ఊహా సుందరి
(Richard Crashaw రచనకు స్వేచ్చానుసరణ)
కాదేమో ఆమె కసాధ్యం...
అదే...గమ్యానికి చేర్చే సారధ్యం
అందాన్నే...ఆమె అందాన్నే ఊహిస్తాను
ఊహిస్తూ విశ్రాంతి పొందుతాను
ఆ వయ్యారపు నడకల
సౌకుమార్యపు కుమారినే;
అందరిపై అధికారం చెలాయించే
ఆ సుందరి ముఖారవిందాన్నే వాంఛిస్తాను
కొట్టులో చేయబడిన
కృత్రిమ బొమ్మ కాదామె
కాని ప్రకృతి కాంత కళాహస్తమే
తీర్చిదిద్దిందా సుందర ప్రతిబింబాన్ని...
పరిహసిస్తున్నాయి ఆమె నును బుగ్గలే
వికసిస్తున్న గులాబీ మొగ్గలను.
అవె ఆమె లే పెదవులు
పలుసార్లు ప్రియుని ప్రతి చుంబనం పారాడినా,
వాడిపోని చిరు పెదవులు.
ఆమె కనులో!
వానిలోంచి ప్రచురించే క్రీగంటి వాలు చూపులే
వజ్రపు వెలుగునే వెలితి చేస్తాయి
కాంతి గోళములనే కించపరుస్తాయి...
ఆమె దరహసితములె
ఉత్తేజ పరుస్తాయి
రక్తాన్ని ఉరుకలెత్తిస్తాయి
పవిత్రత నింపేస్తాయి...
ఆమె శరీరపు ఒంపుల్లోనే
నిండి ఉంది ప్రకృతి సొంపు.
అలంకార భూషణాదు లక్కర లేదామెకు
ఆమెను గురించి రాయాలంటే
అవుతుంది ఒక మహాకావ్యం
ఆమెను గురించి చెప్పాలంటే
ఒక్క ముక్కలో ఆమె కామెయె సాటి.
ఆ సుందరి దివ్య కాంతియే
ప్రతిఫలిస్తోంది ప్రతిక్షణం నా కనులలో...
కల్పనే కావచ్చు యిది అంతా,
కాని; కావచ్చు, ఇదే కావ్యానికొక వస్తువు.
*****************
ఇష్టపడే వారందరికీ ఈ పాట..... ఈ రోజు......
********************************************************************************
8 కామెంట్లు:
"ఊహా సుందరి" బాగుందండీ..
పాట కూడా బాగుంది!
మగువే కదా మగవానికి మధుర భావన. కవుల కల్పనలోను,కావ్య నాయికగాను.. ఊహలలో.. ఊరించి,వేదించి,సాక్షాత్కరించిన "ఆమె" మీ కవితా వస్తువైనదన్నమాట ఈ పూట. మాకు.. ఈమెలో.. మనస్విని..అపురూపంగా ఇమిడి మదిసోయగం అనిపించింది.
బాగుంది అండి
@ రాజీ
@ వనజ గారు
@ 'తెలుగు పాటలు' గారు
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఊహాసుందరిని వర్ణించటం అంటే మాటలు రావెవరికైనా...చాలా చక్కగా మాటల్లో వర్ణించారు, చాలా బాగుంది.
చిన్ని ఆశ గారు ధన్యవాదాలండి.
నా గురించే కదా జయ గారు రాసారు ...నాకు తెలుసు మీరు ఇంత అందంగా రాయగలిగారు అంటే అది కేవలం నాగురించే అని :P ........ పోస్ట్ sooooooooooooooooooooooooooper
Yes, my dear...it is about Shivani:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి