8, మార్చి 2010, సోమవారం

నేనునేనుగానే!
పునర్జన్మ అ౦టూ ఉ౦టే---నేనునేనుగానే!

అవును ... పునర్జన్మ౦టూ ఉ౦టే నేను నేను గానే మళ్ళీ పుట్టాలని నా కోరిక.... అవునండీ...ఒక పంతులమ్మగానే...

చుట్టూ అ౦దమైన పసిహృదయాల పసిడి బాలల మధ్య, కల్మషమెరుగని, కల్లాకపటమే తెలియని, నూతన జీవిత౦లోకి అడుగిడబోతున్న...ముగ్ధబాలికల ప్రేమానురాగాలతో అలరారుతున్న... ఈ జీవితమే నేనుకోరుకున్న జీవిత౦.

సుఖ దు:ఖాలు, మ౦చీ చెడుల మేలుకలయికే ఈ జీవిత౦.

ఎక్కడో పుట్టి ఇక్కడచేరిన ఈ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి, వారి అనుభూతులను ప౦చుకు౦టూ గడిపే పాల వ౦టి స్వచ్చమైన, కల్లాకపటమే లేని ఈ పసి జీవితమే నాకు మళ్ళీ కావాలి. అన్ని స౦స్కృతులు...సంప్రదాయాలు...ఆచారాలు కలగలిపిన వీరితో...సౌభ్రాతృత్వపు భావనలతో... కలిసి ఆడే ఆటపాటలు, సరదాల పండగ సంబరాలు, ఉత్సవాలు, విహార, విజ్ణాన యాత్రలు...ఓహ్...ఇంకా ఎన్నో...ఈ ప్రపంచాన్నే మరిపించే పునర్జన్మ ఇదే...

కొత్తగా వొచ్చిన పిల్లల్తో కలిసిపోయి ప౦చుకునే ఈ ఆన౦ద౦, వారికి ఎన్నో విద్యాబుద్ధులు, ధైర్యసాహసాలు, సక్రమమైన జీవిత నైపుణ్యాన్ని నెరపి... సంఘం లోకి పంపే ఆ పవిత్రమైన బాధ్యతే నాకిష్టం.

నా చేతిలో చేయి వేసి, నా అడుగులో అడుగులేస్తూ...చదువుస౦ధ్యల్లో...వీధిబాలల పాఠశాలలు, బాలనేరస్తుల కారాగారాలు, అనాధశరణాలయాలు, మానసిక వికలాంగుల పాఠశాలలో, స్త్రీ శిశు సంక్షేమ పథకాలకు తోడు వొచ్చి ఎంతో పెద్దరికంతో తమ సేవ లందించి, తమ చేతిలో ఉన్న ఒక్క రూపాయి కూడా తోటి పేద విద్యార్ధిని ఫీజ్ కిచ్చేసి, ఎవరికి ఏ కష్టమైనా ఎటువంటి ఆలోచనా లేక ఆదుకోటానికి ఉరకలు వేసే వారి దీక్ష, పట్టుదల ... తామే స్వయంగా మార్గ దర్శకులుగా మారిపోయె...ఇంత స్వచ్చమైన పూబాలల మధ్య గడిపే జీవితమే నా దృష్టిలో ఎంతో ఉన్నతమైన జీవితం. నేనూ నిత్య విద్యార్ధ్ధినిని. ఒక్కొక్క బాలిక జీవితం నాకు ఎన్నో నేర్పుతోంది. నాకు ఆదర్శమైన వీరి మధ్య గడిపే జీవితమే నాకు గర్వ కారణం. ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఇంకేముంది? జన్మ జన్మల సాఫల్యాన్ని అందిస్తుంది.

ఎంతో ఎదిగిపోయిన ఆ పసికూనలు....ఎప్పుడో కళ్ళముందు కనబడితే...వారి పెరుగుదలకు సంతోషించి చెమ్మగిల్లే నా కళ్ళలోని తృప్తే నాకు పరమావధి. ఉన్నత స్థాయిలోని వారు, చిన్నపిల్లలై...లోకమే మరచి...నాపై గౌరవాన్నిచూపుతూ, మరొక పక్క గారాలు పోయే వాళ్ళ కళ్ళలో తళతళ మెరిసే ఆ వెలుగు నాదికాదా!!!

"టీచర్ అంటే నడిచే పుస్తకం. కొండంత సహనం. టీచర్ అంటే చీకటి తెరలను తొలగించే దీపం. ఒడుపుగా మనలోకి తెలివిని ఎక్కించే తేజం. మంచి టీచర్ కావాలంటే మాటలు కాదు. చదువునే సర్వస్వంగా భావించి ... జీవితాన్ని వెతుక్కోవటం ఎలాగో .... తెలియ చేసేది ఉపాధ్యాయుడే.... ఎందరో భావి పౌరులను తయారు చేసే బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోస్తున్న భారత నిర్మాతలు 'పంతులుగారు '. చీకట్లో మగ్గిపోతున్న ఒక మారుమూల ప్రాంతంలో కూడ ....ఒక పదిమంది పిల్లలు బిలబిల మంటూ పలక, బలపం చేతబట్టుకొని వొస్తే..... భళ్ళున వెలుతురు నింపగల శక్తి ఒక్క ఉపాధ్యాయునుకి మాత్రమే ఉన్నదంటే అతిశయోక్తి కాదు. రేయింబవళ్ళు కష్టపడి, జీవిత చరమ దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే తన వెనుక కనపడే వేలాది విద్యర్ధులను చూసుకొని గర్వంతో మురిసిపొయే ఒక సామాన్య టీచర్ జీవితం ఎంత ధన్యమో! టీచర్ అంటే పిల్లలకు పాఠాలు చెప్పటం తోటే బాధ్యత తీరిపోదు. కన్నబిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించినట్లే టీచర్లు కూడా విద్యార్ధుల గురించి తపనపడతారు. తన స్వంత సంపాదననుంచి పిల్లలకు పలకలు, నోటుబుక్కులు, పెన్నులు, డిక్షనరీలు అందించే ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. పేదవిద్యార్ధులకు, అనాధ పిల్లలకు తామే ఫీజులు కట్టి చదివించే ఉన్నత టీచర్లు కూడా ఉన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్ధులు మంచి స్థానంలో ఉన్నారంటే ఒక టీచర్ కి అంతకన్నా ఇంకేం కావాలి? చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధికి ప్రయోజనం అని ప్రతి గురువు తన విద్యార్ధికి బోధిస్తాడు. వీధిలో గురువుగారు కనిపిస్తే 'మాస్టారు వొస్తున్నారు ఇంటికి తీసుకు రండి ' అంటు తమ పిల్లలకు తల్లిదండ్రులు చెబితే, ఆ గౌరవం చాలనిపిస్తుంది. ప్రతి విద్యర్ధిని చిటికెన వేలు పట్టుకొని ఆప్యాయంగా గమ్యం చేర్చే శక్తి వంతుడు ఒక టీచర్ మాత్రమే! ఎందరో విద్యార్ధుల భవితకి పునాది వేస్తూ, ప్రపంచానికి వెలుతురునందిస్తున్న ధన్యజీవి. నిజమైన టీచర్ కి రిటైర్మెంటే లేదు." .....

పరిపూర్ణమైన జీవితాన్ని చూపి, హృదయ౦ ని౦డా తృప్తి ని ని౦పిన...ఇదిగో ఇటువ౦టి...ఈ ప౦తులమ్మ జీవితమే నాకు మళ్ళీ కావాలి.

మన౦దరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

ఒక చిన్న కొసమెరుపు: అలహాబాద్ లోని త్రివేణి సంగమం లో పునర్జన్మ లో ఏమి కావాలని కోరుకుని మునిగితే ఆ కోరిక తీరుతుందట. ఒక సారి ఒక పేద బ్రాహ్మణుడు త్రివేణీ సంగమం లో మునిగి చావటానికి వెల్తే అప్పటికే అక్కడ ముగ్గురు స్త్రీలు ఉన్నారట. ఒకరు తాను ఒక మహారాజుకి భార్యకావాలని కోరుకుంది. ఇంకొకరు తాను ఒక మంచి విద్యావేత్తకు భార్య కావాలని కోరుకుంటే, ఇంకోకరు ఘనకీర్తి కలవానికి తనను భార్యను చేయమని కోరుకుంటూ చనిపోయారట. అది చూసిన ఈ పేద బ్రాహ్మణుడు మరుజన్మలో ఆ ముగ్గురికీ తనని పతిని చేయమని కోరుకుంటూ తాను కూడా త్రివేణీ సంగమం లో మునిగాడట. అతడే మరుజన్మలో విక్రమాదిత్యుడు గా జన్మి౦చాడుట. ఇది మా అమ్మ చెప్పిన చ౦దమామ కథ.
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి...చదువులమ్మ చెట్టునీడలో కలిసాము....
*************************************************************************

22 కామెంట్‌లు:

సుభద్ర చెప్పారు...

ప౦తులమ్మగారు,
చాలా బాగారారు..ఇ౦త సి౦పుల్ గా కాదెమొ..ఇరగదీశారని చెప్పాలెమొ...
ఎదో తెలియని పీల్ అన్పి౦చి౦ది..చ౦దమామ కధ బాగు౦ది..స౦ధ్బోచిత౦గా కుదిరి౦ది.
తప్పక త్రీవేణిస౦గమ౦లో ముగుతాను..

SRRao చెప్పారు...

జయ గారూ !
ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరుజన్మలో ' పంతులమ్మ ' గానే పుట్టాలన్న మీ నిర్ణయం బావుంది. భావి పౌరుల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అనేది నిర్వివాదాంశం. మీరు చెప్పినట్లు విథ్యార్థుల్ని మంచి వైపు ప్రోత్సహించే ఉపాధ్యాయులు కొందరున్నా చెడు వైపు ప్రోత్సహించేవారు, స్వప్రయోజనాలకుపయోగించుకునేవారు కూడా వున్నారండి. వారు కూడా మారితే బాగుండును. ఏమైనా మీ ఉన్నతాశయాలకు అభినందనలు.

పరిమళం చెప్పారు...

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.మీ నిర్ణయం అభినందనీయం ..చివర్లో కధ చాలా బావుందండీ

జయ చెప్పారు...

సుభద్ర గారు థాంక్యూ. మీకు దండం పెడ్తాను, ప్లీజ్. ఇప్పుడు త్రివేణీ సంగమం కి వెళ్ళకండి. అది కేవలం కథ మాత్రమే. ఇప్పుడు అందరూ మీతో పాటే వరుస కట్టారంటే, మరుజన్మ సంగతేమో గాని నేను ఎప్పటికీ నరకంలోనే స్థిరపడిపోతానండీ బాబూ. ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్....

జయ చెప్పారు...

రావ్ గారు ధన్యవాదాలండీ. ఏదైనా మనసుల్లో రావాల్సిన మార్పు అది. కొంతమంది పరిస్థితుల ప్రభావం వల్ల మీరు చెప్పిన విధంగా ప్రవర్తించవచ్చు. వీలైనంత మటుకు, శక్తి కొలది ప్రయత్నం చేయాలి అన్నది నా అభిప్రాయం. అంతేనండి.

జయ చెప్పారు...

పరిమళం గారు థాంక్యూ. చివర రాసింది కథ మాత్రమే! మీరు ఒప్పుకున్నారు కదా! హమ్మయ్య. మీరు కూడా ఎక్కడ సుభద్ర గారి లాగా అనేస్తారో అని భయపడిపోయానండి.

శ్రీలలిత చెప్పారు...

జయగారూ,
మీరు చూపించిన బొమ్మలోలాగే తన చేతిలోని ఙ్ఞానమనే దీపంతో లోకంలో చీకటిని పారద్రోలే గొప్పవ్యక్తి గురువంటే.
కాని ఈనాడు వెకిలి హాస్యం పేరుతో సినిమాల్లో తల్లితండ్రులని, గురువుని జోకర్ లు గా చూపిస్తూ అపహాస్యం చేస్తుంటే గుండె నీరైపోతోంది. మీరు గురువు ఔన్నత్యం గురించి చాలా బాగా చెప్పారు. మనసు కెంతో సంతోషంగా అనిపించింది. మీ కోరిక బాగుంది.

sreenika చెప్పారు...

జయ గారూ !
చాలా చక్కగా చెప్పారు.ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గురు..శబ్దార్ధం..గు అంటే అజ్ఞానం రు అంటే తొలగించు...అజ్ఞానం తొలగించు వాడు. సర్వదేవతలలో మూడవ స్థానాన్ని ఇచ్చినా ..(మాతృదేవోభవ....) తరువాత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని అత్యున్నత స్థానాన్నిచ్చారు.ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి జన్మ రాదేమో.
నిజమే ఈ వృత్తి లో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదేమో.. గొప్ప అనుకోకపోతే ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను..
మా స్కూలు పాత విద్యార్ధులెవరైనా వస్తే వారికి ఒక డేట్ ఇచ్చి వారి గురించి మా పిల్లలకి పరిచయం చేసుకోమని అవకాశం ఇస్తాం.ఆ రోజు మాస్కూలులో వారి అనుభవాలు చెప్తూంటారు. చాలామంది అందరితో పాటు నాగురించి చెప్పినవారే. కాని ఒకసారి
MBBS ఫైనలియర్ చదువుతున్న ఒక అబ్బాయి..
తను పరీక్ష రాస్తూండంగా కాపీ కొడుతున్నాడని నేను borrowed garments never fit well అనే ఇడియం గురించి చెప్పి ..నువుతప్పు రాసినా ఫర్వాలేదు..నువు స్వంతంగా రాసావన్న తృప్తి ఉంటుంది అని చెప్పాను(ట)అది అతని జీవితాన్ని మార్చిందట..పేరెంట్స్ ముందు, పిల్లల ముందు మైకులో అతను చెప్తూంటే..whether u believe it or not my hair rose at its end and tears suffused...where else do we find this...except in our profession.. ప్రతి గురువు జీవితం లోనూ ఇటువంటి అనుభవాలు కోకొల్లలు..
అందుకే మన సంకల్ప సిద్ధీ కావాలని కోరుకుంటూ..

జయ చెప్పారు...

శ్రీలలిత గారు ధన్యవాదాలు. అవునండి, మీరు చెప్పినట్లు సినిమలల్లో అటువంటి సీన్స్ చూస్తే చాలా బాధనిపిస్తుంది. ఆ బొమ్మ నాకు చాలా నచ్చిందండి అందుకే పెట్టాను. మీరు దాని అర్ధం సరిగ్గా గ్రహించినందుకు థాంక్స్.

జయ చెప్పారు...

శ్రీనిక గారు మీకు నా ధన్యవాదాలు. హృదయపూర్వక అభినందనలు. అదే కదండి ఈ వృత్తిలోని గొప్పదనం. ఎంతోమంది జీవితాలతో ముడి పడి ఉన్న ఉత్కృష్ఠ మైన బాధ్యత ఇది. ఇందులో మీరు గొప్పగా చెప్పారనుకోటానికి ఏముందండి. ఇటువంటి అనుభవాలే కదండి ఉపాధ్యానుకి ఊపిరిపోసేది. ఈ అనుభవాలే ఉపాధ్యాయుని అతి జాగ్రత్తగా అడుగులు వేయించి తన విద్యార్ధిని "step in step" గా చేయ గలుగుతుంది. ఇదే అసలైన job satisfaction.

మాలా కుమార్ చెప్పారు...

గురు బ్రహ్మ , గురు విష్ణు , గురుదేవో మహేశ్వర ,
మళ్ళీ గురువుగానే పుట్టి , విద్యార్ధులను తీర్చి దిద్దాలన్న నీ సంకల్పం బాగుంది . అభినందనలు .
శ్రీనిక గారు ,
మీలాంటి గురువుల వలననే విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు . అభినందనలండి . కీప్ ఇట్ అప్ .

శిశిర చెప్పారు...

నిజమేనండి. గురువుగా పిల్లలకు నేర్పడంలోనూ, పిల్లల నుండి నేర్చుకోవడంలోనూ, వాళ్ళ భవిష్యత్తు బాగుందని తెలిసినపుడు కలిగే సంతోషంలోనూ ఉండే తృప్తి వేరే ఎక్కడా దొరకదేమో. ఎప్పుడో చెప్పిన చదువుకి ఆ పిల్లలు ఇప్పటికీ గుర్తుంచుకుని చూపించే ప్రేమ,అభిమానం, గురువుగా నేను పొందుతున్న ఆనందం ఇది నా వృత్తి మాత్రమే కాదు, నా జీవితం అనుకునేలా చేస్తూంది. మీరు మీరుగానే ఉండాలన్న మీ ఆకాంక్ష ఫలించాలని ఆశిస్తూ... నేను కూడా నేనుగానే ఉండాలని కోరుకుంటూ.. గురువు మీదుండే గురుతర బాధ్యతను గుర్తించి, నిర్వహించగలిగినవాళ్ళే గురుస్థానంలో ఉండేలా చేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.. కొంచెం ఆలశ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

భావన చెప్పారు...

కొంచం లేట్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా బాగా చెప్పేరూ జయ. నిజమైన గురువు ఏమి చేయగలరో, వారి గుండెలలోని ఆనందపు చమరింతలు మెరుపులు గురించి. ఇంకా లోకపు కుళ్ళు కుతంత్రాలను ఎక్కించుకోరు కదండి వారి తోటీ గడిపే కాలం నిజంగా పునర్జన్మే, నాకు కూడా చాలా ఇష్టమైన పని టీచింగ్. చాలా బాగా చెప్పేరు జయ.

జయ చెప్పారు...

అక్కా, థాంక్యూ.


శిశిరా, ఈ జీవితంలో ఆనందం అనుభవించే మీ లాంటి వారిని చూసినా నాకెంతో తృప్తిగా ఉంటుంది. అభినందనలు.

జయ చెప్పారు...

భావనా థాంక్యూ. ఎంతో నిష్కల్మషమైన విద్యార్ధులు ఇతర ప్రభావాలకు లోను కాకుండా ఉన్నతమైన డశకు చేరిన నాడే నిజమైన తృప్తి ఉంటుంది. అందుకేనేమో, టీచర్ అంటే నాకంత ఇష్టం.

SRRao చెప్పారు...

జయ గారూ !

నూతన సంవత్సరంలో మీ మనస్వి నుంచి మరిన్ని మంచి రచనలు కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబం

శిశిర చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు జయ గారు.

జయ చెప్పారు...

రావ్ గారు ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలండి.

శిశిరా థాంక్యూ. మీకు ఉగాది శుభాకాంక్షలు.

Seetharam చెప్పారు...

Endaro Mahanubhavulu. Andariki Sata Sahasra Paadaabhivandanalu.

Entha chakkaga vrasaru!! Inka chakkaga geesaru.

I am glad I ran across your site from some other blog...

Warm Regards

Seetharam

జయ చెప్పారు...

Seetaraam gaaru thank you very much for your visit.

ప్రణీత స్వాతి చెప్పారు...

జయగారూ..కొత్త టపా కోసం వెయిటింగ్..తొందరగా రాయరూ..!

జయ చెప్పారు...

రాయాలనే ఉంది....ఇప్పుడు మీరు కంటిన్యూ చేసేయండేం:) థాంక్యూ

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner