9, మే 2010, ఆదివారం

భరతమాత దత్తపుత్రిక




ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన మన భరతమాతకు ముద్దుల దత్తపుత్రిక మదర్ థెరిసా...

యుగోస్లేవియాలో జన్మించిన ఆగ్నస్ గోన్ష్ బొజాక్సువూ, అనే పువ్వు పుట్టగానే పరిమళించింది.
మానవ సేవకు అంకితమైన త్యాగశీలి.
భారతదేశ అందానికి అద్దం పట్టే హిమాలయాలు ఆగ్నస్ కు స్వాగతం పలికాయి.
ఈ ప్రశాంత ప్రకృతిపట్ల ముగ్ధురాలయింది.
భారత పౌరసత్వం పొంది మదర్ థెరిసా గా రూపుదాల్చింది.
ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి సేవాకార్య క్రమాలకు శ్రీకారం చుట్టింది.
పేదరికం రాజ్యమేలుతున్న ప్రాంతాల సముద్ధరణకు కంకణం కట్టుకున్న పుణ్యశీలి.
సమాజం నుంచి బహిష్కరింపబడిన రోగపీడితులకు, అనాధ శిశువులకు తన జీవితం అంకితం చేసిన కరుణామూర్తి.
మానవసేవయె మాధవ సేవ అన్న నానుడికి ప్రతిరూపమే ఈ తల్లి.
భారత ప్రభుత్వం ఈమెకు అందించిన గౌరవ పురష్కారాలు అనంతం.
ఈమె విశ్వప్రజలకు ఆచంద్రార్కం నిత్యస్మరణీయురాలే...
మహిళా ప్రపంచానికే మకుటాయమానమైన విశ్వమాత థెరిసా ఆశలను, ఆశయాలను అనుసరించి ఆచరించిన వారి జన్మ ధన్యం. అదే మన నివాళి.
ఒక నిరాడంబర మానవతా మూర్తి ఈ మదర్....

మదర్స్ డే రోజున ఒకసారి, ఈ అమ్మను తలచుకోవాలనిపించింది. ఎవరి సంతానం కోసం వారు ఎన్ని కష్ట నష్టాల నైనా ఎదుర్కోవచ్చు. త్యాగాలు చేయొచ్చు. కాని ప్రపంచాన్నే తన సంతానం గా భావించి అంకితమైన ఆ విశ్వమాతకు మాత్రం ఏది సాటి రాదు.

ఆ అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే....అంత గొప్పటి అమ్మతనానికి, ప్రతి తల్లికీ ఈ రోజు నా శుభాకాంక్షలు.....


M - Mother for everyone
O - Offered everything she had
T - Took care of every poor child
H - Honored by all
E - Embraced the dying destitute
R - Really loved the orphans
T - Trusted in God
E - Earned her living for others
R - Rejoined with the poor
E - Ever to help you
S - Served the Nation with love
A - Addressed and admired by all



Mother Teresa Prayer in her handwriting:






I have found the paradox, that if you love until it hurts, there can be no more hurt, only more love.
Mother Teresa



******************************************************************

10 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

జయ గారూ !
మదర్స్ డే రోజున ప్రపంచానికే మదర్ ను తలుచుకోవడం అభినందనీయం. మీకు కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

శిశిర చెప్పారు...

మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి.

Unknown చెప్పారు...

మీకు నా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

మురళి చెప్పారు...

మంచి టపా అండీ.. నిజమే మదర్ తెరెసా అమ్మలందరికీ అమ్మ..

తృష్ణ చెప్పారు...

ఇవాళ మదర్ ను తల్చుకోవటం....నిజంగా అందరం చేయాల్సిన పని. goo post అండీ..happy mother's day..!

సుభద్ర చెప్పారు...

CHALAA BAGUNDI..

శ్రీలలిత చెప్పారు...

జయగారూ,
మాతృదినోత్సవ సందర్భంగా అమ్మలకే అమ్మ అయిన మదర్ ని గురించి మంచి విషయాలు చెప్పారు.
మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"ఎవరి సంతానం కోసం వారు ఎన్ని కష్ట నష్టాల నైనా ఎదుర్కోవచ్చు. త్యాగాలు చేయొచ్చు. కాని ప్రపంచాన్నే తన సంతానం గా భావించి అంకితమైన ఆ విశ్వమాతకు మాత్రం ఏది సాటి రాదు."

చాలా బాగుందండీ మదర్ గురించి మీ పొస్టింగ్. మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

కాస్త ఆలస్యంగా మదర్స్ డే శుభాకాంక్షలండీ.

జయ చెప్పారు...

రావ్ గారు
శిశిర
ధరణీ రాయ్ గారు
మురళి గారు
తృష్ణ
సుభద్ర గారు
శ్రీ లలిత గారు
రాజి
ప్రణీత స్వాతి...మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner