19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చిత్రలేఖనాలు-2

మీకు మళ్ళీ కొన్ని చిత్రలేఖనాలు చూపించబోతున్నాను. శక్తి కొలది మీరు భయపడకుండా ఉండాలని నా విన్నపం. ఇవన్నీ నేను చాలా చిన్నప్పుడు వేసినవి కాబట్టి, అందులో ఘోరమైన తప్పులన్నీ కూడా 'చిన్న తప్పులు ' గా భావించగలరని నా కోరిక. ఎందుకోనండి మరి, ఇవంటే నాకు చాలా ఇష్టమే:) అవున్లెండి, కాకి పిల్ల కాకికి ముద్దు, మాకేంటంట అంటారా! అదీ నిజమే.

ఇందులో నేను ఈ మధ్యే వేసిన రెండు చిత్రాలు కూడా ఉన్నాయి. అవేవో చాలా సులభంగానే కనుక్కోవచ్చులెండి. పెద్ద ఇబ్బందేమి ఉండదు. ఇందులో గనుక తప్పులుంటే మాత్రం అవి 'పెద్ద తప్పులన్న ' మాట.

కొంచెం గుండె చిక్కబట్టుకొని కళ్ళుమూసుకొని చూసేయండేం!!!...














*************************************************************************

18 కామెంట్‌లు:

Giridhar Pottepalem చెప్పారు...

జయ గారూ,

మీ చిత్రలేఖనాలు అద్భుతంగా ఉన్నాయి.

చిత్రలేఖనంలో నాకు తెలిసి తప్పులు అంటూ ఏమీ వుండవు. తప్పులు పట్టటం అంటే బహుశా విమర్శించటమే పనిగా వెతకటమేమో. ఇందులో మీరు ఈమధ్య వేసిన ఒక చిత్రం నడి మధ్యలో "సాయం సంధ్య గూటికి చేరుతున్న పశువులు", అవునా? తప్పు పట్టానంటారా? :)

- గిరిధర్ పొట్టేపాళెం

మురళి చెప్పారు...

I liked the the second and fourth ones very much.. in all, you have done a very good job..keep it up ma'm..

Hima bindu చెప్పారు...

వావ్ ...మొహంజొదారో లార్డ్ పశుపతి ! బాగున్నాయి .

నిషిగంధ చెప్పారు...

చాలా బావున్నాయండి! నాలుగోది మాత్రం చాలా చాలా నచ్చేసింది నాకు :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిత్రాలు చాలా బాగున్నాయండీ...ఇవన్నీ ఆయిల్ పెయింట్స్ తో కాన్వస్ మీద వేసినవేకదండి...

శిశిర చెప్పారు...

నాలుగవ చిత్రం నాకు చాలా చాలా నచ్చిందండి. అన్నీ కూడా చాలా బాగా వేశారు.

SRRao చెప్పారు...

జయ గారూ !
చిన్నప్పుడే వేసిన పెద్ద చిత్రాల్లాగే వున్నాయండీ ! అభినందనలు

SP చెప్పారు...

Jaya pinni - 1st, 3rd and 5th are very nice :)
1st - very beautiful colours and very vivid !
3rd - Mohenjodaro period :) has intensity
5th - Kalamkari painting - very beautiful !

paint more ! Sanju.

రాధిక(నాని ) చెప్పారు...

నాకు అన్ని చిత్రాలు నచ్చాయండి .ముఖ్యంగా ఆనాలుగో చిత్రం చాలాబాగుంది.ఏ వయసులో వేసినా అలావేయడం కూడా గొప్పేకదా . మీనుంచి ఇంకో మంచి చిత్రాన్ని త్వరలో ఆశిస్తున్నాను .

జయ చెప్పారు...

గిరిధర్ గారు, థాంక్యూ. దీన్నే అంటారు "ప్రోత్సహించటమని" . మీరు చెప్పిన చిత్రం నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల వయసులో వేసాను. ఇంక పోతే ఈ మధ్య నేను వేసింది, మొహంజొదారో యోగి, మధుబని పైంటింగ్స్. మీరు వేసిన చిత్రాలు చూస్తుంటే ఎలాగైన, ఎప్పటికైనా ఒక్కటైనా పర్ఫెక్ట్ పైంటింగ్ వేయాలనే కోరిక పెరిగిపోతొంది. ఏం చేస్తానో...చూడాలి:)

జయ చెప్పారు...

మురళి గారు మీకు నచ్చినవి చాలా చిన్నప్పటివి. అప్పటివి మెచ్చుకొని, ఇప్పటివి ప్రోత్సహించారన్నమాట:) Good development కదా! థాంక్యూ.

చిన్ని గారు,థాంక్యూ. మీరు మెచ్చుకున్న పశుపతి నాకూ ఇష్టమే. ఇలా వేయటం కష్టం కదా...

జయ చెప్పారు...

నిషిగంధ గారు మీరు మెచ్చుకున్న చిత్రమే దాదాపుగా అందరికీ నచ్చింది. అది చిన్నప్పుడు వేసిన ఆయిల్ పైంటింగ్. థాంక్యూ.


శేఖర్ గారు థాంక్యూ. ఇందులో వాటర్ కలర్స్, స్కెచెస్, ఆయిల్ పైంటింగ్స్, ఆర్ట్ఫిషియల్ మధుబని పైంటింగ్స్ అన్నిరకాలు ఉన్నాయన్నమాట. ఆల్ రౌండర్ కదూ:)

జయ చెప్పారు...

శిశిరా థాంక్యూ. సో నాలుగవది అంత బాగుందన్నమాట.


రావ్ గారు మీరెప్పుడూ పెద్దమనసుతోటే మెచ్చుకుంటారండి. థాంక్యూ.

జయ చెప్పారు...

హాయ్ సంజు థాంక్యూ. నాకెందుకో లాస్ట్ పైంటింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, అహ్మదాబాద్లో అక్కడ ఫోర్ట్ చూడటానికి వెళ్ళినప్పుడు, అప్పటికప్పుడు అక్కడే మొత్తం వేసేసుకున్నాను. అప్పట్లో అది గంటసేపు కూడా పట్టలేదు. ఒచ్చేపోయేవాళ్ళు వింతగా నన్ను చూసినా నేను పట్టించుకోలేదు. పాపం మా కేరళ ఫ్రెండ్ పద్మజ నాకోసం అక్కడే నేనున్నంతసేపు తోడుగా ఉంది.


రాధిక గారు థాంక్యూ. ఇంకా మంచి చిత్రాలంటే కష్టమే. రాను రాను దిగదుడుపే అయితోంది. ముందు కాకర అని తరువాత కీకర అనే లెవల్లో ఉన్నాన్నేను:)

భావన చెప్పారు...

అన్నీ బాగున్నాయి జయ. మొదటిది, నాలుగోది ఆఖరిది నాకు బాగా నచ్చాయి. చాలా బాగా వేసేరు మీరు అశ్రద్ధ చేయకండీ చిత్రలేఖనం అనేది ఒక వరం అందరికి దొరికేది కాదు వచ్చిన కళ ను నిర్లక్ష్యమ్ చెయ్యకండి.

జయ చెప్పారు...

Thankyou Bhavana. I will try.

..nagarjuna.. చెప్పారు...

A big WOW!

జయ చెప్పారు...

Thank you. I am very late:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner