చమత్కారమున చంపకమాల లల్లగలేను
నీదు గళమలంకరింపగ
కమనీయమగు
కందరీతి నేనెరుగ
నీదు ప్రసన్నత వేడ
ఉత్పన్నమగు నాదు భావసరళి
ఉత్పలయందు జేర్ప శక్తియు నొకించుక లేదు
వేయేల! వేరొండు నేనెరుగ
మ్రోలనిలచి నీదుపూజసేతు
ఏమని?
రవంత నన్ను నీదరినిల్పి
ఆవంత శక్తి ననుగ్రహింపుమమ్మ
సాహితీ నందనమందు
కలుపుమొక్కను నేను
విదిలించి పెకలించకుమమ్మ
సాహిత్య వల్లీ!
నా నివాళులివిగో!!!
(Your heart is a very beautiful garden. And my friendship is a small rose in your garden. Please don't pluck the rose for any reason.....)
నా మనసు లో మనసైన, మనసున్న నా మనస్వి మనసు నొప్పించాను. పుట్టి సంవత్సరం దాటినా, పాపం నా పిచ్చి బ్లాగ్, దానికి నేను హ్యాపీ బర్త్ డే చేయనే లేదు. అందుకే నా మనసులోని ఈ మనసైన భావాలు, నా బంగారుతల్లి మనస్వికే అంకితం.
ఏవిటో, ఈ సంవత్సర కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా పిచ్చి పిచ్చి గానే రాసాననిపిస్తుంది.నేను రాసుకున్నవి ఒక్కటైనా నాకు నచ్చటం లేదు. ఏనాటికైనా, కనీసం ఒక్కసారైనా మంచిగా రాయగలనా అనిపిస్తోంది. ఎవరికైనా నచ్చిన ఒక్క పోస్టన్నా ఉందా!!! నేనేమీ రాయలేననిపిస్తోంది. నా ఈ తపనకు తగ్గ సామర్ధ్యం నాకులేదనిపిస్తోంది. ఆ నిష్పృహ ఫలితమే ఇది.
***************************************************************************
26 కామెంట్లు:
అదేంటీ జయ అలా అనేసేరు, నచ్చటానికి కొలమానాలేమున్నాయి. నా మటుకు మీరు బాగా రాస్తారు అనిపిస్తుంది. అదేదో కమర్షియల్ లో చెప్పినట్లు సూటి గా సుత్తి లేకుండా :-)
సాహిత్య వల్లి ప్రసన్న శారద కరుణ మీ మీద పూర్తి గా వుంది. మీరేమి అనుమానాలు పెట్టుకోకండీ మరి.
జయగారూ,
మీరు మనసులో పడుతున్న మథన చూస్తుంటే మీ లోంచి ఒక మంచి కావ్యం బయటపడుతుందని నాకనిపిస్తోంది. . ఇప్పటివరకూ మీరు రాసినవి బాగున్నాయి. బాగా ఆలోచింపచేస్తున్నాయి. కాని అవి మీ స్టాండర్డ్ కి తక్కువగా అనిపించాయంటే మీలో ఇంకా లోపల చాలా ఆవేశం వుందన్నమాట. అది ఎలా బయట పెట్టాలా అని మథన పడుతున్నారనిపిస్తోంది. మీకు భాష మీద మంచి పట్టు వుంది. ఇన్ని మంచి గుణాలు మీ దగ్గర వున్నప్పుడు మంచి రచన బైటకి వస్తుంది. పాలసముద్రం లోంచి అమృతం బయట పడడానికి దానిని ఎంత మథించాల్సి వచ్చింది? ఆలోచించండి. బాగా మథించండి. సమాజానికి వుపయోపడేలా ఆ అమృతాన్ని మాకు అందించండి.
అన్నింటా జయం కలగాలని కోరుకుంటూ,
శ్రీలలిత..
ముందుగా మీ బ్లాగుకి ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. భావన చెప్పినట్లు సూటిగా సుత్తి లేకుండా ఉండే మీ టపాలంటే నాకిష్టం. ఇతర బ్లాగుల్లో స్వాంతన చేకూర్చే మీ వ్యాఖ్యలంటే మరీ మరీ ఇష్టం. మీ బ్లాగుని అంత తేలిగ్గా తీసిపారేయకండి..మేము ఒప్పుకోము!!
"విజయాల వెనుక వేరే రహస్యమేమీ లేదు. కష్టించి పని చేయటమే" మీ మాటలు మీకే అప్పచెప్తున్నానా?
అదేంటి అలా అంటున్నారు.....గంగిగోవు పాలు గరిటడైనను చాలు.
బాగారాస్తారు మీరు!
జయ గారు ఏమైంది అండి అలా అనేసారు.అలా అయితే నేనెలా ఫీల్ అవ్వాలి.నా సొంత సోది తప్ప ఇంకొక మాట వ్రాయను ... చాలా సార్లు నాక్కూడా డవుట్ వస్తూ ఉంటుంది ... మరీ సొంత డబ్బాలా ఉంటున్నాయా అని... అయినా సరే ..మహా అయితే చదవడం మానేస్తారు ,అయినా ముందే చెప్పానుగా ఇవి నా జ్ఙ్ఞాపకాలు అని సరిపెట్టేసుకుని రాసేస్తాను ... మీరు బాగా వ్రాస్తారు ..మంచి బ్లాగర్ ..ఈ నిస్పృహ మీకు అసలు రాకూడదు :) అన్నట్లు శుభాకాంక్షలు:)
'మంచిగా రాయగలగడం' అనేదానికి మీరు పెట్టుకున్న స్టాండర్డ్స్ ఏమిటో నాకు తెలీదు కానీ నాకైతే మీరు చక్కగా, అర్ధవంతంగా రాస్తారనిపిస్తుంది.. ఒకటో అరో కామెంట్స్ పెట్టానేమో కానీ మీ టపాలు చాలా వరకు చదివాను.. అలానే సిరిసిరిమువ్వ గారు చెప్పినట్లు నాకు మీ కామెంట్స్ కూడా చాలా నచ్చుతాయి.. సో, పెద్దగా ఆలోచించకుండా మీ మనస్వి పుట్టినరోజు కేక్ తినేసి, మీ ఇస్టైల్లోనే రాసేసుకుంటూ వెళ్ళండి :-)
ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చిందండీ మీకు? ఇవన్నీ మర్చిపోయి ఎంచక్కా మీ మనస్వి బర్తేడే ని మనస్పూర్తిగా జరుపుకోండి...మొన్న మీరు రాసిన శ్రీశైలం ట్రైబల్స్ టపా చదూతుంటే నాకైతే మేగజీన్ లో ఆర్టికల్ చదివినట్టు అనిపించింది..అంత బాగా రాసారు..అంతెందుకు ఈ టపాలోనే మొదట రాసిన లైన్లు చదివిన వాళ్ళకెవరికైనా తెలుస్తుంది మీ తెలుగు స్టాండర్డ్...నేనైతే ఆ స్టాండర్డ్ దరిదాపుల్లో కూడా ఉండను..అంతమాత్రాన నేను నాకు తెలుగు అస్సలు రాదు అని న్యూన్యతో ఉంటే ఇప్పుడు రాయగలిగినట్టు కూడా రాయలేను...
సో ప్లీజ్ గో ఎహెడ్...
అన్నట్టు బ్లాగు పుట్టినరోజు కాబట్టి కేక్ గట్రా కట్ చేస్తే మాత్రం నా వాట పక్కన తీసి ఉంచండేం..:-)
జయ గారూ !
మనిషిని పోలిన మనుష్యులు అరుదుగా వుంటారు. అలాగే రచనలను పోలిన రచనలు కూడా అరుదే ! ఎవరి భావాలు వారివి. ఎవరి శైలి వారిది. మీ శైలి మీది. అభ్యాసం కూసు విద్య అన్నట్లు మీరు రాసుకుంటూ వెళ్ళండి. మీ రాతలు మీకు కూడా నచ్చుతాయి. రాశి కంటే వాసి ప్రధానం. మీరు కలుపుగోలు మొక్కేమో గానీ కలుపు మొక్క మాత్రం కాదు. 'మనస్వి' మనసులోకి ఎప్పుడూ ఆ భావన రానివ్వకండి. అభినందనలు.
వామ్మె వాయ్యో ఇదేమిటి జయగారు ఇలా అనేశారు..ఆ లెక్కన నేను ఏ లెక్కలోకి వస్తాము..నేను packup అయితే!!
'మనస్వి'కి అభినందనలు!
మీరే అలాగంటే నేను వ్యాఖ్య రాయడానికి కూడా తగనేమో అనిపిస్తుంది.
మీరే అలాగంటే మేమంతా ఏమనుకోవాలి? చక్కటి సరళమైన భాష, భావం ఉంటాయ్ మీ టపాల్లో. నిరాశ పడకండి జయగారూ..
మమ్మలనందరినీ ఎంతో సపోర్ట్ చేసే మీరు ఇలా దిగులు పడితే ఎలా? ఛీర్ అప్ జయగారూ..
మనస్వి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
@భావన గారు. థాంక్యూ. కొన్ని సార్లు ఇలా బుర్ర పాడైపోతూఉంటుంది.
@శ్రీ లలిత గారు, థాంక్యూ. అంత స్టాండర్డ్ ఏమీ లేదులెండి. నాకు తెలుసు. కొన్ని సార్లు ఏవేవో ఆలోచనలు వొచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయన్నమాట :-)
@సిరిసిరిమువ్వ గారు. థాంక్యూ. పాపం నా మనస్వి పుట్టినరోజు ఏప్రిల్ లోనే అయిపోయింది:) నేను అస్సలు పట్టించుకోనేలేదు. వ్యాఖ్యలు కూడ ఇష్టపడుతారా:) తోచినట్లు రాసేయటమే
@పద్మర్పిత గారు థాంక్యూ. అంతేలెండి.ఏంచేస్తాం.
@నేస్తం గారు థాంక్యూ. భలే ఓదారుస్తున్నారు. ఏం చేయమంటారు చెప్పండి. కొన్ని సార్లు మనసెందుకో అల్లకల్లోలమైపోతుందన్నమాట.
@నిషిగంధ గారు థాంక్యూ. ఒక సారి అలవాటైనాక చేయి ఎలాగూ ఊరుకోదు. అదెలా ఉన్నా ఇంతే సంగతులు:)నా కమెంట్స్ బాగుంటాయంటే గమ్మత్తుగా ఉంది.
@శేఖర్ థాంక్యూ. మీ లాగ మాత్రం రాయలేనుగా. బాబోయ్, మరీ ఇంత మెచ్చేసుకోటమే. అంతలేదులెండి. కేక్ కట్ చేయలేదుగా:(వా
@కొత్తపాళీ గారు, కొంచెం అప్పుడప్పుడు ఇలాగే కనిపిస్తుండండి. కొంచెం ధైర్యం వస్తుందన్నమాట. థాంక్యూ.
@రావ్ గారు, మీ మాటలు కొంచెం ధైర్యం ఇచ్చాయండి. థాంక్యూ.
@ సుభద్ర గారు, థాంక్యూ. బాబోయ్ అలా అనేసారేంటండి.
@ప్రణీత గారు థాంక్యూ. మీ ఫస్ట్ టపా నాకింకా గుర్తే. అంత బాగుంది. ఇవాళే నా మనస్వి పుట్టినరోజు చేసేసానుగా.
@ ప్రేరణ గారు దయచేసి అలా అనకండి. థాంక్యూ.
గాలివాన వల్ల మూడు రోజులనుండి కరెంటు సప్లై లేకపోవడంవల్ల ఈ టపాకి వ్యాఖ్య వెంటనే రాయలేకపోయానండి. ఎప్పుడైనా సప్లై ఇచ్చినా వ్యాఖ్య టైపు చేసేలోగానే మళ్ళీ సప్లై ఆపేస్తున్నారు. ఇక టపా విషయానికి వస్తే మితృలందరూ చెప్పిన మాటలే నావీనూ. మీరెప్పుడూ ఇలాంటి నిస్పృహ రానివ్వకండి. నాకు కూడా మీ వ్యాఖ్యలు చాలా ఇష్టమండి. ఇంకా వివరంగా రాయాలని ఉన్నా మళ్ళీ కరెంటు పోతుందేమోనన్న భయంతో ఇంత మాత్రమే రాస్తున్నాను.
Happy BirthDay to Manasvi.
జయ, రాయటంలో మీకు గల శక్తి, ఇప్పుడు రాస్తున్న స్థాయి బేరీజు వేయగల సామర్థ్యం మీ మనస్సాక్షిదే కనుక మీ మాటతో విబేధించను. కానీ శీఘ్రంగా మీ శక్తి, సామర్థ్యం కలిసిన సంతృప్తి మీ నోటి నుంచే వినాలని ఆశిస్తూ..శుభాకాంక్షలు.
ముందుగా మీ బ్లాగుకి ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.చక్కగా రాసే మీరే ఇలా అనేసుకుంటే నా పరిస్థితి ఏమిటో! మీరు ఎంత బాగా రాస్తారో మీకంటే నాకే బాగా తెలుసు .
ముందుగా మీ బ్లాగుకి ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.చక్కగా రాసే మీరే ఇలా అనేసుకుంటే నా పరిస్థితి ఏమిటో! మీరు ఎంత బాగా రాస్తారో మీకంటే నాకే బాగా తెలుసు .
@థాంక్యూ శిశిరా. ఈ శలవల్లో మీ ఊరికి వెళ్ళారా. ఈ తుఫానుల్లో జాగ్రత్త. మీ ఊళ్ళో ఎలా ఉంది పరిస్థితి. కోనసీమ లో చాలా పంటలు దెబ్బతిన్నాయని చూస్తున్నాను. ఈ లైలా వెళ్ళిపోతుందిలే.
@ఉషా అంత సామర్ధ్యం లేదులెండి. నా లెవెల్ ఇంతే:) థాంక్యూ.
@శివరంజని గారు థాంక్యూ. మంచి రచనలకు శ్రీకారం చుట్టిన మీ బ్లాగ్ నుంచి ఎన్నో చదవాలని ఎదురుచూస్తున్నాను.
అయ్యో, మీరే మనస్వి పుట్టినరోజు లేటుగా చేస్తున్నారంటే, నేను మరీ లేటుగా విష్ చేస్తున్నా! :( Happy Birthday to Manasvi!
మీరే అలా అనుకుంటే, ఇంకా మాబోటి వాళ్ళం తట్టా, బుట్టా సర్దుకోవాల్సిందే! ఓ రకంగా కొంతవరకు అలా అనిపించడం కూడా మంచిదే. ఇంకా బాగా రాయాలన్న తపన వస్తుందిగా :-) నా మటుకు నాకు మాత్రం మీ రాతలు నచ్చుతాయి. పైన చెప్పినట్టు చాలా కొన్ని బ్లాగుల్లోనే వ్యాఖ్యలు చదవడం కూడా పోస్ట్ చదివినంత బాగుంటుంది. అలాంటి అతి కొద్ది బ్లాగుల్లో మీదొకటి. చాలా ఆత్మీయంగా అనిపిస్తాయి మీ మాటలు :-)
మధురవాణి గారు థాంక్యూ. మీ పేరంత తియ్యగా ఉంది మీ మాట.
కామెంట్‌ను పోస్ట్ చేయండి