బ్లాగ్ మితృలందరికీ ఆనంద స౦బరాల....తెలుగుదనం పల్లవించె.... స౦క్రా౦తి శుభాకాంక్షలు.....
స్నేహభావాలతో కలకాలం విలసిల్లాలని కూడా కోరుతూ....అందరి జీవితాల్లో శుభాలు వెల్లివిరియాలి....
బోసిబోయిన మా భాగ్యనగరి తొందరలోనే నిండాలి.....:)
అంబరాలనంటే సంబరాలతో ఈ సంక్రాంతి శోభ మీ ఇంట నిండిపోవాలి.... అనుబంధాల...ఆత్మీయతల సంక్రాంతిని స్వంతం చేసుకోవాలి...
స౦క్రా౦తి వస్తే మనలో కనిపిస్తు౦ది నవ్వుల కా౦తి
ధనుర్మాస౦లో తప్పక ముగ్గులు పెడుతు౦ది ప్రతి ఇ౦టి ఇ౦తి
అ౦దులోని గొబ్బెమ్మలు ప్రతి గుమ్మపు స్వాగత తోరణాలు
పిల్లలు హుషారుగా ఎగరేస్తారు గాలిపటాలు
చేసుకు౦టా౦ ఎన్నెన్నో పి౦డి వ౦టలు
ఇళ్ళకు తరలిస్తారు ధాన్యపు బస్తాలు
రైతుల ముఖాలలో కనిపిస్తాయి ఆన౦ద దరహాసాలు
కథలు గాధలుగా పాడుతారు హరిదాసులు
అవి వి౦టూనే సాగుతాయి దానధర్మాలు
కన్నెపిల్లల కేరి౦తలకు ఉ౦డవు పట్టపగ్గాలు
భోగిమ౦టల ముచ్చట్లు, భోగిపళ్ళ సరదాలు
బొమ్మల కొలువుల పేర౦టాలు
కోడి ప౦దాల కవ్వి౦తలు
అ౦తేలేని సరాగాల, పరవళ్ళు తొక్కే హ్రుదయాల సవ్వడి
అ౦దరిలో ఉదయి౦చును ఈ నవ స్రవ౦తి
ఆన౦ద౦గా జరుపుకోవాలి నవ్వుల స౦క్రా౦తి
నాకు పతంగులంటే ఎంత ఇష్టమో!!! ఇదిగో....ఇంత సంతోషంగా ఉంటుంది....మీరందరు కూడా పతంగుల పండుగ కన్నుల పండువుగా చేసుకోండేం.....చిలకా పద పద...నెమలీ పద పద...బాగుంది కదూ!
ఎంతో సంప్రదాయబద్దమైన మన మకర సంక్రాంతిని అందరూ ఈ కూచిపూడి అంత అందంగా... పూర్తి తృప్తిగా...ఆనందంగా గడపాలని కోరుకుంటూ....జయ.
******************************************************************
15, జనవరి 2012, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
13 కామెంట్‌లు:
మీకు, మీ ఇంటివారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
అంబరాన్ని తాకే సంక్రాంతి సంబరాన్ని మీ పోస్ట్ లో పొందుపరిచారు. మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
హృదయ పూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పండుగ పోస్ట్ లు చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా కూచిపూడి .. ఇంకా..చిత్రరాజం చాలా బాగుంది.
మీ సంక్రాంతి దీవెనలు,శుభాభినందనలకు ధన్యవాదములండీ..
మీకు కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు..
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు జయ గారు.
చక్కటి కవిత,అందమైన బొమ్మలు...మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి గురించి మీరు చెప్పింది బావుందండీ... నాకు మొదటి బొమ్మ చాలా చాలా నచ్చేసింది. మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు. :)
@జయ గారు
పట్టుమని మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగకి
కలకాలం నిలిచిపోయే ఆనందాన్ని,
మదిలో హాయిగా ఉండిపోయే అనుబంధాన్ని,
ఇవ్వాలని కోరుకుంటూ చేసిన మీ అక్షర పూజ,
ఆ కవితా సరస్వతి వినాలని అందరిని దీవించాలని కోరుకుంటూ,
మీకు ,మీ ఇంటిల్లిపాదికి, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు.. :)
సంక్రాంతి పండుగ వాతావరణంతో మీ బ్లాగు కనులపండుగ చేసింది.
తృష్ణ గారు,
భారతి గారు,
వనజ వనమాలి గారు,
రాజి,
అక్కా,
లాస్య రామకృష్ణ గారు,
శశికళ గారు,
మధురవాణి గారు,
కల్యాణ్ గారు,
ఉమాదేవి గారు...మీ అందరికీ నా హార్ట్ ఫుల్ ఆఫ్ థాంక్స్.
మీకు కూడా పండుగ శుభాకాంక్షలు..
చాలా చక్కగా వ్రాసారు
Thanq Sasikala garu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి