ప్రాణ మిత్రమా!
మరపురాని స్నేహమా, మరవలేని నేస్తమా
నీలో నేనుండిపోవాలి ఎప్పటికీ
నీతో కలసి చేరుకోవాలి గమ్యం
నా కళ్ళలో నీవెపుడూ కదలాడలి
నీ మనస్సులో నేనెపుడూ నిండిఉండాలి
స్నేహమనే స్వరం చేరాలి మనం
అందరికీ ఆదర్శం కావాలి మన స్నేహబంధం
మన ఈ స్నేహబంధం సాగిపోవాలి నిరంతరం....
ఈ ప్రశాంత వాతావరణంలో
నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ వచ్చే కోయిలమ్మ పాటకి
ఎదలో కొత్తకొత్త భావాలు చిగురులు తొడుగుతున్న వేళ
నీవు అనే పదంలోకి
నేనుగా మారిన స్పందనతో ఇలా.......
అక్షరాలు ముత్యాల సరాల్లా జాలువారుతుంటే
నీవు నా పక్కన లేకపోవడం
చందమామ లేని ఆకాశంలా
స్నేహమా! వెన్నెల దీపమా!శూన్యంగా ఉన్నాను నేస్తం!
నా జీవితంలో ఎగిసిపడే భావతరంగం నీ పరిచయం...
నా గుండె లోగిలిలో...
మమతల మకరందాన్ని పంచి,
అనురాగపు జ్యోతుల్ని వెలిగించిన
నా స్నేహ సుప్రభాతమా! నువ్వెక్కడ?
నీ చిరునవ్వు కుసుమాల పరిమళం నన్నింకా వీడిపోకముందె
నా కనురెప్పల క్రింద
నీ జ్ఞాపకాల జలపాతాన్ని మిగిల్చి తరలిపోయావ్!
నిజం మిత్రమా!
ఏ అర్ధరాత్రో...
నీ అనురాగపు అలికిడి ఆర్తిగా వినిపించినప్పుడు
నువ్వు రావన్న దిగులుతో,
నా దు:ఖం ముక్కలై...ఏ ముత్యపు చిప్పలోనో!
ఎక్కడేక్కడో రాలి పడింది.....
అవునండి...ఇది నా సెంచురీ...అదేనండి...మూడు సంవత్సరాల క్రితం...ఏప్రిల్ లో బ్లాగ్ లో రాసుకోడం మొదలుపెట్టాను.
అంటే మూడేళ్ళు పూర్తి చేసిన సందర్భంలో....నాకు ఇష్టమైన స్నేహం గురించి.... వందో ఠఫా కూడా కట్టానన్నమాట!!! డబుల్ ధమాకా అన్నమాట...(ద.హా)
అవునండి....నిజమే నమ్మాలి మరి....
వంద అంటే నాకు చాలా చాలా ఎక్కువే సుమండి ...(వె.చి.న)
వంద పూర్తి చేయటానికి ఇంతకాలం పట్టిందా! నువ్వు దండగ ఫో అంటారా!! అయ్యయ్యో, అలా అనకండి మరి...ఏంచేద్దాం..నేనంతే.....
ఇవాళ సీతమ్మ సమేతుడైన ఆ శ్రీరామచంద్రుడే సాక్ష్యమండి......
ఇంకపోతే ఏప్రిల్ ఫూల్ అస్సలే కాదండి....మీ అందరికీ హ్యాపీ హ్యాపీ ఏప్రిల్ ఫూల్ డే అండి...
**********************************************************************************************************************
16 కామెంట్లు:
మనస్విని బ్లాగు మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా శుభాకాంక్షలు జయగారూ....
Happy Birth Day..Manasvi.
Many more Happy returns of The Day.
Jaya gaaru.. sneha sandramlo..yenni muthyapu chippalu Dorikinaa .. andulO..melimi Muthyam okkatainaa chaalunu. Mee melimi muthyam.. mallee dorkaalani aashisthoo..
Double comment:)))))
Congrats jaya garu. Expecting more writings from you.
Nice writeup on friendship! Keep writing. Congrats andi meeku
"మనస్వి"కి మూడవ పుట్టినరోజు శుభాకాంక్షలు..
మా అందరి ఆత్మీయ నేస్తం "జయ" గారికి అభినందనలు..
Happy Birth Day - ♥ మనస్వి ♥
Many Many Happy returns of The Day.
మీరు ఎన్నో మరెన్నో వందల టపాలు పూర్తి చెయ్యాలని, తరచూ టపాలతో కనబడుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ..మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు.
happy birthday manasvi .
!! మనస్వి !! పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ మనస్వికి హాపీ బర్త్ డే జయగారూ
అభినందనలు మరియు మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు.
వంద అంటే నాకు చాలా చాలా ఎక్కువే సుమండి ...(వె.చి.న)...:))
మీకు తోడు నేనూ ఉన్నాలేండి.
@ కెక్యూబ్ వర్మ గారు థాంక్యూ.
@ వనజ గారు డబుల్ థాంక్స్:)
@ అజ్ఞాత గారు ? థాంక్యూ.
@ జలతారు వెన్నెల, వెన్నెల కురిపించినట్లే ఉందండి. థాంక్యూ.
@ @ రాజి, ఇది పుట్టిన రోజు కాదమ్మాయ్:) సరే, థాంక్యూ.
@ తృష్ణా, వందల టపాలా! నేనా!! థాంక్యూ.
@ అక్కా, థాంక్స్.
@ తెలుగు పాటలు గారు థాంక్యూ.
@ లతా, బాగున్నారా! చాలా రోజులయింది. థాంక్యూ.
@ మువ్వ గారు. చాలా థాంక్స్. మరెప్పుడూ ఉండాలి ఈ స్నేహం.
మూడేళ్ళకూ, వందకూ వెరసి డబుల్ శుభాకాంక్షలు! మరిన్ని మంచి పోస్ట్ లు రాయాలని కోరుకుంటూ....
చిన్నిఆశ గారు థాంక్యూ.
ఆలస్యంగా ..కంగ్రాట్స్.ఇకపోతే మిత్రమా చాల బాగుంది .
థాంక్స్ మిత్రమా:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి