10, నవంబర్ 2011, గురువారం

విందు భోజనాలు




అక్కడ కేవలం పదేళ్ళ లోపు వయసున్న మొగపిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పదహారు ఏళ్ళ వయసు వచ్చే వరకు అక్కడే ఉండి చదువుకుంటారు. ఏదో వృత్తివిద్య నేర్చుకుంటారు. అప్పుడప్పుడూ వారిని పలుకరిస్తూ ఉంటాను. అలాగే ఇవాళ కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని వెళ్ళాను. ఇవాళ వాళ్ళకి తినటానికి ఏమీ తీసుకు పోలేదు. ఇవాళ ఏమీ తేలేదర్రా, ఇక్కడే ఏమన్నా చేసుకుందాం.తినుకుంటూ హాయిగా ఆడుకుందాం. పాటలు పాడుకుందాం, కథలు చెప్పుకుందాం... సరేనా!!! మీరే చెప్పండి, ఏమన్నా అని అడిగాను.
అక్కా, అక్కా నేను చెప్తాను అంటూ వచ్చాడు ఏడేళ్ళ శీను. (నేను నన్ను ఆంటీ అని పిలవమన్నా ఎందుకో అక్కా అనే పిలుస్తారు:) కన్నా వీడికంటే కొంచెం పెద్ద వాడు. అంతే. అయినా పేద్ద లీడర్ అనుకుంటాడు. నేను చెప్తానక్కా అన్నాడు. సరే అందరూ తోచినట్లు చెప్పండి. మన ఇష్టమొచ్చినట్లు చేసుకుందాం...సరేనా అన్నాను. అందరూ సరే సరే అంటూ ఏకధాటిగా ఏం చేయాలో చెప్పటం మొదలు పెట్టారు.
మూంపల్లీలు బాగుంటాయి దానితో చేసుకుందాం అన్నాడు కన్నా.
సరే అయితే చెప్పు, అని డబ్బాల్లో వెతికితే కనిపించాయి. చాలానే ఉన్నాయి.

అక్కా బాగా ఉడకపెట్టాలి అన్నాడు. సరే వాడి గైడెన్స్ ఒప్పుకున్నాను కాబట్టి తప్పదు. నేనే చేస్తాను అని చక్కగా కుక్కర్ తెచ్చి అవన్నీ కడిగి ఓ గిన్నెలో పోసి నీట్ గా స్టవ్ మీద పెట్టాడు. ఏయ్, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పువేయ్ అనరిచాడు శీను. అవునుకదా, అని అందరం నవ్వేసాం. మా లీడర్ గారు కుక్కర్ తెరిచి దానిలో చేతితో కొలుచుకుంటు రెండు మూడు చెంచాల ఉప్పు వేసేసాడు. అంత చిన్నవాడు, ఎంత జాగ్రత్తగా చేసాడో ఆ పని. అక్కా, దీన్ని అయిదు విజిల్స్ తరువాత ఆఫ్ చేయాలి అని అక్కడే కూర్చున్నాడు. సరే, ఇహ అందరం ఆ కుక్కర్ దగ్గిరే విజిల్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఈ లోపల నాని వచ్చి నేనే బంద్ చేస్తా అన్నాడు. అందరూ నవ్వటం మొదలు పెట్టారు. ఎందుకురా అంటే, రోజూ బంద్ లన్నీ చూసి ఇక్కడ కూడా బంద్ చేద్దామని వచ్చాడు అని అంతా ఒక్కటే నవ్వు. నాని గాడి బుంగమూతి చూసి, ఊరుకోండిరా, అలా తమాషా చేయకూడదు, మనం స్టవ్ బంద్ చేయటమనే అంటాం కదా అన్నాను. మొత్తానికి వాడే స్టవ్ బంద్ చేసాడు:)

సరే ఎలా గయితేనేం ఈ మగపిల్లలంతా కలసి చివరికి ఉడికిన ఆ పల్లీలను బయటికి తీసారు. మరి ఇప్పుడేం చేయాలి అని అడుగుతూనే ఉన్నాను...ఈ లోపలే కన్నా చిన్న జల్లెడ తెచ్చి దానిలో పల్లీలను చాలా ఒడుపుగా దొర్లించి, అక్కా నీళ్ళన్నీ పోయే దాకా ఆగుదాం అన్నాడు. చక్కగా వడ గట్టిన ఆ పల్లీలను పెద్ద కంచం లో పోసాడు. కన్నా, నానీ, శీను కింద చతికిలబడి, కత్తిపీట తీసుకొని ఒకరి తరువాత ఒకరుగా చక చకా పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసారు. మిగతా పిల్లలంతా చుట్టూ చేరారు. వాళ్ళతో మీరందరూ వీటిని చక్కగా అందంగా పల్లీలమీద చల్లండి అని ఆర్డర్ వేసి, తనేమో నిమ్మకాయ కోసి దానిమీదంతా సమానంగా పిండాడు. తర్వాత సన్నగా కొత్తిమీర కోసాడు. ఇదన్నా నేను చల్లుతానురా అని వాడి పర్మిషన్ తీసుకొని ఆ పని నేను చేసాను. నా దగ్గిర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా చల్లేసాను. దీనిమీద కొంచెం సేవ్ చల్లుదాం అన్నాడు అప్పటి దాకా చూస్తూ కూచున్న రహీం గాడు. ఎక్కడ చూసినా సేవ్ కనిపించలేదు. ఏం చేద్దాం అని అలోచనలో పడ్డాం. పోనీ బయట షాప్ లో తొందరగా తీసుకొచ్చేస్తా అన్నాడు వాడే మళ్ళీ. అలా అయితే ఇది చల్లగా అయిపోయి ఏమాత్రం బాగుండదు అక్ఖర్లేదు అన్నాడు కన్నా గాడు. ఎలాగోలా వాడిని ఒప్పించి రహీం షాప్ కెళ్ళి వచ్చే వరకు ఓపిక పట్టాం. పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోతూ, తానే మొత్తం పల్లీల మీద సన్నగా చల్లాడు. అబ్బా, ఒక్క సారిగా దాన్ని చూస్తుంటే రకరకాల రంగులతో ఎంతో అందంగా కనిపించింది.

హాయిగా ఆ పెద్ద పళ్ళెం తో బయటికొచ్చి, కింద గడ్డిమీద పెట్టి చుట్టూ కూర్చున్నాం. ఆనందంగా "విందు భోజనం...పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం" అహహ్హ హహ్హ హహ్హా...ఒహొహ్హొహొహ్హొ హొహ్హొ అహహహహ్హహా..వింతైన భోజనంబు...ఇవన్ని మాకె చెల్ల:))) అని పాడుకుంటూ... కబుర్లు, పాటలతో మొత్తం తినేసాం.

తెలిసిపోయిందిగా, మా అబ్బాయిలు చేసిన వంటకమేమిటో:)

కార్తీక వనభోజనాలతో అంతా భుక్తాయాసంతో ఉండి ఉంటారు. సాయంత్రం పూట హాయిగా మా చిన్నారులు కలిసిమెలిసి చేసి మీకు ప్రేమ మీర వడ్డించిన ’పీనట్ స్నాక్’ ఆనందంగా తినేసి, వేడి వేడిగా చాయ్ చేసుకొని తాగేసేయండేం:)))

జ్యోతి గారు మా వంట పనికి రాదంటే మాత్రం నేనొప్పుకోనంతే... చెమటోడ్చి, కష్టపడి చేసాం.

ఆహా!!! ఏమి రుచి...తినరా మైమరచి...రోజూ తిన్నా మరి మోజే తీరనిది...అని హాయిగా పాడుకోవాలి. సరేనా:)

(కెమెరా తీసుకు పోలేదుగా...అందుకని సొంత ఫొటో లేదన్నమాట)

మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


**************************************************************************

18 కామెంట్‌లు:

సిరిసిరిమువ్వ చెప్పారు...

జయ గారూ..మీ పిల్లల మూంపల్లీ చాలా బాగుంది. అది చేస్తున్నప్పుడు వాళ్ల కళ్లల్లో వెలుగులు ఇంకా బాగుండి ఉంటాయి. మీకు అభినందనలు..పిల్లలకి శుభాశీస్సులు.

లత చెప్పారు...

లైట్ స్నాక్, చక్కగా ఉందండి.
మీ పిల్లలకు అభినందనలు చెప్పండి

Mauli చెప్పారు...

Baga chepparu, pallilu nooru ooristunnaay :)

sunita చెప్పారు...

Good!!

మాలా కుమార్ చెప్పారు...

మూంపల్లీ స్నాక్స్ బాగుంది .

రసజ్ఞ చెప్పారు...

బాగుందండీ! పిల్లల ముఖాలు ఇంకా ఆనందంగా కనిపిస్తున్నాయి నాకు!

శ్రీలలిత చెప్పారు...

స్నాక్ చాలాబాగుంది. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ చేసింది కనక ఇంకా బాగుంది..

సుభ/subha చెప్పారు...

వావ్ అండీ.. మొదటి సారి మీ బ్లాగు చూస్తున్నా.. వచ్చీ రాగానే నాకు మంచి ఫలహారం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. శీనూ గ్యాంగ్ భలే వంట చేసారండీ.

Padmarpita చెప్పారు...

పల్లీ స్నాక్స్ బాగుంది....

జ్యోతిర్మయి చెప్పారు...

శీను, కన్నా, నాని, రహీం ఇంకా మిగతా పిల్లలకు అభినందనలు. వారితో కలసి మాకు ఇంత మంచి స్నాక్ అందించినందుకు మీక్కూడా నండోయ్..

Ennela చెప్పారు...

అరె ఏందమ్మా..పిలగాల్లు చేసిన చెనిగలు నాకు మిగిల్చినవా లేదా...జెల్దిన బెట్టు ఆకలయితాంది. .ఆహా..రుచి మస్తుంది. పిల్లలందరినీ సల్లగుండుమని దీవించేసినా అని చెప్పు

Ennela చెప్పారు...

అరె ఏందమ్మా..పిలగాల్లు చేసిన చెనిగలు నాకు మిగిల్చినవా లేదా...జెల్దిన బెట్టు ఆకలయితాంది. .ఆహా..రుచి మస్తుంది. పిల్లలందరినీ సల్లగుండుమని దీవించేసినా అని చెప్పు

శిశిర చెప్పారు...

పిల్లలు ప్రేమతో చేసినవి కదా. మీరే స్వయంగా ఇంట్లో చేసుకున్నా రానంత రుచి వచ్చుంటుంది. అక్కతో కలిసి తయారు చేసుకోవడం పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేసుంటుంది. మీకూ, మీ పిల్లలకూ నా శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ.. మీకూ, మీ పిల్లలకూ
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు...

జయ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు
లత గారు
మౌళి గారు
సునిత గారు
అక్కా
రసజ్ఞ గారు
శ్రీలలిత గారు
సుభ గారు
పద్మార్పిత గారు
జ్యోతిర్మయి గారు
ఎన్నెలమ్మా
శిశిరా
రాజీ

మా పిల్లల పల్లీలు మెచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలండీ..
Happy Childre's Day..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలండీ..
Happy Children's Day

జయ చెప్పారు...

Thanq Raji.:)

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner