25, ఫిబ్రవరి 2010, గురువారం
ప్రేమ లేఖ
ప్రేమ లేఖ
(వాక్యాల గారడి)
ఇంతదాక నీ మీద నేను చూపించిన ప్రేమ
కపటమయినదే గాక, నువ్వంటే ఏహ్యభావము
రోజు రోజుకు అధిక మవుతుంది. నీగురించి ఆలోచించి
న కొద్ది నువ్వంటె అసహ్యం ఇనుమడిస్తుంది నాలో.
చివరికి నేను ఓ చక్కని నిర్ణయానికి వచ్చేసాను.
నీకు దూరమై పోవాలని. నేనెన్నడు అనుకో లేదు
నిన్నుపెళ్ళిచేసుకోవాలని. నిన్నటిదాక మన సంభాషణ
నీ మీద నాకున్న ధ్వేషాన్ని ఎక్కువ చేసింది. ఏవిధంగాను
నీ మీద నాకు సదభిప్రాయము, ఆరధన, ప్రేమ భావము
కలిగించలేదు సరికదా, నువ్వంటే గగుర్పాటు
ఎక్కువ చేసింది. నిన్ను ఇప్పుడు చూసిన నా మీద
జుగుప్స, చాలా పొరపాటు చేసానన్న చింత అ
యిష్టం ఏర్పడి స్థిరపడిపోయింది. అంతేకాదు
నిన్ను నేను ఇప్పుడు ఎంతమాత్రం కోరడంలేదు.
నువ్వే నా జీవితం. నువ్వు లేకపోతే బ్రతుకలేను
అనుకుంటున్నాననే భ్రమలో పడవద్దు.
నువ్వు నాకో చిన్న ఉపకారం చేయాలనుకుంటే
ఈ ఉత్తరం చదివి చింపేయి, దాచకుండా
ఈ ఉత్తరానికి చక్కని సమాధానం వ్రాసే ప్రయత్నం
చేయక నన్ను ఎప్పటికి మర్చిపోయె ప్రయత్నం
చేయి. నీ కన్నా గుణవంతులు, సహ్రుదయులు లోకంలో
కోకొల్లలు. కాని నీలాంటి అవినీతి పరులు
ఉండరనే నా నమ్మకం. అందుకే నా మదిని నీకు
అర్పించలేను. దానిని మరెవరైనా యోగ్యులకు
అంకితం చేసి ఈ జీవితాన్ని చక్కదిద్దుకుంటాను.
గమనిక: పై ఉత్తరాన్ని పూర్తిగా చదివారుగా? ఇప్పుడు మళ్ళీ మొదటినుంచి లైను విడచి లైను చదవండి. తేడా గమనించండి. సరేనా!
************************************************************************
లేబుళ్లు:
సరదాగా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
15 కామెంట్లు:
హ హ హా ..బాగుంది.
Nice....
:))) Super Cute...
హి హి హి అదిరింది ప్రేమ లేఖ.
Very Nice. :)
ఈ ప్రయోగం కొత్తగా బాగుంది.
ఇలా రాయడం చాలా కష్టం. ఇలాంటివి ఒకటి, రెండు చదివాను. బాగుంది.
చికిత గారు
రవిచంద్ర గారు
నిషిగంధ గారు
భావన గారు
గిరిధర్ గారు
సునిత గారు
మీ అందరికీ నచ్చినందుకు థాంక్స్.
శిశిర గారు, నేనుమాత్రం ఇలాటివెక్కడా చదవలేదు. థాంక్యూ.
:-) :-) very nice..
గారడీ బాగుంది..తమాషాగా!!
హా..హా..హా భలే బాగుందండి..
మురళి గారు
ప్రణీత స్వాతి గారు
శేఖర్ గారు....మీ అందరికీ నచ్చిందా! అయితే మీ అందరికీ నా థాంక్స్.
భలే బాగుందండి:)
నేస్తం గారు మీకు నచ్చిందా. అయితే మీకొక జాజిపూల దండ.
భలే రాసారు గా ! చాలా differant గా ఉంది ...బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి