24, మే 2010, సోమవారం

!దడిగా డువా నసిరా





ఊహలు-ఊసులు బ్లాగ్ లో, ’కాకతాళీయమా/ యాధృచ్ఛికమా’ అని అనురాధ గారు వ్రాసింది చదివాక నాకు కూడా ఇలా రాద్దామనిపించింది:-) అక్కడో కమెంట్ రాసేసి, ఇక్కడిలా మొదలెట్టాను.

ఇది కొన్ని సబ్జెక్ట్స్ లో నా పరిజ్ఞానమన్నమాట.

మొదటగా ఇంగ్లీష్:

ఇక్కడొక చిన్న tongue twister:

When I was in Arkansaw I saw a saw that could out saw any other saw I ever saw; if you’ve got a saw that can out saw the saw I saw then I’d like to see your saw the saw.

ఇప్పుడేమో నా ప్రయోగం:

What is Life?

Life is neither a ‘Tempest’ nor a ‘Mid Summer Nights’ ‘Dream’. It is a ‘Comedy of Errors’ you may take it,.... ‘As you like it’.

PUN OF POETS

A poet who can shake the spear : Shakes Peare
A marvelous poet: Marvel
A dry poet living in a den: Dryden
A poet made out of steel: Richard Steel
A poet whose words are worthy: Wordsworth
A poet who always stands on a cool ridge: Coleridge
A poet who plays Tennis: Tennyson
A poet who is brown in color: Robert Browning
A poet who lives long: Longfellow

ఇప్పుడు చరిత్ర:

నెపోలియన్ పుట్టింది 1760, హిట్లర్ 1889 లో పుట్టాడు.-తేడా 129 సంవత్సరాలు.
నెపోలియన్ అధికారంలోకి 1804 లో వస్తే, హిట్లర్ 1933 లో వచ్చాడు- తేడా 129 సంవత్సరాలు.
నెపోలియన్ రష్యా మీద 1812 లో దండెత్తితే, హిట్లర్ 1941 లో దండెత్తాడు.- తేడా 129 సంవత్సరాలు
నెపోలియన్ వియన్నా 1809 లో ఆక్రమిస్తే, హిట్లర్ 1938 లో ఆక్రమించాడు.- తేడా 129 సంవత్సరాలు.
నెపోలియన్ 1816 లో ఓడిపోతే, హిట్లర్ 1945 లో ఓడిపోయాడు. - తేడా 129 సంవత్సరాలు....బాగుంది కదూ!!!!


ఇండియా లో జనవరి 26:
అదే రోజు 1530: బాబర్ చనిపోయాడు
1534: జహంగీర్ పుట్టినరోజు.
1730: నాదిర్ షా ఢిల్లీ మీద దండయాత్ర చేసాడు
1792: టిప్పుసుల్తాన్ బ్రిటిష్ వారితో యుద్థం చేసాడు.
1853: భారతదేశం లో మొదటిసారిగా రైలు ప్రయాణం చేసింది.
1863: బాంబే హైకోర్ట్ ప్రారంభించబడింది.
1885: భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించబడింది.
1950: భారత్ గణతంత్ర దేశం అయింది.

ఇక్కడొక చిన్న జోక్ అన్నమాట:

శేఖర్: అమ్మా! ఇక్కడి నా షర్ట్ ఏం చేసావ్.
అమ్మ: అబ్బా, ఏవిట్రా ఆ హడావిడి. లాండ్రీ కి పంపించాను.
శేఖర్: చంపావ్ పొ, నా మొత్తం హిస్టరీ స్లిప్స్ అన్నీ దాని పాకెట్స్ లోనే ఉన్నాయ్. ఇప్పుడు నేను ఎక్జామ్ కి ఎలా వెళ్ళాలి.

మరో జోక్:
మేరీ ఆంటియోనేట్: నేను ప్రాచీన యుగం లో పుట్టిఉంటే బాగుండేది.
అలెగ్జాండర్: ఎందుకో?
మేరీ ఆంటియోనేట్: అప్పుడైతే నేర్చుకోవాల్సిన చరిత్ర ఇంత ఉండేది కాదు కదా:)

(చాలా సంవత్సరాలు రాసాను కదూ. అయితే, ఈ చరిత్ర అంతా వేణూ శ్రీకాంత్, శేఖర్ పెద్దగోపులకి అంకితం:)

ఫైనల్ గా మాథ్స్:

WHY DO WE STUDY MATHEMATICS?

To Add noble qualities.
To Subtract evil habits.
To Divide what we have with others.
To multiply love and mercy.
To Root out dowry and caste system.
To Equate men and women in society.
To Differentiate good from evil.
To integrate joy and happiness in Angle.
To maximize our knowledge.
To expand our noble achievement.
To simplify our life.
To solve problems with ease and grace.
To be Rational in our outlook.
To practise the positive approach always.
To be a Dynamic person.
To maintain three Dimensions.
Duty…..Dignity….Discipline......

ఇప్పుడింక ఎక్జాంస్ . తప్పదు కదండి మరి. పరీక్షలు ఒక క్రికెట్ మాచ్ అనుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే:)

A class room is a "Criket Field"
The Examination is a "Test Match"
Where the student is the "Batsman"
The Paper Setters are the "Bowlers"
The invigilators are the "Umpires"
And the pen is the "Bat"
Questions are the "Balls"
And difficult questions are "Bouncers"
Good questions are "Boundaries & Sixers"
Distinction is 'Century"
And a case of cheating is "Caught out"
And talking in the hall is "Run out"
Where report is the "Score Board"
The highest scores is the "Man of the Match"....

ఇంకా చాలా సబ్జెక్ట్స్ నాకొచ్చండి. ఇప్పటికింక చాల్లెండి పాపం:) మిగతావన్నీ మీకే వదిలేసాను. సరేనా!!!!!.

ఇప్పుడు మా కాలేజ్ గురించి:

If I could pull down the rainbow
I would like to write my college name on it.
And set it back,
To show the people
How colorful our college is.....

ఇంతకీ "దడిగా డువా నసిరా" అంటే మీకు తెల్సా?


*****************************************************************

15 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీరు రాసిన హిస్టరీ డేట్స్ గుర్తు పెట్టుకోలేక ఇక్కడ వీరభద్రరావు లెవెల్లో షర్ట్ చింపుకుంటున్న శేఖర్ ని ఊహించుకోండి...:-)

ఇదిగోండి జయగారు, మీరిలా జోక్స్ రూపంలో అత:పుర రహస్యాలు చెప్పేస్తే ఎలాగండీ? :-) అయినా నేను అలా స్లిప్పులు కాగితాల మీద రాయలేదులెండి..ఎంచక్కా కేమిలిన్ వాడిది 30 సెం.మీ చెక్క స్కేలు మీద డేట్స్ అన్నీ రాసేసుకునేవాడిని...:)

హిస్టరీని రోస్టు అన్నందుకు చరిత్ర అంతా అంకితం చేసి ఎంత పెద్ద శిక్ష వేసారు!

>>>How colorful our college is...

జయగారు..ప్లీజ్..ప్లీజ్ మీ కాలేజ్ అడ్రస్ కొంచెం చెప్పి పుణ్యం కట్టుకోరూ!! :-):-)

తృష్ణ చెప్పారు...

మా నాన్నగారు చిన్నప్పుడు ఇలాంటివి చెప్తూండేవారు...ఒకటి -- "i saw a saw, such a saw(రంపం), that i never saw..:) "

అజ్ఞాత చెప్పారు...

"దడిగా డువా నసిరా"

రాసిన వాడు గాడిద

అజ్ఞాత చెప్పారు...

jokes బాగున్నాయండి

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది. ఇంతకీ మీరు ఏ సబ్జక్టుకి అధ్యాపకులు? ఇంగ్లీషు అనుకుంటున్నా

Hima bindu చెప్పారు...

కొత్తపాళీ గారి ప్రశ్నే నాదీను...

ప్రణీత స్వాతి చెప్పారు...

జయ గారూ ఆదరగోట్టేశారు. ఇంత చక్కగా రాసి మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఏమి బాగోలేదు(దడిగా డువా నసిరా).. శేఖర్ గారు మీ కాలేజ్ పేరు అడ్రెస్ అడుగుతున్నారు..చూశారా..?

భావన చెప్పారు...

సూపరు జయ. బలే రాసేరు, చదివినంత సేపు ఇకిలిస్తూనే వున్నా. శేఖర్ గారిని విరభద్ర రావు లా వూహించుకున్నా కూడా.. :-))
మొత్తాని టీచరమ్మ అనిపించుకున్నారు.

శిశిర చెప్పారు...

:):) బాగుందండి.

మధురవాణి చెప్పారు...

జయ గారూ,
పోస్ట్ అదిరింది. జోక్స్ కూడా బాగున్నాయి. కానీ, టైటిలే ఈ పోస్ట్ కి నప్పలేదు. ఎందుకంటే, మీరు చక్కగా రాశారు కాబట్టి :-)
@ శేఖర్ గారూ,
మీరెందుకు కాలేజీ అడ్రస్ అడిగారో నాకు అర్ధమైపోయిందిలే! జయ గారు వాళ్ళ కాలేజీ colourful అన్నారు కానీ, అది అబ్బాయిలు వాడే context లో కాదనుకుంటా! ;-)

జయ చెప్పారు...

హెలో శేఖర్ థాంక్యూ. వీరభద్ర రావే గుర్తుకొస్తున్నాడు, తల్చుకుందామంటే శేఖర్ ఎలాఉండేది నాకు తెలీదే!!! ఎలా ఊహించుకోను మరి.

అమ్మో! కొలబద్ద మీద కూడా కాపీలే! బాబోయ్ నాకింకా తెలీదు. అయితే మేము మాపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే మా అమ్మాయిల స్కేళ్ళు, రబ్బర్లు కూడా చెక్ చేయాలన్నమాట. హతవిధీ.

అబ్బా, మా కాలేజ్ అడ్రస్ చెప్పాలా? ఎందుకు మా అమ్మాయిలకి సైట్ కొడ్దామనే:) ఎంత ఆశ, దోస, ఇడ్లీ, పూరీ, ఎన్ని స్వీట్లో...

జయ చెప్పారు...

@ తృష్ణా ఎలా ఉంది హెల్త్. ఇలాంటి టంగ్ ట్విస్టర్ లు ఎప్పటికీ మాజా గానే ఉంటాయి కదూ:)

@ అజ్ఞాత గారు మీరూ రాసేసారే!!! ఎలా :) (సారీ)


@ అనురాధ గారు థాంక్యూ.

జయ చెప్పారు...

@ కొత్తపాళీ గారు థాంక్యూ. శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో ఒక నర్తకి అన్ని భాషల్లో పాడి, నృత్యం చేసి తన మాతృభాష కనుక్కోమందిట. తెనాలి రామలింగ కవి ఆమె కాలు తొక్కితే, ఆమె బాధతో మాతృభాషలో రాజు గారికి వెంటనే ఫిర్యాదు చేసిందిట. అలాగే మీరు ఏ క్లూతో కనుక్కో గలిగారబ్బా!!!

@ చిన్ని గారు నాకు బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., పిల్లలందరూ స్టూడెంట్సే:) ఎలా?

జయ చెప్పారు...

@ ప్రణీత గారు థాంక్యూ. ఏమో, నాకు తెలిసిన ఆ ప్రయోగం ఇక్కడ వాడుకోవాలనిపించింది:)
ఔనౌను. శేఖర్ కి మా కాలేజ్ అడ్రస్ చెప్పాలిట. ఏవిటో నా సీక్రెట్స్ అన్నీ ఔట్ అయిపోయేటట్లుంది.

@ కదూ భావనా:) మరి హిస్టరీ ని అలా అంటే ఎలా? అందుకే హిస్టరీ మొత్తం శేఖర్ కే అంకితం:)

జయ చెప్పారు...

@ శిశిరా థాంక్యూ. ఎలా ఉన్నారు. కరెంట్ సరిగ్గా వస్తోందా?

@ మధురవాణి గారు థాంక్యూ. చిన్నప్పుడు సరదాగా అలా ఆడుకునే వాళ్ళం. అందుకే అది ఎలా గైనా ప్రయోగించాలనిపించింది. మరి సరి అయిన సందర్భం నాకు దొరకలేదు:)
అవును శేఖర్ ఏ కలర్స్ కోసం అడిగింది నా కర్ధమైపోయింది. :) (సారీ శేఖర్)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner