చమత్కారమున చంపకమాల లల్లగలేను
నీదు గళమలంకరింపగ
కమనీయమగు
కందరీతి నేనెరుగ
నీదు ప్రసన్నత వేడ
ఉత్పన్నమగు నాదు భావసరళి
ఉత్పలయందు జేర్ప శక్తియు నొకించుక లేదు
వేయేల! వేరొండు నేనెరుగ
మ్రోలనిలచి నీదుపూజసేతు
ఏమని?
రవంత నన్ను నీదరినిల్పి
ఆవంత శక్తి ననుగ్రహింపుమమ్మ
సాహితీ నందనమందు
కలుపుమొక్కను నేను
విదిలించి పెకలించకుమమ్మ
సాహిత్య వల్లీ!
నా నివాళులివిగో!!!
(Your heart is a very beautiful garden. And my friendship is a small rose in your garden. Please don't pluck the rose for any reason.....)
*************************************************************************************
14 కామెంట్‌లు:
పదాల అల్లిక బాగుంది నైస్
తులసి మొక్క లాంటి కవితనల్లి కలుపు మొక్క న౦టారేమిటి...
very nice.
పసందైన పదములతో కూడిన పద్యమును పెకలించుటయా!!!!
ఎంతమాట! ఎంతమాట!!!......విరబూయరాదటే తల్లీ...జయోస్తు:-)
స్నేహ వనంలో హృదయ పుష్పంబు పూయించి పద్య మాలికలల్లి తెలుగు తల్లి గళ సీమ ని అలంకరించిన "జయీ భవ'' మీరు.
"చమత్కారమున చంపకమాల లల్లగలేను"
అంటూనే మీరు చేసిన నివేదన బాగుందండీ..
మీరేదో చంపకమాల దాక వెళ్లారు నాకు "డు ము ఉ లు " అంటారే అవే విభక్తులు అవి కూడా సరిగ్గా రాదు అంటే మర్చిపోయాను ... మరి నా పరిస్థితి ఏంటండి ? ... మీరు కలుపమొక్క కాదు.. కల్పవల్లి మొక్క అ పదము తప్పు చేసేరమో సరిచూసుకోండి... మీ ప్రార్ధన అనిర్వచనీయము.. అ కళామతల్లి ఆశీస్సులు ఎప్పుడు మీకుండును ....
అద్భుతం! చాలా బాగా వ్రాశారు!
"తరల"మైనటువంటి "వనమయూరము" యొక్క "చామరము"తో విసిరినట్టుగా, "మంజుభాషిణి"లా "కవిరాజ విరాజితము" "మత్తె"క్కిస్తోంది!
@ తెలుగుపాటలు-మీకు ధన్యవాదాలు.
@ జ్యోతిర్మయి గారు అమ్మో! ధన్యవాదాలు.
@ కొత్తపాళీ గారు(నాకైతే కొత్తపాళీ గారు అనే వస్తోంది) థాంక్సండి.
@ పద్మార్పిత గారూ...మల్లెచెండయిపోయాను, థాంక్స్.
@ వనజ గారు, చాలా థాంక్స్.
@ రాజీ, ఈ నివాళి సరిపోతుందా మరి. థాంక్యూ.
@ డు ము ఉ లు లో ఆ ఉ కాదనుకుంటా! నాకైనా అంతకంటే పెద్ద ప్రతిభలేదులెండి కల్యాణ్. థాంక్యూ.
@ ఏవిటిది రసజ్ఞ గారు! అవన్నీ నాకర్ధమవుతాయనే:) థాంక్స్.
చూసారా అది ఆ వు సంగతి కూడా తప్పు చేసేసాను ... :)
కల్యాణ్ గారు :-) అంతేగా మరి.
wow.nice...
Thank you Sita garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి