మా కాలేజ్ కి యు.జి.సి. ఎక్ష్పర్ట్ కమిటీ విజిట్ డేట్ డిసైడ్ అయ్యింది. ఈ టైం లో మా కాలేజ్ లో ఎంత హడావుడో చెప్పలేము. ఈ నెల యు.జి.సి. ఎక్ష్పర్ట్ కమిటీ విజిట్ ఉందని, స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి ఏమేమి తయారీలు చేసుకోవాలో చెప్పారు. మర్నాడు సెకండ్ సాటర్ డే. అయినా కాలేజ్ ఉంటుందని అందరు తప్పకుండా రావల్సిందే నని ఎవరు లీవ్ పెట్టటానికి వీలు లేదని, ఆ రోజు బదులు దసరా మర్నాడు హాలిడే ఇస్తామని,మా ప్రిన్సిపాల్ ఘాఠి వార్నింగ్ ఇచ్చేసారు. ఆ రోజు అందరికి కమిటీలు వేసి డ్యూటీ లు వేస్తామని చెప్పారు. మాకిది మామూలే. ఇంక నాకేమి డ్యూటీ ఇస్తారో అని నా ఆలోచన మొదలైంది. నాకెప్పుడు కూడా చాలా గొట్టు గొట్టు డ్యూటీ లే వేస్తారు. అనుకున్నట్లుగా మర్నాడు మీటింగ్ మొదలైంది. ఎన్నో రకాల కమిటీలు వేసారు. మొట్టమొదట ప్రిన్సిపాల్ నా పేరుతోనే మొదలుపెట్టారు. జయా! అయాం టేకింగ్ యు ఇన్ రిఫ్రెషర్ కమిటీ, యు కన్ టేక్ గ్రేస్ అండ్ నైనా అగర్వాల్ ఇన్ యువర్ టీం. యు ఆర్ ద కన్వీనర్ అన్నారు. ఇంకేముంది, అనుకున్నంతా అయ్యింది. ఇంక నేను పొద్దుటినుంచి సాయంత్రం వరకు చాయ్..చాయ్...చై చై చాయ్.. చెయ్య్య్.. చాయ్.. అనుకుంటు, టిఫినీలు తిన్నారా, కాఫీలు తాగారా! అంటూ తిరగాలి కాబోలు.
వాళ్ళిద్దరు నాకన్న సీనియర్స్, అటువంటప్పుడు వాళ్ళను మెంబర్స్ గా నాకు నచ్చలేదు. ఆమాటే ప్రిన్సిపాల్ తో చెప్పి గ్రేస్ కన్వీనర్ గా ఉంటుంది అన్నాను. అట్లా కాదు, ఇది యు.జి.సి. విజిట్, నువ్వు 'రీడర్ ', హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ 'కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి అన్నారు. ఇంక తప్పదు, ముగ్గురం కలసి అన్నీ చూసుకుందామని డిసైడ్ అయిపోయాం. మీకు పని చాలా ఉంటుంది కాబట్టి రేపు సెక్రటరీ సార్ తోటి మీట్ అయి మొత్తం ప్రోగ్రాం చాకౌట్ చేద్దాం అన్నారు మా ప్రిన్సిపాల్.
మర్నాడు సర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, మేము ముగ్గురం సర్ రూం లో మీటింగ్ పెట్టుకున్నాం. సర్ ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయాయి. మొత్తం వచ్చే మెంబర్స్ అయిదుగురు. అందులో ఇద్దరు ఇక్కడినుంచే. ఆ ఇద్దరు నాకు తెలిసినవాళ్ళే. అందులో ఒకాయన మా డిపార్ట్మెంటే. యు.జి.సి. డీన్ గా ఉన్నాడు. ఇక పోతే అందులో ఒకరు కోల్కత్త, ఒకరు చెన్నై, ఇంకొకరు కేరళ నుంచి. వీళ్ళు రిటైర్డ్ వి.సి. లు. అందరు డెబ్బై ఏళ్ళ పైవాళ్ళే. మరి వాళ్ళకోసం ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే కళ్ళు తిరగక ఏమైతుంది.
పన్లో పనిగా ఆరోజు మేం ఏం చీరలు కట్టుకోవాలో కూడా నిర్ణయించేసుకున్నాం. నేను, మన ముగ్గురం ఆ రోజు 'వెంకటమ్మ' లైపోదం అన్నాను. మేము వెంకటగిరి చీర కట్టుకుంటే వెంకటమ్మలని, పోచంపల్లి చీరలు కట్టుకుంటే 'పోచమ్మ' లని, ఇలా చాల పేర్లు మా వాడుకలో ఉన్నై లెండి. నేను ఆ మధ్యనే మంచి పెద్ద జరీ బోర్డర్ తోటి గోల్డ్, సిమెంట్ కలర్ కలనేతలో వెంకటగిరి చీర కొనుక్కున్నాను. రోజూ సింపిల్ గా వెల్తాం కాబట్టి ఆరోజు కొంచెం గ్రాండ్ గా వద్దాం అన్నాను. మా వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రాండ్ గా తయారయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు మరి.(నగలూ నాణ్యాలూ ఉండవులెండి...ఓన్లీ చీర:)
సరే, ఈ ఎక్ష్పర్ట్ కమిటీ ఆ రోజు పొద్దున్న మా కాలేజ్ కి పది గంటలకు వచ్చారు. ఎన్.సి.సి. స్టూడెంట్స్ తోటి 'గార్డ్ ఆఫ్ ఆనర్ ' ఉంది. తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఇంటరాక్షన్. కాలేజ్ రిపోర్ట్ అంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది. ఆ టైం లో మేము వాళ్ళకి స్నాక్స్, టీలు ఇవ్వాలి (రెండు రకాల కాజూలు, కాజు బర్ఫీ, బిస్కెట్స్, నంకిన్ etc.) . ఆ తరువాత 11 టు 12 డిపార్ట్మెంట్స్ విజిట్ ఉంది. పదకొండు గంటల తరువాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే అక్కడికి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూష్ పంపించాలి. మాది మూడంతస్తుల కాలేజ్. మైన్ గేట్ నుంచి ఎంట్రన్స్ కు మధ్యలో మంచి దారి, రెండువైపులా అందమైన బొటానికల్ గార్డెన్స్, ఎడమ వైపు కాంటీన్, కుడివైపు పెద్ద పార్కింగ్ ప్లేస్, వెనకాల పెద్ద ఆడిటోరియం ఉన్నాయి. దానికి వెనకాల పెద్ద పి.జి. బ్లోక్ ఉంది. మధ్యలో పెద్ద స్పోర్ట్స్ గ్రౌండ్, జిమ్, ఇంకోవైపు మూడంతస్తుల హాస్టల్ ఉంది. ఇవి గాక అన్ని డిపార్ట్మెంట్స్. ఈ మొత్తం లో వాళ్ళెక్కడ ఉన్నారో కనుక్కోని మేము సర్వ్ చేయాలి. 12 నుంచి ఒంటిగంటవరకు ఆఫీస్, సైన్స్ లాబ్స్ విజిట్ ఉంది. అప్పుడు వాళ్ళకి మళ్ళీ కాఫీలు, టీలు పంపాలి. అంటే ఒక్క అరగంట తేడాలో వాళ్ళు కాఫీలు, టిఫినీలు, ఇంకా కూల్ డ్రింక్స్ తాగుతారన్న మాట.
వన్ టు వన్ థర్టీ పేరెంట్స్, అల్లుమిని, స్టూడెంట్స్ తోటి ఆడియొ విజుయల్ రూం లో ఇంటరాక్షన్ ఉంది. ఆ టైం లో మేము వీళ్ళందరికి స్నాక్స్, కాఫీలు పంపాలి.వీళ్ళతో పాటు మళ్ళీ యు.జి.సి. ఎక్స్పర్ట్ కమిటీ కి కూడా పంపాలి. ఏ.వి. రూం లో పేరెంట్స్, ఆ పక్కన రూం లో అల్లుమిని స్టూడెంట్స్, ఆ పక్కనే ఉన్న లాబ్ లో మా స్టూడెంట్స్ (మేము సెలెక్ట్ చేసిన పిల్లలు, అంటే మాకు పాజిటివ్ గా మాట్లాడే పిల్లలు మాత్రమే) ఉంటారు. మాకు తోడుగా మొత్తం కాలేజ్ అటెండర్స్, ఆయాలు ఉన్నారు. అంతే కాదు కొంత మంది జూనియర్ లెక్చరర్స్ ని కూడా తీసుకోమన్నారు. ఒ.కే. అన్నీ దిగ్విజయం గానే పూర్తి చేసాం. ఎక్కడా కూడా వాళ్ళు ఏది తిరస్కరించకుండా ఎంతో పెద్ద హృదయంతో మేము ఇచ్చిన వన్నీ ఆరగించి, సహకరిస్తూనే ఉన్నారు పాపం. వీళ్ళ వెనకాలే వాళ్ళ కో ఆర్డినేటర్ అట, మొదటినుంచి మా వెనకాల కూడా తిరుగుతూ వాళ్ళకు ఏమేమి ఇవ్వాలో మాకు ఉచిత సలహాలు ఇస్తూనే ఉన్నాడు.
ఇంక అప్పటికి వాళ్ళు బాగా అలసిపోతారు కాబట్టి ఒన్ థర్టీ టు టు థర్టీ లంచ్ బ్రేక్ అండ్ డిస్కషన్స్ విత్ మానేజ్మెంట్. వాళ్ళ కో ఆర్డినటర్ నా దగ్గరికి ఒచ్చి లంచ్ మెనూ ఏవిటో ఆరా తీసాడు. మా సర్ ఎప్పటిలాగే మా హాస్టల్ లో వాళ్ళ కొసం చాలా స్పెషల్సే ప్రత్యేకంగా చేయించారు. ఎన్నో స్పెషల్ స్వీట్స్ కూడా చెప్పారు. ఇవన్నీ విని ఆయన అదోలా తల ఊపేసి, నాన్ వెజ్ ఏమీ లేదా అన్నాడు. నేను వెంటనే మా సార్ దగ్గరికి వెళ్ళిపోయి, ఈ వార్త చేరేసాను. ఆయన ఖంగారు పడిపోతు మా అటెండర్ ని పిలిచి హైద్రాబాద్ బిర్యాని, రెండు స్పెషల్ నాన్ వెజ్ కర్రీస్ వెంటనే తెమ్మని తరిమేశారు. మా సర్ రూం చాలా బాగుంటుంది కాబట్టి అక్కడే లంచ్ ఏర్పాటు చేసాం. మా ముగ్గురిని సర్ అక్కడే ఉండమన్నారు. మాకు రెండు, మూడు రకాల చాలా కాస్ట్లీ, ఇంపోర్టెడ్ క్రోకరీ సెట్స్ ఉన్నాయి. అవన్నీ తెచ్చి టేబల్ మీద పెట్టాం. అన్ని డిషెస్ కూడా టేబల్ మీద ఎంతో అందంగా ఏర్పాటు చేసాం.నేను అందంగా టేబల్ స్పూన్స్ సద్ది సలాడ్ రెండు వైపులా కారెట్స్, బీట్రూట్స్, కాబేజ్, మిర్చీ, ఆనియన్ తోటి రక రకాల పూలు, డిజైన్స్ చేసి అలంకరించి పెట్టాను. (నేను సలాడ్ డెకరేషన్ లో చాలా ఎక్స్పర్ట్ లెండి). అది చూసి సార్ నన్ను చాలా మెచ్చుకున్నారు. కాని వెంటనే భయమేసింది, ఎప్పుడూ ఇవే డ్యూటీలు నాకిస్తారేమో అని. మా సార్ ఇంట్లోనుంచి స్పెషల్ గా తయారు చేయించి తెప్పించిన 'ఖుర్బాని ' స్వీట్ కప్స్ లో వేసి, పైన కస్టర్డ్ వేసి ఆ పైన వెనిలా అయిస్ క్రీం వేసి(ఇది మా సార్ ఇన్స్ట్రక్షన్) వేరే టేబుల్ మీద పెట్టాము. ఈ లోపల నాన్ వెజ్ డిషెస్ వచ్చాయి. నేను పక్కా బ్రాహ్మిణ్ కాబట్టి ఆ వాసనలేమి నేను తట్టుకోలేక పోయాను. ఆ పని కాస్తా మా గ్రేస్ కి అప్ప చెప్పాను. పాపం తను అవి అన్నీ సద్దేసింది. అందరు లంచ్ కి వచ్చేసారు. ఇంక మా కష్టాలు మొదలైనాయి. ఒకాయన వార్మ్ వాటర్ కావాలన్నాడు. ఆ పక్కనే ఫిజిక్స్ లాబ్ ఉంది. ఒక ఆయాను ఉరికించాను, అక్కడ బర్నర్ మీద వేడినీళ్ళు పెట్టుకోని ఫ్లాస్క్ లో పోసుకోని రమ్మన్నాను. ఒకాయన సాల్ట్ లేని కూరలు కావాలన్నాడు. నాకు దిక్కు తోచలేదు. ఇంకో ఆయన కూరలో షుగర్ వేసి ఇమ్మని అడిగాడు. ఇంకేం చెప్తాను లెండి, ఇటువంటి కష్టాలు చాలానే పడ్డాను ఆ లంచ్ కార్యక్రమం పూర్తయ్యే సరికి. మా సర్ అయిదు నిముషాలకొక సారి జయా, జయా, అని పిలుస్తూనే ఉన్నారు, అదేదో తారక మంత్రం లాగా.
అప్పుడే మా కష్టాలు తీర లేదు. టు థర్టీ నుంచి థ్రీ వరకు అన్ని లైబ్రరీల విజిట్, త్రీ టు త్రీ థర్టీ ఫాకల్టీ తో ఇంటారాక్షన్ ఉంది. ఈ లోపల మంచి ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ అందరికీ పంపించాలి. పాపం పొద్దుటినుంచి మా ఆయాలు రకరకాల ఫ్రూట్స్ అందంగ ముక్కలు కోసిపెట్టారు. అవి అన్నీ చక్కటి కప్స్ లో, బుజ్జి బుజ్జి ఫోర్క్స్ పెట్టి పంపించాము. నాకు మనసులో చాలా అనుమనంగానే ఉంది వాళ్ళు వెంటనే అవి తినగలరా అని. నో డౌట్, చక్కగా ఆరగించేసారు.
థ్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఇంక వాళ్ళు మా కాలేజ్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ తరువాత ఫోర్ థర్టీ నుంచి ఎక్షిట్ మీటింగ్ ఉంటుంది. అంటే అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా నేను కూడా మీటింగ్ లో పార్టిస్పేట్ చేయాల్సి ఉంటుంది. కాని అప్పుడే నా పని పూర్తి అయేలా లేదు. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కాఫీలు, టీ లు అందించాలి. మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలైనాయి. పాపం ఈసారి మా జూనియర్స్ ఎంతో శ్రద్దతో వాళ్ళని ఆర్చుకున్నారు.
ఇంక ఎక్షిట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ సారి మళ్ళీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ సర్వ్ చేయబడ్డాయి. ఇంక వాళ్ళు ప్రెజంట్ చేసిన రిపోర్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదుకదా! మా కాలేజ్ అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిందని, 'నాక్ ' నుంచి 'ఏ ' గ్రేడ్ పొందిన గొప్ప కాలేజ్ అని, మా అటానమీ ఇంకో అయిదేళ్ళు పొడిగిస్తున్నామని ఎంతో ఆనందంగా ప్రకటించారు. వాళ్ళకి శాలువాలు కప్పి, మెమొంటోలు ఇచ్చి, కావలసినన్ని ఫొటోలు తీసుకొని, ఆనందంగా మేము కూడా వాళ్ళని వాళ్ళ కార్ల దాకా తీసుకెళ్ళి, అప్పటిదాకా ఎన్నోసందర్భాలలో ఇస్తూ వచ్చిన పూలబొకే లను కూడ వాళ్ళ కార్లల్లో పెట్టించి, ఎంతో సంతోషంతో టా టా చెప్పాం.
కాని నాకు మాత్రం ఎంతో అనుమానం, ఇన్ని తిన్న ఆ ముసలి వాళ్ళ అరోగ్యాలు మర్నాడు ఎలా ఉన్నాయో అని:)))
ఇదండి, మేము చేసిన పూజ్యుల సేవ:)
(నా 'మయూఖ' ని ఖాళీ చేద్దామనుకుంటున్నాను:) అందుకే నాకు నచ్చని కొన్ని టపాలను తీసేసాను. నాకు నచ్చిన రెండో మూడో 'మనస్విలో' దాచిపెడ్దామనుకుంటున్నాను. ఒకటో రెండో ’మయూఖ” లోనే ఉండిపోతాయి. అవి అక్కడే ఉండాలి. అందుకే, ఈ ప్రయత్నం.)
*********************************************************************************************************************************************************
4 కామెంట్లు:
:))) hm...udyoga kashtalu mee kallato inko sari choosaanu
నైస్ టు సీ..... :-)
emitO.. ee Baadhalu. !?
ayinaa Meeru Extra- ordinary gaa cheyagalaru lendi.
శశికళ గారు, పద్మర్పిత గారు, వనజ గారు...మీ ముగ్గురికీ నా ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి