అక్టోబర్ రెండవ తారీఖు, ఇది నా బుజ్జిగాడు, వరాల కొండ, బంగారు తండ్రి, నా రాజా బేటా, (మా అబ్బాయి) పుట్టిన రోజు.
ఇదిగో, ఇప్పుడే పన్నెండు దాటింది, రెండో తారీఖు వొచ్హింది. మా వాడికి 'హాపీ బర్త్ డే ' చెప్పి ఈ టపా పంపేస్తున్నాను ...
ఈ రోజే నాకు కూడా పునర్జన్మ నిచ్హింది. మయూఖ నుంచి మనస్వి గా మారాను. నేనేనండి జయని.
మయూఖ నాది కాకూడదు అన్న కూడలి లోని టపా చూసిన తరువాత ఒక్క నిముషం నాకేమి తోచలేదు. ఇంక నన్ను ఎంతమంది తిట్టేస్తారో అన్న భయం మొదలైంది.
ఎప్పుడూ నాకు సలహాలు ఇచ్హే మా అక్క అరగంట క్రితమే హాయిగా కర్ణాటక టూర్ వెళ్ళిపోయింది.
కిం కర్తవ్యం!
ఒక సారి రమణా రెడ్డి గారి బ్లాగ్ లోకి తొంగి చూసాను. అక్కడొక టపాలో వెరే లింక్ కనిపించింది. అందులోని వ్యాఖ్యల పరంపర చూసాక ఇంత ఘోరంగా కూడా ఉంటుందా పరిస్తితి అని కాళ్ళు గజగజ వణికాయి. పూర్తిగా చూడకుండానే నా బ్లాగ్ లోకి వొచ్హేసాను.
అలాగే అలోచిస్తు ఉండిపోయాను.సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుందని గుర్తించాను. మయూఖ నుంచి ఇప్పుడేమి చేయలేను, నాకేమొ బ్లాగ్ మార్చటం రావట్లేదు. అందుకే ఆపేయటం మంచిది. బతికుంటే బలిసాకు తిని బతకొచ్హు అనుకున్నాను. అందుకే నేనిక రాయను అని, వివరంగా నేను కూడా కూడలి ముఖం గా ఒక టపా రాసేసి, నా కంప్యూటర్ ఆఫ్ చేసేసాను.
కాని, మనసూరుకోదే! మళ్ళీ నా మయూఖ లొ చూసుకున్నాను.
అదే రోజు నేను రాసిన " జయ శుభకారిణి ' కి ఏమి టపాలు లేవు. అందరు నన్ను తప్పుపడుతున్నారనిపించింది. దాని కారణం, ఎవరో 'కెల్లీ' అని జపానొ, చైనా నో తెలియని భాషలో ఒక పెద్ద కామెంట్ కనిపించింది. తెలుగు చదవ గలిగిన వాళ్ళు, తెలుగులోనో లేకపోతే ఇంగ్లీష్ లోనో కామెంట్ ఇవ్వాలి. ఈ భాష ఏమిటి! దీనికి కారణం ఏమిటి! అన్నది నాకు అర్ధం కాలేదు.
నన్ను తిట్టక పోయినా నా పేరు మార్చేసుకొని రాయమని (ఒకరు మాత్రం బాగానే తలంటి పోసారు) ప్రొత్సహిస్తూ కొన్ని టపాలు కనిపించాయి. ఎప్పుడూ రాని శ్రీకర్ గారు, మంచుపల్లకి గారు కూడా కనిపించారు. ఇంకాసేపటికి మళ్ళీ చూసాను. కొత్తపాళీ గారు, జ్యోతి గారు కనిపించారు. కొంచెం ధైర్యమొచ్హింది. అయ్యో! మురళిగారి టపా కనిపించలేదే అని కొంచెం చిన్నబుచ్హుకున్నాను. ఇంకా వెరే ఎవరైనా కూడా కామెంట్ ఇస్తే బాగుండేది, అనిపించింది.
ఇంకొక్కసారి రమణా రెడ్డి గారి మయూఖ లోకి తొంగి చూసాను. అక్కడ మా ఇద్దరికన్న ముందే ఇంకొ మయూఖ ఉన్న సంగతి కనిపించింది. ఆ లింక్ లోకి చూసాను. నిజమే! పాపం, వాగ్దేవి గారు మా ఇద్దరి కన్న ఎంతో ముందునుంచే మయూఖ తో నిశ్శబ్దంగా రాసుకుంటున్నారు.
జ్యోతి గారు సహాయం చేస్తానన్నారుగా, అడుగుదాం! అని వెంటనే మైల్ చేసేసాను. తిరుగు టపా లో నన్నేమి దిగులు పడొద్దని తెల్ల కాగితమైపోయిన నా మనస్వి ని అలంకరించి ఇస్తానని, నన్ను హాయిగా రాసేసుకొమని, ఒక టేంప్లేట్ తో వెంటనే రెడీ చేసి ఇచ్హేసారు కూడా. ఉహూ, నాకు ఈ టేంప్లట్ వొద్దు ఇంకోటి కావాలి అని అడిగాను. పాపం ఏమి అనుకోకుండా తనదగ్గిరున్న లిస్ట్ అంతా పంపించి నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. వెంటనే అంతా గాలించి నాకు నచ్హిన టేంప్లేట్ చూపించాను. మర్నాడు సాయంత్రం నేను ఇంటికి రాగానే, ముందు చేసిన పని కంప్యూటర్ చూడటం. ఎంతో అందంగా అలంకరించిన నా మనస్వి కనిపించింది. జ్యోతి గారికి పార్టీ ఇస్తానన్నాను, కాని జ్యోతిగారు పట్టించుకోలేదు. జ్యోతిగారు, మీకు నా క్రుతజ్ఞతలు.
ఒక పెద్ద తుఫాను వెలసి మనసు ప్రశాంతం గా అనిపించింది. రాత్రికి నాకు చిక్మగలూర్ నుంచి మా అక్క ఫోన్ చేసింది. ఇంకేముంది, ఒక గంటసేపు అన్నీ 'ఏ ' నుంచి 'జెడ్ ' వరకు చెప్పేసాను.
రమణా రెడ్డి గారికి, వాగ్దేవి గారికి నా క్రుతజ్ఞతలు
ప్రశాంతంగా ఒకసారి నా మయూఖ చూసుకున్నాను. ఈ సారి మురళి గారి కామెంట్ కనిపించింది. హమ్మయ్య! అనుకున్నాను. రవి, ఇప్పుడే భావన గారు కూడా వొచ్హారు.
ఇంక నా ఈ పునర్జన్మ ఎలా ఉంటుందో చూడాలి!
తపన
అజ్ఞానపు చీకటిలో నేనున్నప్పుడు
అంధకార మావరించి
అశక్తను చేసినప్పుడు
విజ్ఞాన దీపం వెలిగి వెన్నుతట్టింది
ఆ దీపం జ్వాలయై
జగమంతా నింపాలనే
తపన రగిల్చింది
నేను మెల్లగా నడిచినా
వెనుకకు అడుగు వేయను .......
****************************************

13 కామెంట్లు:
"congratulations and celebrations...." get going..!!
(this is a cliff Richards song..)
కొంతే వెలిగి పూడ్చింది :-) నేమ్ కొలిజన్ వల్లొచ్చిన కాన్ఫ్లిక్టేదో పేరు మార్పిడికి దారిసిందన్న ముక్కర్ధమయింది. Any how, all the best.
త్రుష్ణ గారు థాంక్యూ.
అబ్రకదబ్ర గారు, మీరు కరెక్ట్ గానే ఊహించారు. ఇది కేవలం పేరు మార్పిడి చెప్పాలనే.థాంక్యూ.
చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి.. వాటిగురించి సీరియస్ గా ఆలోచించి మనసు పాడుచేసుకోకండి.. మీరు రాయాలనుకున్నవన్నీ వరుసగా రాసుకుంటూ వెళ్ళండి.. మీ అబ్బాయికీ, మీ కొత్తబ్లాగుకీ జన్మదిన శుభాకాంక్షలు..
బాగుందండి !ఒక్కసారే ఉమాశంకర్ గారి బ్లాగ్ ''అనంతం ''లోకి పొరపాటున వచ్చానా అనుకున్న ...
మురళి గారు, ధన్యవాదాలు.
చిన్ని గారు థాంక్యు. ఆ సంగతి నాకు తెలియదండి. ఇప్పుడు నేను మళ్ళీ టేంప్లేట్ మార్చాలా!
హ. హ. హ.. నేను నిన్నే అనుకున్నా.. ఉమాశంకర్ గారి బ్లాగ్ లొకి వచ్చానా అని.. ఈ టెంప్లెట్ బావుంటుంది...
http://umasankarrao.blogspot.com/
టెంప్లెట్ మార్చక్కర్లేదు కానీ ఆయన్లా మంచి మంచి పొస్ట్లు రాసెస్తూ వుండండి మాకొసం .
ముందుగా ప్రశాంత్ కి ,మనస్విని కి శుభాకాంక్షలు .
నాకేం తెలుసు ? నేను అటు వెళ్ళగానే ఇటు నువ్వు ప్రమాదములో పడతావని ? అయినా చాలా కూల్ గా హాండిల్ చేసుకున్నావు . పెద్దల సపోర్ట్ పొందావు . అభినందనలు
.అయినా అండగా జ్యోత్ గారుండగా భయమెందుకు దండగ !
జ్యొతి గారి ని అడిగి వర్డ్ వెరిఫికేషన్ తీయంచేయి ప్లీస్ .
మరో సారి హార్ధి కాభినందనలు .
మంచుపల్లకీ గారు, ప్లీజ్ నవ్వకండి, నా సినిమా కష్టాలు తీరాలని అశీర్వదించండి.
మాల అక్కకి థాంక్యూ.
జయ గారూ,
మీ 'మనస్వి' కొత్త రూపు బాగుంది. మేము మీ కొత్త బ్లాగుని ఫాలో అయిపోతాము. ఇక మంచి మంచి టపాలు రాసేయడం మీదే ఆలస్యం :)
మధురవాణి గారు నా బంగారు తల్లి, తెల్లగులాబి వాడిపోకుండా ఉండాలని దీవించాలి మరి.
జయ, ఈ మధ్య కాస్త తీరిక తగ్గి చూడలేదు. మీకు మనస్తాపం కలిగించిన ఆ విషయం సద్దు మణిగినందుకు సంతోషం. ఈ మనస్వి మీ మనోభావికగా మమ్మలందర్నీ అలరించాలని అభిలషిస్తూ..ఉష
ఉషా గారు, థాంక్యూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి