిల్లల్ని చులకన చేసి అందరినుంచి దూరంచేయకుండా మనలోనే కలుపుకుంటే.....అదే అసలైన ఎంతో విలువగల జీవితం...
"చూపులతోనే చులకన భావం వద్దు!
మంచిమాటలతో స్నేహభావం ముద్దు....."

ఈ రోజు నాకనిపిస్తుంది....
"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.
నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను.
నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను......."

నేర్చుకుంటూ ఉన్న వీరి దగ్గిరే నేను ఇంకా నేర్చుకోవాలి. వెలుగుతున్న ఈ దీపమే నన్ను వెలిగించగలదు.వీళ్ళు ఎన్ని సార్లో విఫలమైనా సఫలం కావటానికి మార్గం వెతుక్కుంటూనే ఉంటారు. విజయమే వీరి గమనం.
వీరిపై అపారమైన ప్రేమ కుండపోతగా కుమ్మరించాలనిపిస్తోంది.
నా జీవిత పయనం లో మహోన్నతమైన మజిలీ ఇదే.....మౌనంగా జారే మంచుబిందువులా ఉంది.... కాలగమనంలో......ఈ అందమైన కల కరిగి పోకుండా కలకాలం దాచిపెట్టుకుంటాను.
మనసులో బాధ...గుండెలో వ్యధ....
తోసివేసిన ఈ రాళ్ళను మూల విరాట్టులు చేయటానికి నేనూ చేయూతనిస్తాను.

గొప్పగా మరణించాలి అంటే...గొప్పగా జీవించాలి కదూ.... కనీసం ఒక మనిషిగా నైనా !!!

అందరికీ నా హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
తొందరపడి కూసానా. మేమివాళే కూసేసాం మరి:)



************************************************************************************

14 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

జయ గారూ !

చాలా మంచి పని చేశారు. మీక్కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ నిజమైన స్నేహితులదినోత్సవం జరుపుకున్నారన్నమాట...

"తోసివేసిన ఈ రాళ్ళను మూల విరాట్టులు చేయటానికి నేనూ చేయూతనిస్తాను"

మీ ప్రయత్నంలో మీకు, ఇంకా మీలాంటి మంచి మనస్సు వున్న వారందరికీ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను...

Happy Friendship Day..

కృష్ణప్రియ చెప్పారు...

Inspiring!

లత చెప్పారు...

చాలా బావుంది జయగారు
చేయూతనివ్వడం చాలా గొప్ప విషయం.

అజ్ఞాత చెప్పారు...

నిజమైన ఆనందం వేడుకను ఇలా జరుపుకోటంలొనే వుందండి . గొప్ప అనుభవాన్ని సొంతం చేసుకున్నారు అభినందనలు జయగారు

జయ చెప్పారు...

@ S.R. Rao గారు ధన్యవాదాలండి
@ రాజి, థాంక్యూ.
@ కృష్ణప్రియ గారు థాంక్యూ.
@ లత గారు ధన్యవాదాలండి
@ లలిత గారు ధన్యవాదాలండి.

తృష్ణ చెప్పారు...

"గొప్పగా మరణించాలి అంటే...గొప్పగా జీవించాలి కదూ.... కనీసం ఒక మనిషిగా నైనా !!!" well said జయగారూ. I feel you are really great. జీవితాన్ని చాలా సమంగా సద్వినియోగపరుచుకుంటున్నారు.

మనిషిగా జీవించటానికి గొప్పగా జీవించకపోయినా కనీసం మనిషిగానైనా ఉంటే చాలు అనిపిస్తుందండీ నాకు.

నాకు తెలిసీ ఆగస్ట్ లో వచ్చే first sunday - friendship day అని డిక్లరేషన్ ఉందండీ. ఎప్పుడైతేనేం ఆనందంగా గడపటం ముఖ్యం.

తృష్ణ చెప్పారు...

"గొప్పగా మరణించాలి అంటే...గొప్పగా జీవించాలి కదూ.... కనీసం ఒక మనిషిగా నైనా !!!" well said జయగారూ. I feel u r really great.జీవితాన్ని చాలా సమంగా సద్వినియోగపరుచుకుంటున్నారు.

మనిషిగా జీవించటానికి, గొప్పగా జీవించకపోయినా కనీసం మనిషిగానైనా ఉంటే చాలు అనిపిస్తుందండీ నాకు.

నాకు తెలిసీ ఆగస్ట్ లో వచ్చే first sunday - friendship day అని డిక్లరేషన్ ఉందండీ. ఎప్పుడైతేనేం ఆనందంగా గడపటం ముఖ్యం.

జయ చెప్పారు...

అవును తృష్ణ గారు. రేపే, కాని కొన్ని పరిస్థితులవల్ల మేము ముందే చేసేసుకున్నాం. థాంక్యూ.

శిశిర చెప్పారు...

మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి జయగారు.

Sravya V చెప్పారు...

hm ! Nice !

జయ చెప్పారు...

శిశిరా, ఏముంది నా దగ్గిర నేర్చుకోడానికి!!!!ఎప్పుడూ బుర్రనిండా పిచ్చి ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు.


శ్రావ్యగారు, మళ్ళీ కనిపించారు. థాంక్యూ.

మురళి చెప్పారు...

ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు నాకు ఎలా స్పందించాలో తెలీదండీ.. చాలా ముచ్చటగా అనిపిస్తుంది.. అంతకు మించి మనం చాలా వెనకబడి ఉన్నామనిపిస్తూ ఉంటుంది..

జయ చెప్పారు...

అవునండీ, వాళ్ళ ఆత్మవిశ్వాసం చూస్తే చాలా ముచ్చటేస్తుంది కూడా.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner