సామెతల వర్ణమాల
అడ్డగోడ చాటునుంచి మొగుడి పెళ్ళికి అర్ధణా చదివించినట్లు.
ఆలికి చీరకొంటే ఊరికి ఉపకారమా!
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ఈత వచ్చినప్పుడు లోతనిపిస్తుందా!
ఉదరపోషణార్ధం బహుకృత వేషం.
ఊరపిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు.
ఋణశేషము శతృశేషము ఉండరాదు.
ఎంత చెట్టుకు అంత గాలి.
ఏ గ్రహం పట్టినా ఆ గ్రహం పట్టరాదు.
ఐశ్వర్యానికి అంతం లేదు దారిద్ర్యానికి మొదలు లేదు.
ఒక్కొక్క రాయి తీస్తుంటే కొండ అయినా కరుగుతుంది.
ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళిచేసుకుంటే కుండలన్నీ పగలగొట్టింది.
ఔను కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనడం అంత కష్టం.
అందని మ్రాని పండ్లకు అర్రులు చాచినట్లు.
ఆ:, ఓహో లతో తెచ్చేవు అసలుకే మోసం!
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
ఖరము కున్న ఓపిక జగమెరుగనిదా!
గంజాయి తోటలో తులసి మొక్క.
ఘడియ లోన చెల్లు జీవితంబు కై ఖేదమేల!
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం.
ఛ ఛా అందువే అన్నింటికీ, ఏల అబ్బునే మంచి గుణంబు!
జయాపజయాలు ఒకరి సొమ్ము కావు.
ఝుమ్మన్న నాదం జీవితానికి వీణా నాదమయ్యేనా!
టమటాల తోట ఏయరా బిడ్డా అంటే, టమటమాల బండి కొనిస్తవా అయ్యా! అన్నాట్ట.
ఠక్కున చెప్పమంటే ఢంకా మోగించాడు.
డబ్బు దాచిన వాడికే తెలుసు లెక్క వ్రాసిన వాడికే తెలుసు.
ఢమాల్ అనే వ్యాపారానికి డాంబికాలు కూడానా!
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం లేదు.
థయ్యి థయ్యిన ఆకసానికెగిరితే భూమిలోని మురికి గుంత కూడా దక్కదు.
దంచినమ్మకు బొక్కిందే దక్కుడు.
ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ.
నవ్వలేని వారిని నమ్మరాదు.
పచ్చగా ఉంటే పదిమంది చుట్టాలు.
ఫలములున్న చెట్టుకే కదా, రాళ్ళ దెబ్బలు!
బంగారపు పళ్ళానికైనా గోడ అండ కావాలి.
భక్తి లేని పూజ పత్రి చేటు వంటిది.
మంచి మరణం లో తెలుస్తుంది.
యదార్ధ వాది లోక విరోధి.
రత్నాన్ని బంగారం లో పొదిగితేనే రాణింపు.
లక్కవంటి తల్లి రాయి వంటి బిడ్డ.
వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు.
షష్టి నాడు చాకలి వాడైనా ప్రయాణం చేయడు.
సంస్కారం లేని చదువు, కాయ కాయని చెట్టు ఒకటే.
హంస నడకలు రాకపోయె, ఉన్న నడకలు మరచిపోయె.
క్షణం తీరికాలేదు దమ్మిడీ ఆదాయం లేదు .
ఱ ఱ ఱ ఱ ఱ.....హు...ఈ అక్షరమే ఎగిరిపోయె కదా! ఇంకేటి రాతు!!!!
ఙ, ఞ, ణ, ళ.....అమ్మో! ఇదీ తెలుగు భాష అంటే...అందుకే దేశ భాషలందు లెస్స. ఈ సామెతలు మాత్రం మీరే రాసేసుకోండేం:))))
రీసెర్చ్ చేసి ఎంతో డేటా పోగేసాను మరి! రెండో, మూడో మా అక్క దగ్గిర కూడా ఎత్తుకొచ్చేసా లెండి. మీ అందరికీ నచ్చిందా!! ఈ అక్షరాల వరుసలోని సామెతలు!!!
పద్మార్పిత గారు, ఇదన్నమాట నా ‘కాపీ క్యాట్’.......:)
*************************************************************************************
23 కామెంట్‌లు:
బాగున్నాయండి..
అప్పుడప్పుడు రాస్తూండండి.
chaalaa baagunnaayi. chaalaa Sramapaddaaru kadaa!!!! anduke phalitam.. baagundi..baagundi..baagundi.
సామెతల వర్ణమాల సొగసుగా వుంది.
మీరు పడ్డ శ్రమ ప్రతి అక్షరంలోను కనిపించింది.
అందుకే అంతగా సువాసనలు విరజిమ్ముతోంది.
అభినందనలు...
చాలా బాగుందండీ! చక్కగా వ్రాసేసారే!
చాలా బాగుందండీ..
అ ఆ లు మళ్ళీ చదివించారు.
జయ గారూ !
మంచి భాషా వికాస ప్రయోగం చేశారు. అభినందనలు.
మీరిలా ఎప్పుడో ఒకప్పుడు కాక అప్పుడప్పుడైనా రాస్తూ మమ్మల్ని అలరించమని మనవి.
జయ గారూ గట్టిగా చప్పట్లు...
బావుంది ప్రయత్నం జయ. నా తెలుగుబడి కోసమని వెదికి దాచుకున్న బ్లాగిది - http://dsubrahmanyam.blogspot.com/2012/01/87.html ఇక్కడ చాలా శోధన, శ్రమ తో కూడిన వరుసక్రమంలో రాస్తున్న సామెతలు మీకూ తప్పక నచ్చుతాయి.
అడ్డగోడ చాటునుంచి మొగుడి పెళ్ళికి అర్ధణా చదివించినట్లు...I like this..I never heard this before.
Jaya gaariki inko Ph.D
జయ గారు,
జయా యాహూ !!
అర్థ సహిత వర్ణ మాల !
మంచి కూర్పు
చీర్స్
జిలేబి.
రాసుకుని దాచుకుంటున్నా! పెర్మిషన్ ఇస్తారు కదూ
చాలానే సామెతలు రాసావే :) బాగుంది .
ఆ సామెత ఎందుకు నచ్చిందమ్మా ఎన్నెలమ్మా :)
@జయ గారు
సామెతల పరంపరలు ఎన్నున్నా లోకం పోకడ మారదు ....
బ్లాగ్గింగ్ వల్ల పరిచయాలు జెరుగును తమవంటి స్నేహితుల వల్ల వాటి విలువలు తెలియును...
మంచి సామతేలు అందించారు మా బుర్రలను తోమారు .... ( తప్పుగా అర్థం చేస్కోకండి సామేతలాగే చెప్పాలనే ప్రయత్నం లో అల చెప్పను )
:)
@ తృష్ణా థాంక్యూ.
@ కోర్ట్ లో లా మూడుసార్లా:) థాంక్యూ వనజ గారు.
@ శ్రీలలిత గారు మీ పొగడ్తలు సంపెంగలండి:) ధన్యవాదాలు.
@ రసజ్ఞ గారు. కాపీ కొట్టేయటమేగా:) థాంక్యూ.
@ జడ్జ్ గారు ఇప్పుడు అ ఆ లు చదువుతానంటే ఎలా రాజీ!:)
@ రావ్ గారు అంత పెద్ద పదమే! ధన్యవాదాలండి.
@ జ్యోతిర్మయి గారు మరీ అంత పెద్ద హాండ్ ఇవ్వద్దండి:) బుజ్జి పండు ఎలా ఉన్నాడు? ఇంతకు ఇండియా వస్తాడా రాడా!!!
@ మీరిచ్చిన లింక్ చూశాను ఉషా. చాలా బృహత్పథకమే. ఱ తోటి ఉన్న సామెతలన్నీ మామూలు ర తో మొదలవుతాయనుకున్నాను. ఱ సామెత మాత్రం కొంచెం ఇబ్బందే రాయాలంటే:) తప్పకుండా ఇకనుంచి చూస్తూ ఉంటాను. నాదేదో చాలా చిన్న సరదా పని. అంతే:)
@ ఆ సామెత అంత నచ్చిందా ఎన్నెల గారు. దాని వెనక కథ తెలిస్తే అప్పుడు ఎంత ఇష్టపడ్తారో చూడాలని ఉంది. అదిమాత్రం మా అక్కనే అడగాలి:) ఎందుకమ్మా! అన్నిPh.D. లు నాకు:)
@ జిలేబీ గారు ధన్యవాదాలు.
@ కష్టేఫలే గారు ఇవి నా సొంతమా, నేను అనుమతివ్వటానికి:) ఉషా గారు ఇచ్చిన లింక్ చూడండి, కళ్ళుతిరిగిపోతాయి.
@ అక్కా, ఎన్నెలమ్మకి చెప్పాలే...దాని వెనుక కథ నిన్నే అడుగమని:)
@ కల్యాణ్ గారు, ఏవిటొ...మొత్తానికి నా బుర్రలోని తుప్పుమాత్రం వదలకొట్టేసారు:)
ఛా! ఎప్పుడూ లేట్ గానే చూస్తాను,
అది కూడా మీరు హింట్ ఇచ్చాకే..
అయితేనేం..
అందుకోండి సామెతలతో
జయ అభినందనలు:-)
జ:జయాపజయాలు దైవాధీనాలు.
య:యవ్వనం గువ్వలాంటిది.
అ:అన్నప్రాశన నాడే ఆవకాయా?
భి:భింకంలేని ఆడదాన్ని,బిడియపడే మగాడ్ని నమ్మరాదు
నం:నందుడిలాంటి నలుగురికన్నా చాణిక్యుడొక్కడైనా చాలు.
ద:దమ్ముంటే ధరిద్రం దరిచేరదు.
న:నవ్వు నాలుగువిధాల చేటు.
లు:లుంగీలు కట్టిన బిడ్డలు అడ్డాలనాటి వారు కారు.
వావ్ . . . పద్మార్పిత గారు సూపరంటే సూపరే .
లక్ష్యభక్ష్యాలు భక్షించే కుక్షికి ఒక భక్ష్యం లక్ష్యమా?అన్నట్లు, ఇంక చూసుకోండి...హింట్ ఇస్తూనే ఉంటాను పద్మర్పిత గారు:)
బాగున్నాయండి ! నాకూ సామెతలంటే ఇష్టమే మరీ జంధ్యాల గారి సినిమాల్లో వాడే సామెతలంటే ఇంకా బాగా ఇష్టం
అవునా వంశీకృష్ణా:) థాంక్యూ.
>>అడ్డగోడ చాటునుంచి మొగుడి పెళ్ళికి అర్ధణా చదివించినట్లు
సూపర్ :)
సామెతల వర్ణమాల అంటే మీకు తెలిసిన సామెతలన్నీ పోగుచేసి పోస్ట్ చేశారనుకున్నా. వర్ణక్రమంలో సేకరణ అని చదివాక ఔరా అనుకున్నా... సూపర్ కలెక్షణ్!
Thanq Nagarjuna:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి