7, ఆగస్టు 2011, ఆదివారం
స్నేహమా!
స్నేహమా! వెన్నెల దీపమా!
నా అల్ప జీవితంలో ఎగిసిపడే
భావతరంగం నీ పరిచయం
నా గుండె లోగిలిలో.....
మమతల మకరందాన్ని పంచి,
అనురాగపు జ్యోతుల్ని వెలిగించిన
నా స్నేహ సుప్రభాతమా!....నువ్వెక్కడ?
నీ చిరునవ్వు కుసుమాల పరిమళం,
నన్నింకా వీడిపోకముందే
నా కనురెప్పల క్రింద
నీ జ్ఞాపకాల జలపాతాన్ని మిగిల్చి తరలిపోయావ్!
నిజం మిత్రమా!
ఏ అర్ధరాత్రో.......
నీ అనురాగపు అలికిడి ఆర్తిగా వినిపించినప్పుడు
నువ్వు రావన్న దిగులుతో,
నా దు:ఖం ముక్కలై ...ఏ ముత్యపుచిప్పలోనో
ఎక్కడెక్కడో రాలిపడింది......
**********************************************************************************************************************************************
లేబుళ్లు:
కవితా భావాలు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్‌లు:
చాలా బావుందండి
బాగుందండీ చాలా..
బావుందండీ..very touching !
very nice
లత గారు, మురళి గారు, తృష్ణ గారు, చిన్ని గారు......స్నేహితులందరికీ ధన్యవాదాలు.
Beautiful.. Very Touching!!!
Thanq:)
హ్యాపీ టీచర్స్ డే :)
Thank you my dear Engineer:)
చాల బావుందండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి