ఆనందం డెఫినిషన్ చెప్పటం అంత సులభమా!!!జీవితం లో ముగింపు లేనిది , చెప్పలేనిది అదొక్కటే అనుకుంటా!!!!
ఏ మహాత్ములు ఎన్ని చెప్పినా తమకు మంచి అనిపించిందే చెప్తారుకదా! లేకపోతే ఇతరులెందుకు వాళ్ళని విమర్శిస్తారు? లోకమంతా పనికొచ్చే ఒకే ఒక్క ఆనందం గురించి చెప్తే మహాత్ములు ఒక్కళ్ళే ఉండే వాళ్ళేమో:)
ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఆ ఆనందం తనివి తీరదే!!!!
హత్యలు చేసేవాళ్ళు అందులో ఆనందం కోసమేనా?
ఇతరులను మోసపుచ్చే వాళ్ళకు అందులో ఆనందం ఉన్నట్లేనా!!
ఇటువంటి వాళ్ళు ఏవిధంగా అయినా శిక్ష అనుభవించే వారే అది శాశ్వత ఆనందం కాదు అందామా!!!
మరి ఆనందం ఎప్పటికీ ఉంటుందా, లేక కొంతకాలమేనా? అందుకేనా తపస్సు చేసుకుంటామని వెళ్ళిపోయేది?
ఎటువంటి బంధాలు లేక పోతే, ఏనాటికైనా ఆనందమంటే ఏవిటి అని వెతుక్కుంటూనే పోతారేమో!!!
పోనీ విరక్తి లో అన్నీ వదిలేస్తే ఆనందమా?
అతి మంచివాళ్ళూ ఆనందంగా ఉన్నామనరు...అతి చెడ్డవాళ్ళూ ఆనందంగా ఉన్నామనరు!!!! పోనీ అతి మామూలు వాళ్ళు ఆనందంగా ఉన్నారా!
మనకున్న జీవితంలో మనకు మనమే మనకు మాత్రమే పనికొచ్చే ఆనందాన్ని ఎంచుకుంటే సరిపోతుందేమో....
అందరూ అదే పద్ధతి అనుసరిస్తే అప్పుడు ప్రపంచమంతా ఎలాఉంటుందో, ఊహించుకోవాలని ఉంది నాకు:)
ఎపుడో అపుడు ఎవరో ఒకరు ఆనందం అంటే ఏవిటి? అని ఓ సినిమా తీస్తారేమో...అప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందో....
ఈ ఆనందం మధురానుభూతి. ఆనందం మన చేతిలోనే ఉంది. మనమీదనే ఆధారపడి ఉంది. నా సంతోషానికి నేనే బాధ్యురాలిని.... ఆనందాన్ని నింపుకొనే శక్తి మనలోనే ఉంది... మనం చంద్రుని కోసం ప్రయత్నిస్తే కనీసం అందాలొలికే నక్షత్రాల మధ్యనైనా ఉంటామేమో....సంతోషమే కావాలి.....బాధ వద్దు. కాని అందాల హరివిల్లు వర్షం తరువాతే కదా చూడగలుగుతాము.మన పరమార్ధమే జీవితం లో ఆనందం...చివరిదాకా ఈ ఆనందంలోనే నడచిపోతూ బ్రతికితే బాగుండు...మనకున్న వాటితో సంతృప్తి పడితే ఆనందం అదే వస్తుందనుకుంటా.....
మన ఆనందంతో ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతాము. అప్పుడు అందరూ ఆనందంలో ఓలలాడొచ్చు....ఎంత ఆశో...అవునా! దురాశ మాత్రం కాదు కదూ.... జీవితం లో ప్రతి అనుభూతి ఆనందమే....
సంతోషాన్ని కొనుక్కోలేము కదూ...ఒకవేళ మనకు నచ్చినదేదైనా కొనుక్కున్నామనుకోండి....అది ఆనందమేగా:)
ఎంతంత దూరం నన్ను పోపో అన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.....There is always somebody that loves you.... Its me.....
జీవితం విలువైనది...చేజారితే దొరకనిది...ఆ విలువ కాపాడుకోటమేగా...ఆనందం.
ఏమో నా లాంటి వాళ్ళైతే...అనందమనగానేమి..అని ఒక హెడ్డింగ్ పెట్టి, ఇంట్రడక్షన్, ఓ డెఫినిషన్, కొన్ని సైడ్ హెడ్డింగ్స్, ఓ కంక్లూజన్ తో ఓ ఎస్సే రాసేసుకుంటారు. అంతే:)
Happiness is a journey, not a destination.....
‘Happiness is like a Butterfly;
The more you chase it,
The more it will elude you.
But, if you turn your attention to other things,
It will come and sit softly on your shoulder’.....
........ Exactly correct.
ఆనందమంటే ఇదేకదా!!! ఆనందమే జీవిత మకరందం.......
***************************************************************************
6 కామెంట్లు:
"జీవితం విలువైనది...చేజారితే దొరకనిది...ఆ విలువ కాపాడుకోటమేగా...ఆనందం."
ఆనందం గురించి భలే చెప్పారండీ..
"ఊరించే ఊహల్లో వూరేగటమే ఆనందం కవ్వించే కల కోసం వేటాడటమే ఆనందం"
ఇలాంటి ఆనందాలు కూడా బాగుంటాయి కదండీ :)
బాగుందండి చాలా
చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు.
మన ఆనందం మన చేతిలోనే వుంది. ఇది సత్యం.
@ రాజీ, అంతేగా మరి. సహం జీవితం ఊహాల్లోకాల్లోన్నేగా విహరించేది. కలల్లోని ఆనందం ఎలా కాదనుకుంటాం జడ్జ్ గారు:)
@ రాధిక గారూ, నిత్యం పూల తోటలో విహరించే మీ ఆనందమంత బాగుందంటారా:) ధన్యవాదాలు.
@ జ్యోతిర్మయిగారు, ఆనందమటె ఆనందం...లేదంటే లేదు...అంతేకదండి. ఇదే జీవితం...ఇదే సత్యం:) థాంక్యూ.
మీ టపా మీ ఆనందాన్ని తెలియజేస్తుంది. :)
Is it:) thankyou Varma garu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి